11, అక్టోబర్ 2020, ఆదివారం

దత్తపది - 172

12-10-2020 (సోమవారం) 

కవిమిత్రులారా,

"అల - కల - వల - నెల" 

పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ రామాయణార్థంలో  

మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

44 కామెంట్‌లు:

 1. అలకను బూనెను కైకయె
  కలవరపడి దశరథుండు గడు వడిఁ జనియున్
  "వలసిన వరముల నిచ్చెద
  నెలఁతా! కోపమ్ముఁ బూన నీకేల?" యనెన్.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ నమస్సులు 🙏🙏

  *"అల - కల - వల - నెల"*

  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ రామాయణార్థంలో

  మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

  నా పూరణ యత్నం..

  *కం*

  అలకల సూర్పణక నపుడు
  కలవరబెట్టెను విడువక ఘనుడివి రామా
  వలలో వేయగ జూచిన
  నెలతను తప్పించె నీవు నేర్పుగ నపుడున్!!

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరో ప్రయత్నం 🙏🙏

   *కం*

   అలనాడడవికి బొమ్మని
   తెలుపగ కలవర బడకనె తెగువనె రామా
   విలువల నెరిగిక వెడలగ
   వెల వెల బోవదె నయోధ్య వెన్నెల లేకన్

   *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
   🙏

   తొలగించండి
 3. నీచ రావణుండు నెలత నెత్తుకుపోవ
  కలత నొంది వెదకి కదిసి లంక
  అలకబూని జంపె నసురుని రాముడు
  కోర్కెవలన జచ్చె గొప్ప ద్విజుడు

  రిప్లయితొలగించండి
 4. *హనుమంతుడు రావణునకు హితోపదేశం చేయుట*
  ....... ....... ....... ...... ...... ...... ..... ....
  అలఘుడ వో రావణ యా
  నెలత వలన నాశనమగు నీ కుల మనుచున్
  దెలుసుకొనుము, రాముండు స
  కల సద్గుణధాముతోడ కయ్యము తగునే.

  రిప్లయితొలగించండి

 5. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస ఉవాచ:

  నెలతను కోలుపోవగను నెయ్యము చేయుచు సూర్యసూనుతో
  కలతను తీర్చి ప్రోవగను కమ్మని సీతను రామభద్రుడే
  వలపులు మీర కట్టగను వారధి వేసరి వార్ధి దాట; తా
  నలయక తల్చి రాఘవుని హాయిగ గంతెను వాయుపుత్రుడే!

  రిప్లయితొలగించండి
 6. కందం
  అల లంకాపురి జానకి
  కలదంచును జూచి వచ్చి కమనీయముగన్
  వలకు నెఱిగించి రఘుపతి
  నెలమిని హృదినందు హనుమ నేర్పడఁ గొలుతున్

  రిప్లయితొలగించండి
 7. అలసటనెఱుగకరాముడు
  కలకలమును సృష్టిజేయు కౌణకమూకన్
  కలవలబరచుచు శరముల
  నెలకొల్పెనుశాంతియజ్ఞ నిర్వహణమునన్

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  (వల)పును వీడి దాశరథి పత్నిని వేగమె పంపకుండుచో
  (అల)కనుజెంది రాముడు వినాశమొనర్చును లంకకెంతయున్
  (కల)హమునందు నీక్షణమె గావున యా (నెల)తన్ త్యజించుచున్
  నిలుపుము శాంతి నోయనుజ! నీవుగ నంచు విభీషణుండనెన్.

  రిప్లయితొలగించండి
 9. అలతిగ ధనువును విరువగ
  కలవరపడి జనక పుత్రి కాంచెన్ రామున్
  వలచిన పతితన కౌనని
  నెలతకు సంభ్రమముగాగ నిజముగ దలపన్

  రిప్లయితొలగించండి
 10. కె.వి.యస్. లక్ష్మి:

  (వల)వల నేడ్చుచు కైకయె
  (అల)(కల) పానుపును జేరి నారటపడుచున్
  తలచెను కోరగ దశరధు
  (నెల)వుగ సుతుడా భరతుని నేలికజేయన్.

