24, సెప్టెంబర్ 2020, గురువారం

సమస్య - 3496

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్"

 (లేదా...)
"అయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా"

70 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    తియ్యగ పెండ్లియాడుచును ధీరుడు వీరుడు వెంకటప్పనున్
    పొయ్యిని నూదరాయనగ బొగ్గుల నోర్వక పారిపోవగన్
    దయ్యము వోలె తిట్టగను దగ్గర నుండని, స్వప్నమందు, వెం
    కయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తొయ్యలి పెండ్లి యాడగను తోరపు మీసపు రాములయ్యనున్
    కయ్యము నందు చిక్కగను కాపుల తోడ గుడుంబ నమ్ముటన్
    రయ్యని వచ్చి పోలిసులు లాగుకు పోవగ, జైలునందు రా
    మయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    రిప్లయితొలగించండి
  3. నేటి సమస్య :
    అయ్యను గాంచి యామె విర
    హాతుర యయ్యెను సాజమే కదా
    ( ఆంజనేయుడు అందించిన రామాంగుళీ
    యకాన్ని అందుకున్న సీతమ్మ స్థితి )
    తియ్యని పల్కులన్ సరయు
    తీరము జూపెడి ప్రేమమూర్తియున్ ;
    గయ్యపుజేష్ట లేని మృదు
    కమ్రపు నమ్రపు దివ్యమూర్తియున్ ;
    నెయ్యపు మూర్తియౌ తనదు
    నిండగు దేవుని యుంగరాన - రా
    మయ్యను గాంచి యామె విర
    హాతుర యయ్యెను సాజమే కదా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "దేవుని నుంగరాన..." అనికదా ఉండాలి?

      తొలగించండి
  4. సయ్యొద్ద పూర్వక కనులు

    తియ్యని భాషణ,ఘనమగు దేహము నొప్పన్

    సయ్యని హిడింబ యా భీ

    మయ్యను గనియాయమవిర
    హాతురయయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సయోధ్య'ను 'సయ్యొద్ద' అనరాదు. 'పూర్వక కనులు' దుష్టసమాసం.

      తొలగించండి
  5. తియ్యని‌ కోరిక‌ ప్రబలన్

    పయ్యెద ఘనమౌ కుచముల పైతొలుగంగన్,

    శయ్యన పొరలెడు యా సో

    మయ్యను గని యాయమ విరహాతుర యయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శయ్యను పొరలెడు నా సోమయ్యను..." అనండి.

      తొలగించండి
  6. ఈనాటి శంకరా భరణ సమస్య


    అయ్యను గని యా యమ విరహాతుర యయ్యెన్


    ఇచ్చిన పాదము కందము‌‌

    నా పూరణ తేటగీతిలో


    బ్రహ్మ కుమార్తె సరస్వతి బ్రహ్మ సతతము‌ సృష్టి కార్య క్రమాలలో ముణిగి తనకు శయ్యా సుఖము నివ్వని కారణము‌ సరస్వతి దేవి అతనిని‌ చూచు నప్పుడల్లా విరహాతుర అయినది‌ అని
    భావన


    సతతము‌ జగతి సృష్టిపై మతిని‌ పెట్టి

    తనకు శయ్యా సుఖమిడక తనదు కోర్కె

    ను తలచని ఘనుడా యయ్యను గని‌ యాయ

    మవిర హాతుర యయ్యెన్ తమకము పెరుగ

    రిప్లయితొలగించండి
  7. అయ్యో! దారిని మరచితి
    నెయ్యముతో తెల్పగదవె నిలయము చేరన్
    దయ్యము వై దారి యను ప్రవ
    రయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  8. నెయ్యపు కాడు ముదమ్మున
    పయ్యెద లాగుచు పిలువగ పరవశమందున్
    తొయ్యలి సుందరుడగు కా
    మయ్యనుగని యాయమ విరహాతుర యయ్యెన్

