కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్"
(లేదా...)
"మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్"
(లేదా...)
"మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
మత్స్యమ్ముల్ తిని వ్రాసెగా "రవి"యె భల్ మా దేశపున్ గానమున్
మత్స్యమ్ముల్ తిని బంకిచంద్రుడనెగా మా "మాతరం" హాయిగా
మత్స్యమ్ముల్ కొని వంగభూమి జనగన్ మాయావియౌ పిల్లితో
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మత్స్యమ్ముల్ తిని "కృత్తివాసుడ"చటన్ మాట్లాడె వాల్మీకితో
మత్స్యమ్ముల్ తిని రాధగాథ "జయదేవ్" మైకమ్మునన్ వ్రాసెగా
మత్స్యమ్ముల్ కొని వంగభూమి జనగన్ మాయావియౌ పిల్లితో
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్
అందరూ చేపలబుట్టలో చేపలే చూస్తారు.. విప్రులు ఆ మీనాక్షీ అమ్మవారిని చూస్తారు..
రిప్లయితొలగించండికవిలులు మాత్రము వ్యాసభగవానుని తలుచుకుని వ్రాస్తారు గావున...అసాధారణ భావాలకోసం చూస్తూ వ్రాద్దామనుకుంటారు, అసాధారణమైనటువన్నీ చూస్తారు.. అవి చాలవు కొన్ని సందర్భాలలో..
అందరికీ తన్మాత్రలున్నట్టే కవికి ఒక extra వికటతన్మాత్ర ఉంటుంది.. అదిపోయినప్పుడు ఈ రొండిటినీ కలుపడమే దానికి మందు గా భావించి కలుపుతుంటారు😀😀
శా||
మత్స్యాధానమునందు జూడ గను సామాన్యంబుగన్ చేపలన్
మత్స్యాక్షిన్ గను విప్రవర్యులు దగన్ మత్స్యోదరీయస్పృహన్
మత్స్యోచ్ఛిష్టము జాలునే వికటతన్మాత్రావియోగంబునన్
మత్స్యక్షీరము బిల్లికొమ్ము గలుపన్ మందౌ కవీంద్రాళికిన్
ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻
సమస్య :
రిప్లయితొలగించండిమత్స్యక్షీరమ్ము మంచిమందు కవులకున్
( గడుసు గురువు - కొంటె శిష్యుడు )
గురువు :
"మత్స్యపు బాలను దెమ్ముర !
మత్స్యకిశోరుడ ! రయముగ "
శిష్యుడు :
" మాన్యుడ ! గురుడా !
మత్స్యములకు పాలుండిన
మత్స్యక్షీరమ్ము మంచిమందు కవులకున్ "
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమత్స్యము మంచిది సుమ్మీ
మత్స్యండిని గైకొనుమయ మధురంబదియే!
వాత్స్యుడ వినుమా తప్పక
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్ !
ఇవ్వాళ సెలవా :)
జిలేబి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమత్స్యముల రూపు నొందుచు
మత్స్యములవలె న్నుదధిని మసలెడి బడయౌ
మత్స్యపు తిమింగలమ్ముల
మత్స్య క్షీరమ్ము మంచిమందు కవులకున్.
రిప్లయితొలగించండికవుల వెర్రికి మందు :)
వాత్స్యౌశ్రేష్టుని కామసూత్రమును నింపారంగ వల్లించెనా
వాత్స్యుండాతడు! సంప్రదించగ భళీ పల్కెన్ కదా వెర్రికై
మత్స్యండిన్, సరి యింద్రభేజమును సామర్థ్యంబుగా చేర్చుచున్
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్!
నారదా
బేగనే బారో !
జిలేబి
మీరు ప్రయోగించిన మత్స్యండి, యింద్రభేషజము పదాలు వాట్సప్ లో నివర్తివారి ప్రశంసలు పొందాయి! 👏👏💐💐🙏🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమత్స్యమ్ముల్ వలె రూపునొంది నిరతమ్మా సాగరమ్మందునన్
మత్స్యమ్ముల్ వలె నీదులాడుచు ఘనమ్మౌ పోడిమిన్ దిర్గునౌ
మత్స్యమ్ముల్ ప్రతియౌ తిమింగలములన్ మట్టున్ ప్రయోగించి నా
మత్స్యక్షీరము బిల్లికొమ్ము గలుపన్ మందౌ కవీంద్రాళికిన్
మత్స్యండిక దొరుకు భువిని
రిప్లయితొలగించండిమత్స్యక్షీరము దొరకదు మహిలో కదనే
మత్స్యాక్షెందుకు చెప్పెనొ
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమత్స్యముల చెంత దక్కునె
మత్స్యక్షీరమ్ము? మంచిమందు కవులకున్
మత్స్యములలోన బలిసిన
మత్స్యముల యకృత్తునుండి మధించు చమురుల్.
