"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:బంధమ్మందున త్రోసి వైరులనహో బ్రహ్మాండమౌ తీరునన్రంధిన్ జేయుచు రాజకీయముననున్ రాకాసిగా మారుచున్గాంధీ వంశమునందు పుట్టకనయో గమ్మత్తుగా పేరుకౌ గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదాబంధము = చెఱ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
* పుట్టక భళా
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
సమస్య :గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా (స్వతంత్రులమైన మనం ఒళ్లు మరచి అతితెలివితో జాతిపితనే వ్యాఖ్యానిస్తే..)అంధంబయ్యెను భారతీయులకు న త్యంతంబు పాశ్చాత్యదు ర్గంధం బెంతయొ యాక్రమింప మదులన్ గాఢత్వమే పొంగె ; సౌ గంధంబున్ గొరజేసి పల్కదగునా గర్వోద్ధతిన్ స్వేచ్ఛమై -" గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా !"( సౌగంధ్యము - సత్స్వభావము ; కొరజేసి -తక్కువజేసి )
అధిక్షేపాత్మకమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)గాంధీ పార్టిని నాయకుండగుచు వే గల్లంతులన్ జేయుచున్బంధాలన్ కడు త్రెంచి వాగుచునయో "బాపూజి! బాపూజి!" యన్గంధమ్మున్ కడు పూసి మేనునను తా గర్వమ్ముగా కూయుచున్ "గాంధీజీ!";..తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
శా||అంధుల్ జూతురె సత్యమున్ నిలువగాఢాంధంబునన్ మూఢులైగాంధారిన్ వలె కళ్ళు గల్గియును మూర్ఖాగ్రేసరుల్ మూయు సద్గంధంబున్ గనునే వరాహమునెటన్ తద్రీతితో యోచనన్గాంధీజీ తనజీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదారోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వరాహ మెచటన్..." అనండి.
అంధుల రాజ్యమ్మున గర్వాంధులు పనిగొని ప్రచార మాధ్యమ్ములలోరంధిని బల్కెదరుగదాగాంధీ తనజీవితమున గల్లలె బల్కెన్ బందీయై నిజసత్యమార్గమున సంపాదించె స్వాతంత్ర్యమున్గాంధీజీ తనజీవితమ్మున; సదా కల్లల్ వచించెన్ గదానిందారోపణ జేసిగాడ్సె బహుదుర్నీతిజ్ఞుడన్ బేరుతోచంద్రుండిచ్చెడు వెన్నెలన్ గనకయేసంజన్ విలోకింతురేసంజ = మచ్చ , కళంకముద,ధ ప్రాసకు మన్నించండి 🙏🙏🙏
కందమున గర్వాఎధులకు బదులు కామాంధులుగా చదువ ప్రార్ధన!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.ద-ధ ప్రాస సరే... మరి నాల్గవ పాదంలో ప్రాస ?
ధన్యవాదములు గురుదేవా! సవరించిన పూరణబందీయై నిజసత్యమార్గమున సంపాదించె స్వాతంత్ర్యమున్గాంధీజీ తనజీవితమ్మున; సదా కల్లల్ వచించెన్ గదానిందారోపణ జేసిగాడ్సె బహుదుర్నీతిజ్ఞుడన్మందుల్ కూళలు మెత్తురే యవనిలో మాహాత్ములన్ బుద్ధిలో
మూడవపాదం చివరలో దుర్నీతిజ్ఞుడన్ బేరుతో 🙏🙏🙏
పాంధుడని మరచి పరిణయగంధముల వెఱచి తెగువరి గోముగ మసలన్బంధముల బడని రాహులగాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: స్కంధము తప్పుచు నెప్పుడు బంధము లెల్లను విడుచుచు పద్ధతి లేకన్ స్ఖంధనముగ ఎదురు గృహపు గాంధీ తన జీవితమున గల్లలె పలికెన్. ( స్కంధము= దారి; స్ఖంధనము= స్థిరము)
జరిపెగా నెన్నియో సత్యాగ్ర హములనుజీవిత మంతయు ,చేసెను పలుమార్లు శాంతి యుతపు మంతనములు,తన దేశప్రజలకై,విదేశ వస్తువులు వాడ వలదని తెలుపుచు భరత ప్రజలకు పిలుపునిచ్చె సత్యమేవచించె గాంధీ తన జీవితమున,కల్లలె పలికెననుచు తెలియక మాటలాడగ వలదు స్వాతంత్ర లక్ష్య సాధన కొరకు తన జీవితమును నష్ట పెట్టిన ఘను డాతడు, మ్రొక్కుము నమ్మ కముగననుచు పలికె నొకడు తన వనిత తోడ
చక్కని పూరణ. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: బంధంబుల్ విడనాడుచుండి సరియౌ వైనమ్ము చూపించనౌ స్కంధమ్మున్ సతతమ్ము పర్యటనముల్ సాగించు వాడౌచు నే రంధిన్ జూపని మాగృహమ్ము కెదురున్ లభ్యంబునౌవ్వాడునౌ గాంధీజీ తనజీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'లభ్యంబునౌవ్వాడు...'?
