16, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3488

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంతుఁడు శివునిఁ జంపెఁ జక్రమ్ముతోడ"

 (లేదా...)
"కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై"

38 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    కంతుని శంభుడాదటను కన్నును విప్పుచు కాల్చగా తొలిన్
    కాంతయె మ్రొక్కగా తుదకు కంతుడు నవ్వుచు పొందుచున్ రహిన్
    పంతము మీరగా పగను భండన మందున నుగ్రుడై కలిన్
    కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "ప్రేమ కోసమై వలలో పడెనే అయ్యో పాపం పసివాడు..."

    చింతలనోర్చి హైమవతి చిక్కుల నోర్చుచు సేవజేయుటన్
    కంతుడు గాంచి మానసము కంపము నొందగ చిల్కనెక్కుచున్
    వింతగ ప్రేమచక్రమును వింటిని దాల్చుచు నొక్కవేటునన్
    కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై...

    రిప్లయితొలగించండి
  3. చాలా కష్టమైన సమస్య

    దీనికి ఒక ప్రణాలిక:

    కంతుడు శివుని ప్రేరేపించడానికి వెళ్ళడం, ఆ ప్రయత్నం లో చావడం మనకు తెలిసిందే. కానీ అసలు శివుని అంత కన్నులు తెరిచి భస్మం చేసేంత disturbance ఏం చేసాడు? అదే నా పూరణ.

    ఆయన సంగమచక్రధారియగు..ఆయన శివుని మీదకొక బాణం వేసాడు. ఆ బాణం అమృతతుల్యంగా ఉంది.. ఆ అమృతం కొంచం శివుని కంఠంలో విషాన్ని హరించింది..అన్నది పూరణ..
    (తరవాత మీకు తెలుసు.. కంతుడి పని త్రినేత్రుని చేతులో ఐపోయింది.)


    ఉ||
    వింతగదోచు, కాముడు విభిన్నము సంగమచక్రధారియౌ!
    అంతముగాకముందమృతహారములౌనటి బాణముల్ విడన్,
    కొంత విషాగ్నినిన్ కుసుమకోమలమొందగజేసె! జ్వాలలన్
    కంతుడు శంభు కంఠమును, ఖండన జేసెను జక్రధారియై

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  4. అంతము జేయనీశ్వరు డనంగుడు
    గానడయాడె నెవ్వడో
    వింతగ శోభలీనుచును వీనులకంటి
    యలంకరించె నా
    పంతము తోడకృష్ణుని యవాకులు ప్రేలగ వానిశీర్షమున్
    కంతుడు, శంభు కంఠమును, ఖండన చేసెను చక్రధారియై

    వీనులకంటి = సర్పము

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    కంతుడు శంభు కంఠమును
    ఖండన చేసెను జక్రధారియై

    (గురువు ప్రశ్నలు - శిష్యుల జవాబులు )
    " ఎంతగ గూడదన్న బర
    మేశ్వరు నొంటి నెదిర్చె నెవ్వరో ?
    అంతటి కాలకూటవిష
    మాఖరు కెచ్చట కేగి నిల్చెనో ?
    చింతను బాప నేన్గునకు
    శ్రీహరి నక్రము నేమి చేసెనో ? "
    " కంతుడు " " శంభు కంఠమును "
    " ఖండన చేసెను జక్రధారియై . "
    (నక్రము-మొసలి;కంతుడు -మన్మథుడు)

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. చింతిల వేల్పులందరును చిత్రపు బాణము వేసె నీశు పై ;
      ఇంతి ఉమాసతీ తపము లీప్సిత మొందగ హారమూన్చె తా;
      పంకజసంభవుండటను పాపము సేయ నజున్ నఖంబు తో ;
      కంతుడు, శంభు కంఠమును, ఖండన చేసెను జక్రధారియై.

      తొలగించండి
  7. సిరి సుతు డెవరనిన,గజా సురు డెవరిని

    గొలిచె,శివుడేమి చేసెను
    వలపు దొరను

    మకరి నెటుల జంపెను‌ హరి మడుగు లోన,

    కంతుడు,శివుని,జంపె,చక్ర మ్ము తోడ

    రిప్లయితొలగించండి
  8. పూల బాణము వేయుచు మోహి జేసె
    కంతుఁడు శివునిఁ ; జంపెఁ జక్రమ్ముతోడ
    కన్నడు శిశుపాలుని శిరోఖండనమున
    వంద తప్పుల యనుమతి భర్తి కాగ

    రిప్లయితొలగించండి
  9. సంతస మందుచున్ సుతుని సర్వవిధంబుల శ్రేష్ఠమంచు నా
    వంతయు స్వీయసంస్కృతుల నందగనీయక హూణవిద్యలన్
    పంతము మీర నేర్పి రిక వాడును వారికి బల్కె నొక్కచో
    కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై.

