శ్రీ అనుచు పలికేడి నామము చే స్త్రీ రూపాంతరము గావింప తన శ్రేయస్సు నే గాక తన వారి శ్రేయస్సు ను సైతం కాంక్షించు భూదేవి సహనంబు తన వశమే త్రికరణ శుద్ధిగా వెంట నడిచే స్త్రీలకు మ్రొక్కినన్ ధనఁబు శ్రెయము గల్గి సుఖింతురెల్లరున్ నా సహధర్మచారిణికి అంకితము జేయ దలిచేను గురువర్య
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
నేలను నింగినిన్ భళిగ నేరుపు మీరగ మేళవించుచున్
వాలము నోటినిన్ గనక వాగుచు నుండగ నెన్నికందునన్
కాలము మారిపోయినది కాంతలు చేరగ మంత్రివర్గమున్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తలా తోకా' అనడానికి 'వాలము నోటికిన్' బదులుగా "వాలము శీర్షమున్ గనక" అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వేలము వెఱ్ఱిగన్ తనరి వెంగళి యప్పలు చీట్లపేకలన్
నేలను కూలకే నగుచు నేరుపు మీరగ ముత్తుకూరునన్
నాలుగు గోడలన్ నిలిపి నాలుగు లక్షల కిల్లునిచ్చు మే
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఆలిగతోడూనీడై
రిప్లయితొలగించండిచెల్లిగనింటికికళగనుచేరువకాగా
తల్లిగమమతనుపంచెడి
స్త్ర్రీలకుప్రమిల్లధనముశ్రేయముకలుగున్
కందం
రిప్లయితొలగించండివేలుపుగ కరాగ్రములన్
మేలుగఁ దన్మధ్యమందు మిన్న యనఁగఁ ద
న్మూలమున వసించు ముగురు
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
ఉత్పలమాల
తొలగించండిఆలయమై కరాగ్రములు నాలయమై కరమథ్యభాగముల్
మూలములున్, శ్రమించుటకు పుస్తకధారణకాదిశక్తికిన్
శ్రీలకు విద్యకున్ మరియు చేవలొసంగుటకొప్పు ముగ్గురౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతురెల్లరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఉత్పలమాల
తొలగించండికాలముచేసినన్ సతియె కాంతుడు నెంగిలి పుల్లియై సదా
గాలికి లేచుచున్ బడఁగ గందరగోళము జీవితమ్మగున్
మేలుగ భర్తలున్ బ్రతుకు మేదిని దీర్చఁగ నాలవాలమౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయముఁ గల్గి సుఖింతురెల్లరున్
ఉత్పలమాల
తొలగించండిహేళనమయ్యె జీవనము నింకి యుపాధులు మానవాళికిన్
శ్రీలఁగలుంగు వారలొగి చేయుచు సాయము తోటివారికిన్
బేలవమై పురోహితపు వృత్తియుఁ జిక్కఁగ నాదరించి శా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతురెల్లరున్
కందం
తొలగించండిఆలులగుచు షట్కర్మల
మేలొనరఁగ వెనుకనుండి మేదినిఁ బతులన్
గీలక స్థితినుంచెదరన
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
రిప్లయితొలగించండిపాత సరదా పూరణలు:
1.
పూలను తెచ్చి మాలలుగ ముద్దుగ పేర్చుచు మోదమొందుచున్
కూలుచు నేలమీద పడి కొబ్బరి కాయలు తెచ్చి కొట్టుచున్
వ్రాలుచు కాళ్ళు బట్టుచును బ్యాన్కుల నేలెడి భట్టచార్యులౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
2.
ఫూలుగ పార్వతమ్మకును పొందుగ భారతి లక్ష్మిదేవికిన్
జాలిగ మ్రొక్కగా వలదు జంబము మీరగ భాగ్య వాసిరో!
కూలుగ ముఖ్యమంత్రికగు కూతురు కోడలు రాణిగారులౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
౩.