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సయ్యాటలతో రాధకు
    తియ్యని కూరిమిని బంచి తిరుగాడెడినౌ
    నెయ్యపు మూర్తియు నా కృ
    ష్ణయ్యను గని యాయమ విరహాతుర యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ఇయ్యమునాతరంగములనెంతని చూడను., మందమారుతం..
    బియ్యది గాల్చెనగ్నివలె., నీ శరదిందుడునట్లెయుండె., సా..
    హాయ్యమొనర్చుచుండె మకరాంకుడు వారికటంచు., నాత్మఁ గ...
    న్నయ్యను గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. అయ్యామ్య వేళ యందున
    తొయ్యలి పూవనము జేరి తుంగీ పతియౌ
    యయ్యత్రినేత్రి భవు చం
    ద్రయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  12. నెయ్యము మారెను వలపుగ
    తొయ్యలి యాతని నతనునితో సరియనుచున్
    చయ్యన తలచుచునా కా
    మయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్

    రిప్లయితొలగించండి
  13. నెయ్యముతో హ్వానమునిడె
    నయ్యనుఁ గని యాయమ : విరహాతుర యయ్యెన్
    తొయ్యలి తన పతితోడన
    కయ్యము లాడుటకు వీలు గననిక యనుచున్

    రిప్లయితొలగించండి
  14. కం.
    తియ్యని మురళీ రవమది
    తొయ్యలి యా రాధ వినగ తొందర పాటున్
    పయ్యెదయే జారగ, క
    న్నయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నెయ్యరియై నిరంతరము నింపును జూపుచు వల్లభుండటన్
    తియ్యని మాటలన్ గలిపి తీరున రాధకు నిష్ఠమౌ నటుల్
    కయ్యములేని పద్ధతిని గారవమున్ కలిగించునంత కృ
    ష్ణయ్యను గాంచి యామె విరహాతుర యయ్యెను సాజమే కదా!

    రిప్లయితొలగించండి
  16. అయ్యమునా తటి చెంతను
    తియ్యని గానమ్ము వినుము తీరని తమితో
    నెయ్యము కోరుచు నట క
    న్నయ్యనుగని యాయమ విరహాతుర యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  17. చయ్యన హిడింబి గాంచియు
    తియ్యని భావమ్ము గలిగి దేదీప్యంబౌ
    వయ్యారి గ మారియు భీ
    మయ్యను గని యాయమ విరహా తురయయ్యెన్

    రిప్లయితొలగించండి
  18. చయ్యన పంచ బాణములు సారిక పయ్యెద తాకినంతనే
    తియ్యని బాధమేనొదగ తీరని కోరిక లుప్పతిల్లగన్
    నెయ్యము గోరి వేగపడె నేనిక తాళగ లేననంగ కా
    మయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    రిప్లయితొలగించండి
  19. తియ్యని మాటలన్ దన తీరగు మోహన రూపసంపదన్
    తొయ్యలి సీతగూడి బహుతోషము
    నందుచు సంచరించు రా
    మయ్యను గాంచి యామె విరహాతుర యయ్యెను సాజమేగదా
    స్రుయ్యని క్రాగు మానసపు సుందరి రావణు తోడబుట్టుకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! దనదు అని ఉండాలి, పొరపాటున ఒక అక్షరం తప్పిపోయింది! 🙏🙏🙏

      తొలగించండి
  20. తియ్యనికలదాగాంచెను
    చయ్యనదనప్రక్కచేరిసరసముతోడన్
    బయ్యెదలాగెడునాక
    న్నయ్యనుగనియాయమవిరహాతురయయ్యెన్

    రిప్లయితొలగించండి
  21. కయ్యములాడకుండగను గాంతలభావముగారవించుచున్
    నెయ్యముతోమెలంగుచునునేర్పునునోర్పునుగల్గియుండియున్
    దియ్యనిమాటలన్ బలికిదీర్తునుగోరికనంచుబల్కురా
    మయ్యనుగాంచియామెవిరహాతురయయ్యెనుసాజమేకదా

    రిప్లయితొలగించండి
  22. తియ్యనిఁ బల్కులం దనిపి తీండ్రములైదగు నూసు లెయ్యెదం
    జయ్యన రేపి కౌగిట భృశమ్ము బిగించి నవోఢనుం గటా
    నయ్యెడ వీడి పున్నమి దినమ్మున వత్తని నంతఁ బూర్ణచం
    ద్రయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  23. ఉ:

    కయ్యము లేక యెంతయును గారము సేయుచు ముద్దు గూర్చుచున్
    తొయ్యలి కూరడింపుగను దూరము నేగక వృత్తి జేయుచున్
    సయ్యట లాడుచున్ మనసు శాంతము గూర్చెడు భర్త నొంద బా
    వయ్యను గాంచి యామె విరహాతురు యెయ్యెను సాజమే కదా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధా మాధవుల కేళి:

