9, అక్టోబర్ 2020, శుక్రవారం

సమస్య - 3512

 

10-10-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"మతము మార్చువాఁడె మంత్రి యగును"

(లేదా...)

"మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్"

(ఈ సమస్యను పంపిన డా. జి. సీతాదేవి గారికి ధన్యవాదాలు)

81 కామెంట్‌లు:

  1. చం||

    హితములు జెప్పునెల్లరకు హేతుపథంబని వీగునాతడున్
    పతనము మాన్పు నేననుచు పాలకులన్ పడగొట్ట గోరుచున్
    సతతమునొట్టు గట్టున వెసన్ బరిమార్చుచు ముందు బల్కు స
    మ్మతమును మార్చువాడుయగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చగన్

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మాన్పు వాడనని... మార్చువాడె యగు..." అనండి.

      తొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    అతులిత భక్తి జూపుచును హాయిగ నేతను నెత్తికెత్తుచున్
    సతతము మోడినిన్ గనుచు చాకిరి చేయుచు రాత్రినిన్ పవల్
    కుతిగొని రాజకీయమున కుండలు మార్చుచు భాజపాల స
    మ్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్...

    రిప్లయితొలగించండి
  3. సతతమురాజనీతిమతిశాసనబద్ధముశుద్ధసత్వమున్
    జతనముతోడరాజ్యమునశాంతియుభద్రతరెండుకళ్ళుగా
    గతమునుత్రవ్వకుండపథకంబులుదెచ్చికుశాస్త్రస
    *మ్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "సదా కుశాస్త్ర..." అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సతతము నెత్తికెత్తుచును జంబము వీడుచు పట్టువస్త్రముల్
    నుతమగు కీర్తనల్ నుడివి న్యూనత నొందక సిగ్గువీడుచున్
    గతమును విస్మరించి పడిగాపుల నొందక దేవళమ్ములన్
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్...

    రిప్లయితొలగించండి
  5. ౧.
    విదతమిదియె నేడు విరివిగా నుతులంది
    విజ్ఞుడైనవాడు ప్రజ్ఞగొనడు!
    అభిమతమ్ము లోనె యవలోకనమునెంచ
    మతము మార్చువాఁడె మంత్రి యగును!!

    ౨.
    సతతము రాజకీయ మున సత్యము గోరని వారలేయిటన్
    వితరణశీలురై మనగ విజ్ఞత గల్గియు మంచిజేసిన
    న్నితరుల కుట్రలందునను యెంతగ చిత్తయి కూరిపోవగా
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కుట్రలందునను+ఎంతగ' అన్నపుడు యడాగమం రాదు. "కుట్రలందు గన నెంతయు..." అనండి.

      తొలగించండి
  6. లాలు ప్రసాదు యాదవ్ పై


    ప్రజల‌ మనసు చూరగొనెను‌ పలు విధముల

    రైలు చార్జీలు‌ తగ్గించ ,జైలు కెళ్లె,

    గడ్డి స్కాములో మేయంగ కడుపు నిండ

    పసరముల గమతము మార్చు వాడె మంత్రి

    యగును భారతా వనిలోన వగచ కుండె

    గమతము‌ ‌= గడ్డి
    పసరము = పసుపు

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏

      నా పూరణ యత్నం..

      *ఆ వె*

      చెప్పు మాటలెపుడు చేయక బుద్దిగ
      ఓటు కొరకు తాను నోటు పంచి
      మనసు నందు నెపుడు మలినమ్ము తో నభి
      *"మతము మార్చువాఁడె మంత్రి యగును"*

      *ఆ వె* 🌹🌹

      ప్రజల మంచి గోరి పనులను జేయుచు
      వారి మాట లెపుడు కోరి నిలుప
      రాజ్యమెదుగు కొరకు రారాజు యొక్క స
      *"మ్మతము మార్చువాఁడె మంత్రి యగును"*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
      🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  8. రాజ కీయ మందు రాజీలు పడుచుండి
    యెల్ల వేళ లందు యెదలు దెలిసి
    పలుకు బడుల కొఱకు పార్టీలు మార్చుచూ
    మతము మార్చు వాడె మంత్రి యగును

