18, అక్టోబర్ 2020, ఆదివారం

సమస్య - 3519

 19-10-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు”

(లేదా…)

“చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్”

(ఈ సమస్యను పంపిన రామ్ డొక్కా గారికి ధన్యవాదాలు)

90 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    గొప్పలు చెప్పుచున్ తనరి కొండొక శాస్త్రియె హైద్రబాదునన్
    కుప్పలు కుప్పలందు; కడు కూరిమి మీరగ త్రిప్పి మీసమున్;
    తప్పులు జేయగా తరచు దబ్బున నవ్వుచు పూరణమ్ములన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్...

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    రక్ష యన్న కనుచు రాకీని గట్టుచున్
    నోరు తీపి జేయ చేరవచ్చి
    యన్న కాలి వద్ద నున్న జెఱ్ఱిని గాంచి
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    ఉత్పలమాల
    గొప్పగ నమ్మనాన్నలను గుర్తుకుఁ దెచ్చుచుఁ బ్రేమఁ బంచఁ దా
    నెప్పటి రీతినన్నకట నింపుగఁ గట్టుచు రక్ష తీపితో
    ముప్పని కాళ్లజెఱ్ఱిఁగని బూనుచుఁ జంపఁగ మూల నుండెడున్
    జెప్పు ను దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గొప్పగ సోదరుండు భళి కూరిమి మీరగ కండ్లు మూయుచున్
    త్రిప్పుచు మాలనున్ వడిగ తిండికి ముందర పూజచేయగన్
    మెప్పును పొందగోరి తన మీదకు ప్రాకెడు వృశ్చికమ్మునన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్...

    రిప్లయితొలగించండి
  4. పక్ష వాతపు రోగము‌ వాడు అన్న,

    కాళ్ళు చేతులు కదలవు, కనులు‌ కాంచి

    నట్టిది తెలుప లేడుగ ననుచు చెప్పు

    దీసి కొట్డె చెల్లి యపుడు తేలు గాంచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాడు+అన్న=వాడన్న' అవుతుంది. యడాగమం రాదు. "వాడె యన్న" అనండి.

      తొలగించండి
  5. అన్నవచ్చెననుచు అన్నము వడ్డించి
    కడుపునిండ తినగ కడుముదముగ
    పక్కసర్దబోవ పరుగిడు తేలును
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్నచెల్లినాట చూడదలచినంత
      మాయజేతునంచు మరువజూపి
      బొమ్మదాచినంత బుడిబుడి నడకల
      చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ఆ.వె.
    ఉత్సవంబు చూడ యూరువచ్చిన జామి
    అన్న నిప్పుకర్రసాము చూడ
    నెంచ, రాఁజు కొనిన నిప్పును యార్పంగ
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    నోట తీపి బలికి నొసట సైగలుఁ జేయ
    బుర్ర పగులు నంచుఁ గర్రఁ జూపఁ
    జెల్లి వనుచు వాడుఁ జేతిని గిల్లంగ
    జెప్పుఁ దీసి కొట్టెఁ 'జెల్లి' యపుడు

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తుంట రైన వాడు వెంటబడుట జూసి
    ఆగ్ర హించి వచ్చు నన్న నెంచి
    నిబ్బరమ్ము తోడ నీచునాతని తన
    చెప్పు దీసి కొట్టె జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
  9. ముసురు వెలిసి నంత భూమి చిత్తడి యయ్యె
    బురద నుండి వచ్చె పురుగు యొకటి
    దానిని గనినంత త్రాసమొందగ నన్న
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పురుగు+ఒకటి' అన్నపుడు యడాగమం రాదు. "పురుగొకండు" అనండి.

      తొలగించండి
  10. పప్పుసుద్దయనుచు ప్రాణముల్ దీసెడు
    బాలకుండు వాడు వరుసగాను
    వీధులన్ని గాచి వేధించు చుండగ
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు!!