మేలగు విష్ణు పాదమును మెల్లగ నొక్కతె పట్టుచుండగా
నాలుగు వేదముల్ నుడువు నాల్కను నొక్కతె కూరుచుండగా
మూల విరాట్టు గూడెగద ముచ్చట నొక్కతె యర్ధభాగమై...
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
తొలగించండిశంకరాభరణం సమస్య - 2706
తొలగించండిసార్! పై మూడు సరదా పూరణలు మీ బ్లాగులో లేవు...కేవలం నా బ్లాగులోనున్నవి
రెండవ పద్యం 👌👌👏👏
తొలగించండిశ్రీలఁ గురిపించు శ్రీహరి
రిప్లయితొలగించండియాలి, విరించి వశ వాణి యచలాత్మజ కా
పాలి సతులైన మువ్వురు
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రీలందగ పద్మాలయ
కాలంజరి ధృతికి విదకు కమలజు భార్యన్
మేలగు విధమా మువ్వురు
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్.
పూల వనంబు లోపల నపూర్వముగా కనుపట్టు మేడ-ఆ
రిప్లయితొలగించండిమేలిమి సౌధమందున సుమించెను రాగ పరీమళంబులున్
ఆ లలిత ప్రభాశుభగ మందటు కట్టినయట్టి మేటి మే
స్తీలకు మ్రొక్కినన్ ధనము,శ్రేయము గల్గి సుఖింతురెల్లరున్.
శ్రీ అనుచు పలికేడి నామము చే స్త్రీ రూపాంతరము గావింప
రిప్లయితొలగించండితన శ్రేయస్సు నే గాక తన వారి శ్రేయస్సు ను సైతం కాంక్షించు
భూదేవి సహనంబు తన వశమే త్రికరణ శుద్ధిగా వెంట నడిచే
స్త్రీలకు మ్రొక్కినన్ ధనఁబు శ్రెయము గల్గి సుఖింతురెల్లరున్
నా సహధర్మచారిణికి అంకితము జేయ దలిచేను గురువర్య
స్త్రీలెచ్చటగౌరవమును
రిప్లయితొలగించండిమాలిమిననుభవమునొంది మనజాలుదురో
శ్రీలకునిలయంబచ్చట
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
శ్రీలక్ష్మీ శ్రీవాణీ
రిప్లయితొలగించండిశ్రీ లలితాంబలు సతమ్ము శ్రేయమ్మీరే
చాలగ ధృతినీ మువ్వురు
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిగురువుగారూ! దయతో నిన్నటి పూరణను గూడా పరిశీలించగలరు.
నిన్నటి పూరణ:
కవినను ప్రఖ్య గల్గగను కబ్బము ఛందముతోడ వ్రాయగన్
అవిరళమెంతయున్ కృషిని నచ్చగు రీతి లిఖించి నంతటన్
కవివరుడంచు కీర్తిగను గాదె?; గణమ్ములు భంగమైనచో
అవకరమౌను పద్యములు నాశమునొందగనౌను కీర్తియున్.
నేటి పూరణ:
మేలగు భక్తిని జూపుచు
శ్రీలక్ష్మి శివాణి వాణి శ్రీదేవతలన్
వాలయ ముపాసనల నా
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్.
ఆలన పాలన జూచుచు
రిప్లయితొలగించండిమేలును గూర్చెడు మెలతలు మెరికల వోలెన్
చాలికతో నేలికలవ
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
హేలగ లోకమున్నడుప నీశ్వరుడాదిని
మూడుశక్తులన్
లీలగ స్త్రీలరూపమున లెస్స సృజింపగ
మాతృమూర్తులౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
తేలిక జేయరాదు నిల దేవతలేయగు
స్త్రీలనెన్నడున్
కూలగ కాపురమ్ములవి కూలుగ (cool)ద్రాగుచు రమ్మువిస్కిలే
తొలగించండిచాలక జీతభత్యములు చాటుగజేయగ
నప్పుసొప్పులే
చాలిమి రెక్కకష్టమున సంతును సాకెడు ధన్యజీవులౌ
స్త్రీలకు మ్రొక్కిన ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
సమస్య
రిప్లయితొలగించండి...........
