28-10-2020 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వెలఁది నుదుట సూర్యబింబ మమరె"
(లేదా...)
"వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్"
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:వెలుగులు చిమ్మగా నచట వేడుక మీరగ వంగభూమినిన్తలుపులు తీసి బైటపడి తన్మయ మొందుచు డార్జిలింగునన్పలువురు జూడగా తనరి భళ్ళున ప్రొద్దున వెండికొండయౌ వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్...
* చూడగా
* వెండికొండ = కాంచన్ జంగ
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
🙏
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)1950:కులుకుచు ముత్తుకూరునను కూరిమి మీరగ నీలవేయుచున్ తలుపులు తీసి వంటగది దాపున బొగ్గుల మూట విప్పుచున్కులసతి లేచి వేకువను కుంపటి రాజిల కాఫికోసమై వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: గౌరి పూజ జేసి గంగమ్మ దరిజేరి తమ్ములమ్ము నొసగి తనివిదీర ఎఱుపు కుంకుమలది యెలమితో జూడంగ వెలది నుదుట సూర్యబింబ మమరె.
తెలుగువెలుగుభారతేతిహాసచరిత్రరూపురేఖలకొక రూపునిచ్చెకవివిమర్శకాళి కమ్మగా నుడవరే*వెలఁది నుదుట సూర్యబింబ మమరె"*
౧.చట్టసభలలోనసగభాగమిమ్మనిఎన్నొమార్లు నడుగ యేళ్ళుగడిచెఉద్యమాన నిలచి నుదృతము జేయగవెలఁది నుదుట సూర్యబింబ మమరె!!౨.కొలదిగనున్నవారలగు కోమలులెల్లను రాజకీయమందలరుచు నెంతగానొ తమ దర్పము నిల్పుచు కీర్తిచంద్రికల్వెలయగ నన్ని రంగముల వెల్గిరి విచ్చిన పూవులై సదావెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు."... మారు లడుగ నేండ్లు గడచె నుద్యమాన నిలిచి యుద్ధృత మొనరింప..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చట్టసభలలోనసగభాగమిమ్మనిఎన్నొమారు లడుగ నేండ్లు గడచెనుద్యమాన నిలచి యుదృతమొనరింపవెలఁది నుదుట సూర్యబింబ మమరె!***సవరణతో...
కలిమివెలంది దేవళము కాంచన దీప్తుల దేజరిల్లగా చెలువము మీర భూషణ విశేషములన్నియు దీర్చి దిద్దుచున్ పొలుపుగ మానికమ్మొకటి బొట్టుగ వెట్టగ పద్మ నేత్రియౌ వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: లలితమునైన పద్ధతిని లక్ష్మికి పూజయొనర్చి వెంటనే లలితను బిల్చి వాయనములన్నియు నిచ్చి ముఖమ్మునందునన్ జిలుగును గూర్చు నెర్రనగు చెందిరమంటగజేసి జూడగా వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్.
సమస్య :వెలదికి ఫాలభాగమున వేవెలు గొప్పెను దివ్యకాంతులన్ ( సూర్యోదయము )కలువలరాయడే మనకు గన్నుల విందును జేసి యేగగా దెలతెలవారు కాలమున తీరగు నా యుదయాచలమ్మునన్ కులుకులు చిందులాడ మది గోరిక లీరికలెత్త తూరుపన్ వెలదికి ఫాలభాగమున వేవెలు గొప్పెను దివ్యకాంతులన్ .( కలువలరాయడు- చంద్రుడు ; వేవెలుగు- సూర్యుడు)
కె.వి.యస్. లక్ష్మి: పసుపు కుంకుమలవి పడతి భాగ్యముగాగ పట్టి నోములెన్నొ భక్తిమీఱ లలిత కెర్ర కుంకుమలది జూచినయంత వెలది నుదుట సూర్యబింబ మమరె.
మొల్ల మనస్థితి - దైవకృపచం||సలలితమైన మానసము సాధ్వియమర్చెను దివ్యకార్యమున్వెలువడ సూర్యవంశనృపవీరము రాముని మొల్ల గాంచగన్సులభము గాదె జ్ఞానధనశోధన రామునిగాధ వ్రాయుటన్వెలదికి ఫాలభాగమున వేవెలుగొప్పెను దివ్యకాంతులన్రోహిత్🙏🏻🙏🏻🙏🏻
ముదిత మోము నెపుడు ముద్దుగానందురుచక్కదనమునందు చందమామపంతమెంచి తాను పదిలముగ గెలువవెలఁది నుదుట సూర్యబింబ మమరె
ఆడమగనిరువుర నాదరముగజేయనాతితక్కువనుచు నీతిపలుకతాను తోడు నిలుచు తరుణమొచ్చెననుచువెలఁది నుదుట సూర్యబింబ మమరె
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు.
