15, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3487

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నాఁటిరోజు లిఁకరా వింకరావు"

 (లేదా...)
"నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా"(ఛందోగోపనము)

47 కామెంట్‌లు:

  1. ఉ||
    రావిక రావు రావు గద రావిక రావిక రావు రావులే
    రావిక రావులే యసలు రావిక రావిక రావు రావు లే
    కోవిడు వల్ల గుంపులిక గూడవు సంఘములెవ్వియుండవే
    రావిక నాటిరోజులిక రావిక రావిక రావు మిత్రమా

    రోహిత్ 😄😄😄 (సరదాగా )

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    బావురుమంచు నేడ్చుచును బ్రాహ్మణ తేజము వ్యర్థమౌచు ఛీ!
    దేవుకులాడి తిండికని దీవెన లిచ్చెడి రాజుగార్లకిన్
    పోవుర నేటిరోజులెటు పొందిక మీరగ రామభద్రుడా!
    రావుర నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  3. కవి తనలో తాను సమస్యల గూర్చి:
    ఇవి వరములు గదా, సమస్యలు గావు కదా!

    ఉ||
    రావిక రావికా? కవివరా యవి యూరక రాకనుండునే?
    నీవిక నోపికన్ కవితనే రమియించుచు రావురావురా
    వావరుసన్ వరంబులగు వారె! సమస్యలు కావురా! కవీ
    రావిక నాటిరోజులిక రావిక రావిక రావు మిత్రమా!
    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  4. సమస్య :-
    "నాఁటిరోజు లిఁకరా వింకరావు" (ఛందోగోపనం)

    *తే.గీ**
    పాడిపంటలన్ని సమృద్ధి పండెనాడు
    పాలు పెరుగు లన్ని యుచిత పంపకాలు
    ధర్మమని యడిగినచాలు ధాన్యములను
    పెట్టు నాఁటిరోజు లిఁకరా వింకరావు
    .............✍️చక్రి

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రోజులు రోజులన్ గనక రొప్పుచు రోజుచు రాజ్యమంతటన్
    నాజుకు కైపదమ్మునిడి నందము నిచ్చెడి పూరణమ్ముకై
    భోజుడు కాళిదాసుఁ గన భోరున నేడ్చుచు గోలజేసెడిన్
    రాజుల నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా 😊

    రిప్లయితొలగించండి
  6. సమస్య :
    నాటి రోజు లిక రావిక రావిక రావు మిత్రమా
    ( ఛందోగోపనము )

    ( ఆంధ్రసాహిత్యచరిత్రలో అష్టదిగ్గజకవీంద్రుల స్వర్ణయుగం రాయలవారి కాలం )
    ఆయతకీర్తిలోకమది ;
    యార్యులు పెద్దన ముక్కుతిమ్మనల్ ;
    మాయలు లేని మూర్తికవి
    మల్లన ధూర్జటి రామకృష్ణుడున్ ;
    దీయని శ్లేషమార్గముల
    దీర్చెడి సూరన రామభద్రుడున్
    రాయలనాటి రోజు లిక
    రావిక రావిక రావు మిత్రమా !
    ( ఆయత - విశాలమైన ; మూర్తికవి- భట్టు
    మూర్తి )

    రిప్లయితొలగించండి
  7. మణుగు బియ్యము‌ రూకకు, మట్టి నూనె

    గ్యాలనుకు ఖర్చు నొక కాణి,కంది పప్పు

    వచ్చు అర్ధణాకొక శేరు,పసిడి శవరు

    వంద రూకలు కొనబోవ, వైభ వమగు

    పిన్న నాటి రోజు లిక రావింకరావు

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల:
    -------------
    మాయని కీర్తినిచ్చెగద,మాటలు పద్యములాయెనత్తరిన్
    తీయని సాహితీసుమము,తీరుగవిచ్చెలె యష్టమూర్తులై
    కూయనికోసెకోయిలలు,కోరికదీర్చగ కృష్ణరాయలై
    రాయలనాటిరోజులికరావికరావికరావుమిత్రమా
    ++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  9. ఇల వైకుంఠ పురంబులో వరదుడై శ్రీ భూసతీనాథుడై
    విలసత్కాంచన శంఖ చక్రయుగళిన్ వేంచేసె శీతాంశు కాం
    తుల నానంద గృహాంతరాన కటిహస్తుండైన సౌవర్ణ మే
    ఖలునిం గొల్చినవాడె యర్హుడగు మోక్షంబందగా నిచ్చలున్