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము
శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
( త్రిమూర్తుల దేవేరులకు మ్రొక్కితే ప్రాప్తించని దేముంది ? )
ఉత్పలమాల
..................
మేలుగ బ్రహ్మజిహ్వపయి
మించెడి వాజ్మయదివ్యవాణికిన్ ;
వాలుచు విష్ణువక్షమున
వాసము జేసెడి యాదిలక్ష్మికిన్ ;
దేలుచు శూలిదేహమున
దేటగ నర్ధమునందు గౌరికిన్ ;
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము
శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్ .
పాల సముద్ర జనిత రమ ,
రిప్లయితొలగించండివేలుపగమికాని జాయ వేదాగ్రణియున్,
ఫాలుని సతి యుమ , మూవురు
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్
శ్రీ లక్ష్మీ శారద కును
రిప్లయితొలగించండిపాలాక్షుని సతికి జనులు భక్తి ప్రపత్తి న్
శ్రీల నొసంగు మను చు నా
స్త్రీల కు ప్రణ మిల్ల ధనము శ్రేయము గల్గున్
రిప్లయితొలగించండికాలము మారెను బిడ్డా
సేలల భీతహరిణములు చెంగున భళి సిం
హాలాయె జీన్సు మారెను
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్!
జిలేబి
రిప్లయితొలగించండికందోత్పల
వసుధను వశవీడె మహా
నస! స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గ
ల్గి సుఖింతు రెల్లరున్ మా
నసమున సంకోచమేల నసనస లేలా !
మహా, నస :)
జిలేబి
శ్రీలక్ష్మికి వాణికి గిరి
రిప్లయితొలగించండిజలకును ప్రీతిని సతతము జరుపుచు పూజల్
తలచుచు మనమున మీరా
“స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్”
పాలసముద్రమందు పతి పాదము లొత్తెడు లోకమాత, గా
రిప్లయితొలగించండికోలము కంఠమందు గల కోడెవయాళివజీరు పత్నినిన్
వేలుపు బెద్ద ప్రాణసమ విద్దెల రాణులు, శక్తి మూర్తులౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్.
స్త్రీలె సృజించి సంతతిని సృష్ట్యభివృద్ధికి హేతుభూతులై
రిప్లయితొలగించండిస్రీలె కుటుంబభారమునుఁ జేకొని యింటినిఁ దీర్చిదిద్దరే
స్త్రీలె పథమ్ము తప్పునెడఁ జేర్చరె లక్షితగమ్యమార్గమున్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
కంజర్ల రామాచార్య.
కాలముమారెనీకలియుగంబుననేవరమైననీయమి
రిప్లయితొలగించండిమ్మేలగవాంఛితార్థములమేయవరాద్రులమోఘశక్తులున్
*“స్త్రీలకు మ్రొక్కినన్, ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్”*
బాలుడుశంకరార్యులకుభవ్యకవీంద్రులకమ్మలీయరే
మాలిమితోడ చూచుచును మందిరమందున నత్తమామలన్
రిప్లయితొలగించండితాలిమితోడ వర్తిలుచు తద్దయు ప్రీతిని భర్తఁ బ్రోచుచున్
కాలమునంతయున్ కడు నకల్మష బుద్ధి చరించు నా కుల
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికాదన్నారో... మీ ఇష్టం. 🤣🙏
జాలిఁ గనన్ మహానసశశమ్ముల వారిని బోల్చినారు., మీ
కేలును బట్టి మిమ్ముల సుఖింపగ జేసెద., రింటఁబిల్లలన్
మేలుగ పెంచువారయి దమిన్ గృహశోభను దీర్చిదిద్దునా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయముగల్గిసుఖింతురెల్లరున్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిమహానసశశము !
How Dare!
మహిళాభ్యుదయ సభ్యులారా ఇక్కడికి వచ్చి హడతాలు చేయండి ! :)
జిలేబి
మేలొనరించుచిత్తమున మీరక నాజ్ఞల ప్రేమతో డుతన్
రిప్లయితొలగించండివీలగునంతమేర పలు వేదనలన్నియు దూరమొందగన్
కాలము మారెనింక విను కాచును చేసిన తప్పులన్నియున్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్!!