(యకృత్తు= కాలేయము)
మత్స్యంబులు తిను నొకండు
రిప్లయితొలగించండిమత్స్యాక్షిని తాగుటకును మందును తెమ్మని
మత్స్యము మంచిది తెలుసా?
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్
మత్స్యాధీశుడు భక్తిభావమమరన్ మత్స్యావనీ మేలుకై
రిప్లయితొలగించండిమత్స్యాంశన్ హరి యుధ్భవంబయిన యా మాహాత్మ్యమున్ కోరగన్
మత్స్యాక్షంబుల జాణయై యమృతమున్ మార్పెట్టుటల్ వ్రాయ నా
మత్స్యక్షీరము బిల్లికొమ్ము గలుపన్ మందౌ కవీంద్రాళికిన్
మత్స్యక్షీరమ యే నదిన్ వరలి యా మత్స్యంబు పాలిచ్చునో
రిప్లయితొలగించండిమత్స్యాహారిబిడాలశృంగమ దయన్ మాకోసమై బంపుమా!
హృత్స్యందిస్థితిఁ గల్గి సారకవితల్ చెన్నొందు సేవించ, నా
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్"
కంజర్ల రామాచార్య
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
హృత్స్యంద్యక్షరపంక్తులే కరువుగా హింసించుటే వృత్తిగా
చిత్స్యూతంబుది భావరిక్తమన సృష్టింపన్ సమస్యాకృతిన్
మత్స్యద్రక్ష్య పదాల ప్రాశ్నికులు.,సమ్మానింపనవ్వారికిన్
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మత్స్యపు వేపుడు వద్దని
రిప్లయితొలగించండిమత్స్యముతో పాలవంట మానుగ తినుచున్
మత్స్యము పయి రచనసలుప
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్
మాను = మనోజ్ఞము
మత్స్యక్షీరము = గాడిదగుడ్డు = శూన్యము
మత్స్యా హారము హితవై
రిప్లయితొలగించండిమత్స్యంబు లు తిను జనులకు మహిత బలంబౌ
మత్స్య ములకు పాలుండిన
మత్స్య క్షీ రమ్ము మంచి మందు కవుల కున్
మత్స్యంబేలను క్షీరమెందులకు మామా యంచు మాటాడకే!
రిప్లయితొలగించండిమత్స్యంబుల్ నయనమ్ము లైన ప్రియ భామా, యొజ్జయే యిట్లనెన్,
"మత్స్యక్షీరము బిల్లికొమ్ము గలుపన్ మందౌ కవీంద్రాళికిన్."
మత్స్యంబున్ మఱి పిల్లియున్ దొరకె! లేమా తెమ్ము దుగ్ధమ్మిటన్!
మత్స్యము మంచిది కవికన,
రిప్లయితొలగించండిమత్స్యము తిన నడ్డగించ మర్మము తోడన్!
మత్స్యము తినని మనిషనెగ
"మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్"
మత్స్యక్షీరమటేమిది
రిప్లయితొలగించండిమత్స్యందిక యుక్త క్షీర మధురసమౌనా?!
మత్స్యపు కంటక న్యాయము
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్ణ
రిప్లయితొలగించండిమత్స్యంబున్ మరి క్షీరమున్ గలుపుటే మా వల్ల గాదాయెనే
రిప్లయితొలగించండిమత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మాకెట్లు సాధ్యంబగున్
మత్స్యందీయుత క్షీరమందిటుల మిర్యంబుల్ ప్రయోగించిరే
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిమత్స్యము శాకమటంచును
మత్స్యము మెండుగ తిందురు బెంగాలీయుల్
మత్స్యతిమింగల మిచ్చెడి
మత్స్య క్షీరమ్ము మంచి మందు కవులకున్.
వాత్స్యాయన!వింటివెయిది
రిప్లయితొలగించండిమత్స్యక్షీరమ్ముమంచిమందుకవులకున్
మత్స్యక్షీరముకవులకు
మత్స్యపుటవతారుడిచ్చుమందుగనేమో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుత్స్యము వచింప నేల చి
తొలగించండికిత్స్యము కా నేర దిది యకృత్యము నీ యీ
దిత్స్యము జుగుప్సిత మహో
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్
[కుత్స్యము = నింద్యము; చికిత్స్యము = రోగము; దిత్స్యము = ఈ నెంచినది]
మత్స్యాలాభుఁడు సత్వరమ్మున వినా మాత్సర్యమే వింతగా
నుత్స్యాభమ్మయి మిత్రుఁ డివ్విధము సద్యో రీతి విభ్రాంత చం
చత్స్యందాత్ముఁడె యేమి పల్కినను హాస్యంబై ధరం జెల్లుఁ బో
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్
[మత్ +స్యాల +ఆభుఁడు = మత్స్యాలాభుఁడు; నాకు బావమఱఁది వంటి వాఁడు; ఉత్స్య +ఆభము = ఉత్స్యాభము; ఉత్స్యము =, ఊట సంబంధ మైనది, పొంగుట]
మత్స్యక్షీరము పిల్లికొమ్ములనుచున్ మాటాడినన్ నవ్వరే
రిప్లయితొలగించండిమత్స్యాక్షీ! లభియింపబోవవియు భూమమ్మందు నెచ్చోటనున్
మత్స్యందీ గలదిందు మందులకు కొమ్మా వాడవే, నెవ్విధిన్
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్.