గురువుగారికి నమస్కారములు. ఆ పదాలను మార్చి వ్రాసాను. దయతో పరిశీలించండి. బంధంబుల్ విడనాడుచుండి సరియౌ వైనమ్ము చూపించనౌస్కంధమ్మున్ సతతమ్ము పర్యటనముల్ సాగించు వాడౌచు నేరంధిన్ జూపని మా పురమ్ము కెదురున్ గ్రామమ్ము నందుండునౌ గాంధీజీ తనజీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా1
వితముగ గాంధీ తన జీ వితమున గల్లలె పలికెన విరతము యనుటన్గతమును నేర్చని వానికివతనయ్యెను యీదినముల పతనమునొందన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విరతము+అనుటన్, వతనయ్యెను + ఈ' అన్నపుడు యడాగమం రాదు. "విరత మ్మనుటన్... నేర్వనివానికి... వతనయ్యెనె.." అనండి.
🙏🏽🙏🏽
గాంధీ బాటనువీడిరిగాంధీజీపేరుబలికి గాడినిదప్పన్గాంధీనిటుయన సబబాగాంధీతనజీవితమున కల్లలుబలికెన్+++++*++++++++++++++++++++రావెల పురుషోత్తమరావు
దక్షణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన గాంధీగారి తో ఆ నాటి భారతస్వతంత్రసమరయోధుడు....బంధీభూతమొ నర్చె భారతభువిన్ వ్యాపారకౌటిల్యగర్వాంధుండై బ్రిటిషర్దురంతకుడు నిర్వార్యాయుధానీకుడైసంధించెం బరతంత్రదుర్నయ మవిశ్వాసప్రథన్ వా డహోగాంధీజీ! తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!కంజర్ల రామాచార్య
మరో పూరణ..బంధీభూతము నైన భారతధరన్ స్వాతంత్ర్యవాంఛాప్తులైబంధుల్ గారె? కుటుంబమున్ విడుచుచున్ బ్రాణమ్ము లర్పించిరే?అంధున్ జేయుచు నేటి నాయకుడు విత్తార్థిన్ ప్రజన్ దోచగన్ గాంధీజీ! తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదాకంజర్ల రామాచార్య
రావెల వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు."గాంధీ నిటులన..." అనండి.*****కంజర్ల వారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
అంధులుగా జను లందరుబంధితులై చనిరి గాదె భారతమందున్గాంధారీ సుతు లౌచునుగాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."గాంధారీ సుతు లిట్లన.." అంటే అన్వయం బాగుంటుందేమో?
