కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్"
(లేదా...)
"రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్"
(లేదా...)
"రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
కృష్ణుడు మథురకు వెడలగా:
రాతిరి వేళనున్ జనుచు రమ్యపు రీతిని గొల్లపల్లెనున్
భీతిని వీడుచున్ తనరి బింకము మీరగ పూలతోటనున్
ప్రీతిని జేరుచున్ వెదకి ప్రేమను కృష్ణుని చంద్రకాంతపున్
రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
నాతుల మధ్యను పున్నమి
రిప్లయితొలగించండిరాతిరి నాట్యమునుసల్పు రాసక్రీడన్
చేతనమూర్తిని దైత్యా
రాతినిగని ముద్దులాడె రాధ ముదమునన్
నాతుల మధ్యలోనిలచి నాట్యము జేసెడు నల్లనయ్యనున్
తొలగించండిపూతన ప్రాణహారిని ప్రపూతుని మారుని మీరువానినిన్
ప్రీతిగ వేణుగానమును వీనుల
విందుగజేయు దానవా
రాతినిగాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
నిలిచి
తొలగించండిచిరు సవరణతో మొదటిపాదము
తొలగించండినాతుల గూడుచున్ వనిని నాట్యము జేసెడి నల్లనయ్యనున్
🙏🙏🙏
నాతులపోరునుగానగ
రిప్లయితొలగించండిగీతను మేలుగ పలికిన గృష్ణుని తరమా
ఖ్యాతిగ శిలయైనిలచిన
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
యాతన జెందుచున్ హృదిని హాయిని పెంచగ పట్టి లేమినిన్
సూతుని తోడ చూడగను సుందర మొప్పెడు మందసమ్మునన్
ప్రీతిని జేరుచున్ శిశుని ప్రేమను; బాపుచు నడ్డమున్నదౌ
రాతినిఁ; గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
ఆ తరుణీ మానస హరు
రిప్లయితొలగించండినా తరిదాలుపు ననంతు నచ్యుతు శౌరిన్
ఆ తరళాక్షుని కంసా
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
ఈ తనువు నీకు నిడితిని,
రిప్లయితొలగించండినా తలపున సతము నీవు నాట్యము నిడుచున్
ఖ్యాతి నిడెదవని కంసా
రాతిని గని ముద్దు లిడెను రాధ ముదమునన్
కృష్ణుడూ రాధా కలిసి వనములో వారు ఉండగా ప్రణయములో రాధ కృష్ణుని ముఖమును దగ్గరగా జూస్తూ ఆయన ముఖసౌష్ఠవానికి ముగ్ధురాలై ఆయన ముక్కును ముద్దు పెట్టుకున్నది.
రిప్లయితొలగించండిఉ||
శీతలసంధ్యయన్ వనము జేరగ రాధ సఖాసమేతయై
పాతములై గనన్ ప్రణయవర్షసుధారసధారలిద్దరున్
జూతురు మోము మోము గని! సుందరసౌష్ఠవకృష్ణు మోమునన్
ఘ్రాతిని గాంచి ముద్దులిడె రాధమనంబున మోదమొందుచున్!
ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
రీతిగ బృందావనమున
రిప్లయితొలగించండిభ్రాతిని పెంచెడి పదములు పాడుచు నెలమిన్
ద్యోతించెడి ఘన దైత్యా
రాతిని గని ముద్దులిడెను రాధ ముదమునన్.
నాతిని గనంగ పోవును
రిప్లయితొలగించండికోతికివలె మనసు నందు కూరిమితో నే
నాతిని కూడెనొ యోపక
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
పూతన జంపిన పెంపరి
రిప్లయితొలగించండిగీతను బోధించినట్టి గిరిధరు డనుచున్
ఖ్యాతిగడించిన కంసా
రాతిని గనిముద్దులిడెను రాధముదమునన్.
