22, అక్టోబర్ 2020, గురువారం

సమస్య- 3523

 23-10-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది....

"సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్"

(లేదా....)

"సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్"

88 కామెంట్‌లు:

  1. ఉర్విన వసించు జనులకు

    పర్వముల గురించి తెల్పు‌ బాగుగ నెపుడున్

    గర్వము గజెప్ప గలరా

    *సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్"*

    రిప్లయితొలగించండి
  2. శా||
    ఉర్విన్ సర్వము దెల్సు గూగులుకు సమ్యుక్తంబుగన్ జూచినన్
    శర్వున్ నాస్తికబుద్ధులన్ వివిధ విశ్వప్రార్థనాశైలులన్
    నిర్వాహంబునుజేయదే యహము లేనేలేక శాస్త్రోక్తమున్
    సర్వజ్ఞత్వము గూగులందగలదే శాస్త్రీ విచారించినన్

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి


  3. సర్వరు కృత్రిమ మేధ
    స్సర్వస్వము జీవితమకొ జనులకు ? ఐటీ
    గర్వము వీడండి వెసన్
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్?


    జిలేబి

    రిప్లయితొలగించండి

  4. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పర్వమ్మాయెను జాలమే యమరగన్ భద్రమ్ముగానంచు భల్
    సర్వంబున్ విడి నాట్యమాడుచునహో స్వర్గమ్మిదేయంచు వే
    గర్వమ్మొందుచు పల్కుచున్ తనరుచున్ గ్రంథమ్ములన్ దూఱగన్
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్...

    రిప్లయితొలగించండి
  5. కం
    పర్వము ఆధునికమ్ముకు
    చర్వితచర్వణముమాని స్వైరుండవ్వన్
    ఉర్విన్ శృతులకు సమమగు
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె? గూగుల్

    స్వైరుడు = సోమరి
    ------ శ్రీరామ్

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నిర్వాకమ్మును జేయుచున్ మురియుచున్ నిక్కంపు జాలమ్మునున్
    సర్వమ్మిందున కూడియున్నదనుచున్ జంబమ్మునన్ ప్రేలుచున్
    పుర్వుల్ పట్టును పుస్తకాలకనుచున్ పూజింపగన్ ఫోనులన్
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్....

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గర్వముతో గొదగొనినను
    ఉర్వినిమూర్ఖుల కెలమిని నొసగెడి నెఱికిన్
    నిర్వచన మీయకుండగ
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్?

    రిప్లయితొలగించండి
  8. ఉర్విన్ విషయ ప్రాప్తత
    బర్వెడి విధమందు బహుళ భాషలలోనన్
    తర్వుగ జ్ఞానం బొసగిన-
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్?!

    రిప్లయితొలగించండి
  9. ఉర్వినరుడు సృజియించె న
    పూర్వమగు పడితర మిదియె ముదమున తానే
    సర్వావస్థల యందును
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్

    రిప్లయితొలగించండి
  10. సర్వజనులయాశంకలు
    సర్వమునెరపుచునిరతముసహకారముతో
    నిర్వక్రసేవసలుపుచు
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గర్వమ్మున్ చెలరేగుచున్ సతము తా కైపున్ పురాణించుచున్
    సర్వంబున్ తెలియున్నటంచు నెఱినిన్ చాటింపులే చేయుచున్
    ఉర్విన్ మూర్ఖుల చిత్తమున్ సరిగ జక్కొన్పంగగన్ లేకనే
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ? విచారించినన్.

    రిప్లయితొలగించండి
  12. సర్వజ్ఞత్వం బెపుడున్
    శర్వునకే చెల్లు-కాని నవయుగమందున్
    గర్వము నిండిన పట్టున
    సర్వజ్ఞత్వంబు నందజాలునె గూగుల్

    రిప్లయితొలగించండి
  13. అర్వాచీన మహోపకారి యగునా యంత్రమ్మదే గాంచగా
    నుర్విన్ మానవుడే సృజించెనిది సర్వోత్కృష్టమై నిల్చుచున్
    సర్వావస్థలయందు కోరినవిధిన్ సంవిత్తునందించుచున్
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్

    రిప్లయితొలగించండి
  14. సర్వజ్ఞుడు శర్వుండే
    సర్వమ్మొక నెలవునందు సమకూర జనుల్
    సర్వాధారమని బొగడ
    సర్వజ్ఞత్వమ్ము నందజాలునె గూగుల్?