    రిప్లయితొలగించండి
  11. కీకారణ్యంలో ప్రయాణం చేస్తున్న అన్నా చెల్లెళ్ళ ఉదంతం
    .
    కప్పిన కారుచీకటులు,క్రమ్మిన మేఘ సముచ్చయంబులున్,
    తప్పిన దారి,కాననము,దారియు తోచదటన్న లేమకున్
    చెప్పగరాని భీకరపు చేవ గలట్టిది తేలు కుట్టగన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున అన్న మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  12. మెప్పును బొందనెంచెనట మేలగు పూరణలెన్నొజేతున
    న్నెప్పుడు వాట్సపుంగనుచు నెన్నియొ పద్యమరందముల్ విన
    న్నొప్పెడు పద్యరాజముల నొప్పుగ వ్రాయక గేలినొందగా
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్!!


    ***సరదాగా....

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తప్పునుగూడు పద్ధతిన తన్విని హేళనజేయు మాటలన్
    గొప్పగ బల్కు తుంటరిని కోపముతో గని నగ్రజన్ముడే
    అప్పళమొంది వచ్చునెడ నామె ధృతిన్ తన యన్ననండతో
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్.

    (అప్పళము= వేగము)

    రిప్లయితొలగించండి
  14. సమస్య :
    చెప్పునుదీసి కొట్టినది
    చెల్లి తటాలున నన్న మెచ్చగన్
    ( మగని ఘాతుకచేష్టలకు మనసు విరిగిన
    మగువ దసరాకు తీసుకు వెళ్దామని వచ్చిన
    అన్నముందు ధూర్తభర్తకు వేసిన శిక్ష )
    ఉత్పలమాల
    ....................
    " చెప్పగలేనురా ! యితని
    చీదర చేష్టలు ; వారకాంతకున్
    గుప్పుచు విత్తమున్ ; మదిర
    గ్రోలుచు నెప్పుడు డబ్బుకోసమై
    యప్పులపాలు జేసె మన
    యయ్యను ; వీడెద " నంచు భర్తనే
    చెప్పును దీసి కొట్టినది
    చెల్లి ; తటాలున ; నన్న మెచ్చగన్ .
    ( మదిర - మద్యము ; వారకాంత - వేశ్యాంగన )

    రిప్లయితొలగించండి
  15. విజయ దశమి నాడు విహితులు విచ్చేసి
    రన్న తోడ గ్రికెటు నాడు గొనగ
    కెడను పాకు చున్న కీటకమును జూసి
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ యత్నం..

    *ఆ వె*

    కుక్క యొకటి వచ్చి పిక్కను బట్టగ
    అన్న బెదిరి పోయె నంత లోనె
    చూడ వచ్చి తాను స్పీడుగా చెంతకు
    *"చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  17. వరదనీరు చేరి వంతలు బెట్టగ
    చెక్కపెట్టె సందు జిక్కినట్టి
    నల్లతేలు గనగ నదురు బెదురులేక
    చెప్పుదీసి కొట్టె చెల్లియపుడు

    మెప్పును బొందగోరి మెలమెల్లగ నెక్కగ జామచెట్టునున్
    చప్పున కోయగాను బహుచక్కని పండ్లను చెల్లికోసమై
    చప్పుడు జేయకుండ తరుశాఖను దాగిన వృశ్చికమ్మునున్
    చెప్పునుదీసి కొట్టినది చెల్లి తటాలున నన్నమెచ్చగన్

    రిప్లయితొలగించండి

  18. ఈ మధ్య వరసగా
    మొలను కత్తి దూయటం,
    గన్నుతో ఢామ్మని కాల్ చేయటం
    చెప్పు దీసి కొట్టటం వచ్చేసేయి.

    రేపేమి వచ్చును ? :)



    మొలను కత్తి దూసి ముందుకు దుముకగ
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి, యపుడు
    గన్ను నెక్కు పెట్టి ఘాట్టిగ నెదురింప
    చెంపశుద్ధిచేసె చెంగు మనుచు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమీక్షారూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇవన్నీ రామ్ డొక్కా (అమెరికా) గారు పంపిన సమస్యలు. అప్పటికీ వరుసగా ప్రతిరోజు ఇస్తే స్టీరియో టైపుగా ఉంటాయని రోజు విడిచి రోజు ఇస్తున్నాను. :-)

      తొలగించండి


  19. కందోత్పల


    అనుకొనుమా నువ్వేమై
    నను, చెప్పును దీసి కొట్టినది చెల్లి తటా
    లున నన్న మెచ్చఁ, గన్ గై
    కొని వాడిని కాల్చి వేసె గోతి జిలేబీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యలో 'గన్' లేదు. 'మెచ్చన్+కన్=మెచ్చఁగన్' అవుతుంది.