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వేళలందు నెదలు... మార్చుచు" అనండి.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సేవజేతు మీకు చెన్నుగా ననిబల్కి
    ఎన్నికైన పిదప నెఱిని వీడి
    పదవి మోజులోన బడుచు ప్రజల యభి
    మతము మార్చు వాడె మంత్రి యగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సేవజేతు మీకు చెన్నుగా ననిబల్కి
      ఎన్నికైన పిదప నేడు తాను
      పదవి మోజులోన బడుచు ప్రజల యభి
      మతము మార్చువాడె మంత్రి యగును.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చెన్నుగా నని పల్కి.." అనండి. రెండవ పాదంలో యతి తప్పింది. "ఎన్నికైన పిదప నిపుడు తాను" అందామా?

      తొలగించండి
  10. గతమున నేమిజేసినను జ్ఞప్తిని యుంచక నేతకింపుగా
    చతురత జూపుచున్ మిగుల చక్కగ
    మాటల మాలలల్లుచున్
    కుతిగొని యక్రమార్జనను కోర్టుల చుట్టును త్రిర్గుచున్ సదా
    మతమును మార్చువాడె యగు మంత్రిగ నేడు ప్రజాళిమెచ్చగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోర్టులచుట్టు భ్రమించుచున్ సదా గా చదువ ప్రార్ధన ! 🙏🙏🙏

      తొలగించండి
    2. హితముగోరు తనకు నెల్లవేళల యందు
      సతము పాటుపడును సంతు కొరకు
      నతులనిచ్చి దాను నాయకుని కెపుడు
      మతము మార్చువాడె మంత్రియగును

      తొలగించండి
    3. మితముగ మాటలాడుచును మిత్రుని
      వోలెను నాప్తవాక్యముల్
      హితమగు ధర్మమున్ దెలిపి యేలెడు నేతకు మార్గదర్శియై
      సతతము రాజ్యపాలనము చక్కగ సాగగ నేర్పుమీర దు
      ర్మతమును మార్చు వాడెయగు మంత్రి నేడిట ప్రజాళి మెచ్చగన్

      తొలగించండి
    4. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "జ్ఞప్తిని నుంచక..." అనండి.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏🙏

      తొలగించండి
  11. కులమతమ్మనెడు కుత్సితంబును వీడి
    పేదజనుల పట్ల ప్రేమ కలిగి
    స్వార్థ పరుల లోని పాప చింతనను, దు
    ర్మతము మార్చువాడె మంత్రి యగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "కులమలమ్ము లనెడు..." అనండి.

      తొలగించండి
  12. క్రతువుగ నెంచి సత్క్రియల రాతము జేయుచు నిత్యమున్ బ్రజా
    హితమొనరించువాడు, బలహీనుల శ్రేయము గోరుచున్ నిజా
    యతిగ చరించువాడును దురాత్ముల నీచుల గాంచి వారి దు
    ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ ప్రజాళి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  13. సుతిమతి లేని నాయకులు,స్రుక్కుచు సోలుచురాష్ట్రమంతటిన్
    పతనముజేసె గాప్రగతి,పాడయిపోవగకాలవాహినిన్
    వితరణజేయసాగెనిక,విందువినోదముజేయునట్టిదౌ
    మతమును మార్చువాడెయగు,మంత్రిగనేడు ప్రజాళిమెచ్చగన్
    +++++++========
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "స్తుతమతి లేని... పతనము జేసిరా ప్రగతి..." అనండి.

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వితముగ సేవజేయుచు వివేకముతోడ జనాళి కెంతయున్
    హితములు జెప్పుచున్ సతము నీతిని వీడక పూనికగూడి పాలనన్
    పతనమొనర్చు నాయకుల వక్రతలంపు లడంచి వారి దు
    ర్మతమును మార్చువాడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "వీడక పూని పాలనన్" అందామా?