    ఉర్విన్ మానవులెల్ల సంతతము
    సర్వోత్కృష్ట యత్నంబునన్
    పర్వుల్ దీయగ నచ్చటిచ్చటికి
    సంపాదించగా జ్ఞానమున్
    సర్వార్ధంబులొకే నివేశనమునన్
    చక్కంగ చేకూరగా
    సర్వజ్ఞత్వము గూగులందగలదే! శాస్త్రీ విచారించినన్!

    రిప్లయితొలగించండి
  15. సర్వము తెలిసిన హితుడై
    గర్వంబొందక విషయము గూర్మినిదెలుపన్
    మర్వక మోదము గూర్చగ
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి

      తొలగించండి
    2. గర్వంబొందక విషయము గాదిలిజెప్పన్
      🙏🏻🙏🏻

      తొలగించండి
  16. ఉర్వినిఁ సృజించె మనిషియె
    సర్వంబెరిగిన గవేషిఁ జగమే మెచ్చన్
    గర్వముచే బ్రహ్మ గడచి
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్?

    రిప్లయితొలగించండి
  17. సమస్య :
    సర్వజ్ఞత్వమ్ము నంద జాలునె గూగుల్

    ( కైలాసములో శ్రీనాథుని స్వగతము )
    కందము
    .............

    సర్వజ్ఞత్వము జూడగ
    శర్వునకే చెల్లును గద ! సర్వంసహలో
    గర్వము ఖర్వము కాగా
    సర్వజ్ఞత్వమ్ము నంద జాలునె గూగుల్ ?

    ( శర్వుడు - ఈశ్వరుడు ; సర్వంసహ - భూమి ; ఖర్వము -శూన్యము)

    రిప్లయితొలగించండి
  18. సర్వము నాకే తెలుసని
    గర్విత మతి గాగ నీవు కలలు గనకు మా
    ఉర్విని నీ కె య్యెడ లను
    సర్వ జ్ఞ త్వ మ్ము నంద జాలునె గూగుల్?

    రిప్లయితొలగించండి


  19. సర్వంబ్రహ్మమయమ్ము కాని స్థలమున్ స్థాపింప వీలౌనకో?
    నిర్వాణమ్మును సత్యశోధనను మున్నెవ్వారు సాధించిరో
    గర్వంబున్ గొని? బుద్ధి జీవులకు ధిక్కారమ్ములేలన్ సుమా!
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. సర్వరు బ్రతుకుగ సాగుచు
    సర్వము నాయందె కలదు సరగున రండని
    గర్వమున పలుక సరియా?
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      రెండవ పాదం చివర గణభంగం.అక్కడ సుగుణం కాని గగం కాని ఉండాలి

      తొలగించండి
  21. కందం
    సర్వజ్ఙత్వము శౌరికి
    శర్వునకు నలువకు నమరి సాధ్యమ్మయ్యెన్
    నిర్వాకము మనుజునిదన
    సర్వజ్ఙత్వమ్ము నందఁ జాలునె గూగుల్?

    రిప్లయితొలగించండి
  22. గర్వమధాందులు బల్కిరి
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్
    సర్వులు పలుకగ నెంతురు
    సర్వము విజ్ఞానమంత సత్వరమిచ్చున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఖర్వాటుడ వైతివి గదా
      “సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్”
      ఖర్వపు సందేహమిదియ
      విశ్వ జ్ఞానమొక చోట పెట్ట గుదరదే !

      తొలగించండి
  23. శర్వాజ్ఞనుసర్వంసహ
    సర్వోత్కృష్టార్థదంబుసాధ్యంబయ్యెన్
    సర్వజ్ఞునియెట్టయెదుట
    *"సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్"*

    రిప్లయితొలగించండి
  24. సర్వావస్థలయోగసాధననుసాక్షాద్దక్షిణామూర్తులౌ
    సర్వోత్కృష్టమనంతచింతననువిశ్వశ్శ్రేయమందించరే
    సర్వానర్థకకారకంబలసులన్సాధించ దౌర్భాగ్యమే
    *"సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్"*

    రిప్లయితొలగించండి
  25. మర్వకు సర్వజ్ఞుం డన
    శర్వుండే జగతి యందు సాధ్యమె ధరలో
    నేర్వగఁ బర హృదయమ్ముల
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్?

    రిప్లయితొలగించండి
  26. నేర్వ దలంచిన వెల్లయు
    నుర్వి జనాళికి గఱపెడి యొజ్జ యటంచున్
    గర్వముతో చెలరేగగ,
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్

    రిప్లయితొలగించండి
  27. శార్దూలవిక్రీడితము
    నిర్వాకమ్మది మానవాళి పరమై నేర్పున్ గడించంగ సూ!
    సర్వమ్మున్ దగనిండియుండె ననుచున్ సాంబున్జగమ్మెర్గినన్
    శర్వున్దైన విలాసమున్ గనక తా సాధ్యమ్మశోధ్యమ్మనెన్
    సర్వజ్ఙత్వము గూగులందఁ గలదే శాస్త్రీ విచారించినన్?