      తొలగించండి
  20. అన్న ,చెల్లి తాము పాఠశాలకు బోవ
    బూటు తొడుగు చుండ పూర్తి గాను
    కాటు వేయ బోవు కీటక మ్మునుజూచి
    చెప్పు దీసి కొట్టె చెల్లి యపుడు

    రిప్లయితొలగించండి


  21. సెబాసో జిలేబి :)


    అప్పుడు వీధియందు నడయాడెడు వేళ రయమ్ముతోడు కై
    జొప్పుచు ధూర్తుడొక్కడు కుచోపరి చేలను తాక వాడిగా
    కొప్పును పట్టి లాగి భళి క్రుమ్ముచు దుష్టుని భద్రకాళియై
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. ఉప్పు కప్పురంబు నొక్క పోలికెయగు
    తప్పు చేయువారు ధరణి కలరు
    అన్నకొరకు వచ్చి తిన్నగ లేకున్న
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
  23. ఎప్పటి నుండియో మధుర కేగెద మంచును కోరుచుండతా
    నప్పును జేసి సోదరిని యన్నయె గైకొని పోవువేళ నా
    యొప్పులకుప్ప గాంచి ఖలు డొక్కడు పయ్యెదయట్టి లాగగన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున, నన్న మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  24. ఆకతాయి వఛ్చి అల్లరి చేయగా
    చెప్పు దీసి కొట్టె చెల్లి యపుడు
    మెచ్ఛు కొనుచు పొగడి మేలు మేలని నామె
    సాహ సమును గాంచి చక్క ననిరి

    రిప్లయితొలగించండి
  25. రెప్పలు వేయకుండ జను లెల్లరు మెచ్చగ నాట్యమాడగా
    గొప్పగ చిందులేయుసహ గోపకుమారులు వంతపాడుచున్
    చెప్పగ నేలనొక్కరుడు చెల్లెలి చేతిని పట్టఁజూడగా
    చెప్పును దీసికొట్టినది చెల్లి తటాలున యన్న మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  26. ఇప్పుడమిన్ దురాత్మగణ మింతులనుం గని కీడు చేయగా
    నెప్పుడు చూచుచుండుటకు నిజ్జనులందున భీతి హేతువౌ
    నిప్పుడు చూడు డంచొకని నెంతయు ధైర్యముతోడ దుష్టునిన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  27. అప్పులు చేయుచున్ సతత మారడి పెట్టుచు నత్తమామలన్
    గొప్పలు చెప్పి తాను సమకూర్చిన సొమ్మును ఖర్చుబెట్టుచున్
    తిప్పలు బెట్టుచుండ మది తీవ్రపు కోపము కల్గ భర్తనే
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున, నన్న మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  28. *“చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్*
    ముచ్చటగా చరించు విష పుచ్ఛము చప్పుడు జేయకుండ దా
    వచ్చి బిచాణ మెక్కి నడుపాడుట గాంచి భవాని భంగి యే
    సప్పుడు సేయ కుండ పరిచారిక బిత్తర పోయి నిల్వగా

    రిప్లయితొలగించండి
  29. ముప్పు ఘటిల్లు నీ కనిన మూర్ఖుడు లక్ష్యముఁజేయఁబోడు తా
    నెప్పుడు వెంబడించుచు హసించ దురుక్తివికారచేష్టలన్
    దెప్పరమెంచి సోదరుడు తిక్క కుదుర్చుము ధీరవై యనం
    జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  30. అచ్చట నూయెలందు శిశువాడుచు నవ్వుచు జిందు లేయగా
    వచ్చెను నాకుపచ్చ పురువందరు తత్తర పాటు నొందగా
    ముచ్చెమటల్ స్రవించగ డుబుక్కను నిక్వణ ముద్భవింప దా
    *“జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్*

    రిప్లయితొలగించండి
  31. అన్నయొక్కహితుడుకన్నుగొట్టగజూచి
    చెప్పుదీసికొట్టెచెల్లియపుడు
    మంచిపనినిజేసిమార్గదర్శకమాయె
    దుష్టబుద్ధికలుగుదుర్జనులకు