🙏🏻🙏🏻 ధన్యవాదాలు, గురువర్యాసవరణ:తానుతోడునిలుచు తరుణమిదియెనని
కలువ కన్నుల కఱికజ్జలము నలదికురులు ముడిచి పూల కొప్పుదీర్చిఅరుణ కాంతులెగయు నద్దంపు బొట్టిడవెలది నుదుట సూర్యబింబ మమరెనలినములెల్ల కూరిమిని నవ్వుచు స్వాగతమీయ స్వామికిన్చలిపులి పారగా రజని జారగ మానవులెల్ల మేల్కొనన్కలువవిరోధి తూరుపు నగంబున దోచగ నభ్రవీధియన్వెలదికి ఫాలభాగమున వేవెలుగొప్పెనుదివ్యతేజమున్
జీవులలెల్ల మేల్కొనన్
జీవులవెల్ల
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏
ఆ.వె.అమ్మ వారి పూజ లధికముగాఁజేసినిత్య లలిత పూజ నియతిఁజేసిపట్టు చీరఁ గట్టి పదిలంపు బొట్టెట్టవెలది నుదుట సూర్య బింబ మమరెచంపకమాలనెలలకొలంది నిత్యము వినిర్మలభక్తి ని పూజఁజేయుచున్తలపుల గౌరి దేవిని సతమ్ము ను చింతనఁజేయు తాపసైమెలగెడుఁ గాంత చందురునిమించు ముఖంబున బొట్టుఁబెట్టగావెలదికి ఫాలభాగమున వేవెలుఁగొప్పెడు దివ్యకాంతులన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'బొట్టెట్ట..' ఎట్ట అనడం సాధువు కాదు. "బొట్టిడ" అనండి. 'తాపసి+ఐ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
చంద్రబింబమంటి చక్కటి నగుమోము కలువరేకు లేమొ కన్ను లయ్యె గోరవారునట్టి కుంకుమదియె జూడ వెలది నుదుట సూర్య బింబ మలరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వంటి'ని 'అంటి' అనరాదు. 'గోరవారు'?
మిసమిస లాడు జిలేబి వరుసగ పదములనరరె కుదురుగ కూర్చంగన్పొసగుచు నాటవెలఁది నుదుట సూర్య బింబమమరె మకుటపు కందంబై!జిలేబి
అమ్మా! మీకో నమస్కారం!బాగుంది మీ పూరణ. అభినందనలు.
కందచంపకముమునిమాపువేళ ధుని తటమున వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్ చువ్వన తాకగ దొంతరల పవనమున్ కురులన్!జిలేబి
మనోహరమైన పూరణ. అభినందనలు.
