14, అక్టోబర్ 2020, బుధవారం

సమస్య - 3515

 15-10-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే"

(లేదా...)

"పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్"

81 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ యత్నం..

  *కం*

  పోలిక పొంతన లేకయు
  గోలను జేయుచు సతతము గొప్పల కొరకున్
  లీలలు జూపెడి యా కో
  *"పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  రాలంగానిక దంతముల్ ముదిమినిన్ రమ్యమ్ముగా డెబ్బదిన్
  మూలంబైనది స్వాస్థ్యమాదటనహో ముప్పొదులన్ తిండికై...
  కాలేయంబున గాయముల్ కలుగగన్ కష్టమ్ములన్ సైచగన్
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్...

  రిప్లయితొలగించండి
 3. విరించి: . . ...................... జాలియు సహనము సద్గుణ
  శీలమె ముఖ్యము నరునకు శ్రేయమ్మదియే
  బాలా! వినుమంటిని, కో
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే

  రిప్లయితొలగించండి
 4. జాలిని‌ తలచక నెప్పుడు

  వేల ధనము పొంద గోరి వేగము తోడన్

  నేలన‌ పండించు నభిని

  పాల వలన‌ యెల్ల జనులు‌ పతి తులగుదురే


  అభినిపాలు= ‌నల్లమందు పాలు (గంజాయి వలె)

  రిప్లయితొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అయ్యో పాపం రాజశేఖరుల్!

  ఫూలన్ దేవిని బోలు చానలనిటన్ మోసమ్మునన్ దున్ముచున్
  శూలమ్ముల్ కడు దించుచున్ హృదులనున్ శుద్ధాత్ములౌ నేతలన్
  కూలంగానిక నీతులున్ నియమముల్ కోదండరామయ్య శా
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్...

  రిప్లయితొలగించండి
 6. లాలన తోనాకట్టుచు
  పాలకులెల్లరు ప్రజలకు భారమవంగన్
  కాలమె జెప్పును యే లో
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే!!

  రిప్లయితొలగించండి
 7. కాలంబెప్పుడు మారబోదు గద సంస్కారంబునే వీడుచున్
  జాలిన్ బ్రేమల మర్చి మానవుడు నీచాత్ముండయెన్ గాదుటే
  బాలా నానుడు లాలకించుమిట విశ్వంబందు నన్ గాంచ కో
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అయెన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "నీచాత్ముండుగా నయ్యెలే" అందామా?

   తొలగించండి
 8. శా.
  శూలిన్ ఢీకొనమన్మథుండు తనదౌ సూకంబులన్ వేయగా
  ఫాలాక్షక్రుథ చేతనామమాడచెన్ బంధిద్రుడే "యంకతా
  పాలే" కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్
  ఈలీలన్ గని శూలిఁగొల్వరె జనుల్ నిస్తారమున్ బొందఁగన్

  అంకతాపాలు = కోపతాపాలు
  వీటికి కారణమైన చిత్తభవుణ్ణి దహనం చేసిన శివుణ్ణి పూజింపమని సారాంశం
  ----- శ్రీరామ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో టైపాట్లు.

   తొలగించండి
  2. నమస్కారం గురువుగారు 🙏🙏

   శూలిన్ ఢీకొనమన్మథుండు తనదౌ సూకంబులన్ వేయగా
   ఫాలాక్షక్రుధ చేతనామమడచెన్ బంధిద్రుడే "యంకతా
   పాలే" కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్
   ఈలీలన్ గని శూలిఁగొల్వరె జనుల్ నిస్తారమున్ బొందఁగన్

   సరిచేసాను (క్రుథ, క్రుధ), (నామమాడచెన్, నామమడచెన్)
   ధన్యవాదములు

   తొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వాలయము తీరు నేర్వక
  వాలకమున్ గాని రీతి పనులు చలుపుచున్
  నీలుగు నధికారుల లో
  పాల వలన నెల్లజనులు పతితులగుదురే!

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆలస్యంబుగ గాక పాండవుల రాజ్యాంసమ్ము దీటించి వే
  రాలాపమ్ములు లేక భాగములు వారాశించి నట్లిచ్చుచో
  చాలున్ వారికి ధార్తరాష్ట్రుడ! పగల్ స్పర్థల్ విసర్జించు కో
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందగన్.

  రిప్లయితొలగించండి
 11. ఆలోచింపగ సజ్జనుండు గొనున
  ష్టాంగాది యోగమ్మదే
  హేలం గెల్చును నింద్రియమ్ములను
  దా హీనా భిమానుండునై
  శీలంబించుక లేనివాడగు సదా
  శిక్షార్హుడే , కోపతా
  పాలే కారణమెల్ల వారికి గుణభ్రష్టత్వమున్ బొందగన్

  రిప్లయితొలగించండి
 12. కె.వి.యస్. లక్ష్మి:

  వీలుగ పాపములు సలిపి
  వేలుగ పూజలొనర్చి వెలయుచునున్నన్
  కాలమె చెప్పు నెఱిని పా
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "పూజల నొనర్చి" అనండి.

