25, అక్టోబర్ 2020, ఆదివారం

సమస్య - 3525

 26-10-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద”

(లేదా...)

“సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్”

96 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    చేయుచు పుణ్యకార్యములు చెంతను చేర్చుచు ధర్మపత్నినిన్
    మూయుచు కొట్టు ద్వారములు ముద్దుగ పోవగ తీర్థయాత్రలన్
    హాయిగ షిర్దినిన్ వెడలి హ్లాదమునొందగ రూఢియౌనహో:
    “సాయిని దైవమం చనుటసత్యము గాదని యండ్రు సజ్జనుల్”

    (దైవమంచనుట + అసత్యము)

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్సులు🙏

    నా పూరణ యత్నం..

    *తే గీ*

    ధనము కోరుచు నెప్పుడు తాను నిలను
    కోడి మేకను పట్టుకు కోత కోసి
    మాంసమమ్ముచు నుండెడి మనుజుడౌ క
    *“సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  3. హలము‌ పట్టి ,ధరణి దున్ని‌, జలము జల్లి,

    విత్తనములు నాటి, కలుపు వేరు చేసి,

    యెరువు మందు లన్నియు‌ వాడి ,కరువు కాట

    కముల‌ కెదురొడ్డి పండించు ఘనుడగు వ్యవ

    సాయి భగవంతుడనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
  4. దేవదేవుని మహిమల తీరు గనిన
    సాధుసంతుల సాంగత్య మందు జూడ
    ధర్మరక్షణమునకిట ధరణ వెలుగ
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరణి వెలుగ' టైపాటు.

      తొలగించండి
    2. రెండవ పాదము లో యతి మైత్రి సందేహమండి యతి మైత్రి ఎలాగో తెలియజేయ మనవి

      తొలగించండి
  5. సాయి అనే వానితో ఒకజోగి నిచూపుతూ చెప్పినమాటగా

    పెంచి మూరెడు గడ్డమ్ము వీధులందు
    కావి వస్త్రము తాగట్టి కాసుకొరకు
    తిరుగు చుండెడి వాడొక్క తిరిప గాదె
    సాయి, భగవంతుఁ డనుట యసత్యమె కద.

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సాయిని గొల్చుచున్ విధిగ చంకలు గొట్టుచు దొంగచాటునన్
    చేయుచు గంజ వర్తకము చెప్పుచు దండిగ రంగనీతులన్
    తీయగ జైలుజేరగను తిట్టకు మూర్ఖుడ!;...యేడ్చి యివ్విధిన్:
    “సాయిని దైవమంచనుట సత్యము గాదని”;...యండ్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  7. విధినిర్వహణ మానిన రాజప్రతినిధిని గూర్చి జనుల సంభాషణ
    ఉ.
    హాయిగ కార్యముల్ విడిచి, హ్లాదము నొందుచు రాచవీధులన్
    వాయుగతిన్ జరించుచు వివాదము లన్నియు సల్పి, యవ్వన
    ప్రాయము వీడనట్టి జడరాజగు నీతని రాచవేగి "వై
    స్రాయి"ని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్”

    వైస్రాయి = రాజప్రతినిధి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం వైవిధ్యంగా ఉన్నా సాయిని వైస్రాయి అనడం కుదరదు. సంశ్లేష చేసినపుడు సకారం చివర ఉండాలి. 'హృత్సాయి' అన్న విధంగా.

      తొలగించండి
    2. గురువర్యా.. !🙏🙏
      మీ సూచనకు ధన్యవాదములు సరిచేస్తాను

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాయి వేషము నెంచుచు సాగుచుండి
    మాయ జేయుచు జనులను మభ్యపెట్టి
    ధనము చూఱగొనెడి మాయదారి దొంగ
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కర్కశమ్మగు హృదితోడ కదలు చుండి
    తోడివారల నెప్పుడు తూలబుచ్చి
    కరుణ విడనాడి నడరెడి కఱటియౌ క
    సాయి భగవంతుడనుట యసత్యమె కద?