కవి తలచుకుంటే జరగని దేమైనా వుందా :) ఎన్ జాయ్ చెలువము మీర చంద్రముఖి చెంగట చేరుచు ముద్దుచేయగాతలపుల తెల్ప జాణయు వధానియె సూర్యుని కోరగా వరమ్ము, లవటి గాను కాంతుల ప్రమోదము తోడుగ చేర్చగానరే వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్ జిలేబి
కొంప నందు నెగడె కుంకుమ బొట్టుగవెలఁది నుదుట ; సూర్యబింబ మమరెవిన్ను వీధి నందు వెలుగు నొసగుచుండియెరుపు వర్ణ మడరె నింట బయట
ఆటవెలదిఉభయ సంధ్యలందు నుత్సాహభరితమైనింగి ముకురమందు తొంగి చూడనరుణిమ వెదజల్లి యా ప్రకృతి యనెడువెలది నుదుట సూర్య బింబమమరె!చంపకమాలకొలువున పట్టమున్ గొనఁగఁ గూర్చిన తారక 'రామమూర్తికిన్' ,తిలకము సూర్యనామముగ దిద్దియు ప్రేమగ గాంచినంతటన్గలుముల రాణి, నేత్రముల కంజదళమ్ములు విచ్చె పర్వమైవెలదికి, 'పాలభాగమున వేవెలుఁగొప్పెను దివ్యకాంతులన్'
🙏ధన్యోస్మి గురుదేవా🙏
అతివ లంత జేరి యంగ నా లంకార మాధునికపు రీతు లలరు నట్లు వధువు కొనర జేయ వైవిధ్య మో యన వెలిది నుదుట సూర్య బింబ మమరె
పొలతి పెండ్లి యాయె పురుషుని కోల్పోయెవిధవ యనగ నామె బిరుదు మిగిలెకుములు నామె కొకడు కుంకుమ బొట్టిడవెలఁది నుదుట సూర్యబింబ మమరె
మైలవరపు వారి పూరణ లలన యొకర్తు భక్తిని శరన్నవరాత్రపరాంబికాపదంబుల గల కుంకుమున్ నొసట పొల్పుగ దాల్పగ, జూచువారికిన్వెలసెను చంద్రబింబమున వింతగ భానుడనంగ చందమైవెలదికి ఫాల భాగమున వేవెలుగొప్పెను దివ్యకాంతులన్!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
కలువల రేడు క్రుంగగనె కౌముది కాంతియె తగ్గగా రజో బలమది చుట్టుముట్ట గని పక్షులు భీతిలి యంబుజాప్తునిన్ బిలవగ నంకురించెనట వేలుపు త్రోవన, గాంచనత్తరిన్ వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
వలచి వరించినట్టి చెలి వాసము చేరగ చెంగలించుచున్చెలువముఁ జూచి చుట్టములు చేరి గృహమ్మును మెచ్చు చుండగాకలికికి యత్త వేసియొక కాంచన హారము బొట్టుపెట్టగావెలదికి ఫాల భాగమున వేవెలుగొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కలికికి నత్త...'
ఆ.వె. నాటకంబు నందు నర్కబింబపు బొమ్మ కట్ట జూసె నంట కపురు గాను కాని త్రాడు దెగగ గాఱెను గతకటా!వెలఁది నుదుట సూర్యబింబ మమరె
ఆ.వె.నాటకంబు నందు నర్కబింబపు బొమ్మకట్ట జూసె నంట కపురు గానుకాని త్రాడు దెగగ గాఱెను గటకటా!వెలఁది నుదుట సూర్యబింబ మమరె
విలువల వల్వ గట్టి యలివేణి సభాంగణ మందు స్త్రీలపైతులువల యాగ డాలపయి దుగ్గయి యగ్గి తెఱంగు నిగ్గదీయ లలన కెంత ధైర్యమని యచ్చెరు వొందిరి సౌరభంబుతో *వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్*
చం: గలగల గాజు సవ్వడులు గజ్జెల మోతలు మందయానమున్కులుకుచు మేని సొంపులును కొంటెత చూపుల కైపు నిండగన్తెలుపుచు సౌర సౌష్టవము తీరగు నడ్కలు బొట్టు బింబ మావెలదికి ఫాల భాగమున వేవెలు గొప్పెను దివ్యకాంతులన్వై. చంద్రశేఖర్
సౌర / సౌరు గా చదువగలరు
ధన్యవాదములు
వెలసె సమీపమందున నవీనగనుండిన నొక్క భామకున్వెల నుడువంగ రాదు కనువిందగు చందము తోడ నామెయున్వెలయు చునుండె నద్దమున వీలుగ కుంకుమనద్దు చుండ నావెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
🙏🏽
కుంకుమాదులలరగూర్మినిగిరిజకుపూజజేసినియతిపోడిమినికబొట్టుపెట్టుకొనగముద్దుగొలుపువోలెవెలదినుదుటసూర్యబింబమమరె
చంద్రబింబమదియె చక్కటి నగుమోము కలువరేకు లేమొ కన్ను లయ్యె కులుకులీను చున్న కుంకుమయే జూడ వెలది నుదుట సూర్య బింబ మలరె
పూర్వ సాగర జల పూర్ణ కణ ధవళ మౌక్తిక ప్రభా విమల నభస్సతీమణి వొడచూపె దివ్యతరమ్ముగ వెలఁది నుదుట సూర్యబింబ మమరెచిలుకఁగఁ బాలసంద్రమును జేరి సురాసుర వర్గ మింపుగం గలువల ఱేని పిమ్మటను గాంతుల మించఁ దటిత్తు రేఖలన్ సలలిత శుద్ధ వారిధిజ చంచల వుట్టఁగ బొట్టు లక్ష్మికిన్ వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
చెలియకు నౌదలన్ జెలగెఁ జెచ్చెరఁ దేటుల నీలిమద్యుతుల్పొలతికి మోమునం గలువ పూవులు విచ్చి తనర్చె శోభలన్మెలతకు నెమ్మెయిన్ నెగడె మేలిమి పుత్తడి సౌరు వన్నెలున్ వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్కంజర్ల రామాచార్య.
