12, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3484

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్"(లేదా...)
"కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్"

78 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    "ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
    భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"

    వదనమునందు ప్రీతిగొని బావకు ధైర్యము నివ్వగోరుచున్
    బెదరనుగూడదంచు భళి వేడుక మీరగ నీశ్వరుండహో
    హృదయమునందు నుండునని హెచ్చుగ పల్కుచు గీతనందునన్
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎల్ల జీవుల, యంత్రము లెక్కి నట్టి
      వారి, హృదయమ్ము లందున మూరి నిల్చు
      నీశ్వరుండు తనదు మాయ నెల్ల నెఱపి
      త్రిప్పుచు సతము నర్జున యొప్పిదముగ -- శ్రీ కృష్ణ. సూక్తి. 18. 61.

      తొలగించండి
    2. 🙏

      ఏష దేవో విశ్వకర్మా మహాత్మా
      సదా జనానాం హృదయే సన్నివిష్టః
      హృదా మనీషా మనసాభిక్లుప్తో
      య ఏతద్విదురమృతాస్తే భవంతి

      శ్వేతాశ్వతర ఉపనిషద్ IV. 17

      తొలగించండి
  2. ముదిమిని దెచ్చి స్వతంత్ర్యము
    సదమల చిత్తమున జనులు సమరస రీతిన్
    బ్రదుకగ విడిపొమ్మనినన్
    కదనమ్మును దెచ్చిపెట్టె గద శాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెదరిన మానసంబునను చింతిలి
      యద్ధము చేయబోననన్
      విధులను బోధజేయుచును వీరుని వెన్నును తట్టిలేపుచున్
      కదనమునందు జచ్చినను కల్గును నాకము మేలుమేలనన్
      కదనము దెచ్చిపెట్టెగద కంజదళాక్షుని
      శాంతివాక్యముల్

      తొలగించండి
    2. మూడవపాదముగా
      కదనమునందు గెల్చినను గల్గును రాజ్యము గీర్తినొందగా
      అని చేర్చి పంచపాదిగా చదువ ప్రార్ధన

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏

      తొలగించండి
  3. రాయబారము:

    చం||
    సదనమునందు కృష్ణుడట సంధినిగూర్చుట యత్నమొందగన్
    తదుపరి కార్యమేమనుచు ధర్మము గోరిన కృష్ణబోధలన్
    వదులగ కౌరవేంద్రుడట వాదములేటికినంచు ద్రోయగన్
    కదనము దెచ్చి బెట్టెగద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  4. అందరినీ ఆనందింపజేయాలంటే మొదటికే మోసం వస్తుంది కదా..😊

    కృష్ణుని పారిజాతరసవత్కర ఘట్టం:

    చం||

    ముదమును గూర్చనెల్లరకు, ముందుగ నిచ్చుట పారిజాతమున్
    సదనమునందు రుక్మిణికి, సత్యకు సమ్మతి జూపెనేని త
    ద్పదతలమంట వెన్ను తల భార్యకు వృక్షమునిచ్చు మార్గమున్
    కదనము దెచ్చిపెట్టెగద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కుచేలుని అవస్థ:

    చెదరకు మిత్రమా వడిగ చిక్కులు నీకిక తీరునంచు వే
    పదులును వంద చీరలను పంపెద నీ సతి కంచు పల్కగా...
    కుదురుగ నాడబిడ్డలహ గుట్టుగ పోలిసు కేసు పెట్టగా
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
  6. సమస్య :
    కదనము దెచ్చిపెట్టె గద
    కంజదళాక్షుని శాంతివాక్యముల్
    (సాక్షాత్తుగా జగన్నాథుడే సంధికోసం రాయబారిగా విచ్చేస్తే విరగబాటు చూపిన
    కౌరవులు నామరూపాలు కోల్పోయారు )
    పెదవులయందు జిర్నగవు ;
    బేరిమి చిందెడి మేలికామనల్ ;
    వదనములో బ్రసన్నతయు ;
    బల్కుల నిండిన సత్యబోధనల్ ;
    సదమలవిశ్వరూపమును ;
    సంయమనమ్మును జూపుచుండినన్
    గదనము దెచ్చిపెట్టె గద !
    కంజదళాక్షుని శాంతివాక్యముల్ .
    (పేరిమి - ప్రేమ ; సంయమనము - ఓర్పు )

    రిప్లయితొలగించండి
  7. మెదులుము నైక్యత వీడక
    పదురుగ మీరందరనుచు బకవైరనినన్
    కుదురుగ భారతమందున
    కదనమ్మును దెచ్చిపెట్టె గద శాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బకవైరి+అనినన్' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. మెదులుము నైక్యత వీడక
      పదురుగ మీరందరనుచు పద్మాక్షుడనన్
      కుదురుగ భారతమందున
      కదనమ్మును దెచ్చిపెట్టె గద శాంత్యుక్తుల్

      తొలగించండి
  8. కుదరని బంధము కూర్చుకు
    నదరక చైనా నా పంచశీల నాపగ తలచన్
    ఇదె యదనని కలబడి యీ
    కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  9. మదిరాక్షి నాటి నవ్వదె
    కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద, శాంత్యుక్తుల్
    వదరగను రాయ బారిగ
    కదలెద నో ధర్మరాజ కాచగ జగతిన్.

