12, అక్టోబర్ 2020, సోమవారం

సమస్య - 3513

 13-10-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్"

(లేదా...)

"పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్"

100 కామెంట్‌లు:


 1. కం.
  అందిన రాక్షస వీరుని
  పందెమ్ముననామమడచి బడలికఁబడి తా
  బొందును గోరుచు యా తొలు
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  తొలుపంది = ఆదివారాహము

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  మగడు:

  అందరి ముందరన్ వలదు హాయిగ నీవిక పెండ్లిపందిరిన్
  ముందటి వాకిటన్ వదిలి ముద్దుల నిమ్మని దొడ్డి దారినిన్
  తొందర చేసి రమ్మనుచు తోరపు కన్నుల తోడ భామ చూ
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్...

  రిప్లయితొలగించండి
 3. సమస్య :
  పంది పటుక్కునం గొరికె
  బంకజలోచన మోవి గ్రక్కునన్
  ( కందుల వారి అబ్బాయి - నందుల వారి అమ్మాయి )

  కందుల వారి పిల్లడొక
  కమ్మని రాతిరి సౌఖ్యవంతమౌ
  నందుల వారి పిల్లయగు
  నర్మద ; భార్యను శోభనంబునన్
  బొందుగ జెంతజేరి పెను
  పొందెడి ప్రేమను జెప్పలేని కై
  పంది ; పటుక్కునం గొరికె
  బంకజలోచన మోవి గ్రక్కునన్ .

  రిప్లయితొలగించండి
 4. సందులు గొందులందు మనసందున యిందిర యేమనందు నీ
  యందమె యందమౌ గువల యంబున సుందరు లెందరున్న నీ
  డెందమె డెంద మందమనడే విటు డిందు ముఖిన్ వరించి సొం
  *"పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనసందున నిందిర' అనండి. నిజానికి 'మనసు' అన్నది సాధుపదం కాదు.

   తొలగించండి
  2. సందులు గొందులందు మదిసమ్మతి యిందిర నేమనందు నా
   యందమె యందమౌ గువల యంబున సుందరు లెందరున్న నా
   డెందమె డెంద మందమనడే విటు డిందు ముఖిన్ వరించి కై
   *"పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్*


   సవరణతో🙏🙏

   తొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సుందరి క్రొత్తగా నమరి శోభను గూర్చగ పాకశాలనున్
  తొందర పాటునన్ తనరి త్రుళ్ళుచు భర్తకు వంటజేయగా
  కందుల పచ్చడిన్ విరివి కారము నెత్తికి జేర్చు మిర్చి పో
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్...

  రిప్లయితొలగించండి
 6. ౧.
  అందము మధురానందము
  సుందరమైనట్టి మోము సురుచిర మైనన్
  బంధముముడివడ గా నూ
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్!

  ౨.
  విందున బోయినొక్క డొక బేలను జూడగ మోజుగల్గె తా
  పొందును గోరనెంచి కడు పోరును సల్పగ
  నొప్పపెద్ద లా
  బంధము గూర్చ,వారికిక,పంతము నెగ్గిన సంతసమ్ము నూ
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్!!


  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అందముతో దీపించెడి
  సుందరి మోమున వలపును శోధించుచు నా
  సుందరు డక్కజముగ కై
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్.

  రిప్లయితొలగించండి
 8. వరాహ రూపములో‌ శ్రీ హరి హిరణ్యాక్షుని సంహరించిన సందర్భము

  పాతాళ‌మున దాచె భరణిని దానవుడా హిరణ్యాక్షుడు, పాహి యనుచు

  మొరలిడ భూదేవి, హరి‌ వరా హముగ మారి‌ రసాతల మును‌ చేరి సమరమును

  చేసి యా యసురుని శీఘ్రము గా జంపెను,ధరణి సంకెలలపై దాడిచేసి

  గ్రక్కున పంది పటుక్కున గొరికెను, భామిని మోవిన్ త్రిపాత్తు‌ పనికి‌

  చిరునగవులు మెరియగ శ్రీ హరి చుబుకము

  నెత్తి ముద్దుల‌ కురిపించ ‌నెమ్మి‌ తోడ

  బ్రహ్మ రుద్రాదు లెల్లరు‌ భక్తి‌తోడ

  చక్రికి సలిపె పూజలు సరస‌ గతిని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసం నాల్గవ పాదం పూర్వార్ధంలో గణభంగం. "శీఘ్రముగా జంపె" అంటే సరి. కర్తృపదం 'రుద్రాదులు' బహువచనం. క్రియాపదం 'సలిపె' ఏకవచనం. "చక్రధరుని బూజించిరి" అనండి.