  రిప్లయితొలగించండి
 11. దత్తపది :
  అల -కల -వల -నెల అనే పదాలను
  అన్యార్థంలో రామాయణపరంగా స్వేచ్ఛా
  ఛందస్సులో .
  (దశరథమహారాజు కైకేయితో )
  అలకల బూనబోవకు కు
  లాంగన ! కేకయరాజపుత్రి ! యీ
  కలకల మెందుకే ప్రణయ
  కామిని ? రాముడు భావిరాజు గా
  వలయు నటంచు నెంచితిని ;
  పండెను భావపు బంటలింక ; క్రొ
  న్నెలయును సాటిరాని మన
  నెయ్యపుబిడ్డయె కోసలేంద్రుడౌ !!

  రిప్లయితొలగించండి
 12. దశరథుడు దన ‘కల’కంఠి తగులు దీర్చ
  నాత్మజుని యడవికి పంప‘నల’ములదిని
  దో’నెల’జలము దాగుచు దొరలు చుండె
  కష్టముల నా’వ ల’ సుఖము గలుగు ననుచు

  రిప్లయితొలగించండి
 13. (అల)జడిపడి యవనిజ గడు
  (కల)వరమున రవికులుఁ వెదుకగ జనుమన, నా
  (వల) నొక వలయము వలనగ
  (నెల)తకు లక్ష్మణు డమరిచి నెమకుట కరిగెన్

  రిప్లయితొలగించండి
 14. అలకల నెలత వలపులకు
  బలిగా రాముని థశరథుబంపెనటవికిన్
  మెలకువ నడవడినట వన
  ముల గనియన్ రాముడు హనుమను మేలవగన్

  రిప్లయితొలగించండి
 15. రాముడు అరణ్యాలకు వెల్లగా కాళిదాసు రఘువంశరాజులను ఉద్దేశించి చెప్పిన ఆ రఘువంశవైఖరులెల్లయూ అక్కడకు వెళ్ళిపోయాయి. త్యాగము సత్యము యశస్సు అక్కడకు వెళ్ళగా రామచంద్రుడు ఆ వనం లో పండువెన్నెలలు కురిపించాడు

  చం||
  అలజడి రాజ్యమందుగననా రఘురాముడరణ్యమేగగన్
  కలవరమొంది తండ్రిజనె కాననలందున వంశదీప్తి గా
  వలయును త్యాగసత్యపరిపాలయశోలయమవ్వనా వనిన్
  వెలసెను పండువెన్నెలల వెల్లువగానట రామచంద్రుడున్

  రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 16. కలవరమేలమానుమిక? కాలముమారును మాదురాకతో
  యలజడిరేపగాదగులె,యంతట లంకన మంటబుట్టగా
  నెలతరొనమ్ముమమ్మికను,నెయ్యముగోరిన రామచంద్రుడే
  వలచిన జానకమ్మనిక,వారధిదాటగజూతుమమ్మరో
  +++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 17. అల - కల - వల - నెల
  అలస టెరుంగక సతికై
  కలయ తిరిగె కొండ కోన కపులను కూడెన్
  వలసిన సంగతి తెలుసుకు
  నెలత కొరకు రాక్షసులను నిహతుల జేసెన్

  రిప్లయితొలగించండి
 18. అలరుఁ బూబోణి జానకి నసురవిభుడు
  వలదు రావణ! యన్నను బలిమిఁ జేసి
  కలయ పరికించి చెరఁబట్టఁ గాంక్ష తోడ
  నెలత శోకమ్ము మృత్యవై నేలఁ గూల్ఛె.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు నేను హైదరాబాదు వెళ్తున్నాను. రోజంతా ప్రయాణంలో ఉండడం వల్ల మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 20. మైలవరపు వారి పూరణ