    రిప్లయితొలగించండి
  10. *వీధులలో తిరిగే యాచకుని గూర్చి* . మాయలు లేవు మంత్రముల మర్మమెరుంగడు వాడు మూఢుడై
    హేయమటంచు నెంచక మహేశ్వర నామజపమ్ము తో ప్రజన్
    సాయము గోరుచున్ దిరుగు సాధువతండుకదా పకీరు గో
    సాయిని, దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  11. అందరికీ నమస్సులు🙏
    ఉ.మా

    మోయక బాధ్యతల్ విడచి మోక్షము గోరుచు నిత్య సాధనల్
    కాయము నల్గనీక నుపకారము సుంతయు లేని బోధనల్
    మాయలు పల్కుచున్ జనుల మాన్యము దోచెడి నేటి దొంగ గో
    సాయిని దైవమంచనుటసత్యము, గాదనియండ్రు సజ్జనుల్

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  12. సాయము గోరినంతటనె చక్కగ దక్కగ
    భక్తకోటి యా
    సాయిని దైవమటంచనుట సత్యము;
    కాదని యంద్రు సజ్జనుల్
    కాయము శాశ్వతమ్ము; చిరకాలము
    మన్నున దాత్మయొక్కటే
    మాయను దాటువాడె పరమాత్మను
    బొందును సాధనమ్మునన్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. మాయల గారడిన్ సలిపి మానవ జాతిని మోసపుచ్చెడిన్
      ఖాయపు దొంగబాబయని గర్జన జేసెడు హేతువాదులే
      సాయిని దైవమంచనుట సత్యము కాదనియంద్రు, సజ్జనుల్
      మాయను దాటినాడనుచు మన్నన జేతురు భక్తిమీరగన్

      తొలగించండి
    2. విరుపుతో మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురుదేవా! నమోనమః! 🙏🙏🙏

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భయము వీడి సాయివలె వర్తిలి సర్వుల మోసగించుచున్
    హాయిగ సంపదల్ గొనుచు నన్వయమవ్వని నీతులెంచుచున్
    మాయలుగూడు పోకడను మంచిగ నాటకమాడు దొంగయౌ
    స్రాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదాన్ని లఘువుతో ప్రారంభించారు.

      తొలగించండి
    2. నేయము వీడి సాయివలె నేగుచు సర్వుల మోసగించుచున్
      హాయిగ సంపదల్ గొనుచు నన్వయమవ్వని నీతులెంచుచున్
      మాయలుగూడు పోకడను మంచిగ నాటకమాడు దొంగయౌ
      స్రాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్”

      తొలగించండి
  15. తే.గీ.1
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద
    ఎల్ల జీవుల లో హరి ఎందుకనుచు
    పాపపుణ్యములెంచగ పాడిగాదు
    లీలజూపగ వెలసిన గోలతగదు
    మంచి కోరగ మరచిన మనుజుడౌనె


    తే.గీ.2
    మంచి మాటలు చెప్పచు మాయజేసి
    ఓటు కాజేసి మరచిన ఒప్పుయగునె
    నేటి రాజులచందము మేటియన క
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
  16. ఉ:

    చేయగ లేని కార్యములు సేయుచు భక్తుల కాంక్ష దీర్చుచున్
    మోయుచు నిందలున్ కఠిన ముండెడి శిక్షల నెల్ల నోర్చుచున్
    మేయము నెంచ దైవికము మేరలు లోకులు గొల్వ నేటికిన్
    సాయిని దైవ మంచనుట సత్యము ; గాదని యండ్రు సజ్జనుల్ ?

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  17. బలిమి నెంతగనిచ్చిన బతుకుతెరువు
    చూపకుండి యుచితముగ సొమ్ము లిచ్చి
    యెల్లరను దుర్బలుల జేయ నెంచుకొను క
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
  18. సమస్య :
    సాయిని దైవమం చనుట
    సత్యము గాదని యండ్రు సజ్జనుల్
    ( షిరిడీ సాయిలాగా వస్త్రధారణ చేసి అమాయకులను మోసగిస్తున్న అల్పుని విషయంలో విజ్ఞులు )
    పాయని ప్రేమతోడ దన
    వద్దకు వచ్చెడి భక్తకోటికిన్
    మోయగలేని బాధలను
    మోయుచు గాచెడి సాయి యట్టులన్
    మాయల వేషధారియయి
    మంచిగ మాటల మోసగించు పీ
    సాయిని దైవమం చనుట
    సత్యము గాదని యండ్రు సజ్జనుల్ !!
    ( పీసాయి -అల్పుడు పలనాడు ప్రాంత జనమాండలికపదం )

    రిప్లయితొలగించండి
  19. అన్ని మతముల సారంబు లెన్న నొకటె
    యనుచు చాటగ భువి లోన నవతరించి
    సమత మమతల బెంచిన సాధు శీలి
    సాయి భగవంతుడ ను ట య సత్య మె కద !? !