తలపునగౌరిమాతనునెధ్యానముజేయుచునెల్లవేళలన్ విలసితపాదపద్మములబ్రీతినిదాకుచుగుంకుమార్చనన్ సలుదాముఖంబుననుజక్కగబొట్టునుబెట్టుకుండుటన్ వెలదికిఫాలభాగమునవేవెలుగొప్పెనుదివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మాతనునె'? 'సలుపగ' టైపాటు.
చందమామ వంటి చక్కని నగుమోముఇంద్రచాపమౌనుయింతి భ్రుకుటినెన్నుదురునమెరయు నిండైన బొట్టుగావెలఁది నుదుట సూర్యబింబ మమరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'చాపమౌను+ఇంతి' అన్నపుడు యడాగమం రాదు. "చాపమె యగు నింతి..." అనండి.
వెలవెలబోవు చందురుని వెన్నెలయాయమ నవ్వినంతనేకలకలలాడుమోముగన కన్నులుచాలవు వేల్పుఱేనికిన్ కలవరపాటునొందుమది కంతునికైననునామె కుల్కులన్ వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
ఉదయ వేళలందు నొప్పుగా గడపను కడిగి ముగ్గులిడుచు కమ్మగానుతూరుపు దిశ తిరిగి తులసి పూజను చేయువెలది నుదుటి సూర్య బింబ మమరె
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
వెలుగులు చిమ్మగా నచట వేడుక మీరగ వంగభూమినిన్
తలుపులు తీసి బైటపడి తన్మయ మొందుచు డార్జిలింగునన్
పలువురు జూడగా తనరి భళ్ళున ప్రొద్దున వెండికొండయౌ
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్...
తొలగించండి* చూడగా
తొలగించండి* వెండికొండ = కాంచన్ జంగ
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
1950:
కులుకుచు ముత్తుకూరునను కూరిమి మీరగ నీలవేయుచున్
తలుపులు తీసి వంటగది దాపున బొగ్గుల మూట విప్పుచున్
కులసతి లేచి వేకువను కుంపటి రాజిల కాఫికోసమై
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగౌరి పూజ జేసి గంగమ్మ దరిజేరి
తమ్ములమ్ము నొసగి తనివిదీర
ఎఱుపు కుంకుమలది యెలమితో జూడంగ
వెలది నుదుట సూర్యబింబ మమరె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెలుగువెలుగుభారతేతిహాసచరిత్ర
రిప్లయితొలగించండిరూపురేఖలకొక రూపునిచ్చె
కవివిమర్శకాళి కమ్మగా నుడవరే
*వెలఁది నుదుట సూర్యబింబ మమరె"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి౧.
రిప్లయితొలగించండిచట్టసభలలోనసగభాగమిమ్మని
ఎన్నొమార్లు నడుగ యేళ్ళుగడిచె
ఉద్యమాన నిలచి నుదృతము జేయగ
వెలఁది నుదుట సూర్యబింబ మమరె!!
౨.
కొలదిగనున్నవారలగు కోమలులెల్లను రాజకీయమం
దలరుచు నెంతగానొ తమ దర్పము నిల్పుచు కీర్తిచంద్రికల్
వెలయగ నన్ని రంగముల వెల్గిరి విచ్చిన పూవులై సదా
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"... మారు లడుగ నేండ్లు గడచె నుద్యమాన నిలిచి యుద్ధృత మొనరింప..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచట్టసభలలోనసగభాగమిమ్మని
తొలగించండిఎన్నొమారు లడుగ నేండ్లు గడచె
నుద్యమాన నిలచి యుదృతమొనరింప
వెలఁది నుదుట సూర్యబింబ మమరె!