    దాగుడు మూత లాటలును, తాడును బొంగరమాట, కోతులై
    సాగుచు కొమ్మలాట, మరి సంతకు వెళ్ళగ గోళిసోడ, తో
    డేగిన పిల్లలల్లరులు, టీపగు చేష్టలు, పర్వవేడ్కలే
    లాగున నాటిరోజులిక రావిక రావిక రావు మిత్రమా

    టీపు = మంచి నడవడికకు మూటగట్టిన ధనము
    పర్వవేడ్కలు = పండుగ నాటి వేడుకలు

    రిప్లయితొలగించండి
  10. ఎంత సొగసుగ బాల్యమ్ము సుంతయైన
    వంత లేకను ఐదేళ్ళు వచ్చువరకు
    జరిగిపోయెను మాకైతె జననమాది
    వెళ్ళె నాఁటి రోజు లిఁక రా వింకరావు

    రిప్లయితొలగించండి
  11. రాయల రాజ్యమందు రస రమ్యము లయ్యెను సాహితీ సుధల్
    వ్రాయ స్వయమ్ముగా తెనుగు భాషను సత్కృతి నాంధ్ర భోజుడున్
    తీయని కావ్య రాజముల దిగ్గజముల్ వెలయించిరే భళా!
    రాయల నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. నాడునలుగురునొకచోటకూడుటొప్పు
      నేడు గృహమునువీడిన నేరమౌను
      పాడువైరసు చెరచెను బ్రతుకులెల్ల
      నిపుడు నాఁటిరోజు లిఁకరా వింకరావు 

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పఱిగలేరి వాటి నదల్చి వడ్లు దీసి
    సత్తి కొట్టున సోలలో సర్ది పెట్టి
    ఇష్టమగు మిఠాయిల నన్ని నేరి కోరి
    పెట్టు నాటి రోజులిక రావింక రావు.

    రిప్లయితొలగించండి
  14. చోద్యముగ జోస్యమును జెప్పుచుంటివి గద
    తప్పకుండగ లోకులు దాము జేయు
    పనులయందున ధర్మము బాటించినపు
    డేల నాఁటిరోజు లిఁకరా వింకరావు ?

    రిప్లయితొలగించండి
  15. ప్రేమ లాప్యాయత ల బంచి ప్రీతి తోడ
    పలుక రించుచు నాత్మీయ బంధ మునను
    కలిసి మసలుచు జీవించు కమ్మనగు సు
    విధపు నాటి రోజులిక రా వింక రావు

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వావిరినైన కంకులను పంటపొలమ్ములనుండి నేరుచున్
    కైవడి గూడు పద్ధతిని కాముడు కొట్టుకు పోయి వెంటనే
    సావమునందు పేర్చి తగు చక్కని పేణిని తిన్న పూటలన్
    రావిక నాటి రోజులిక రావిక రావిక రావు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  17. సమస్య :-
    "నాఁటిరోజు లిఁకరా వింకరావు"

    *సీసం**

    గోలీల ఆటలో గొడవగొడవపడి
    మొండితనముజూపి మోసగింత

    బొంగరమ్ములతోడ బుగ్గపగలగోట్టి
    ఇల్లుచేరగ లేక ఈదులాట

    రేగుపండ్ల కొరకు రేగడంత తిరిగి
    బడికి నామము పెట్టి బంతులాట

    నటన జేసిన చిన్న నాఁటిరోజు లిఁకరా
    వింకరావు మనకు వెంటవెంట

    *ఆ.వె**
    కర్ర చిల్ల తోడ కర్రల సమరమ్ము
    ముక్కుగిచ్చు లాట ముక్కు వాసె
    కాలు విరిగిపోయెగా కబడ్డీనందు
    నాటి రోజులకివి సాటిరావు
    ......‌.‌....✍️చక్రి

    రిప్లయితొలగించండి
  18. కె.వి.యస్. లక్ష్మి:

    చిన్న వయసు చేష్టలు చిఱుతగవులు
    కోతికొమ్మచ్చు లాటలు గోటిబిళ్ళ
    కాకి ఎంగిళ్ళ పంచుళ్ళు గాలినుడులు
    పిన్ననాటి రోజులిక రావింక రావు.