    రిప్లయితొలగించండి


  20. సరియగు జిలేబి ప్రభువు వసతిని తెలుపు
    సాయి భగవంతుఁ డనుట, యసత్యమె కద
    లేదనుట! గల డాతడు లెస్స గాను
    సృష్టి యందు వెలుగగుచు సృజన తెలిపి



    జిలేబి

    రిప్లయితొలగించండి


  21. కందోత్పల ఓ శతకమయ్యిందా ?



    అనుమానించు జనులు మ
    న్నును, సాయిని, దైవమంచనుట సత్యము గా
    దని యండ్రు; సజ్జనుల్ దే
    వుని రూపమ్ముగ తలంచి పూజింతురయా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కందోత్పల పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆ లెక్క ఏదో మీకే తెలియాలి!

      తొలగించండి
  22. రేయి పగలంచు తలపున
    హాయి యనిన వానిమహాత్ముడనగా
    పాయక పదములు కొలిచెడు
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "హాయి యనిన వాని గన మహాత్ము డనంగా" అనండి.

      తొలగించండి
  23. రేయి పగలంచు తలపున
    హాయి యనిన వానిమహాత్ముడనగా
    పాయక పదములు కొలిచెడు
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
  24. రేయి పగలంచు తలపున
    హాయి యనిన వానిమహాత్ముడనగా
    పాయక పదములు కొలిచెడు
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. సాయి దయామయప్రకటసాధుమహోన్నతవర్తనుండు, బా
      బా యని పిల్పు నంది యిల పావనసద్గురువౌను గాని, వి
      శ్వాయతసృష్టిపాలనలయాదిధృతప్రభవావతారుడా?
      సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. కలియుగంబున దైవమై వెలసి తాను
    మహిమలెన్నియొజూపెను మహిని సాయి!
    కపట వేషధారణయందునిపుణుడగు క
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద

    రిప్లయితొలగించండి
  27. చేయుదు మీకు మేలనుచు జేసెను చూడుమిదెంత మోసమో
    తీయని మాటలన్ బలికి తేనెలు బూసిన కత్తి వోలెనా
    మాయలు జేసి మానినుల మానము దోచెడి దుష్టుడైన గో
    సాయిని దైవమంచనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  28. దేవదేవుని మహిమల తీరు గనిన
    సాధుసంతుల సాంగత్య సాధనమున
    ధర్మరక్షణమునకిట ధరణ వెలుగ
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద!

    ****సవరణతో...🙏

    రిప్లయితొలగించండి
  29. సాయము గోరి సజ్జనులు శ్రద్ద సుబూరిని యెంచి ద్వారకా
    మాయిని జేరి స్వస్థులయి మాన్యు డటంచు దయా పయోధి గో
    సాయి భయంబడంచ మనసా స్మరియించిరి యంజలించియున్
    సాయిని దత్తునంశయని సన్నుతి జేతురు నెప్పుడెవ్విధిన్
    *“సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్”*

    రిప్లయితొలగించండి
  30. ద్వారకామాయిజనహితద్వారమయ్యె
    భక్తిశ్రద్ధసబూరియెభజనయయ్యె
    నెవరుసాయమొందరుపల్కుటెట్లుజెపుమ
    *సాయి భగవంతుఁడనుట యసత్యమెకద*

    రిప్లయితొలగించండి
  31. తీయని మంచిమాటలను తెల్విన బల్కుచు నమ్మజేసి, కా
    పేయము వీడకన్ తమిళ బేలల బట్టుకు నాశతోడ, చాం
    పేయపు లాలసన్, విడిది వీడి, విదేశము జేరినట్టి గో
    సాయిని, దైవమంచనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్

    కాపేయము-కోతిచేష్ట
    చాంపేయము-బంగారము

    రిప్లయితొలగించండి
  32. తేటగీతి
    విశ్వనాథుని రీతిగ భిక్షఁ గొనుచు
    పాప పరిహారమున్ జేయ భక్తులకును
    సంచరించ సజీవుడై సందియంబు
    సాయి భగవంతుడనుటయ? సత్యమె కద!