    రిప్లయితొలగించండి
  10. రతి పతెవ్వడొ తెలుపుము? రావణుండు
    కొలుచు నెవ్వని? కృష్ణుండా కుచ్చితుడగు
    చేది రాజునెట్లు వధించె చెప్పు మనగ
    "కంతుఁడు, శివునిఁ, జంపెఁ జక్రమ్ముతోడ.

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మోహపరవశునిగ జేయ పూనికగొనె
    కంతుడు శివుని; జంపె జక్రమ్ము తోడ
    నూఱుతప్పుల నొనరించి నూగినట్టి
    కఱటుడా శిశుపాలుని కంబుధరుడు.

    రిప్లయితొలగించండి
  12. "కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై
    అంతమొనర్చ దౌష్ట్యముల" నంచు వచింపగ దోషమౌనురా
    కంతుడు కాడురా నరుడ! కంతుని తండ్రి యతండు; ద్రుంచె తా
    పంతము బూని దుష్ట శిశుపాలుని శీర్షము; శంభు కాదురా!

    రిప్లయితొలగించండి
  13. ఎవరుపూలబాణమువేసెనెవరిపైన
    చక్రి శిశుపాలునేరీతి చమరజేసె
    తెలిసియున్నను ప్రత్యుక్తిదెలుపుమీవు
    కంతుఁడు శివునిఁ, జంపెఁ జక్రమ్ముతోడ

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    ముంతెడు కల్లుద్రావ జెడిపోయెనొ నీ మతి., లేక వేపకా...
    యంతటి వెర్రి పుట్టుకనె యబ్బెనొ.,
    పైత్యము ప్రజ్వరిల్లెనో.,
    వింతగ బల్కితీగతి కవీ! రసవంతము గాని వాక్యమున్
    కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. ఫాల నేత్రపు మంటకు భస్మ మయ్యె
    కంతు డనుటకు బదులుగా కలవరము న
    కంతుడు శివుని జంపె జక్రమ్ము తోడ
    ననగ ఫక్కున నవ్విరి యచటి వారు

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వింతగ నీశుపై తమిని జేర్చెడి శస్త్రములెవ్వరేసిరో?
    అంతట సర్పమందముగ నల్లికగొన్నది నేరి కంఠమున్?
    పంతముతోడ నేనుగును పట్టిన కుంభినెటుల్ హరి మట్టుబెట్టెనో?
    కంతుఁడు, శంభు కంఠమును, ఖండన చేసెను జక్రధారియై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వింతగ నీశుపై తమిని బేర్చెడి శస్త్రములెవ్వరేసిరో?
      అంతట సర్పమందముగ నల్లికగొన్నది నేరి కంఠమున్?
      పంతముతోడ నేనుగును పట్టిన కుంభినెటుల్ హరి మట్టుబెట్టెనో?
      కంతుఁడు, శంభు కంఠమును, ఖండన చేసెను జక్రధారియై.

      తొలగించండి
  17. చెంతన కల్లు ముంత పిలిచెన్ జెలి భాగవతాంతరార్థమున్
    వింత వచించు సంతుగని
    వెన్నునిచింతనజేయుమన్నదా
    ముంతనుముద్దువెట్టుకొనిముద్దియతోవచియించెనివ్విధిన్
    కంతుఁడు శంభుకంఠమును ఖండనచేసెను జక్రధారియై

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    (క్రమాలంకారం)

    శివుని తపమును భంగమున్ జేసెనెవడు?
    రావణుడు గొల్చు నెవ్వని ప్రతిదినంబు?
    హరి మకరి నేమి జేసెను కరినిఁ గావ?
    కంతుడు; శివునిఁ; జంపెఁ జక్రమ్ము తోడ.

    రిప్లయితొలగించండి
  19. వింత యదేమి లేదుర వివేకము వీడిన వాడు గావునన్
    పొంతన లేక పల్కెనట మూర్ఖుడు జ్ఞానవిహీనుడాతడే
    కాంతయె గోర జెప్పెనొక కల్పిత గాథనె యాలకింపుమా
    కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై

    రిప్లయితొలగించండి
  20. పుష్పబాణానగిరిజపై మోహబఱచె
    కంతుడుశివుని,జంపెజక్రమ్ముతోడ
    నూఱుతప్పులుసేసెడువరమువలన
    శ్రీకరుడుశిశుపాలునిశీఘ్రముగను

    రిప్లయితొలగించండి
  21. హరుని కోపాగ్ని కాహుతి యైనదెవరు?
    వరునిగా నెంచి నగజాత వలచె నేరిఁ?
    వదరు శిశుపాలు గృష్ణుండు వంచె నెటుల?
    కంతుఁడు; శివునిఁ; జంపెఁ జక్రమ్ముతోడ