మత్స్యక్షీరముబిల్లికొమ్ముగలుపన్ మందౌగవీంద్రాళికిన్
రిప్లయితొలగించండిమత్స్యక్షీరముబిల్లిగొమ్ముగలువన్ మార్గమ్ముపిచ్చౌటకే
మత్స్యంబెక్కడపిల్లికొమ్ములు దగన్ మందౌనెనెవ్వారికిన్
మత్స్యక్షీరముగానరాదుగనెటన్ మందేసిచూడన్ రమా!
మత్స్యము ప్రియమగు బిల్లికి
రిప్లయితొలగించండిమత్స్యము ప్రియమగు పులుగుల మానవతతికిన్
మత్స్యపు నూనియ వింటిమి!
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్?
మత్స్యక్షీరము బొందవీలగును పెన్మత్స్యంబులన్ బట్టగా
మత్స్యాక్షీ! భువినెవ్విధిన్ దొరకు నామార్జాల శృంగంబహో!
మత్స్యండిన్ మరి యింద్రభేషజము సామాన్యంపు మందెవ్విధిన్
మత్స్యక్షీరము బిల్లికొమ్ముగలుపన్ మందౌ కవీంద్రాళికిన్?
మత్స్యండి = కండ చక్కెఱ
ఇంద్రభేజము = శొంఠి
మత్స్యాక్షీ! యల నీదు రూపమును సమ్మానమ్ముతో గాంచినన్
రిప్లయితొలగించండిమత్స్యందీ మిళితమ్ముగా నుడివెదన్ మాధుర్యమౌ కైతలన్
చిత్స్యోనమ్మును పొందెదన్ సతతమున్ సీమంతినీ! ఎవ్విధిన్
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్
మత్స్యందీ: ఖండచక్కెర., చిత్+ స్యోనము: చిత్స్యోనము: మానసిక ఆనందము
కందం
రిప్లయితొలగించండిమత్స్యము జలపుష్పము! స్త్రీ
మత్స్యాక్షి! మనసు చలించు మత్స్యమ్మనెడున్
మత్స్యములఁ బోలిక మఱువ
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్
శార్దూలవిక్రీడితము
మత్స్యమ్ముల్ జలపుష్పరాశియని, భామన్జూచి వర్ణించుచున్
మత్స్యాక్షీ యని బిల్వనెంతురుగదే మత్తెక్కి మోహంబునన్
మత్స్యంబట్లు చలించు నంద్రు మదినే! మానంగ నీ పోలికల్
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్
(అలాంటి మందు దొరకదు, కవులు ఆ పోలికలు మానరని నా భావన)
అత్తగారింట్లో ఎలా నడచుకోవాలో తెలియ జెప్పటము:
రిప్లయితొలగించండిశా:
మత్స్యాక్షీ ఎదురీదగా వలయు నీ మాయావి యత్తమ్మతో ,
మత్స్యండీ గుణమున్న ప్రేమికునితో మారాము లేకుండగన్
మత్స్యంబై తిరుగాడగా సుఖము ప్రేమానుంగు ధ్యానంబునన్
మత్స్యక్షీరము బిల్లి కొమ్ము గలుపన్ మందౌ గవీంద్రాలికిన్
మాయావి=దుష్టు
మత్స్యండీ గుణము =తియ్యనే కానీ నెమ్మది
మత్స్యంబై తిరుగాడుట= ఎవరికీ చిక్కకుండా
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
మత్స్యము మాంసాహారమె
మత్స్యములన్ బోషకములు మస్తు
లభించున్
మత్స్యములఁ దినిన; మరెటుల
మత్స్య క్షీరమ్ము మంచి మందు కవులకున్?
మత్స్యంబదిజలపుష్పము
రిప్లయితొలగించండిమత్స్యంబులునండజములుమనుజులకెటులో
మత్స్యాశనముచితంబా
మత్స్యక్షీరమ్ముమంచిమందుకవులకున్
మత్స్యాహారముమేథబెంచునటయామత్స్యాపపుష్పాళినే
మత్స్యాహారులునారగింతురటయామత్స్యంబులౌయండజాల్
మత్స్యక్షీరముబిల్లికొమ్ముగలవేమౌలిన్బ్రశస్తంబెటుల్
మత్స్యక్షీరముఁబిల్లికొమ్ముఁగలుపన్ మందౌఁగవీంద్రాళికిన్