   తొలగించండి

 9. కం॥
  ఇందువదనాందమును గని
  పొందును గోరుచు తమికి ధవుండె యత్యా
  నందముతోడను మది "వల
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్"


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఇందువదన యందము గని... ధవుడే..." అనండి. (కందం రెండవ పాదంలో సరిగణంగా జగణం 'ధవుండె' ఉండరాదు)

   తొలగించండి
 10. సుందరుడా రమ్మని ప
  ర్వేందుముఖియె సైగజేసి పిలిచిన వేళన్
  సుందరి కాంక్షల కనుచూ
  పంది పటుక్కునఁ గొఱిగెను భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
 11. కుందనబొమ్మనీవనుచు,కూరిమి తోడనుచెంతజేరి నా
  చందురుమించు నందమని, చక్కనిచుక్కగనెంచిబల్కుచున్
  పొందునుగోరుచున్ మదిన,పొంగులువారగ ప్రేమతో,నుచూ
  పంది పటుక్కునంగొఱికె పంకజలోచన మోవిగ్రక్కునన్
  ++++++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కుందనపు బొమ్మ' అనడం సాధువు. "మదిని" అని ఉండాలి.

   తొలగించండి
 12. అందము లారబోసితిని యత్త కుమారుడ రమ్మటంచు నా
  సుందరి సైగజేసి కను చూపుల బాణము రువ్వి పిల్వ నా
  నందము తోడ నాప్రియుడు నారి సుధారస మూరుచున్న చూ
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజ లోచన మోవి గ్రక్కునన్

  రిప్లయితొలగించండి
 13. సుందరి బెండ్లాడిన నా
  నందమున వరుడు సుధీరు హద్దులు లేకే
  చిందులువేయగ మది ఊ
  పంది పటుక్కున గొరికెను భామిని మోవిన్

  సుందర పారిజాతమును సొంపుగ కొప్పున జేర్చకృష్ణుడే
  ముందుగ రుక్మిణీమణికి , మ్రుచ్చగు
  నారద మౌనివర్యుడా
  ఇందిర భాగ్యమున్ బొగడ నీసున
  చేదగు వర్తమాన ము
  ప్పంది పటుక్కునన్ గొరికె పంకజలోచన మోవి గ్రక్కునన్


  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అందముతోడ పెంపెసగు నంగన గాంచి ముదమ్ము నొందుచున్
  పొందుగ పెద్ద లూకొనగ పొల్పున పెండిలియాడినట్టి నా
  సుందరు డానిశ న్నెలమి జూపుచు కోరిక రెచ్చినంత కై
  పంది పటుక్కునం గొఱికె బంకజలోచన మోవి గ్రక్కునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...యాడినట్టి యా సుందరు.." అనండి.

   తొలగించండి
 15. తొందర సేయగ మదనుడు
  పందిరి మంచంబున సతి పతి దరి జేరన్
  కందువ విరిమల్లెల పిలు
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
 16. కె.వి.యస్. లక్ష్మి:

  అందము చిందులు వేయగ
  సుందర రూపున తనచెలి సొగసుల తోడన్
  విందులు చేయగ తా నూ
  పంది పటుక్కున గొఱికెను భామిని మోవిన్.

  రిప్లయితొలగించండి
 17. అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ యత్నం..

  *కం*

  అందము తోడుగ నెదురుగ
  విందును చేయగ సతినిక విడువక పతియే
  ముందుగ తలచిన యా చూ
  *"పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  ✍️🙏

  రిప్లయితొలగించండి
 18. సందడిగా మనువాడి ప
  సందయిన పడతి బడసెను సుఖములు గూరన్
  తొందర జేసి మగడు వూ
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సందడిగా మనువాడి ప
   సందైన సతిని బడసెను సురతము గోరన్
   తొందర జేసి మగడు వూ
   పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వూపు' తెలుగులో వూతో మొదలయ్యే పదాలు లేదు. "తొందర జేయుచు మగ డూ।పంది..." అనండి.