అంధత్వంబుననర్భకాధములుదేశౌన్నత్యమున్దూరినిర్బంధానన్ప్రతిపక్షనాయకులహో వాల్లభ్యమైగక్షతోస్కంధావారములందుగల్లుగొనుచున్సత్యాంతమైపల్కరే*"గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా"*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అంధులవలె నుప్పున వరిబంధనములు గూడవని సబబుగాదిదనెన్స్కంధముగన నేరీతినగాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్ ??వరి= పన్నుస్కంధము = దారి
గాంధీ తత్త్వమునెఱుగకనంధమతులు పలుకుచుందురన్యాయముగాసంధిప్రేలాపనముగగాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
అంధుల వలె నిజమెరుగక సంధి ప్రేలాపన ము చేయ జనతతు లిల గ ర్వాంధ త తో నిటు లనియెను గాంధీ తన జీవితమున గల్లలె పలికెన్
మైలవరపు వారి పూరణ బంధుప్రీతికినేని., హాస్యపుప్రలాపంబేని., మిత్రాళిసం..బంధాలాపనలేని సత్యమొకటే భాషించు మా గాంధి.. మో...హాంధీభూతుని మాటకున్ విలువనీయన్ పాపమౌనిట్లనన్గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అంధుడునైధనమదమునగంధమురెడ్డయ్యపలికెగరుణయెలేకన్ గాంధీగూరిచియిటులుగగాంధీతనజీవితమునగల్లలెపలికెన్
అంధతమస చిత్తులగుచుఅంధుల వలెనేది గనక యజ్ఞానము తోరంధిని చేయుచు ననిరిటు*గాంధీ తన జీవితమున కల్లలె పలికెన్
గంధము పూసి జనులఁ దా నంధుల నొనరించి పబ్బ మవ్వ కడపఁగన్ గాంధీ వాదుఁ డహో యీ గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్ బంధవ్రాతముఁ ద్రెంచె నెల్లరకు సంభావ్యుండు స్వాతంత్ర్య సత్సంధాతృ ప్రవరుండు మాను మన, రాజద్భారతంపుం జరిత్రాంధుం డైతివి “సత్య మేవ జయతే” యంచుం బ్రబోధించెనే,గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
"గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా"చిందింపంగ విషంబు మూర్ఖులిటు లిస్సీ గల్లలన్ బల్కినన్సందేహింపకు నమ్మబోకుమది వాచాలత్వమౌనంతియే;గాంధీజీ నిరతంబు నమ్మె గద నిష్కామంబు సత్యంబులన్
జిందాబాదని బల్కి రూప్యములపై జిత్రించి నీరూపమున్వందేమాతరమంచు నీప్రతిమనున్పాతించి కూడళ్ళలోసందుల్ గొందులకిచ్చి నీసమభిదన్సమ్మానముల్ జేయుచున్అంధీభూత జనమ్ము వేమరచి సత్యమ్మున్ విచారించగాగాంధీజీ! తనజీవితమ్మున సదాకల్లల్ వచించెన్ గదా!
Dry Day 2nd Octoberశా: మందున్ మానగ బాస జేసె విధినిన్ మర్యాద నీ రోజుగన్సందేహమ్మెటు లేదు రేయి కనగన్ సారాయి నాత్రమ్మునన్బంధమ్మేదియు నింక మాట నిలుపన్ పక్కాగ స్వచ్చంధమున్గాంధీజీ ; తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదావై. చంద్రశేఖర్
రంధిని సేసెను గాదె సంధించుచు సత్యమనెడు శరముల తోడన్ బాంధుడ వచింప నేలర గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
సంధింపంగను లేదు కత్తులను తా సంగ్రామమున్ జేయగా రంధిన్ జేసెను తాను సత్యమనె శస్త్రమ్మొక్కటిన్ బూని, హే పాంధుండా! తగదంటినోయి తమరీ వాక్యంబులన్ బల్కగన్ గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
సంధిన్చెన్గద సత్యమార్గమదిస్వాతంత్ర్యంబు కోసంబనన్,బంధుత్వంబది శాంతిమార్గమన సంపాదించెభద్రంబునైఅంధత్వంబున కల్లలౌనుగద సత్యాహింస లేనేటికిన్గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదాకొరుప్రోలు రాధాకృష్ణరావు
గాంధీభారతి దాశ్య శృంఖలములన్గావింప విచ్ఛేదనన్బందీయాయెను, యుద్యమంబులనుతాబాటించె సచ్ఛీలుడైగాంధీజీ తన జీవితమ్మున, సదాకల్లల్ వచించెన్ గదాగాంధీపేరునుపెట్టుకొన్ననొకదుష్కర్ముండహో దైవమా
అంధత్వంబునుదోడనత్యధికమోహావేశమున్ నొందుచున్గంధంరాజయయిట్లుబల్కెనునహోగారమ్ముబోనాడగాగాంధీజీతనజీవితమ్మునకల్లల్ వచించెన్ గదాగాంధీనాబడుసత్యపాలకుడికన్ గర్వమ్ముభూదేవికిన్
సింధుజ యనుసతి సుతుడగు గాంధిని పెంచెను ముదమున కనురెప్పవలెన్ పాంధుడ గాంచగ నేడా గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
కందంగంధమనిరి స్వేచ్ఛను! దుర్గంధపుటవినీతి పొరలె ప్రభువుల్ నిత్యమ్మంధమున నుంచి దోచిరె!గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్! !శార్దూలవిక్రీడితముఅంధంబావులు గాక పంప మనమీ యాంగ్లేయులన్, నిత్య సౌగంధంబుల్ విరబూయు స్వేచ్ఛననిరే? కాంచంగ దుర్నీతి దుర్గంధంబుల్ భరతావనిన్ జెలఁగె స్వార్థంబెంచఁగా నేలికల్! గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!!