    రిప్లయితొలగించండి
  10. అదరక బెదరక కృష్ణుడు
    పదుగురి సభ యందు తాను పల్కెను సూక్తుల్
    కుదరక సంధియు నయ్యెడ
    కదనమ్మున్ దెఛ్చి పెట్టె గద శాంత్యుక్తు ల్

    రిప్లయితొలగించండి
  11. హృదయమువెన్నముద్దతపియింతురుసఖ్యమెవీర్యమంచునీ
    సదనముజొచ్చెమాధవుడుసంధియొడంబడియాజినాపుమా
    వదలరుదుస్ససేనునినుపార్థుడుకర్ణునిరూపుమాపనన్
    కదనముఁదెచ్చిపెట్టెఁగదకంజదళాక్షునిశాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    మృదుపదబంధురమ్ముగఁ బరిస్థితిఁ దెల్పుచు శాంతిఁ గోరుచున్.,
    బెదరగఁ బల్కి పాండవులవీరత వారి ప్రతిజ్ఞలన్., వడిన్
    హృదయమునందునగ్ని రగిలించె నృపాలునకా సభాస్థలిన్
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. బెదరకు నేనె యన్నిటికి పెన్నిధి నిశ్చయమర్జునా ! యనన్
    సదమల విశ్వరూపమున సంశయ మార్పిన గీతవాక్కులున్
    వదలక నంత్య యాత్రలకు వాడగ నేడు నహో ! యిదేమి చౌ
    కదనము దెచ్చిపెట్టె గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
  14. యదుకుల భూషణుండు దర హాసము వీడక పల్కె నిట్టులన్
    వదులుము యుద్ధ కాంక్షనిక పాండవ వీరులె యాగ్రహించినన్
    వదలరొకండనైన నిది వాస్తవ మంచు వచించె గాదుటే
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
  15. చెదరిన ధర్మనందనుని చెంతకు జేరుచు నూఱడించుచున్
    ముదమని యెంచిమాధవుడు బుద్దులుఁదెల్పగ
    రాయబారియై
    వదలక మిత్రలాభమును పార్థుని శక్తిని సన్నుతించగన్
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  16. పదవుల కొల్లగొట్టి యల పార్థుల కానల పాలుచేయగా
    పదిలముగా నొనర్చి వనవాసము గుప్తపు వాసముల్ ధృతిన్
    సదనముచేర, కౌరవులు ఛద్మము జేయగ, పుట్టినట్టిదౌ
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్
    ఛద్మము: మోసము

    రిప్లయితొలగించండి
  17. అదియిది యసక పలురకపు
    పదార్థములను జవిగొనిరి పంతులియింటన్
    పిదప తమ బొజ్జలందున
    కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి

  18. * శంకరాభరణం *
    సెప్టెంబరు 12, 2020...శనివారం
    సమస్య

    "కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్"

    నా పూరణ. చం.మా.
    **** *** ***

    ముదముగఁ బారిజాతమును ముద్దియ రుక్మిణి కొప్పుఁ దాల్చగన్

    మది కడు క్షోభ జెందగను మానిని సత్యయె యల్కఁ బూనగన్

    యదుకుల భూషణుండగు మురారి పఠించుచు శ్రేష్ఠ వాక్కులన్

    గుదురుగఁ జేయఁ బోవ హృదిఁ... గోపము వీడక భామ తన్నినం

    త దశశతాక్షునిన్ గెలిచి తా నిడెఁ బారిజ శాఖి సత్యకున్

    కదనము దెచ్చిపెట్టె గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    ( కృష్ణుడు హిత వచనములు ఎన్ని చెప్పినా సత్యభామ పారిజాతముకై మొండిపట్టు పట్టగ ఇంద్రనితో యుద్ధం చేసి పారిజ వృక్షమునే సతికి బహుకరించారు..ఆతని శాంతి వాక్యములు నిష్పలమై చోవరికి యుద్ధమునే తెచ్చిపెట్టెను కదా...)