   తొలగించండి
 19. అందముగ నున్న శూరము
  చందపు మరబొ మ్మను వలజయె చుంబించన్
  యందలి మీట యదుముగొన
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  శూరము = పంది
  వలజ = స్త్రీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చుంబించన్+అందలి' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి


 20. ముందర దూసుకు వచ్చెను
  పంది, పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్
  కందువ వేళ జిలేబీ
  సందుకొన భయము పరుగున సదనము చేరెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 21. కందోత్పల


  మునుగడ హటాత్తుగా దా
  రిని పంది! పటుక్కునం గొఱికెఁ బంకజలో
  చన మోవి గ్రక్కునన్ భయ
  మున కందువ వేళ వాజమున పరుగులిడెన్  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. ఉ:

  సుందరి నీదె యందమని చూపులు గల్పుచు ప్రేమ దెల్పుచున్
  సందులు గొందులన్ తిరిగి చప్పున చేతిని చిక్క బట్టుచున్
  పొందును గోర నా గడుసు పోకిరి చేష్ట పొలీసు దెల్ప ను
  ప్పంది పటుక్కునం గొరికె బంకచ లోచన మోవి గ్రక్కునన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 23. మైలవరపు వారి పూరణ

  😊🙏

  విందయినంతఁ దక్కిన విభిన్నపదార్థములన్ని మూటగా
  తొందరఁజెంతనే గల వధూవరచిత్రమునందు గట్టి., యా
  పందిరి ప్రక్క వేసిర.,ది వాసన జూచుచు మూట చించగా
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజ లోచన మోవి గ్రక్కునన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 24. సందడి లేకనె జరిగెను
  సుందరి పెండిలి తదుపరి చూపులె మిగిలెన్
  సందు దొరకగ వరుడు కై
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
 25. అందముననూర్వశియై
  సుందర మైవెల యునింతి సునిశిత దేహన్
  డెందమున మెచ్చి తా గై
  పంది పటుక్కున గొరికె భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. "అందమ్మున నూర్వశియై" అనండి.

   తొలగించండి
 26. సుందరి యగు సతి గూడియు
  పొందుగ సుఖములను దేలు పొల్పగు వేళన్
  కందువ మగు నా చెలి చూ
  పంది పటుక్కున గొరికె భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
 27. తొలిరేయి మధురిమలు...

  కందం
  అందించు పాలలో సగ
  మందించి సతికి వరుండు నరమరముడుగన్
  పొందిక నొగి కౌగిటఁ బ్రా
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  ఉత్పలమాల
  అందియ మ్రోగనట్టి కడు నణ్కువ వచ్చియు పాలనీయఁ దా
  నందుచుఁ బ్రేమతో సగము నాలికొసంగి మనోహరుండటన్
  బొందిక భీతి తొల్గగనె మోవిని ముద్దిడి కౌగిలింతఁ బ్రా
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్

  రిప్లయితొలగించండి
 28. దందుడు హేమనేత్రుడదె ధారుణి ముంచగ నీటిలోన గో
  విందుడు క్రోడ రూపమున బేలను గాచెను నవ్య తేజుడై
  సుందరి భూమిదేవినదె చూపగు కోరల నిల్పి తాను కై
  పంది పటుక్కునం గొఱికె బంకజలోచన మోవి గ్రక్కునన్

  దందుడు = మాయావి
  హేమ నేత్రుడు = హిరణ్యాక్షుడు

  రిప్లయితొలగించండి
 29. వందిత దేశరక్షణ నవారిత దీక్షిత తత్పరుండు తా
  బొందిన యవ్వనంపుకడు పూరిత దేహసు కామవాంఛలన్
  సుందరి లభ్యమైనతరి చూపులకందని కోర్కెమీర కై
  పంది పటుక్కునం గొఱకె పంకజలోచన మోవిగ్రక్కునన్

  రిప్లయితొలగించండి
 30. అందాల వరూధిని, ప
  ర్వేందుముఖిన్ ప్రవరుడు విడ వేరొక్కండా
  గంధర్వుండరుదెంచు
  ప్పంది పటుక్కున గొరికెను భామిని మోవిన్.

  రిప్లయితొలగించండి
 31. అందముచిందు కాయమున నన్నులమిన్నవరించి భర్తగా
  నందక మాటలాడ పగలంతయు చూపులతోడ గ్రుచ్చుచున్
  కంద మొగమ్ముసిగ్గుగొని కంతుని బాణమురీతి చేర దా
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్

  రిప్లయితొలగించండి
 32. సుందరి ఐశ్వర్యారాయ్
  చిందులు గని స్వప్న మందు చిత్తముకలయన్
  ముందరచిత్రముగని కై
  *పంది పటుక్కునఁగొఱికెను భామిని మోవిన్*

  రిప్లయితొలగించండి

 33. పిన్నక నాగేశ్వరరావు.