గీతా చార్యునిగా నిల
రిప్లయితొలగించండిఖ్యాతిగడించిన మురారి కరుణా మయుడౌ
పూతన దునిమిన కంసా
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరీతిగ ప్రేమగీతములు రెచ్చిన తేకువ తోడ మీఱుచున్
ప్రీతిని గొల్పు చందమున బిత్తరమౌనటు పాడుచుండుచున్
ఆతురతన్ వనమ్మున ఘనమ్ముగ దోరెడునట్టి దానవా
రాతిని గాంచి ముద్దాడెను రాధ మనంబున మోదమొందుచున్.
కర్ణుని అతిరథుడు రాధ కొసగివ సందర్భము
రిప్లయితొలగించండిపాతి శిశుని తనకిడిన పు
రాతన గుడిలోన చిందరగ పడి యున్నన్
రాతి బొమలయందు పురా
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశీతలవాతబాధలకు చెక్కిలిచెక్కిలికాన్చి., వెచ్చగా....
ప్రీతిగనూసులాడుకొని., వింతసుఖమ్మును పొందినామొ యీ
రాతిపయిన్., గతించెను శరత్తున రాతురులట్టివంచునా...
రాతినిఁగాంచిముద్దిడెనురాధ మనం బునమోదమందుచున్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పూతన గడతేర్చి మహిత
రిప్లయితొలగించండిచేతన తో వెలిగి నట్టి శ్రీకర రూపున్
ప్రీతిగ వలచిన దైత్యా
రాతి ని గని ముద్దు లిడెను రాధ ముదమునన్
ఆతత సేవ జేతు మనసాతని సొత్తు విధాత చేత గో
రిప్లయితొలగించండిమాతలు తస్కరింపబడ మందయె తానయె శక్రవృష్టికిన్
ఖ్యాతిగిరిన్ధరించె యదు కాంతల చింతలుబాపె గీతతో
గీతలుమార్చెసాధకులకీర్తినిబెంచెదయాత్ముదానవా
*రాతినిఁగాంచిముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్*
ప్రీతిని దేవకీ సుతుని పేరు జపించుచు ప్రేమవాటినిన్
రిప్లయితొలగించండిరాతిరి వేళలందు రసరమ్యములైన శశాంకు కాంతిలో
నాతని పొందుకై వగచి యా మురళీధరు రూప గొన్న నా
రాతిని గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్!
మూడవ పాదంలో "రూపు" అని సవరించడమైనది.
తొలగించండిపాతకి పూతనన్ దునిమి, పయ్యర మేపరి నంటగట్టుచున్
రిప్లయితొలగించండిగోతతి కాచినట్టి ఘన గోపకిశోరుడు, సవ్యసాచికిన్
గీతను చెప్పినట్టి హరి, కేశవు డాతడె చక్రి దానవా
రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
చేతనజగత్తులోనస
రిప్లయితొలగించండినాతనుడైశుభములిడుచుమాటునతానై
త్రాతగనుండెడికంసా
రాతినిగనిముద్దులిడెనురాధముదమునన్
రాతిరి వెన్నెలందున కలాధరు డల్లరి పెట్టుచుండగా
రిప్లయితొలగించండిచేతమునందుమాధవుడు చెన్నును చూపుచు చెంగలింపగా
పాతకులై చరించెడి క్షపాచర జాలము దున్ము దానవా
రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
చేతోరూపుడునగుచును
రిప్లయితొలగించండిచైతన్యులజేయుచుండిశిష్టజనంబున్
ఖ్యాతిగనిలచినదైత్యా
రాతినిగనిముద్దులిడెనురాధముదమునన్
ఉ:
రిప్లయితొలగించండిప్రీతిగ చేరియున్ యమున బేలగ జూసెను రాధ యంతయున్
ఆతురతన్జ్వలించెహృది యాదవుగానక తీరమంతయున్
ఆతనివోలెకన్పడగనాదరిచేరగకృష్ణురూపుగా
రాతినిగాంచిముద్దిడెనురాధ మనంబున మోదమొందుచున్
ఆతత గుణగణుఁ డవశీ
రిప్లయితొలగించండిభూతుండవతారమెత్తఁ మోహము మీరన్,
చేతమునన్ నా కంసా
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్.
