6, సెప్టెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3479

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సన్మానమ్మును బొందని కవి  మాన్యుం డగునా"

 (లేదా...)
"సన్మానముఁ బొందకున్న కవి మాన్యుఁ డంటంచు గణింతురా ప్రజల్"  

(ఛందోగోపనము)

51 కామెంట్‌లు:

  1. ఉ||
    దానము జేయకున్న విబుధాళిని విద్యను దానమివ్వగన్
    సూనుని ప్రీతివాక్యముల జూచిన తండ్రిటు శ్లాఘమిచ్చినన్
    పూనిన పద్యవిద్యలను పూజ్యులు జూచి తరించి జేయు స
    న్మానము బొందకున్న కవిసత్తముడంచు గణించురాప్రజల్

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      యతి సవరించిన సమస్యకూ వర్తిస్తుంది.

      తొలగించండి
  2. ఆనందించగ నెల్లరు
    దీనారమ్ములను దూగి తీరగు బాటన్
    మేనాలో మోసెడు స
    న్మానమ్మును బొందనికవి మాన్యుండగునా?

    రిప్లయితొలగించండి

  3. నాకు తోచిన మేరకు నేను మార్చుకున్న సమస్య:
    (క్షమించవలె)

    "సన్మానముఁ బొందకున్న కవి మాన్యత నొందున నీజగమ్మునన్"

    (ఛందోగోపనము)

    **************************************************************

    నడిరేయి సరదా పూరణ:

    హీనపు బుద్ధులన్ గొనుచు హేళన లోర్చుచు నెల్లవేళలన్
    మానము వీడుచున్ మురిసి మంత్రుని పాదము నెత్తికెత్తుచున్
    వీనుల విందుగా భజన వేడుక మీరగ జేయుచుండి స
    న్మానముఁ బొందకున్న కవి మాన్యత నొందున నీజగమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యలోని యతిదోషాన్ని గుర్తించి తెలిపినందుకు ధన్యవాదాలు.
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "మాన్యత నొందున యీజగమ్మునన్" అని ఉండాలి.

      తొలగించండి
  4. సమస్య :
    సన్మానము బొందకున్న కవి
    మాన్యత నొందున నీజగమ్మునన్

    ( ఎవరు నిజంగా గొప్పకవి ?)
    కానగరాని పాండితిని
    కావ్యములందున గుప్పియుండినన్ ;
    వేనకువేల పద్యముల
    వేసటనందక వ్రాసియుండినన్ ;
    మానసజిహ్వలందు స్థిర
    మై నటనం బొనరించు దివ్యస
    న్మానము బొందకున్న కవి
    మాన్యత నొందున నీజగమ్మునన్ ?
    (వేసట - అలసట ; మానసజిహ్వలందు - మనస్సు ,నాలుకలలో ; మాన్యత - పూజ్యత )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "మాన్యత నొందున యీజగమ్మునన్"

      తొలగించండి
  5. వీనుల విందుగ బాడుచు
    నానా యంశముల కల్పనలు గావించన్
    యేనాడు జనులచే స
    న్మానమ్మును బొందని కవి  మాన్యుం డగునా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నానా+అంశములు=నానాంశములు' అవుతుంది. అలాగే '...గావించన్+ఏనాడు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మానికమగు ధర్మములను
    పూనికతో నేర్చిగూర్చి పుస్తకములలో
    జానుగ లిఖించియున్ స
    న్మానమ్మును బొందని కవి మాన్యుండగునా?

    మానికమైన ధర్మములు మంచిగ జెప్పెడి కావ్యముల్ సదా
    పూనికగల్గు చిత్తమున పొల్పగు రీతిని వెల్వరించుచున్
    జానుగ సంఘమందున సుశాంతిని నిల్పుచు నుండు వేళ స
    న్మానము బొందకున్న కవి మాన్యత నొందునె నీజగమ్మునన్?

    రిప్లయితొలగించండి
  7. సన్మానముకై యితరుల
    సన్మానపు రచనలు కొనసాగిం చిననున్
    సన్మానకర్త లనడుగ
    సన్మానముఁ బొందని కవి సత్తము డగునే

    రిప్లయితొలగించండి
  8. కె.వి.యస్. లక్ష్మి:
    గురువు గారికి నమస్కారములు. దయతో నిన్నటి పూరణ పరిశీలించ గలరు.

    మెప్పు నొందెడి విద్యలు మేలురీతి
    బోధ జేయుచు తీరుగ బుద్ధులెల్ల
    వాడి నొందెడి విధముగ వన్నువైన
    తగవులంబెట్టు వారుపాధ్యాయు లనగ.

    రిప్లయితొలగించండి
  9. కానగ కవి ప్రతిభకు కొల
    మానము తానందుకొన్న మన్ననలౌతా
    నేనాడైననునొకస
    న్మానమ్మును బొందని కవి  మాన్యుం డగునా

    రిప్లయితొలగించండి
  10. ఘనముగ కావ్యము లల్లిన
    జను లందరు వాని చదివి సంతస మందన్
    కను విందుగ సభలను స
    న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం గురుతుతో ఆరంభమయింది. మిగిలిన పాదాలు లఘువుతో ప్రారంభమయ్యాయి. సవరించండి.