చాలా మంచి భావము, చక్కని పూరణ
ఆర్యా!ధన్యవాదములు
గాంధీ కులమునొక నలుసుబంధమున కలిగిన చాలు పార్టీ నిలచున్అంధత తీరుననగ నాగాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
సింధూబాయికి పుట్టె నంగభవుడా చిన్నారినిన్ బ్రేమతో గాంధీజీయని పేరుతో పిలుచుచున్ గారంబుగా పెంచగన్ బంధుత్వమ్ముల కాలరాసెనతడో పాపాత్ముడై మూర్ఖుడీ గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
బంధమ్మందున త్రోసి వైరులనహో బ్రహ్మాండమౌ తీరునన్
రంధిన్ జేయుచు రాజకీయముననున్ రాకాసిగా మారుచున్
గాంధీ వంశమునందు పుట్టకనయో గమ్మత్తుగా పేరుకౌ
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
బంధము = చెఱ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండి* పుట్టక భళా
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిగాంధీజీ తన జీవితమ్మున సదా
కల్లల్ వచించెన్ గదా
(స్వతంత్రులమైన మనం ఒళ్లు మరచి అతితెలివితో జాతిపితనే వ్యాఖ్యానిస్తే..)
అంధంబయ్యెను భారతీయులకు న
త్యంతంబు పాశ్చాత్యదు
ర్గంధం బెంతయొ యాక్రమింప మదులన్
గాఢత్వమే పొంగె ; సౌ
గంధంబున్ గొరజేసి పల్కదగునా
గర్వోద్ధతిన్ స్వేచ్ఛమై -
" గాంధీజీ తన జీవితమ్మున సదా
కల్లల్ వచించెన్ గదా !"
( సౌగంధ్యము - సత్స్వభావము ; కొరజేసి -
తక్కువజేసి )
అధిక్షేపాత్మకమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
గాంధీ పార్టిని నాయకుండగుచు వే గల్లంతులన్ జేయుచున్
బంధాలన్ కడు త్రెంచి వాగుచునయో "బాపూజి! బాపూజి!" యన్
గంధమ్మున్ కడు పూసి మేనునను తా గర్వమ్ముగా కూయుచున్
"గాంధీజీ!";..తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిశా||
రిప్లయితొలగించండిఅంధుల్ జూతురె సత్యమున్ నిలువగాఢాంధంబునన్ మూఢులై
గాంధారిన్ వలె కళ్ళు గల్గియును మూర్ఖాగ్రేసరుల్ మూయు స
ద్గంధంబున్ గనునే వరాహమునెటన్ తద్రీతితో యోచనన్
గాంధీజీ తనజీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వరాహ మెచటన్..." అనండి.
అంధుల రాజ్యమ్మున గ
రిప్లయితొలగించండిర్వాంధులు పనిగొని ప్రచార మాధ్యమ్ములలో
రంధిని బల్కెదరుగదా
గాంధీ తనజీవితమున గల్లలె బల్కెన్
బందీయై నిజసత్యమార్గమున సంపాదించె స్వాతంత్ర్యమున్
గాంధీజీ తనజీవితమ్మున; సదా కల్లల్ వచించెన్ గదా
నిందారోపణ జేసిగాడ్సె బహు
దుర్నీతిజ్ఞుడన్ బేరుతో
చంద్రుండిచ్చెడు వెన్నెలన్ గనకయే
సంజన్ విలోకింతురే
సంజ = మచ్చ , కళంకము
ద,ధ ప్రాసకు మన్నించండి 🙏🙏🙏
కందమున
తొలగించండిగర్వాఎధులకు బదులు కామాంధులుగా చదువ ప్రార్ధన!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిద-ధ ప్రాస సరే... మరి నాల్గవ పాదంలో ప్రాస ?