    రిప్లయితొలగించండి
  22. కంతుడుశంభుకంఠమునుఖండనచేసెనుజక్రధారియై
    వింతగనున్నదీపలుకువెర్రిమనస్కులబల్కులీవెయే
    కంతుడెభస్మమాయెనటకామవిరోధినిగంటిచూపుతో
    నంతముజేయగానగునునాద్యునిసంయతినడ్డగించనౌ

    రిప్లయితొలగించండి
  23. తేటగీతి
    చక్రమున రమాకాంతుఁడుఁ జంపె శిశుక
    ము నన, నీదు నిర్వాకమ్ము మూర్ఖమౌట
    నిన్నటి పరీక్షలోఁ గంటి నీవిధముగ
    "కంతుఁడు శివునిఁ జంపెఁ జక్రమ్ముతోడ"

    ఉత్పలమాల

    ఎంతని జెప్పితిన్ వెధవ! యింపుగ నీకు గజేంద్ర మోక్షమున్
    సంతసమంది వ్రాయ నదె చక్కగ నీయ పరీక్షలందునన్
    వింతగ నక్కుపక్షి! యవివేకిగ వ్రాసితివిట్లు శుంఠవై
    "కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై"

    రిప్లయితొలగించండి
  24. కాంత రతీ ప్రియుండెవడు? కావరి యౌ త్రిపురాసురుండనే
    యంతము జేసె నెవ్వడట? యా శిశు పాలుని శౌరి యవ్యయా
    నంతుడు చంపెనెవ్విధిని? నాకెఱిగించుమనంగ చెప్పెనే
    కంతుఁడు, శంభు, కంఠమును ఖండన చేసెను జక్రధారియై

    రిప్లయితొలగించండి
  25. సుర గణము తన్ను గోరఁగఁ జోద్య మొప్ప
    నెమ్మి నిజ పుష్పబాణ చక్రమ్ము పఱచె
    బ్రహ్మచర్య కాఠిన్యము భవుని, కాంచి
    కంతుఁడు శివునిఁ, జంపెఁ జక్రమ్ముతోడ

    [బాణచక్రమ్ము = బాణసమూహము]


    సుంతయు సిగ్గు సెందక వచోరచ నాజ్ఞుఁడు మిత్ర కోటికిం
    జెంత సురా నిషేవణ మశేషము జేసి వికార చిత్తుఁడై
    పొంతన లేని మాటలను మోహ వశమ్మునఁ బల్కె నిట్టులం
    గంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై

    రిప్లయితొలగించండి
  26. నేటి సమస్య : "కంతుఁడు శివునిఁ జంపెఁ జక్రమ్ముతోడ"
    తే.గీ.
    చూతపత్రమ్ము నెవ్వని సూక? మట్టి (సూకము?+అట్టి )
    వాని నెవ్వడు యుగ్రుడై పదడు జేసే?
    అచ్యుతు శిశుపాలుని నెట్లు ఆదరించె?
    "కంతుఁడు", "శివుని", " జంపెఁ జక్రమ్ముతోడ"
    క్రమాలంకారం లో నా పూరణ
    ---- శ్రీరామ్ 10వ తరగతి

    రిప్లయితొలగించండి
  27. ఉ:

    సొంతము గాని విద్య మనసొప్పక గ్రుక్కెడు మద్యమందునన్
    గొంతుకలోన దింపి పలు గ్రుక్కలు మ్రింగి పురాణ వేత్తగా
    పొంతన లేక బల్కెనట పుక్కిట బట్టిన గాథగా వెసన్
    కంతుడు శంభు కంఠమును ఖండన జేసెను జక్రధారియై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. ఆ. వె.

    కొంటె తనమున హరికథ గోర జనులు
    చెప్పు దొడగెను కథకుడు చేష్ట లుడగ
    కల్లు త్రాగిన రీతిని గావుపెట్టి
    కంతుడు శివుని జంపె జక్రమ్ము తోడ

    రిప్లయితొలగించండి
  29. సుంతయు భీతినిన్ గొనక శూలితపమ్మును నిల్పె నెవ్వరో?
    పంతముతో విషమ్ముగొని పంచముఖుండెట నిల్పియుంచె? శ్రీ
    కాంతుడు చేదిరాజు గని కంఠము త్రుంచిన దెవ్విధమ్మునన్?
    కంతుడు, శంభుకంఠమును, ఖండన చేసెను చక్రధారియై

    రిప్లయితొలగించండి
  30. వింతగనున్నదీపలుకు వేదనతోమది విన్నబోయె ని
    ర్ఘాంతహృదంతరాళపరిఘట్టనదుఃఖము మిన్నునంటె నా
    ఛాత్రుడుబుద్ధిహీనతను జంకకనందరిముందు నిట్లనన్ :
    "కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై"

    రిప్లయితొలగించండి