      తొలగించండి
  15. మంచిచెడుల మధ్య మదినందలి దురాభి
    మతము మార్చువాఁడె మంత్రి యగును
    పాలకునికి మంచి పరిపాలన నొసగ ,
    దీని నెరుగ నెదుగు తెలుగు నాడు

    అభిమతము = మమకారము

    రిప్లయితొలగించండి
  16. సమస్య :
    మతమును మార్చువాడె యగు
    మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చగన్

    ( నాయకలక్షణాలు )

    చంపకమాల
    ..................
    హతమును జేయుచున్ మనుజు
    లందలి నీరసనిష్క్రియత్వమున్ ;
    హితమును గూర్చుచున్ సతము
    హింసల జేయని సజ్జనాళికిన్ ;
    స్మితమితభాషణంబులను
    జేరువ యౌచును నంతరంగదు
    ర్మతమును మార్చువాడె యగు
    మంత్రిగ నేడు ; ప్రజాళి మెచ్చగన్ .
    ( అంతరంగదుర్మతము -మనస్సులోని చెడుభావము )

    రిప్లయితొలగించండి


  17. కందాట :(



    అవును! సరియే మతము మా
    ర్చు వాఁడె మంత్రి యగును! తనరుచు నే‌ పార్టీ
    ని విడువడు పనికి రాదను
    చు! వానికి పదవి యె వంచ శోభస్కరమై!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  18. మతమన నేమి ? భావమె సుమా! తమ దైనది లేని వారలే
    సతతము గెల్తురౌ నెపుడు! చక్కగ దానిని పక్కబెట్టగా
    పతనము చెందడాతడు; సభాసదు లెల్ల గణించు రీతిగా
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. సమస్య :-
    "మతము మార్చు వాడె మంత్రి యగును"

    *ఆ.వె**

    తప్పు దారి నడుచు తన మతమైనను
    సహచర మతమైన చక్క బరచి
    మతము లోని తప్పు మార్పును జేయుచు
    మతము మార్చువాఁడె మంత్రి యగును
    ......................✍️చక్రి

    రిప్లయితొలగించండి


  20. పరులు మాట వినుచు పనికి మాలిన యట్టి
    పనుల నాచరించు వారలకట
    తెలివి తోడ హితవు తెలిపి వారి దురభి
    *మతము మార్చు వాడె మంత్రి యగును.*



    రిప్లయితొలగించండి
  21. మైలవరపు వారి పూరణ

    అతడొక తాత్త్వికుండు., మన హైందవధర్మపథానుయాయి., భా...
    రతఘనకీర్తి నిల్పి జనరంజకపాలననిచ్చువాడు., ధీ...
    రత నడయాడునొక్క మృగరాజు., కుతంత్రపరాయణత్వదు...
    ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  22. చంపకమాల:
    ++++++++++++++
    హితమునెఱింగి దేశమున, హింసకు ప్రోద్బలమివ్వకున్నచో
    నతులితమైన భక్తిగను ,నందరిపట్లను శ్రద్ధజూపుచున్
    మితముగ మాటలాడుచును ,మిన్నగ ప్రేమనుబంచినంత,దు
    ర్మతమును మార్చువాడెయగు ,మంత్రిగనేడుప్రజాళి మెచ్చగన్
    +++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  23. జన హితంబు గోరి శక్తి యుక్తులు జూపి
    కార్య శూరు డగుచు ఘనత నొంది
    మనుజు లందు తాను మాన వత్వపు ట భి
    మతము మార్చు వాడె మంత్రి యగును

    రిప్లయితొలగించండి
  24. సతతము శాంతిచర్చలని ,సన్నుతకీర్తినిబొందు వారలే
    యతులితమైన యోర్పుగల ,యాజులుగావెలుగొందునెప్పుడున్
    గతమునుగుర్తుజేసుకొని,గాఢముగానికహింసధోరణౌ
    మతమునుమార్చువాడెయగు ,మంత్రిగనేడు జనాళిమెవ్చగన్
    +++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  25. శ్రుతులను గూర్చినారు మును సూత్రము లన్నియు జేర్చి నారనన్
    మతమనమానవత్వమని మంత్రము జాటిరి లోకమంతటన్
    గతిమయఁగా‌లఁజాలమున గల్మష మంటగ నీతిలేనిదౌ
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కల్మష మంట' దుష్టసమాసం. "కల్మష కీలగ" అందామా?