ధన్యవాదములు గురుదేవా! సవరించిన పూరణ
తొలగించండిబందీయై నిజసత్యమార్గమున సంపాదించె స్వాతంత్ర్యమున్
గాంధీజీ తనజీవితమ్మున; సదా కల్లల్ వచించెన్ గదా
నిందారోపణ జేసిగాడ్సె బహు
దుర్నీతిజ్ఞుడన్
మందుల్ కూళలు మెత్తురే యవనిలో మాహాత్ములన్ బుద్ధిలో
మూడవపాదం చివరలో
తొలగించండిదుర్నీతిజ్ఞుడన్ బేరుతో
🙏🙏🙏
పాంధుడని మరచి పరిణయ
రిప్లయితొలగించండిగంధముల వెఱచి తెగువరి గోముగ మసలన్
బంధముల బడని రాహుల
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్కంధము తప్పుచు నెప్పుడు
బంధము లెల్లను విడుచుచు పద్ధతి లేకన్
స్ఖంధనముగ ఎదురు గృహపు
గాంధీ తన జీవితమున గల్లలె పలికెన్.
( స్కంధము= దారి; స్ఖంధనము= స్థిరము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజరిపెగా నెన్నియో సత్యాగ్ర హములను
రిప్లయితొలగించండిజీవిత మంతయు ,చేసెను పలు
మార్లు శాంతి యుతపు మంతనములు,తన
దేశప్రజలకై,విదేశ వస్తు
వులు వాడ వలదని తెలుపుచు
భరత ప్ర
జలకు పిలుపునిచ్చె సత్యమేవ
చించె గాంధీ తన జీవితమున,కల్లలె పలికెననుచు తెలియక మాట
లాడగ వలదు స్వాతంత్ర లక్ష్య సాధ
న కొరకు తన జీవితమును నష్ట పెట్టి
న ఘను డాతడు, మ్రొక్కుము నమ్మ కముగ
ననుచు పలికె నొకడు తన వనిత తోడ
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబంధంబుల్ విడనాడుచుండి సరియౌ వైనమ్ము చూపించనౌ
స్కంధమ్మున్ సతతమ్ము పర్యటనముల్ సాగించు వాడౌచు నే
రంధిన్ జూపని మాగృహమ్ము కెదురున్ లభ్యంబునౌవ్వాడునౌ
గాంధీజీ తనజీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లభ్యంబునౌవ్వాడు...'?
గురువుగారికి నమస్కారములు. ఆ పదాలను మార్చి వ్రాసాను. దయతో పరిశీలించండి.
తొలగించండిబంధంబుల్ విడనాడుచుండి సరియౌ వైనమ్ము చూపించనౌ
స్కంధమ్మున్ సతతమ్ము పర్యటనముల్ సాగించు వాడౌచు నే
రంధిన్ జూపని మా పురమ్ము కెదురున్ గ్రామమ్ము నందుండునౌ
గాంధీజీ తనజీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా1
వితముగ గాంధీ తన జీ
రిప్లయితొలగించండివితమున గల్లలె పలికెన విరతము యనుటన్
గతమును నేర్చని వానికి
వతనయ్యెను యీదినముల పతనమునొందన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విరతము+అనుటన్, వతనయ్యెను + ఈ' అన్నపుడు యడాగమం రాదు. "విరత మ్మనుటన్... నేర్వనివానికి... వతనయ్యెనె.." అనండి.
🙏🏽🙏🏽
తొలగించండిగాంధీ బాటనువీడిరి
రిప్లయితొలగించండిగాంధీజీపేరుబలికి గాడినిదప్పన్
గాంధీనిటుయన సబబా
గాంధీతనజీవితమున కల్లలుబలికెన్
+++++*++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
దక్షణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన గాంధీగారి తో ఆ నాటి భారతస్వతంత్రసమరయోధుడు....