పూతనజంపువాడునునపూర్వబలంబునుగల్గుదానవా
రిప్లయితొలగించండిరాతినిగాంచిముద్దిడెనురాధముదంబునమోదమందుచున్
బాతకులైనవారెసగుబాపములన్నియునెండగట్టుచున్
చెతనరూపుడౌచునిక శిష్టజనంబులరక్షజేయుగా
రాతిరిపున్నమివెన్నెల
రిప్లయితొలగించండిభాతియగుచుయమునపైన బరచుకొనంగా
నాతత విరాళి దైత్యా
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
చేతనము లుడిగి వింతన్
రిప్లయితొలగించండినాతులతో నేఁగుదెంచి నందుని వనికిం
బ్రీతినిఁ జెక్కిన బొమ్మను
రాతినిఁ గని ముద్దు లిడెను రాధ ముదమునన్
త్రాతను వ్యోమ ధీ బృహ దరాతిని భీకర ఘోటకాసు రా
రాతినిఁ గంస రాణ్మహ దరాతి నభో గత మారు తాసు రా
రాతిని వాహ్య రా డ్లస దరాతి బకారినిఁ బూతనాంగ నా
రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
ఉ:
రిప్లయితొలగించండిఆతతినొంద ప్రేమికుని యాత్రము జేరుట కాస గూర్చగన్
వ్రాతగ చీటి నిచ్చి యిక భారము నీదని వెల్లడించగా
మాతకు దెల్వ నా లిఖిత మ్రాన్పడి గోపము సేయఁ చింత, నా
రాతిని గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందగన్
వై. చంద్రశేఖర్
ఉ:
తొలగించండిభ్రాతను జేరి దెల్పె తన బాల్యపు మిత్రుడు ప్రేమ పాత్రునిన్
ప్రీతిని గొల్పనాతనిని పెండిలి యాడగ నిచ్ఛగింపగన్
సాతము గూర్చు నీ వలపు చక్కని జంటయు రత్నమన్న నా
రాతిని గాంచి ముద్దిడెను రాధ మనంబున మోద మందుచున్
వై. చంద్రశేఖర్
పూతవిభూతిదాతకునుపూతనప్రేతనిహంతకున్జగ
రిప్లయితొలగించండిజ్జేతకుజేతకున్విమతశ్రేష్ఠినియాతనవృష్ణినేతకున్
ద్రాతకుధాతతాతకుహృదంజలిజేతనియెంచికైటభా
రాతినిఁగాంచిముద్దిడెనురాధమనంబునమోదమందుచున్
జేతమునిచ్చిపుచ్చుకొనెశ్రీధరుశ్రీకరునాత్మభూతినిన్
కందం
రిప్లయితొలగించండిభీతిలి ద్రోవది సభలో
యాతనపడి వలువలూడ్చ నన్నా! యనఁ జే
యూతనిడె ననుచు కంసా
రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్
ఉత్పలమాల
భీతిలి, కౌరవాధములు వేదన నింపుచు వల్వలూడ్చఁగన్
యాతన బాపరమ్మనుచు నార్తిని ద్రౌపది వేడినంతఁ జే
యూతగ నిల్చి కాచెనని యున్నతుఁడంచునుఁ గృష్ణు దానవా
రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్
భాధాతప్తహృదంతదుఃఖిత! పరబ్రహ్మస్వరూపుండు స
రిప్లయితొలగించండిర్వాధారప్రణతార్తిహారి యొకడే ప్రాణేశుడౌ సృష్టి లో
స్త్రీధామంబె జగత్సమస్తమ యినన్ చిత్రమ్ము, శాస్త్రోక్తమై
రాధాకృష్ణుఁడు బ్రహ్మచారి యగు, నో రాకేందుబింబాననా!
కంజర్ల రామాచార్య