      తొలగించండి
  26. సమస్య :-
    "మతము మార్చు వాడె మంత్రి యగును"

    *కందం**

    జవరాలి వెంట తిరుగుచు
    నెవరిని లెక్కయును లేక నెదిరెడు వానిన్
    భవితయు,దురభిమతము మా
    ర్చు వాడె మంత్రి యగును విచారణజేయన్
    ..................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  27. ఇతవరియంచువోట్లనిడ, నింపుగ పాలన చేయుచున్ సదా
    యతులితమౌ విధమ్ముగను, హర్షము తో ప్రజ లాదరించగా,
    సతతము సత్యమార్గమున సాగుచు, వైరుల గాంచి వారి స
    మ్మతమును మార్చువాఁడె, యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  28. మతము కులమటంచు మంట రేపి జనుల
    హితము దలపనట్టి హీనుడగుచు
    మత గురువులఁ గూడి మాయ మాటలు బల్కి
    మతము మార్చువాఁడె మంత్రి యగును

    రిప్లయితొలగించండి

  29. హితము నొసంగుచున్ ప్రజ ర
    హించు విధమ్మున మేలొసంగగన్
    సతతము శాంతి ధర్మముల
    సారమెరింగి చరించు బాటలో
    ప్రతిదినమున్ ఫలించు నవ
    భావనలన్ దరి జేర్చలేని దౌ
    మతమును మార్చువాఁడె యగు
    మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్!


    మతము=అభిప్రాయం

    రిప్లయితొలగించండి
  30. కె.వి.యస్. లక్ష్మి:

    ప్రజల నాదరించి రాజ్యమ్ము నేలుచు
    ప్రాభవమ్ము నొంద ప్రభువు నెపుడు
    సత్యవంతు జేసి సరిరీతి దీర్చి దు
    ర్మతము మార్చు వాడె మంత్రియగును.

    రిప్లయితొలగించండి
  31. మతముమార్చువాడెమంత్రియగుననుట
    నిజముకాదుసామి! నిజముగాను
    మంత్రిపదవివలచు మాన్యనాయకులను
    బాధ్యతాయుతమగుపదవియదియ

    రిప్లయితొలగించండి
  32. బుద్ధి గలిగినేని విదురరీతి మెలగు
    మంచిమాట బలుక మనసు తలచు
    చాకచక్యముగన చాణక్యునిగ నభి
    మతము మార్చు వాడె మంత్రి యగును

    రిప్లయితొలగించండి
  33. *మతము మార్చువాఁడె మంత్రి యగును (శంకరాభరణం పూరణ)*

    చట్ట సభల లోన సరియైన బలమును
    పార్టి యేది తాను బడయనపుడు
    తనదు పార్టి మార్చి తనపూర్వపక్ష స
    మ్మతము మార్చు వాడె మంత్రి యగును.

    బలిజెపల్లి ద్వారకానాధ్

    రిప్లయితొలగించండి
  34. హితమును గూర్చు మాకనుచు నీయగ పగ్గము రెచ్చిపోవుచున్
    పతనపు బాట బట్ట పరిపాలన సుంతయు లెక్క సేయకన్
    హితులకు బంధు మిత్రులకు హేయమనెంచక బంచి పెట్టుచున్
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  35. గతచరితప్రవర్తితవిగర్హితదుర్మతమౌఢ్యవాదదు
    ష్కృతమును రూపు మాపి జనసామ్యవిధాయకశాసనమ్ములన్
    వితతమొనర్చి ధార్మికవివేచన భాసిలఁ దీవ్రవాదస
    మ్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  36. మతములపేర దారుణ యమానుష మారణకాండ సల్పుచున్
    సతతము చిచ్చురేపుటయె సమ్మత
    మంచును దేశద్రోహులై
    మతసహనమ్ము లేశమును మానసమందున లేని వారిదు
    ర్మతమును మార్చువాడెయగు మంత్రిగ నేడు ప్రజాళిమెచ్చగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదమునకు సవరణ