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  19. కదనమువలదనిగృష్ణుడు
    పదుగురికింనచ్చజెప్పబహువిధములుగాన్
    నదయనుద్రాళ్ళనుగట్టగ
    గదనమ్మునుదెచ్చిపెట్టెగదశాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పదుగురకును నచ్చజెప్ప బహువిధములుగా నదయను..."

      తొలగించండి
  20. పదిలముకోరుచున్ పతిత పావనుడాడిన మంచి మాటలన్,
    కుదురు నెరుంగకన్ మకురు కుంతికుమారుడు లెక్క చేయకన్!
    బెదరక పోరుకై తలచె బింకముతోడను కర్మబద్ధుడై!
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్"

    రిప్లయితొలగించండి
  21. అదనుగనైదూళ్లిమ్మని
    పదునైనమాటతలపడిపలుకగవైరిన్
    పదపడిభావముతెలియగ
    కదనమ్మునుఁదెచ్తిపెట్టెగదశాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  22. కదనముజోలికింజనుటకార్యముగాదిపుడెవ్విధమ్మునన్
    సదయనువారిభాగమికసాదరమొప్పగనీయమేలగున్
    పదుగురుజింతజేయుడనుబభ్రునిమాటలులెక్కజేయకే
    కదనముదెచ్చిపెట్టెగదకంజదళాక్షునిశాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
  23. వదరకుదుర్భాషలతో
    నెదలోవైరమునునింపకెవ్వరియందున్
    ముదముగనివ్విధిపలికిన
    కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
  24. మద ముప్పొంగిన వానికి
    మది యలరు పలుకులు కొన్ని మంచివి యనఁ గీ
    డెదురైన చంద మత్తరిఁ
    గదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్


    సదయుఁడు నీ సఖుం డచటఁ జక్కఁగ శాంతి నెడందఁ గోరుచుం
    బదిలము నెంచి నల్వురకుఁ బల్కిన భంగి వచించి తీ వహో
    యది వినినంత నాతఁ డన హర్షము తోడుత గౌరవమ్ము నా
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    [నాకు + అదనము= నా కదనము]

    రిప్లయితొలగించండి
  25. కం:

    వదలని సఖ్యత మనదని
    హృదినిడ పలికెను భరతము హెచ్చిన చైనా
    యదనని పోరున దలపడె
    కదనమ్మును దెచ్చి పెట్టె గద శాంత్యుక్తుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చం:

      ఉదయము నాది చింతగొన నొప్పగు ఛందము వ్రాయ బూనగన్
      వదలక వంట జేయుమనె వల్లక బోయిన బువ్వలేదనెన్
      కదలక యుండ నట్లె చన గన్పడె కాలిక రుద్రరూపమున్
      కదనము దెచ్చి పెట్టెగద కంజ దళాక్షుని శాంతి వాక్యముల్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. సదమల హృదయుడు యదుపతి
    కుదిరించెద సంధి నంచు కురుపతి దోడన్
    మృదువుగ బల్కిన గానిన్
    కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్

    రిప్లయితొలగించండి
  27. పదిలము దేశము ననుకొని
    కదనము వలదంచుశాంతి కాముకు లవగన్
    అదునని తెగబడె వైరులు
    కదనమ్మునుదెచ్చిపెట్టె గదశాం త్యుక్తుల్

    వరగంటి నగేష్ ,హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  28. కందం
    పదునగు కత్తుల కౌగిట
    వదనమ్మున సంధి వాక్కుఁ బలికెడు చైనా
    తుదియని మొదలిడు కతనన్
    గదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్

    చంపకమాల
    వదనమునందు చిర్నగవు వాక్కున యుద్ధ వినాశ ౘందమున్
    బదునగు భాషణమ్మొదవఁ బల్కుచు సంధిని గూర్చనెంచినన్
    బెదరనటంచు రెచ్చి సభఁ బెద్దల మీరిన రాజరాజుతో
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    రిప్లయితొలగించండి
  29. కదనముకూడదంచుకలకాలము సఖ్యత మేలటంచు నా
    పదలకునాలవాలమిరు పక్షపు సైన్యము చత్తురంచు నా
    సదనమునందునెల్లరకుశాంతి ప్రబోధములెన్ని సల్పినన్
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతి వాక్యముల్

    రిప్లయితొలగించండి
  30. హృదయ మునందు పాండవు లుహృష్ట ముతోన నినట్టి మాటలన్
    మదిని తలంచు చుండగ నుమాన్పడి జూచుచు భీష్మ ద్రోణులున్
    "కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్"
    తుదకికనేమియౌననుచుదుఃఖి తు లైరటవార లెల్లరున్

    రిప్లయితొలగించండి