***సవరణతో...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలిమివెలంది దేవళము కాంచన దీప్తుల దేజరిల్లగా
తొలగించండిచెలువము మీర భూషణ విశేషములన్నియు దీర్చి దిద్దుచున్
పొలుపుగ మానికమ్మొకటి బొట్టుగ వెట్టగ పద్మ నేత్రియౌ
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిలలితమునైన పద్ధతిని లక్ష్మికి పూజయొనర్చి వెంటనే
లలితను బిల్చి వాయనములన్నియు నిచ్చి ముఖమ్మునందునన్
జిలుగును గూర్చు నెర్రనగు చెందిరమంటగజేసి జూడగా
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండివెలదికి ఫాలభాగమున
వేవెలు గొప్పెను దివ్యకాంతులన్
( సూర్యోదయము )
కలువలరాయడే మనకు
గన్నుల విందును జేసి యేగగా
దెలతెలవారు కాలమున
తీరగు నా యుదయాచలమ్మునన్
కులుకులు చిందులాడ మది
గోరిక లీరికలెత్త తూరుపన్
వెలదికి ఫాలభాగమున
వేవెలు గొప్పెను దివ్యకాంతులన్ .
( కలువలరాయడు- చంద్రుడు ; వేవెలుగు- సూర్యుడు)
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిపసుపు కుంకుమలవి పడతి భాగ్యముగాగ
పట్టి నోములెన్నొ భక్తిమీఱ
లలిత కెర్ర కుంకుమలది జూచినయంత
వెలది నుదుట సూర్యబింబ మమరె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొల్ల మనస్థితి - దైవకృప
రిప్లయితొలగించండిచం||
సలలితమైన మానసము సాధ్వియమర్చెను దివ్యకార్యమున్
వెలువడ సూర్యవంశనృపవీరము రాముని మొల్ల గాంచగన్
సులభము గాదె జ్ఞానధనశోధన రామునిగాధ వ్రాయుటన్
వెలదికి ఫాలభాగమున వేవెలుగొప్పెను దివ్యకాంతులన్
రోహిత్🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముదిత మోము నెపుడు ముద్దుగానందురు
రిప్లయితొలగించండిచక్కదనమునందు చందమామ
పంతమెంచి తాను పదిలముగ గెలువ
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
ఆడమగనిరువుర నాదరముగజేయ
తొలగించండినాతితక్కువనుచు నీతిపలుక
తాను తోడు నిలుచు తరుణమొచ్చెననుచు
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు.
🙏🏻🙏🏻 ధన్యవాదాలు, గురువర్యా
తొలగించండిసవరణ:
తానుతోడునిలుచు తరుణమిదియెనని
కలువ కన్నుల కఱికజ్జలము నలది
రిప్లయితొలగించండికురులు ముడిచి పూల కొప్పుదీర్చి
అరుణ కాంతులెగయు నద్దంపు బొట్టిడ
వెలది నుదుట సూర్యబింబ మమరె
నలినములెల్ల కూరిమిని నవ్వుచు స్వాగతమీయ స్వామికిన్
చలిపులి పారగా రజని జారగ మాన
వులెల్ల మేల్కొనన్
కలువవిరోధి తూరుపు నగంబున దోచగ నభ్రవీధియన్
వెలదికి ఫాలభాగమున వేవెలుగొప్పెను
దివ్యతేజమున్
జీవులలెల్ల మేల్కొనన్
తొలగించండిజీవులవెల్ల
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏
తొలగించండిఆ.వె.
రిప్లయితొలగించండిఅమ్మ వారి పూజ లధికముగాఁజేసి
నిత్య లలిత పూజ నియతిఁజేసి
పట్టు చీరఁ గట్టి పదిలంపు బొట్టెట్ట
వెలది నుదుట సూర్య బింబ మమరె
చంపకమాల
నెలలకొలంది నిత్యము వినిర్మలభక్తి ని పూజఁజేయుచున్
తలపుల గౌరి దేవిని సతమ్ము ను చింతనఁజేయు తాపసై
మెలగెడుఁ గాంత చందురునిమించు ముఖంబున బొట్టుఁబెట్టగా
వెలదికి ఫాలభాగమున వేవెలుఁగొప్పెడు దివ్యకాంతులన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'బొట్టెట్ట..' ఎట్ట అనడం సాధువు కాదు. "బొట్టిడ" అనండి.