      మతములపేర పెచ్చరిలి మారణకాండను
      ప్రోత్సహించుచున్

      తొలగించండి
  37. అతిబలవంతులైన యనుయాయుల గల్గిన దుష్ట నాయకుల్
    మతిచెడి నట్టి యోటరుల మద్యము తోడ ప్రలోభ పెట్టుచున్
    మతముల మధ్య చిచ్చుమిసి మారణ కాండను జేయుచున్ ప్రజన్
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  38. కలినిఁ గాంచ మించి పలికి నీతులు వెన్క
    ముంచు వాఁడె యగును మునివరుండు
    నేత యగును దుడ్డు పాతిపెట్టిన వాఁడ
    మతము మార్చువాఁడె మంత్రి యగును


    కతిపయ వత్సరమ్ముల వికార వినోద విహార కేళినిం
    బతి గణ ముత్సహించుచు విపత్తుల నెల్లర కీయఁ గాంచమే
    మతి నిడి శిష్ట భావములు మానవ దున్నతిఁ బౌరకోటి దు
    ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  39. మంత్రియనగ ప్రజల మనసెరిగి మసలి
    వెతలు కడవబెట్టు విధమునెఱుగు
    పాతపద్ధతులకు ప్రాకులాడెడుయభి
    మతము మార్చువాఁడె మంత్రి యగును

    రిప్లయితొలగించండి
  40. సతతమునిందబాలగునుసజ్జనుదూషణనొందగాదగున్
    మతమునుమార్చువాడె,యగుమంత్రిగనేడుప్రజాళిమెచ్చగన్
    నతివలబాగుచూచుచునునాశ్రితులందరిమానసంబులన్
    నతులితప్రేమగూర్చునెడనాయతరీతినినిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  41. చం:

    మత మన రంగు మారుటయె మాటకు మాటకు రాజకీయమున్
    సతమది నొప్పగన్నెపుడు జాలియు మిత్రత గానరాదటన్
    పితరులు నడ్డు జెప్పినను పీఠము వేయగ చెల్ల దచ్చటన్
    మతమునుమార్చు వాడె యగు మంత్రిగనేడు ప్రజాళి మెచ్చగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  42. మతములపేరిటన్ వితతమారణహోమము జేయునట్టి దు
    ర్మతులదురాగతంబులను మాన్పగ కంకణ ధారియై సతం
    బతులిత దీక్షతోడజనులందరి శ్రేయముగోరి వారి దు
    ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  43. మతిజెడి మాటలాడితివొ? మర్మమెఱుంగక వాగినాడవో?
    హితమును గూర్చకున్న జనులెందుకు మద్దతు నిత్తురోయి? నీ
    వతిగను చొక్కునీరుగొని యల్పుడవై వచియించినావిటుల్
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  44. ఆటవెలది
    ప్రజల నాడి బట్టి పథకాలు ప్రకటించు
    ముఖ్యమంత్రి వరుల సఖ్యతఁగొని
    యంకురించఁ బోవు వ్యతిరేకతల నస
    మ్మతము మార్చువాఁడె మంత్రి యగును

    చంపకమాల
    మతిగొని ముఖ్యమంత్రికి సమాగమునందున నమ్మకస్తుడై
    హితులుగ వైరిపక్షమున నేర్పడ నుండెడు వాంఛితార్థులన్
    జతగొని, యంకురంబుననె చక్కఁగ దారికి దెచ్చుచున్ యస
    మ్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్


    రిప్లయితొలగించండి