   తొలగించండి
 13. శా:

  కాలేడింకను బుద్ధి మంతునిగ నే కాషాయమున్ దాల్చినన్
  శీలంబింతయు మారకుండె నకటా చేవిప్ప లంచమ్ము కై
  మూలాలే కద దీనుకంతటికి యున్మూలంబు పేరాస లో
  పాలేకారణ మెల్ల వారికి గుణభ్రష్టత్వముం బొందగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "లంచాలకై... కంతటికి నున్మూలంబు..." అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు, అట్లే మార్పులు చేస్తాను

   తొలగించండి
 14. కందము
  లలనా నామాట వినుము
  తొలిగా నిను వల చినాను తొందర పడినే
  విలువలు గాపా డుము,మురి
  పాలవలన యెల్ల జనులు పతితుల గుదురే

  శా.
  కాలాతీత వృధాప్రయాస పడిరాకాంక్షం సదామత్తులై
  లీలావిగ్రహమూర్తి మాధవుడుతా లేడాసహాయంబుగా
  కాలంబే కడఁదేర్చెనా కుమతులన్ గర్వాంధమూర్ఖత్వ,కో
  పాలే కారణమెల్లవారికి గుణ భ్రష్టత్వముం బొందగన్

  రిప్లయితొలగించండి
 15. సమస్య :
  పాలే కారణ మెల్లవారికి గుణ
  భ్రష్టత్వముం బొందగన్

  వాలాయంబుగ ఘోరవీరతపమున్
  వర్ధిష్ణువై జేయుచున్ ;
  జేలంబున్ సవరించు మేనక మహా
  చిత్రంపు నాట్యాలనే
  యాలోకించిన గాధిపుత్రుడు తపం
  బాపెన్ ; భళీ ! మారతా
  పాలే కారణ మెల్లవారికి గుణ
  భ్రష్టత్వముం బొందగన్ .
  ( వాలాయంబుగ - నిరంతరముగా ; గాధి
  పుత్రుడు - విశ్వామిత్రుడు ; మారతాపాలు -
  మన్మథబాధలు )

  రిప్లయితొలగించండి
 16. చాలీ చాలని బ్రతుకుల
  మేలును తలపని ప్రభువుల మాటల మాయా
  జాలమునొనగూరిన పా
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే

  రిప్లయితొలగించండి
 17. బాలుర దలిదండ్రుల మురి
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే
  తాలుము ఈగతి , సంతుకు
  మాలిమి చూపించు వేళ మట్టము చాలున్

  మట్టము = తక్కువ

  రిప్లయితొలగించండి


 18. బాలా! జిలేబి విను! పా
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే
  మేలగు గోవిందాయని
  కైలాటము చేసి పుణ్యకర్మలు సలుపన్

  జిలేబి

  రిప్లయితొలగించండి


 19. బాలా!తప్పదు సూవె కర్మఫలమౌ! ప్రార్థించు శేషాద్రి వా
  సా! లావింతయు లేదు కావు మనుచున్! సౌశీల్యతన్ పొందు! పా
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్
  కైలాటమ్మున పుణ్యకర్మలను నిష్కామమ్ముతో సల్పుమా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. బాలుర ప్రేమను పెంచుట
  యేలా? వారలు చెడిరని యేడ్చుట యేలా?
  బేలవు కాకను విను మురి
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే

  రిప్లయితొలగించండి
 21. ఏలమనుజులందునకో
  పాలుకలుగుచుండునేల పంతముబూనన్
  తాలిమిజూపక తమకో
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే

  రిప్లయితొలగించండి
 22. బాలా! శీలమె సద్గుణోన్నతికి శోభాహేతువై వెల్గు, కో
  పాలే సర్వవిధమ్ము మానవు నధఃపాతమ్ముఁ జేకూర్చు, లో
  పాలే జీవనభోగభాగ్యములకున్ బంధాలె యౌ, నట్లు పా
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 23. తాలిమి వీడియు జను లిల
  కాలము తో పాటు తాము కదలని వారై
  జాలము చేసిన తరి లో
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదు రే !

  రిప్లయితొలగించండి
 24. పాలం ద్రాగ గదా శిశుత్వమునకున్ బ్రాప్తించు తేజం బికన్
  పాలన్ నిత్యమనేకరూపములలో బ్రహ్మాండమందంతటన్
  వాలాయంబుగ నందుచుండ నిలుచున్ బ్రాణంబు సత్యం బిదే
  పా లేకారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్?