  అలలై పొంగుచునుండె నేత్రముల దుఃఖాశ్రుల్., ధరాజాతలే...
  క లయన్ దప్పెను గుండెసవ్వడి., గనన్ గంజమ్ములన్ బూల తీ...
  వల సీతమ్మయె కానిపింప., నడకల్ భారమ్ములై తోచ., వె...
  న్నెలయున్ మోదము గాదటంచు వగచెన్ శ్రీరామచంద్రుండటన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 21. అలకలను వలచి నెలతి పరుపును వ
  లదని తన కరము లలిత గతిని

  తలగడ వలె నిడి దరణిన తెనమణి,
  కలతను బడిసెను,కలవరము వ

  లన నలజడి కలిగెను‌, మది
  వికలము
  బడయుచు
  నిపు డవగడము కలుగు

  నని తెలుపుచు ఘురణము లను ఘనముగ
  సలిపెను,జరుగును కలహ మిపుడు

  వలపుల‌ నెలతి కనుల న జలము తడిపె

  వలువలను,చెదరె నుదుట
  నలకము నని

  దశరధుడు పడతిని‌ గని‌ తలచుచు నడు

  గిడెను నవరుకు హృదయము దడ దడ మన

  తెనమణు = పరుండు
  అవగడము= కీడు
  ఘరణములు = ధ్వనులు
  అలకము = ముంగురులు
  నవరు= అంతఃపురము

  రిప్లయితొలగించండి


 22. కలకంఠి ధరణి జయు నా
  వల! శివుని ధనుస్సు విరిచి వరుడీవల క
  న్నులు కలిసెవెన్నెల విరిసె
  నలువైపులతెల్లదనము నడుమనలపులున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. దత్తపది :-
  *"అల - కల - వల - నెల"*
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ రామాయణార్థంలో
  నచ్చిన ఛందంలో పద్యం

  *కందం**

  అలసితి రామా యనగా
  కలవరపడి సీతకు తను కాళ్ళను పట్టెన్
  వలచిన ప్రేమను తెలపగ
  నెలతకు నయనముల నిండ నీరులు నిండెన్
  ...................✍️చక్రి
  (అరణ్యవాసం లో నా ఊహ మాత్రమే....)

  రిప్లయితొలగించండి
 24. అలకను బూనిన కైకను
  వలపున నోదార్ప నెంచి వసుధాధిపు తా
  నెలతకు వరములొ సంగియు
  కలవర మును మాన్పె తాను కామిత మొప్పన్

  రిప్లయితొలగించండి
 25. అలక బూని కైక యామూడువరములుఁ
  గోర కలత చెంది కుందెరాజు
  వగచి యేడ్చికార్చె వలవల కన్నీరు పట్టువీడ నెలత బరగలేదు.
  పూడి.లక్ష్మీపతి...

  రిప్లయితొలగించండి
 26. అలకల పాన్పు జేరి దనయాలి కలంకు నెలంత యవ్వలిం
  చి లలిత మీయు మన్న ననుజీవ్యుడు గైకను గాంచి బల్కె నో
  వలజ! యలంక యేల రఘు వంశ కలాపు వినీల దేహుపై
  యలకను మాని పుష్కల దయామయి! కావల మణ్చు వెన్నెలా!

  రిప్లయితొలగించండి
 27. అలకాపురి దలపించెడు
  పలువన్నెల లంకలోన పావని సీతన్
  కలువల కంటిని గన్గొనె
  కలవర మందుచు హనుమయె కంపిత గాత్రన్

  రిప్లయితొలగించండి
 28. అలకబూనినకైకనుననునయించె
  గలతజెందకుమికయీయ వలసినవర
  ములగు రెంటిని నిత్తునునెలత!నీకు
  నూరడిల్లుమక్రుద్ధముబారినుండి

  రిప్లయితొలగించండి
 29. రిప్లయిలు
  1. అశోక వనములో రావణుడు సీతను అనునయించుట.