      ఉ:

      పయ్యెద జారుచుండ కడు భారము గూర్చగ గుండె సవ్వడుల్
      రయ్యన తాపమున్నెగయ రమ్మనె ప్రాయము నాత్రమందగన్
      నెయ్యపు మాటలన్ వగలు నిండిన మేనియు పొందు గూర్చ క
      న్నయ్యను గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. వియ్యాల వారి యింటను
    సయ్యాటలు సల్పుచుండ సమ్మదమున నీ
    వొయ్యనఁ బల్కుమ తా నే
    యయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్


    కయ్యము నెంచ కాత్మ సిత కంజము నందు సురాలి పంపునన్
    వియ్యము నెంచి వెండిమల వీరున కింపుగ నుద్యమించి తా
    నయ్యతనుండు వేయ శర మంతటఁ బార్వతి మారవైరి యా
    యయ్యనుఁ గాంచి యామె విరహాతుర యయ్యెను సాజమే కదా

    [అయ్య = పూజ్యుఁడు]

    రిప్లయితొలగించండి
  25. చయ్యన దూకు కేశివలె చక్కని మధ్యముతోడ మించ భీ
    మయ్య, హిడంబి వెస మారుని తూపుల లోనచిక్కి తా
    కయ్యమునందు సోదరుని కాలునిచెంతకు పంపినట్టి యా
    యయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  26. తొయ్యలియవ్వనంపుబిగి తొందరజేయగనాత్మవల్లభున్
    చయ్యనజేరికౌగిటను చక్కిలిగింతల తేలియాడగన్
    తియ్యని స్వప్నలోకములదేలుచునుండగనంతలోన కాం
    తయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    రిప్లయితొలగించండి
  27. చయ్యన జేరెను గనుమా
    దొయ్యలి మురళిని విని, మది దోచిన ఘనునిన్
    తియ్యవిలుతుడా మారుని
    కయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్

    రిప్లయితొలగించండి
  28. కయ్యము నాడి కోపముమ ఖండము దాటెనటంచు బాధతో
    నయ్యవిషిన్ పతిన్ దలచి యంగద నందు తరిన్ నభమ్ములో
    నయ్యభిరూపుడే పొడిమి యద్భుత మైన యకల్కనీన చం
    ద్రయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

    రిప్లయితొలగించండి

  29. పిన్నక నాగేశ్వరరావు.

    నెయ్యము జరుపుచు ప్రియుడే
    పయ్యెద లాగుచు సరసపు పలుకులతోడన్
    తొయ్యలిపై కరమిడు సో
    మయ్యనుఁ గని యాయమ విరహాతుర
    యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  30. కందం
    చయ్యన వచ్చెను రుక్మిణి
    రయ్యన కోవెలకు వచ్చి రమ్మటనుచుఁ దా
    నయ్యరదమునుండెడు కృ
    ష్ణయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్!

    ఉత్పలమాల
    చయ్యన వచ్చినన్ రమణి చక్కఁగ శైలజమందిరంబుకున్
    రయ్యన వచ్చి రుక్మిణిని రాక్షసమందు వివాహమాడ నే
    నయ్యరదంబునన్ గొనెద నంచన వచ్చియు వేచియుండి కృ
    ష్ణయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా!

    రిప్లయితొలగించండి
  31. చెయ్యను వివాహమీకని
    వియ్యము కూడదని దక్షు వివరింపదగన్
    కయ్యని యెగసిన మహదే
    వయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్


    సయ్యాటకు రా బిలచిన
    తొయ్యలి పిలుపు వినినంత తమకంబొప్పన్
    రయ్యని వచ్చిన మన క
    న్నయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్

    రిప్లయితొలగించండి
  32. చయ్యనఛాయజూడమధుసారధిసాయకమేయకొండమ
    ల్లయ్యనుగాంచియామెవిరహాతురయెయ్యెనుసాజమేకదా
    తియ్యనిహాయిసోయగముతెచ్చెనెదన్మధుమాసమాధురిన్
    రయ్యననిశ్చయించెనుపరాత్పరియీశునివల్లభుండుగా

    రిప్లయితొలగించండి