      తొలగించండి


  11. ఏనాటికైనను దిటవు
    గా నిలిచెడు పద్యముల ప్రకర్షణ తోడై
    మానసమందు ప్రజల స
    న్మానమ్మును బొందని కవి మాన్యుండగునా?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. శ్వానము కూడ గౌరవము పండితు లందున పొందనిచ్చతో
    హీనుగ కాళ్ళు పట్టుచును హేళన చేసిన వంత పాడుచున్
    మానము వీడి హేయుగిల మార్కొను నీచుల మధ్య నిల్చి స
    న్మానము బొందకున్న కవి మాన్యత నొందునె నీజగమ్మునన్?

    రిప్లయితొలగించండి
  13. కానగ సత్కవుల్ భువిని కావ్యములెన్నిరచించి యున్న నే
    మానవమాత్రుడాతడినిమాన్యునిగాతలబోయ డెప్పుడున్
    తానురచించుకావ్యములు దక్కినవారల మెప్పునొందిస
    న్మానముఁ బొందకున్న కవి మాన్యుడటంచు గణింతురా ప్రజల్

    రిప్లయితొలగించండి


  14. న్యూనత లేని భావనలు, నూతన మైన ప్రయత్నముల్, భళీ
    వీనుల కింపుగొల్పెడు కవిత్వము, ధాత్రిని మేలు కొల్పుచున్
    మానస మందు పద్యములు మన్నిక గానిలు వంగ, నౌర స
    న్మా నముఁ బొం దకున్న, కవి మాన్యుఁ డటంచు గణింతురా ప్రజల్?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. దానము ధర్మమంచు పలు తావుల,నాస్తులగూడబెట్టుచున్
    వేనకువేలుగాజనుల వేదనజెందగ, బాధబెట్టునా
    మానములేనివాడె మన మన్ననలందక ,తిట్లతోను స
    న్మానముబొందకున్నకవిమాన్యతనొందునయీజగమ్మునన్
    ++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  16. ఆనతినిచ్చినంత తన యభ్యుద యంబును వీడి వ్రాసియున్
    మాన సమానమౌ గుణము మారుపు కావగ కూర్పు చేసియున్
    తాననుకొన్న దానికి విధానపు రూపును మాపికూ డ స
    న్మానముఁ బొందకున్న కవి మాన్యుఁని గానె గణింతురా ప్రజల్

    రిప్లయితొలగించండి
  17. వేనకు వేలగు కవితల
    దా నలవోకగ ను వ్రాయు దక్షుo డైన న్
    జ్ఞానుల మెప్పు ల తో స
    న్మానములను బొందని కవి మాన్యుo డగు నా?

    రిప్లయితొలగించండి
  18. 06.09.2020
    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ యత్నం..

    *కం*

    జ్ఞానము మెండుగ గల్గియు
    మానవ విలువలు నిరతము మంట గలుపుచున్
    వాణీ పుత్రుల మను *"స న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  19. మేనున పట్టుశాలువలు మీరు పరీమళ పూలమాలికల్
    పాణిని కంకణమ్ములవి భాసురమవ్వగ
    హస్తమూపుచున్
    మానితమైన పల్లకిని మార్గము వెంబడి సాగిపోవు స
    న్మానము బొందకున్న కవి మాన్యు డటంచు గణింతురా ప్రజల్?

    రిప్లయితొలగించండి
  20. కానుక లిచ్చి శాలువల గప్పి కవీంద్రుల సత్కరించుటల్
    మానుగ సాగు కార్యమన మానసమందు దలంచ నంతటన్
    భానువులైన కైతల ప్రభాసము లెంచగ బోరు! నేడు స
    న్మానము పొందకున్న కవి మాన్యుడటంచు గణింతురా ప్రజల్!

    రిప్లయితొలగించండి
  21. వేనకు వేలు పద్యములు వెన్నుని మన్నన నందు గీతముల్
    జాను తెనుంగు నానుడులు జాతి పురోగతి నింపు సొంపులన్
    మానిత రీతి మానవత మాధురిమల్ ప్రజకందకున్న *స*
    *న్మానముఁబొందకున్న కవిసత్తముఁడంచు గణింతురాప్రజల్*

    రిప్లయితొలగించండి
  22. ఆననమందునన్ చదువులమ్మ వసించుచు నుండ ప్రీతితో
    జ్ఞానము పొంది పూర్వపు సుకావ్యములన్ పఠియించు చున్ సదా
    పూని రచించు కావ్యముల పోకిరి వారల కమ్మకుండ స
    న్మానముఁ బొందకున్న కవి మాన్యుఁ డటంచు గణింతురా ప్రజల్

    రిప్లయితొలగించండి
  23. ధీనిధిఁ బోతన సత్కవిఁ
    గానమె సన్మాన మంద కవి లోకములో
    నీ నాఁ డన కిట్టులు స
    న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా


    గాన వికాసమాన పద కాయము కల్పన చేయకున్నచో
    జ్ఞాన సుచోదన ప్రతిభ చాటక వ్యాకరణాది బోధ నా
    నూన విశేష పాండితిని నూనక సత్కవి పుంగవాలి స
    న్మానముఁ బొందకున్న కవి మాన్యుఁ డటంచు గణింతురా ప్రజల్

    [కవి మాన్యుఁడు = కవులకు మాన్యుఁడు]

    రిప్లయితొలగించండి
  24. తేనియ లొల్కు పద్యములు తేటతెనుంగున వ్రాయ నెంచుచున్
    వేనకు వేలుగా కృతులు విజ్ఞత తో రచియింపనేమిరా
    జ్ఞానులు దూరదర్శులు ప్రజాళియు భేషని మెచ్చిచేయు స
    సన్మానముఁ బొందకున్న కవి మాన్యుఁ డంచు గణింతురా ప్రజల్

    రిప్లయితొలగించండి
  25. ఉత్పలమాల:
    -------------
    తూనిక లేని మాటలని, త్రుళ్ళుచు పేలుచు వాదులాడుచున్
    పూనిక నీని గాధలను, పుణ్యము పేరిట మీదరుద్దుచున్
    తానొక గొప్పవాడినను, తప్పుడు భావనలోనబొంగి స
    న్మానముబొందకున్న కవి ,మాన్యుడటంచు గణింతురాప్రజల్
    ++++++€€++€+++€+€+€€+
    రావెల పురుషోత్తమ రావు

    రిప్లయితొలగించండి
  26. మానకకవితలనెపుడును
    వేనకువేలుంగవ్రాయబేర్మినిమిగులన్
    ఙ్ఞానులమెప్పునువడిస
    న్మానమునుబొందనికవిమాన్యుండగునా

    రిప్లయితొలగించండి
  27. మానకయెప్పుడున్గవితమాన్యతనొందువిధంబుగానికన్
    వేనకువేలుగాభువినిబేర్మినివ్రాయగ,సాహితీయస
    న్మానముబొందకున్నకవిమాన్యుడటంచుగణింతురాప్రజల్
    ఙ్ఞానులమెప్పునేగవులుసాంతముమేదినినిచ్చగింతురే

    రిప్లయితొలగించండి
  28. జానుదెనుగు పదములతో
    నీనుల విందగు కవితల వెలయించి సదా
    మానసముల గొలువౌ స
    న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా

    రిప్లయితొలగించండి
  29. శ్రీనాథకవీశ్వరులు పోతనార్యులతో...

    కందం
    మానిత భాగవత కృతినిఁ
    బూనెద మన సింగరాయ భూపతి వర్యుల్
    కానుకలొసంగి తత్స
    న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా?

    ఉత్పలమాల
    మానిత భాగవత్కృతిని మన్నన రామున కీయనెంతువే?
    కానగనొప్పవే సిరుల కర్షక వృత్తిని వీడనెంచవే?
    కానుకలిచ్చి యంకితముగాగొన నెంచిన సింగభూప స
    న్మానముఁ బొందకున్న కవి మాన్యుఁడటంచు గణింతురా ప్రజల్?

    రిప్లయితొలగించండి
  30. ఉ:

    కానరు లోకమందు వెటకారము సేయుచునుంద్రు తిక్కగన్
    మానరు యెంత జెప్పినను, మన్నిక నొందగు పాండితీ ప్రభన్,
    హీనపు యోచనల్ తుడుచ , హెచ్చిలు రీతిని యుక్తిమేర స
    న్మానము బొందుకున్న కవి, మాన్యుడటంచు గణింతురా ప్రజల్

    యుక్తి=న్యాయము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. ఉత్పలమాల
    కానుకనంది వాక్సుధల కమ్మఁగ శారదమాతదీవెనన్
    బూనుచు ప్రోత్సహించ సతి ముందుగ గెల్చుటనింట నొప్పనన్
    బేనుచు పద్యముల్ తొలుత ప్రేమగఁ గౌగిట నాలి గూర్చు స
    న్మానముఁ బొందకున్న కవి మాన్యుఁడటంచు గణింతురా ప్రజల్?

    రిప్లయితొలగించండి
  32. తేనెల తేటల పదములు
    వేనకువేలుగనువాడి విరచించంగన్
    మానుగ దానికిలనుస
    న్మానమ్మును బొందనికవి మాన్యుండగునే

    రిప్లయితొలగించండి
  33. మైలవరపు వారి పూరణ

    హీనగతిన్ బడంగ ప్రభుతేతరసంస్థల శిక్షకాళి., యా
    దీనత గాంచి దుఃఖితమతిన్ కవితల్ వెలయించి, వారికిన్
    దానొక తోడుగా నిలిచి ధైర్యమునీవలె.,నట్టివేళ స...
    న్మానము బొందకున్న కవి మాన్యుడటంచు గణింతు.,రా ప్రజల్!


    గణింతురు ఆ ప్రజల్

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  34. మానితమగు చరిత గలిగి
    ధ్యానంబున వాణి గొలిచి హరువు నొసంగన్
    బూనిక కావ్యం బిడ స
    న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా?!


    రిప్లయితొలగించండి