   కం.

   అలకలు మానుము లలనా
   నెలకువ నా మది నిలుతువు నిక్కము సుమ్మీ
   వలపుల పట్టపురాణీ
   కలకాలము రావణాన కష్టము రాదే

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 30. అలఘు పరాక్రముఁడు తను వి
  కల రిపు వలయుఁడు గనె లయకారకుల సుఘో
  రుల ఖర దూషణ సత్రిశి
  రుల దండక యందు రఘువరుఁ డసుర గణమున్

  రిప్లయితొలగించండి
 31. (అశోకవనములో హనుమ సీతా మాతను గాంచుట)
  అల లంకా నగరంబులో వనములోనా శింశుపా ఛాయలో
  కలతన్ మానసమందు రేగు దన దుఃఖాగ్నిన్ నిరోధించుచున్
  వలపున్ జూపుచు వేసరించెడి ఖలున్ పాపాత్మునిన్ గూల్చగా
  నెలతాల్పున్ మది వేడెడిన్ నెలత సాన్నిధ్యంబు దా జేరెనే

  రిప్లయితొలగించండి
 32. అలనాడా సీతమ్మకు
  వలబన్నెను రావణుండు వంచన తోడన్
  నెలతను బట్టిన పాపము
  కలహంబై ద్రుంచెనతని కంఠదశములన్

  రిప్లయితొలగించండి
 33. అలవోకగ యటునిటుగని
  వలపుల మొగ్గయి ధరణిజ వసుధాపతికై
  కలహంసయి కదలినంత
  నెలకొనె ఆనందశోభ నేత్రోత్సవమై

  రిప్లయితొలగించండి
 34. *అల-కల-వల-నెల*
  అన్యార్థంలో రామాయణార్థం

  కం.
  అలలంకాపురిలోనన్
  వలవలవిలపించు సీత వదనము గాంచన్
  నెలతుక కలవర మేలా?
  యలఘుడు శ్రీ రాము డనుచు హనుమ వచించెన్.

  -యజ్ఞభగవాన్

  రిప్లయితొలగించండి
 35. అలవోకగ నబ్ధిఁ గడఁచి
  కలనున్ రావణుని జంపి కాంతను గొని యా
  వల చేర యయోధ్యాపురి
  నెలతకు కష్టములు తీరి నెఱి ముదము గొనెన్

  రిప్లయితొలగించండి
 36. అలకబూనెనేమొ ఆనందమే లేదు
  కలవరమ్మయె,మది యలసిపోతి
  వలదు వలదన, నను బాధ పెట్టుచునుండె
  నెలత జాడ నేల తెలిసి కొందు!!

  ***సీతను వెదుకుతున్న రాముడు బాధపడుతూ తన తమ్ముడు లక్ష్మణునితో పలికిన సందర్భంగా....!

  రిప్లయితొలగించండి
 37. రావణుడు సీతతో

  అలవి కాదు వినుము నంబుధి నిలదాటి
  నిన్ను కలవ లేడు నీదు పతియు
  తలపు లన్ని వీడి దరిచేరి రావణున్
  వలపు నందు కొనుము నెలత నీవు
  ఆంజనేయుడు సీతతో

  అలమటించకమ్మ నంతరంగమునందు
  కలత మాను మింక నెలత నీవు
  తలపు నందు సతముదాశరథి యునుండ
  వలదు చింత వచ్చు వార్ధి దాటి.

  అలమిథిలాపురమ్మున స్వయంవర మందున విల్లు ద్రుంచ గా
  కలకలలాడెమోమచటకాంతకు గాంచినయంత రాఘవున్
  వలపదినిండగామదిని వాలుగజూచుచు సంభ్ర మమ్ముతో
  నెలతయు మ్రాన్పడన్నచటనెమ్మిని పూని తదేక దృష్టితో

  రిప్లయితొలగించండి