    రిప్లయితొలగించండి
  32. అప్పలరాజుబోవగనునాప్తునియింటికిజూడగోరుచున్
    ముప్పునుదాదలంచకనుమోహినిమోమునుముద్దువెట్టగా
    దప్పుగనుంటకారణముదప్పదుదండనయంచునత్తఱిన్
    జెప్పునుదీసికొట్టినదిచెల్లితటాలుననన్నమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  33. అందరికీ నమస్సులు🙏

    ఉ.మా
    గొప్పగ మెచ్చుచున్ వెనుక గోతులు తీసెడి మాయ రోజులన్
    తప్పుడు వర్తనల్ మరిగి దారిని నడ్డిన పోరగాడు తా
    మెప్పును కోరి వెంటబడి మీసము దిప్పగ బుద్ది చెప్పగన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

    ఆ.వె
    కొత్తిమీర చట్ని కోరి యడుగ గన్న
    పెంచి చేతు నేను పెరటి లోన
    ననుచు తీసె నిన్ని ధనియాలు నలుపగ
    చెప్పు తీసి కొట్టె జెల్లి యపుడు

    *వాణిశ్రీ నైనాల, విజయాడ*

    రిప్లయితొలగించండి
  34. మైలవరపు వారి పూరణ

    చెప్పులు విప్పినారచట చిందరవందరగా జనమ్ములా
    కుప్పకు ప్రక్కనే గలదు కొబ్బరికాయలు కొట్టు రాయి.,దా..
    నిప్పుడు కాయఁగొట్టుటకు నెంచినదై యొక పుల్లముక్కతో
    చెప్పును తీసి., కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  35. ముక్కు మీద కోపము సెలఁగు నిత్యము
    తమ్ముఁ డన్న జాలి వమ్ము సుమ్ము
    కాలు భంగి నెగసి కఱ్ఱను, దా నేమి
    చెప్పుఁ, దీసి కొట్టెఁ జెల్లి! యపుడు


    తిప్పలు వెట్టఁ దన్ను నట దిట్టతనమ్మున నన్నరుండు వే
    కొప్పు బిగించి త్రిప్పుచును గ్రుడ్డుల నొప్పులకుప్ప యప్పుడే
    గుప్పున నుప్పతిల్లఁ బగ కోపము చప్పున వామపాదపుం
    జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  36. ఉ:

    ఒప్పుల కుప్ప యంచనుచు నొంచెడు మాటల వెంట దిర్గుచున్
    తప్పుడు చేష్టలున్ బలిమి దారికి నొత్తిడి పెట్టు చుండగన్
    చప్పున నిబ్బరించి తన శత్రువు వీడని వైరశుద్ధిగన్
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. గురువు గారికి నమస్కారం దేవరకొండ భగవాన్
    ప్రేమ పేరుతో ని ప్రేయతములావెంబ
    డించువానిమదము దించనెంచి
    జాగు చేయకామె చప్పున తనయన్న
    చెప్పు దీసి కొట్టె చెల్లి యపడు

    .

    రిప్లయితొలగించండి
  38. అన్నజూడచెల్లియరుగుచునుండగ
    దారికాచియొకడు దాడిజేయ
    నబలగాదునేను సబలనురా! యని
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
  39. కొప్పునపూలుపెట్టుకొని కోమలి కోవెలకేగుచుండగా
    అప్పలరాజువెంటబడియారడిచేయగనుగ్ర రూపియై
    నిప్పులు గ్రక్కుచున్ కనుల నీపనియిట్టుల కాదటంచు తా
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  40. చెప్ప రాని తప్పు జేయ బూని యొకడు
    చెప్పుచు మెఱమెచ్చు చెంత జేరి
    చెప్పి జెడు దలంపు చేయి వేయగ జూడ
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడు

    రిప్లయితొలగించండి
  41. చెల్లి యనుచు తప్పు చెయ్దములను చేయ
    గాంచు చుండి చెంత కన్నులార
    తాళలేక మదిని తనదు నెడమ కాలి
    చెప్పు దీసి గొట్టె చెల్లి యపుడు

    రిప్లయితొలగించండి