ఆలిగనర్ధభాగమనియాతనిఁజేరెనుపార్వతీసతిన్
రిప్లయితొలగించండివీలుగనాల్కయందమరివిందులుఁజేసెడిభారతీమతిన్
వాలెనుగండెలోనిమిడిపాలనుపోంగెడిలక్ష్మిగానటన్
స్త్రీలకుమ్రోక్కినన్ధనముశ్రేయముగల్గిసుఖింతురెల్లరున్
గుండెలోనిమిడి, సవరణ
రిప్లయితొలగించండిఈనాటి శంకరాభరణం వారి సమస్య.
రిప్లయితొలగించండిస్త్రీల కు ప్రణమిల్ల ధనము శ్రేయము కల్గున్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
పాండిత్యమును గోరి బారతీ దేవిని
జనులెల్ల పూజించు సంతసముగ,
ధనమును కోరి మోదమ్ముగన్
పూజించు
పాలకడలి సుతన్ భక్తి తోడ,
శ్రావణ ఆశ్వీయుజములందు పార్వతి
నర్చింతురు గదఘనంబుగాను
పావన స్తీలకు ప్రణమిల్ల ధనము శ్రే
యము కల్గు నిమ్మహిన్,హ్లాద మిచ్చు
గా నరుంధతి తారక గగన మందు,
సీత,సావిత్రి, యనసూయ, పాతి వ్రత్య
పు లలనలు గాదె మహిలోన పుణ్యము బడ
యంగ వచ్చును మ్రొక్కనీ నవని లోన
స్త్రీలు మహోన్నతుల్ భువిని ధీమసమందున ఝాన్సిరాణులే
రిప్లయితొలగించండిలాలనయందునాలనములందునవారికిసాటి వారలే
కాలునినైనగైల్వగల కాంతలలామలు వారుగాదె! యా
“స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
హేళనగాదిదిసత్యము
రిప్లయితొలగించండిచాలినదగుశక్తితోడసాదరముంగన్
ఫాలునిసేవనుజేసెడు
స్త్రీలకుప్రణమిల్లధనముశ్రేయముగలుగున్
ఈ లలనలె యల సత్వము
రిప్లయితొలగించండినాలాపించిన ధనక్షయ సుఖక్షయముల్
సాల యగుఁ గాన స్వీయ
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్ !
చాలము సూడఁ జక్షుల నిజద్యుతి గాత్ర విరాజమానలన్
ఫాల కరాబ్జ సంస్థితము పన్నుగఁ గాంచుచు భక్తి మీఱ దే
వాలయ దర్శిత ప్రముఖ భక్త గణార్చిత లైన త్రై కకు
త్స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
[త్రై కకుత్స్త్రీలు = ముగ్గురు ముఖ్యుల కూటమి కి జెందిన స్త్రీలు; త్రిమూర్తుల భార్యలు]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:
రిప్లయితొలగించండికాలిడ భూమిపై పిరిమి గారము సేయుచు పెంచు నమ్మ యై
కాలము తర్లు చుండ మమ కారము పంచెడి యక్క చెల్లిగా
నాలిగ నర్థభాగ మవ నాత్మజ తోడుత తీరుతెన్నులున్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్
వై. చంద్రశేఖర్
వీలగునంతకాలమునువేదనలన్నియుద్రోసిబుచ్చుచున్
రిప్లయితొలగించండినాలయకారురూపమునునౌదలదాల్చుచునెల్లవేళలన్
చాలినభక్తితోడభవుసాదరమొప్పగబూజజేయునా
స్త్రీలకుమ్రొక్కినన్ ధనముశ్రేయముగల్గిసుఖాంతురెల్లరున్
సుఖింతురెల్లరున్
రిప్లయితొలగించండికాలుని కెదురాడి గెలిచి
రిప్లయితొలగించండిమేలుగ పతి ప్రాణములను నిలిపెను గాదా
ఈలుపుటాండ్రకును కుల
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్