  రిప్లయితొలగించండి
 25. జాలిన్జూపకద్వారపాలకులపైశాపాపమున్బోసిరా
  బాలాకారమునీంద్రులుర్విభవమైబాధించిరాభృత్యులే
  వేలున్జూపకుదుష్టదైత్యులనుచున్వేలున్భవంబందశా
  *పాలేకారణమెల్లవారికి గుణభ్రష్టత్వముంబొందగన్*

  రిప్లయితొలగించండి
 26. ఆలూ మొగులిక ముదముగ
  చాలని జీతంబునైన సరిపెట్టుకొనన్
  మేలగు జీవనమిఁక, తా
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఆలును మగడును ముదముగ" అనండి. (ఆలూ మొగులు అనడం వ్యావహారికం)

   తొలగించండి
 27. రిప్లయిలు
  1. కందం

   శ్రీలుఁ గలుఁగఁ గౌంతేయులఁ
   దాళని రారాజు గెల్చె ధర్మజుడోడెన్
   బాళిని, దుర్వ్యసనఁపు శా
   పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే!

   శార్దూలవిక్రీడితము

   శ్రీలన్రాజ్యములన్ ధనంజయుఁడుగన్ జేకూర్చ భీభత్సుడున్
   శూలాలైననె ధార్తరాష్టునకవే జూదమ్ముకై బిల్వఁదా
   నాలిన్దమ్ముల నోడె ధర్మజుడె దుర్వ్యాపార మోహంపు శా
   పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 28. ఆలాపనమ్మమూల్యము
  మేలునుగూర్చును సరియగు మేరకు వాడన్
  కాలక్షేపపు సల్లా
  పాలవలన సకలజనులు పతితు లగుదురే

  రిప్లయితొలగించండి
 29. కాలమ్మంతయునార్జనమ్మునతిగా కాంక్షించి వెచ్చించి బం
  ధాలన్ లక్ష్యముచేయకుండ పరులన్ దౌష్ట్యమ్ములన్ నొంచి లో
  పాలన్ చూపి కుటుంబ సభ్యుల సదా బాధించుచున్ చేయు పా
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 30. మైలవరపు వారి పూరణ

  నీలో నీవు సమీక్ష జేసుకొని యన్వీక్షింపనేడేడులో..
  కాలున్., తారలు, సూర్యచంద్రులును లోకాధీశుడున్నట్లుగా
  నాలోకింపగవచ్చు.,నింద్రియములే యడ్డమ్ములౌ., దృష్టిలో...
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 31. కాలపుమహిమనుదెలియుము
  పాలవలననెల్లజనులుపతితులగుదురే
  పాలవి విషముగమారును
  బాలనుడెట్టాలుకలుపభామా!యెఱికే?

  రిప్లయితొలగించండి
 32. కూలును వేగ సకల దే
  శా లలసత్వము వహించి చన భూపతు లే
  కాలమునను బాలన లో
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే


  చాలుం జాలును గోప తాపములు సచ్చారిత్రమే ధర్మమౌ
  లే లెమ్మింక సఖిత్వమే దనరెడిన్ రీతిం బ్రవర్తించుమా
  ఢాలవ్రాత విహీన రాజ దరిషడ్వర్గ ప్రభా ప్రాప్త కం
  పాలే కారణ మెల్లవారికి గుణ భ్రష్టత్వముం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 33. బాలా!యేమనిపల్కుచుంటివిగదేయిక్కాలమందున్భళా
  పాలేకారణమెల్లవారికిగుణభ్రష్టత్వముంబొందగన్
  నేలాయంటివికారణంబుజెపుమా హేలాగతిన్బల్కితే?
  వాలాయంబుగమాటలాడుటసరా?వాల్లభ్యముంజూపవా?

  రిప్లయితొలగించండి
 34. కాలపు రీతిని గాంచగ
  కోలాసలు పెరిగి పోయికూరిమి కరువై
  పాలనయంత్రాంగపు లో
  పాలవలన నెల్లజనులు పతితు లగుదురే!!!

  రిప్లయితొలగించండి
 35. ఏలదునిమెనో రాముడు
  హేలా రీతిగ దనుజులు హాహా యనగా
  యేలాగున రావణ లో
  పాల వలన నెల్లజనులు పతితు లగుదురో!!!

  రిప్లయితొలగించండి
 36. ఏలాకోపముబూనగాజనులువారేలా క్షమన్జూపకన్
  లోలోనన్ దహియించుచున్ బ్రతుకు కల్లోలంబునున్బొందుచున్
  కాలమ్మంతయుకక్షలందుగడుపన్ కావేషమున్బెంచు కో
  పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 37. తూలుచు మద్యపు మత్తున
  ప్రేలుచు నిష్ఠూరము లవివేకము నందున్
  తేలుచు జేయు మహా పా
  పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే

  రిప్లయితొలగించండి