'తాపసి+ఐ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
చంద్రబింబమంటి చక్కటి నగుమోము
రిప్లయితొలగించండికలువరేకు లేమొ కన్ను లయ్యె
గోరవారునట్టి కుంకుమదియె జూడ
వెలది నుదుట సూర్య బింబ మలరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వంటి'ని 'అంటి' అనరాదు. 'గోరవారు'?
రిప్లయితొలగించండిమిసమిస లాడు జిలేబి వ
రుసగ పదములనరరె కుదురుగ కూర్చంగన్
పొసగుచు నాటవెలఁది నుదు
ట సూర్య బింబమమరె మకుటపు కందంబై!
జిలేబి
అమ్మా! మీకో నమస్కారం!
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండికందచంపకము
మునిమాపువేళ ధుని తట
మున వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొ
ప్పెను దివ్యకాంతులన్ చు
వ్వన తాకగ దొంతరల పవనమున్ కురులన్!
జిలేబి
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికవి తలచుకుంటే జరగని దేమైనా వుందా :) ఎన్ జాయ్
చెలువము మీర చంద్రముఖి చెంగట చేరుచు ముద్దుచేయగా
తలపుల తెల్ప జాణయు వధానియె సూర్యుని కోరగా వర
మ్ము, లవటి గాను కాంతుల ప్రమోదము తోడుగ చేర్చగానరే
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొంప నందు నెగడె కుంకుమ బొట్టుగ
రిప్లయితొలగించండివెలఁది నుదుట ; సూర్యబింబ మమరె
విన్ను వీధి నందు వెలుగు నొసగుచుండి
యెరుపు వర్ణ మడరె నింట బయట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిఉభయ సంధ్యలందు నుత్సాహభరితమై
నింగి ముకురమందు తొంగి చూడ
నరుణిమ వెదజల్లి యా ప్రకృతి యనెడు
వెలది నుదుట సూర్య బింబమమరె!
చంపకమాల
కొలువున పట్టమున్ గొనఁగఁ గూర్చిన తారక 'రామమూర్తికిన్' ,
తిలకము సూర్యనామముగ దిద్దియు ప్రేమగ గాంచినంతటన్
గలుముల రాణి, నేత్రముల కంజదళమ్ములు విచ్చె పర్వమై
వెలదికి, 'పాలభాగమున వేవెలుఁగొప్పెను దివ్యకాంతులన్'
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఅతివ లంత జేరి యంగ నా లంకార
రిప్లయితొలగించండిమాధునికపు రీతు లలరు నట్లు
వధువు కొనర జేయ వైవిధ్య మో యన
వెలిది నుదుట సూర్య బింబ మమరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొలతి పెండ్లి యాయె పురుషుని కోల్పోయె
రిప్లయితొలగించండివిధవ యనగ నామె బిరుదు మిగిలె
కుములు నామె కొకడు కుంకుమ బొట్టిడ
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిలలన యొకర్తు భక్తిని శరన్నవరాత్రపరాంబికాపదం
బుల గల కుంకుమున్ నొసట పొల్పుగ దాల్పగ, జూచువారికిన్
వెలసెను చంద్రబింబమున వింతగ భానుడనంగ చందమై
వెలదికి ఫాల భాగమున వేవెలుగొప్పెను దివ్యకాంతులన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
తొలగించండికలువల రేడు క్రుంగగనె కౌముది కాంతియె తగ్గగా రజో
రిప్లయితొలగించండిబలమది చుట్టుముట్ట గని పక్షులు భీతిలి యంబుజాప్తునిన్
బిలవగ నంకురించెనట వేలుపు త్రోవన, గాంచనత్తరిన్
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలచి వరించినట్టి చెలి వాసము చేరగ చెంగలించుచున్
రిప్లయితొలగించండిచెలువముఁ జూచి చుట్టములు చేరి గృహమ్మును మెచ్చు చుండగా
కలికికి యత్త వేసియొక కాంచన హారము బొట్టుపెట్టగా
వెలదికి ఫాల భాగమున వేవెలుగొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కలికికి నత్త...'
ఆ.వె.
రిప్లయితొలగించండినాటకంబు నందు నర్కబింబపు బొమ్మ
కట్ట జూసె నంట కపురు గాను
కాని త్రాడు దెగగ గాఱెను గతకటా!
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె.