    ఉత్పలమాల
    మాయలు జేసి తానెపుడు మన్ననలందడు దైవమంచు! బా
    బా! యని వేడ నార్తి నిజవాసము నుండి విబూదిఁ బంపుఁ దా
    నో యని బల్కి, భిక్షువుగ నున్నతి గూర్చెడు విశ్వనాథుడౌ
    సాయిని దైవమం చనుటసత్యము గాదని యండ్రు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
  33. హాయిగ రాత్రివేళలను హ్లాదము నిచ్చుచు ప్రాణికోటికిన్
    సేయుచు నౌషధాళికి విశేషములైన సుధాప్రపూరణల్ వినా
    స్తేయము సేయువారికిని వితీర్ణముగా జని క్షీణ దేహు ర
    త్సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్

    రత్సాయి = చంద్రుడు
    సరిచేసాను గురువుగారు

    మీ సూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ, మూడవ పాదాలలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. హాయిగ రాత్రివేళలను హ్లాదము నిచ్చుచు ప్రాణికోటికిన్
      సేయుచు నౌషధాళికి విశేషములైన సుధాప్రపూరణల్
      స్తేయము సేయువారికి వితీర్ణముగా జని క్షీణ దేహు ర
      త్సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్

      తొలగించండి
  34. బాల!సంశయమొకొ?యక్షరాలనిజము
    సాయిభగవంతుడనుట,యసత్యమెకద
    సాయిదైవమేకాడన,సద్గురువును
    భక్తరక్షణగావించురక్తితోడ

    రిప్లయితొలగించండి
  35. పంటలు దగఁ బండించిన వంటల కయి
    ప్రాణ మొసఁగుఁ గద సకలప్రాణులకును
    వసుధ రైతు దేవుఁడు చెడ్డ పంటల వ్యవ
    సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద


    వాయిని నంగుళమ్ము నిడి పండడె యవ్వటపత్ర శాయియే
    యాయన శేషశాయి పరమాత్ముఁడు పన్నుగఁ బవ్వలించునే
    హాయిగఁ దోడుగా నడువ నామెకు నాతఁడు సాయి తప్పు సూ
    సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్

    [సాయి = తోడుగ నడచు వాఁడు, పెండ్లికొడుకు]

    రిప్లయితొలగించండి
  36. సాయినిదైవమంచనుటసత్యముగాదనియండ్రుసజ్జనుల్
    బాయకసాయినామమువారమువారముదప్పకుండగన్
    బాయనిభక్తితోడనికపల్మరుమారులుపాటలనాలపించుచున్
    జేయగనిష్ఠగాసరియెశిష్టులభావముజింతజేయగన్

    రిప్లయితొలగించండి

  37. తే.గీ.
    సాయి భగవంతుడనుటయే సత్య మిలను
    ఇలను వారి లీలల నెవరెంచలేరు
    అదిగనని మూర్ఖుడొకడు నిట్లనుచు పలికె
    సాయి భగవంతుడనుట యసత్యమెకద

    రిప్లయితొలగించండి
  38. సాయియెదిక్కునాకు మనసారభజించెద సాయి నామమున్
    సాయియెరక్షకుండుగనసాయియె దక్షుఁడు నన్ను బ్రోవగన్
    సాయినితాంతమౌకరుణ సత్యము సాయియెదైవ మేవిధిన్
    సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్?

    రిప్లయితొలగించండి
  39. సాయి దయామయుండు నరజాతికి శ్రద్ధ సబూరి దారిలో
    జ్ఞేయము జ్ఞానగమ్యమని శ్రేయ మొసంగి పరాత్పరార్చనన్
    సాయము జేసె ధ్యేయ మిడి సద్గురు వయ్యె భయంబు నూడ్చె గో
    *సాయిని దైవమంచను టసత్యము గాదని యండ్రు సజ్జనుల్*

    రిప్లయితొలగించండి


  40. తీయని మాటలాడుచును తీయుచు గోతులు వెన్కవై పునన్
    చేయుచుమోసమున్సతముచిత్తమునందుదు
    రూహలుం చుచున్
    న్న్యాయముచేయనెంచుచునునాటకమాడుచునున్న దొంగ గో
    సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్”*

    రిప్లయితొలగించండి
  41. కె.వి.యస్. లక్ష్మి:

    కలడు లేడను మీమాంస కలుగనేల?
    కలవవెన్నియొ మహిమలు నిలను జూడ
    సాయి భగవంతు డనుట యసత్యమె కద
    సాధువేష ధారుల నంత సాయి యనగ.

    రిప్లయితొలగించండి
  42. వీరత్వమ్మును చూపగ
    తీరుగ విచ్చే సెగాని తేరది క్రుంగన్
    భీరువుగానిల్చిగనుచు
    భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్

    రిప్లయితొలగించండి