  కుందనపు బొమ్మ వంటిది
  సుందరినే సతిగ పొంది శోభన రాత్రిన్
  తొందరపడి మదనుని పిలు
  పంది,పటుక్కునఁ గొఱికెను భామినిమోవిన్.

  రిప్లయితొలగించండి
 34. పందిరి మంచమే పరమభాగ్యము
  నూత్న సమాగమంబునన్
  విందుల నారగించి కనువిందగు
  శోభన శయ్యనూనుచున్
  సుందరి హస్తమందుకొని సొక్కగ జేసెడు క్రీడయందు తీ
  పంది పటుక్కున గొరికె పంకజలోచని మోవి గ్రక్కునన్

  రిప్లయితొలగించండి
 35. అందముగలనొకయువతియ
  పందిరిమంచంబుమీదపడుకొనియుండన్
  డెందమునూగిసపడనూ
  పందిపటుక్కునగొరికెనుభామినిమోవిన్

  రిప్లయితొలగించండి
 36. అందమెయాభరణముగా
  సుందరిమిరుమిట్లుగొలుపు సొగసులతోడన్
  డెందమునపతికి కడు వల
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
 37. బందరు లడ్డును దిని యొక
  సుందరి తల్పమ్మునందు సుప్తిని మునుగన్
  కుందువు దిరుగుచు నటు ను
  ప్పంది పటుక్కున గొరికెను భామిని మోవిన్!!!
  కుందువు - ఎలుక

  రిప్లయితొలగించండి
 38. అందందుం దిరుగాడుచు
  సుందరుఁడు రసికవరుండు సూచి ముదమునన్
  సుందరి తలను గసవు మో
  పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్

  [మోపు +అంది = మో పంది]


  అందము నందు నచ్చరయె యామె పయిం జిరకాల శంకపుం
  డెందము తోడఁ గుందుచుఁ బటిష్ఠ వివర్ధిత కామతాపముం
  జెందఁగ నిత్య హింసన విచిత్ర మనస్కుఁడు క్రూర భర్త నాఁ
  బంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మొదటి పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నది.
   రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. "నిత్య హింసను.." అనండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   అక్కడ పదము హింస కాదండి. హింసనము. నిత్య హింసన విచిత్ర మనస్కుఁడు. (హింసనపు విచిత్రమనస్సు కలవాడు. )

   తొలగించండి
 39. అందమునారబోయునొకయంగనగానగరామభద్రుడూ
  పందిపటుక్కునగొఱికె బంకజలోచనమోవిగ్రక్కునన్
  నందముజూచినన్ గలుగుహర్షమునేరికినైననీభువిన్
  బొందునుగోరుకొందురటపోడిమిజూచెడువారలెప్పుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...గ్రక్కునన్+అందము= గ్రక్కున నందము" అవుతుంది.

   తొలగించండి
 40. పందిరి దినకరు నెల్లరు
  పందీ యని పిలుచు వాని పాణౌ కృతియై
  సుందరితో తొలి రాతిరి
  పంది పటక్కునఁ గొఱికెను భామిని మోవిన్.

  రిప్లయితొలగించండి
 41. కుందవిభాసినీరదన కోమలి నూత్నకరగ్రహీత తా
  పొందుల విందు గోరుఁ బతిఁ బూవిలుతుం బలె నందగానినిన్
  సుందరనీరజాననవిశుద్ధమతిం గని, గాఢరాగసు
  స్పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన, మోవి గ్రక్కునన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 42. విందులు చేసెడి వలపున
  నందముగానున్నయట్టి అతివను
  గదియన్
  తొందర పడు మగడును ఊ
  పంది,చటుక్కున గొఱికెను భామిని మోవిన్

  రిప్లయితొలగించండి
 43. పంది గ మారిన శ్రీహరి
  ముందుగ దనుజేంద్రు చంపి ముదమున పుడమిన్
  కందుకమటు తానెత్తుచు
  పంది పుటుక్కున గొరికెను భామిని మోమున్

  రిప్లయితొలగించండి
 44. సుందరి పెళ్లిరోజనుచు సొంపుల రంగను కొత్త సొమ్ములన్
  నందముగాధరించుచట నాత్రత తోడను చూపనెంచుచున్
  డెందము నన్దలంచుచువడిన్ పతిజేరినయంతనే తనూ
  పంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్

  రిప్లయితొలగించండి