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    పాలకునేడ్వ ముద్దుమురిపాలనుఁదేల్చెడి తల్లిప్రేమ., పే...
    చీలనుఁబెట్ట జాలి దరిఁజేర్చి ముదంబిడు తండ్రిప్రేమ.,బెం...
    చీలను నెక్కు శిక్షనిడు శిక్షకవర్యులు.,
    నాటపాటలన్
    గ్రాలిన నాటిరోజులిఁక రావిఁక రావిఁక రావు మిత్రమా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  20. బారుగ నల్లినట్టిజడ బాగుగ పూవుల నొప్పుకొప్పునున్
    సౌరుగ నొంటినిండుగను చక్కగ జుట్టిన చీరచోళియున్
    దీరుగ సోగకన్నులను దీర్చిన కాటుక మువ్వగజ్జలున్
    మీరిన లోహకాంతులను మెల్తుక
    మోమున దిద్దుబొట్టు ల
    ల్లారెడు నాటిరోజులిక రావుగ రావుగ రావుమిత్రమా

    రిప్లయితొలగించండి
  21. పలక బలప ములను పట్టి పాఠశాల
    కేగినటువంటి రోజుల వెప్పటికిని
    మరపురానివెల్లరకును మహిని జూడ
    పిన్ననాటి రోజులిక రావింక రావు.

    మరొక పూరణ

    చెట్ల నెక్కుచు సతతము చిలిపి పనులు
    చేసి గురువుల, పెద్దల చేత తిట్లు
    తినుచు నాడుచు పాడుచు తిరిగి నట్టి
    పిన్ననాటి రోజులిక రావింక రావు.

    రిప్లయితొలగించండి
  22. మనసునిండుగహాయిగమాటలాడు
    కొనుచునొకరికొకరమునుగుంపుగూడి
    యాటపాటలతోడనునలరెమిగుల
    వెంకి!నాటిరోజులికరావింకరావు

    రిప్లయితొలగించండి
  23. పల్లె పల్లెను పద్యమ్ము పరిఢ విల్లె
    రాగ బంధమ్ము దెలిపెడి రామ కథలు
    పోరు నష్టమని తెలుపు భారతమ్ము
    పరమ పురుషుని చర్చించు భాగవతము
    వెర్రి కేకలాయెనుగద వేదఘోష
    మంట గలిసెను కదనోయి మానవత్వ
    మింక నాటి రోజులిక రావింకరావు.
    😢

    రిప్లయితొలగించండి
  24. నూరు రూకల కిచ్చిరి నులక మంచ
    మారు పైసల కిడిరింక నారరిసెలు
    కోతికొమ్మచ్చు లాటకు కొదవలేదు
    కోట్లు వెట్టిన గానింక కొనగలేము
    *పిన్ననాటి రోజులిక రావింక రావు.*

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. కమ్మని రామ నామమును గానము జేయుచు శాంత చిత్తులై
      నమ్ముచు ధర్మ మార్గమును న్యాయము దప్పక సాగనందరున్
      యిమ్ముగ భోగ భాగ్యముల నింపొదవౌ నట రామ రాజ్యమే
      రమ్మన నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా

      తొలగించండి
  26. రాయలపాలనంబరయరంజిలునట్లుగనుండెనీభువిన్
    రాయుడ!నాటిరోజులికరావికరావికరావుమిత్రమా!
    రాయలపాండితీగరిమరాజులమన్నలనందుచుండియున్
    దీయనికావ్యసంపదలుదేటతెనుంగుననుద్భవించెగా

    రిప్లయితొలగించండి
  27. తీపి జ్ఞాపకము లనుచు నాప కుండఁ
    దలఁచి తలఁచి ముదము నొందఁ దగును గాక
    చిన్న నాటి యా ముచ్చట లన్న యేల
    శంక నాఁటిరోజు లిఁకరా వింకరావు


    కా విలఁ బ్రాణి దేహములు గావిలఁ గావిలఁ గావు నిత్యముల్
    పో విఁకఁ బుట్టు బుద్దు లవి పో విఁకఁ బోవిఁకఁ బోవు చావకే
    లే విఁక బాంధవమ్ము లవి లే విఁక లే విఁక లేవు చావఁగా
    రా విఁక నాఁటి రోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా

    రిప్లయితొలగించండి
  28. తామస చిత్తులైరిగద తానము నందు విపక్ష మూకపై
    కామముతోడ నేత్రములు కప్పుకు పోయెను నేతలందునన్
    చామలపైన దుండగము సాగుచునుండ వికల్ప మేలనో
    రాముని నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా

    రిప్లయితొలగించండి
  29. కోవిదు రాకతో జనుల కోర్కెలవల్లరికూలిపోయెనిం
    కెవ్వరు గీములన్ విడచియెచ్చటికింజనరాదు యేరితో
    వావిరిగా మెలంగతగవౌనికనొంటరి జీవితమ్ములే
    రావికనాఁటిరోజులిఁక రావిఁక రావిఁకరావు మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవపాదంలో ప్రాస సవరించి వ్రాయడమైనది. (అసనారె గారికి ధన్యవాదములు)

      కోవిదు రాకతో జనుల కోర్కెలవల్లరికూలిపోయెనిం
      కేవిధి గీములన్ విడచియెచ్చటికింజనరాదు యేరితో
      వావిరిగా మెలంగతగవౌనికనొంటరి జీవితమ్ములే
      రావికనాఁటిరోజులిఁక రావిఁక రావిఁకరావు మిత్రమా

      తొలగించండి
  30. కామయతోటలోన కడుకమ్మని పండ్లను దొంగిలించి యా
    రామములందు నానుచు జలమ్ముల హేలగ నీదులాటలున్
    రాముని మందిరమ్మునను నాటక సంఘపు శిక్షణమ్ములున్
    తామరసాక్షు కోవెల ముదమ్మున చేరుచు చెంగలించు స్వ
    గ్రామము, నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా

    రిప్లయితొలగించండి
  31. పాదరక్షలు లేకుండ పల్లెలందు
    తిరిగినట్టిరోజు లవియె కరిగిపోయె
    లాగు జారిన నేమిరా లజ్జ యనని
    పిన్న నాటిరోజులిఁక రావింక రావు

    రిప్లయితొలగించండి
  32. రాయలు యుద్ధ వీరుడని ప్రక్య గడించిన శూరుడైన, నా
    త్మీయులుగా కవీంద్రులను మిక్కిలి మన్నన జేసె నచ్చటన్
    హాయిగ వాక్కులమ్మ దర హాసమె చిందుచు నిల్చె నందురే
    రాయల నాటి రోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  33. సాయముజేయబంధుజనశర్ధమమేయప్రియానురాగమున్
    మ్రోయువిభూషలందియలపూర్వవిలాసములాటపాటలున్
    మాయనిచిద్విలాసమునమాయకమోమునసోయగంబులే
    బ్రాయపునాఁటిరోజులిఁకరావిఁకరావిఁకరావుమిత్రమా

    రిప్లయితొలగించండి
  34. ఉ:

    మిత్రుల గూడి పొద్దనక మిట్టుచు గోలగ నాటపాట లే
    మాత్రము చింతలేక దిన మాజరు కేగుట పాఠశాలకున్
    ఛాత్రుడు వీడెయన్నటుల చక్కని మార్కులు బొందుచుండనౌ
    రా ! త్రమె ! నాటిరోజులిక రావిక రావిక రావు మిత్రమా

    ఔరా+ఆత్రమె=ఔరాత్రమె

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  35. పిన్నక నాగేశ్వరరావు.

    కోతి కొమ్మచ్చి, గోలీలు, కుందులాట
    కాల్వయందున నీతలు, కఱ్ఱ బిళ్ల
    లాడినట్టి బాల్యము కదలాడె మదిని
    పిన్ననాటి రోజులిక రావింక రావు.

    రిప్లయితొలగించండి
  36. తేటగీతి
    బాల్యమందున మునిమాపు వడినయంత
    వీధి దీపాల వెలుగులో వేడుక యన
    నాడుకున్నట్టి యనుభవమద్భుతమ్ము
    లిలను నాఁటిరోజు లిఁకరా వింకరావు!

    ఉత్పలమాల
    గోలయనంగ నాడు గుమిగూడుచు బాలలమంత సంజలో
    హేలగ వీధి దీపములునింపొనరించఁగ నాటపాటలన్
    దేలుచు నిళ్లముంగిట యథేచ్ఛగ నూసుల వైచి మంచముల్
    వ్రాలిన నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  37. మొదటి పద్యం మూడవ పాదం చివర 'అనుభవాలద్భుతమ్ము' అని చదువుకొన ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  38. చేవను చూపుచున్సతముచీరుచునేడ్చుచు నెల్ల,వేళలన్
    బావులయందు నీదుచునుపారుచు దాగుడు మూతలాడుచున్
    నావల దాగినేరికిని నందక యాడినరోజులింకపై
    రావుగ నాటి రోజులికరావికరావికరావుమిత్రమా.

    రిప్లయితొలగించండి