    రిప్లయితొలగించండి
  28. చర్వణచర్వితమగునటు
    సర్వముదాదీర్చుచుండుసందేహములన్
    నేర్వగజేయుటచేతను
    సర్వఙ్ఞత్వమ్మునందజాలునెగూగుల్

    రిప్లయితొలగించండి
  29. సర్వజ్ఞుండను వాడొకొండె హరి విశ్వంబందు నీక్షించ, నే
    చార్వాకుండన గూగులందు కలవే సర్వజ్ఞధౌరేయముల్
    నిర్వార్యాఖిలసృష్టిరక్షణలయల్ నిక్కంబు కాదట్టు, లా
    సర్వజ్ఞత్వము గూగు లందుఁగలదే శాస్త్రీ విచారించినన్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  30. మైలవరపు వారి పూరణ

    ఉర్విన్ మానవనిర్మింతంబయినదై యూహింపలేనట్టిదై
    సర్వార్థమ్ములఁ జూపగల్గినను నశ్యంబే కదా! ధీమణుల్
    పూర్వంబిచ్చిన జ్ఞానభాగమును దెల్పున్., భవ్యమైనట్టి యా
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  31. ఇద్దరు ప్రాచీనకవులు ఆకాశమార్గంలో నేటి భూమిని చూసి సంభాషించుకుంటున్నారు
    శా.
    "సర్వజ్ఞుల్ జనపాలులంచు గొలువన్ శంకింపలేదప్పుడున్ "
    ఉర్విన్ నేటి సభాస్థలుల్,దరగతుల్ యూహింపకున్నట్టివే !
    నిర్వాహంబులు యన్ని నొక్కయుదుటన్ నిత్యప్రపంచంబునన్
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే !శాస్త్రీ విచారించినన్
    ------ శ్రీరామ్

    రిప్లయితొలగించండి
  32. మ:

    పూర్వమ్మందున జ్ఞాన మబ్బెసమునై పుణ్యంబుగా నెంచగన్
    సర్వజ్ఞున్డగు వాగ్మి జేర సతమున్ సాఫల్యమై నొప్పగన్
    సర్వావస్థలయందు నేడు తృటినున్ సర్వంబు ముందుంచగన్
    సర్వజ్ఞత్వము గూగు లంద గలదే శాస్త్రీ విచారించగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. సర్వజ్ఞుం డనఁ జెల్లును
    శర్వునకుం దక్కి నట్టి సర్వులు కారే
    సర్వము మానవ సృష్టము
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్


    ఉర్వీవాసుల సూరి పామరులు సద్యోబుద్ధి విద్యా మహా
    పర్వక్షిప్త వివేక నైపుణిని సర్వజ్ఞత్వ హీనాత్ములే
    సర్వుల్ వారలు వ్రాయ నందు సతమున్ సత్యంబు లెక్కించినన్
    సర్వజ్ఞత్వము గూగు లందఁ గలదే శాస్త్రీ విచారించినన్

    రిప్లయితొలగించండి
  34. సర్వఙ్ఞత్వముగూగులందగలదేశాస్త్రీవిచారించినన్
    నర్వాచీనపువిద్యలన్నిటినిదాయార్షమ్ముమూలంబునే
    సర్వంజూచుచువస్తుజాలమునుదాశాస్త్రోక్తముంజెప్పుటౌ
    సర్వఙ్ఞత్వమునొందుగూగులుగదాసందేహమేలాయికన్

    రిప్లయితొలగించండి
  35. సర్వంబిందే కలదని
    నిర్వహణంబున గణించ నేటికి నిదియే
    సర్వోత్కృష్ట మ్ము మరియు
    సర్వజ్ఞత్వంబునంద జాలునె గూగుల్

    రిప్లయితొలగించండి
  36. శర్వుండే గద యన్నిలోకములలో సర్వజ్ఞుడంచెంచినన్
    పూర్వమ్మందున మానవుల్గొనిన సంపూర్ణంపు జ్ఞానమ్ముతో
    నుర్విన్మానవ నిర్మితమ్మయిన యా యుత్పత్తులన్ చూచినన్
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్ ?

    రిప్లయితొలగించండి
  37. సర్వం బెరుగుదు నేనను
    గర్వము విడనాడి శర్వు ఘనత నెరుంగన్
    నిర్వాణము నొందిన గురు
    సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్

    రిప్లయితొలగించండి