తొలగించండినాటకంబు నందు నర్కబింబపు బొమ్మ
కట్ట జూసె నంట కపురు గాను
కాని త్రాడు దెగగ గాఱెను గటకటా!
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
విలువల వల్వ గట్టి యలివేణి సభాంగణ మందు స్త్రీలపై
రిప్లయితొలగించండితులువల యాగ డాలపయి దుగ్గయి యగ్గి తెఱంగు నిగ్గదీ
య లలన కెంత ధైర్యమని యచ్చెరు వొందిరి సౌరభంబుతో
*వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం:
తొలగించండిగలగల గాజు సవ్వడులు గజ్జెల మోతలు మందయానమున్
కులుకుచు మేని సొంపులును కొంటెత చూపుల కైపు నిండగన్
తెలుపుచు సౌర సౌష్టవము తీరగు నడ్కలు బొట్టు బింబ మా
వెలదికి ఫాల భాగమున వేవెలు గొప్పెను దివ్యకాంతులన్
వై. చంద్రశేఖర్
సౌర / సౌరు గా చదువగలరు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివెలసె సమీపమందున నవీనగనుండిన నొక్క భామకున్
రిప్లయితొలగించండివెల నుడువంగ రాదు కనువిందగు చందము తోడ నామెయున్
వెలయు చునుండె నద్దమున వీలుగ కుంకుమనద్దు చుండ నా
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏🏽
తొలగించండికుంకుమాదులలరగూర్మినిగిరిజకు
రిప్లయితొలగించండిపూజజేసినియతిపోడిమినిక
బొట్టుపెట్టుకొనగముద్దుగొలుపువోలె
వెలదినుదుటసూర్యబింబమమరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంద్రబింబమదియె చక్కటి నగుమోము
రిప్లయితొలగించండికలువరేకు లేమొ కన్ను లయ్యె
కులుకులీను చున్న కుంకుమయే జూడ
వెలది నుదుట సూర్య బింబ మలరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూర్వ సాగర జల పూర్ణ కణ ధవళ
రిప్లయితొలగించండిమౌక్తిక ప్రభా విమల నభస్స
తీమణి వొడచూపె దివ్యతరమ్ముగ
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
చిలుకఁగఁ బాలసంద్రమును జేరి సురాసుర వర్గ మింపుగం
గలువల ఱేని పిమ్మటను గాంతుల మించఁ దటిత్తు రేఖలన్
సలలిత శుద్ధ వారిధిజ చంచల వుట్టఁగ బొట్టు లక్ష్మికిన్
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిచెలియకు నౌదలన్ జెలగెఁ జెచ్చెరఁ దేటుల నీలిమద్యుతుల్
రిప్లయితొలగించండిపొలతికి మోమునం గలువ పూవులు విచ్చి తనర్చె శోభలన్
మెలతకు నెమ్మెయిన్ నెగడె మేలిమి పుత్తడి సౌరు వన్నెలున్
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితలపునగౌరిమాతనునెధ్యానముజేయుచునెల్లవేళలన్
రిప్లయితొలగించండివిలసితపాదపద్మములబ్రీతినిదాకుచుగుంకుమార్చనన్
సలుదాముఖంబుననుజక్కగబొట్టునుబెట్టుకుండుటన్
వెలదికిఫాలభాగమునవేవెలుగొప్పెనుదివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మాతనునె'? 'సలుపగ' టైపాటు.
చందమామ వంటి చక్కని నగుమోము
రిప్లయితొలగించండిఇంద్రచాపమౌనుయింతి భ్రుకుటి
నెన్నుదురునమెరయు నిండైన బొట్టుగా
వెలఁది నుదుట సూర్యబింబ మమరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చాపమౌను+ఇంతి' అన్నపుడు యడాగమం రాదు. "చాపమె యగు నింతి..." అనండి.
వెలవెలబోవు చందురుని వెన్నెలయాయమ నవ్వినంతనే
రిప్లయితొలగించండికలకలలాడుమోముగన కన్నులుచాలవు వేల్పుఱేనికిన్
కలవరపాటునొందుమది కంతునికైననునామె కుల్కులన్
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉదయ వేళలందు నొప్పుగా గడపను
రిప్లయితొలగించండికడిగి ముగ్గులిడుచు కమ్మగాను
తూరుపు దిశ తిరిగి తులసి పూజను చేయు
వెలది నుదుటి సూర్య బింబ మమరె