తొలగించండిబంధీభూతమొ నర్చె భారతభువిన్ వ్యాపారకౌటిల్యగ
ర్వాంధుండై బ్రిటిషర్దురంతకుడు నిర్వార్యాయుధానీకుడై
సంధించెం బరతంత్రదుర్నయ మవిశ్వాసప్రథన్ వా డహో
గాంధీజీ! తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!
కంజర్ల రామాచార్య
మరో పూరణ..
తొలగించండిబంధీభూతము నైన భారతధరన్ స్వాతంత్ర్యవాంఛాప్తులై
బంధుల్ గారె? కుటుంబమున్ విడుచుచున్ బ్రాణమ్ము లర్పించిరే?
అంధున్ జేయుచు నేటి నాయకుడు విత్తార్థిన్ ప్రజన్ దోచగన్
గాంధీజీ! తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
కంజర్ల రామాచార్య
రావెల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గాంధీ నిటులన..." అనండి.
*****
కంజర్ల వారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
అంధులుగా జను లందరు
రిప్లయితొలగించండిబంధితులై చనిరి గాదె భారతమందున్
గాంధారీ సుతు లౌచును
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గాంధారీ సుతు లిట్లన.." అంటే అన్వయం బాగుంటుందేమో?
అంధత్వంబుననర్భకాధములుదేశౌన్నత్యమున్దూరిని
రిప్లయితొలగించండిర్బంధానన్ప్రతిపక్షనాయకులహో వాల్లభ్యమైగక్షతో
స్కంధావారములందుగల్లుగొనుచున్సత్యాంతమైపల్కరే
*"గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా"*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅంధులవలె నుప్పున వరి
రిప్లయితొలగించండిబంధనములు గూడవని సబబుగాదిదనెన్
స్కంధముగన నేరీతిన
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్ ??
వరి= పన్ను
స్కంధము = దారి
గాంధీ తత్త్వమునెఱుగక
రిప్లయితొలగించండినంధమతులు పలుకుచుందురన్యాయముగా
సంధిప్రేలాపనముగ
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
అంధుల వలె నిజమెరుగక
రిప్లయితొలగించండిసంధి ప్రేలాపన ము చేయ జనతతు లిల గ
ర్వాంధ త తో నిటు లనియెను
గాంధీ తన జీవితమున గల్లలె పలికెన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిబంధుప్రీతికినేని., హాస్యపుప్రలాపంబేని., మిత్రాళిసం..
బంధాలాపనలేని సత్యమొకటే భాషించు మా గాంధి.. మో...
హాంధీభూతుని మాటకున్ విలువనీయన్ పాపమౌనిట్లనన్
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అంధుడునైధనమదమున
రిప్లయితొలగించండిగంధమురెడ్డయ్యపలికెగరుణయెలేకన్
గాంధీగూరిచియిటులుగ
గాంధీతనజీవితమునగల్లలెపలికెన్
రిప్లయితొలగించండిఅంధతమస చిత్తులగుచు
అంధుల వలెనేది గనక యజ్ఞానము తో
రంధిని చేయుచు ననిరిటు
*గాంధీ తన జీవితమున కల్లలె పలికెన్
గంధము పూసి జనులఁ దా
రిప్లయితొలగించండినంధుల నొనరించి పబ్బ మవ్వ కడపఁగన్
గాంధీ వాదుఁ డహో యీ
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
బంధవ్రాతముఁ ద్రెంచె నెల్లరకు సంభావ్యుండు స్వాతంత్ర్య స
త్సంధాతృ ప్రవరుండు మాను మన, రాజద్భారతంపుం జరి
త్రాంధుం డైతివి “సత్య మేవ జయతే” యంచుం బ్రబోధించెనే,
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
"గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా"
రిప్లయితొలగించండిచిందింపంగ విషంబు మూర్ఖులిటు లిస్సీ గల్లలన్ బల్కినన్
సందేహింపకు నమ్మబోకుమది వాచాలత్వమౌనంతియే;
గాంధీజీ నిరతంబు నమ్మె గద నిష్కామంబు సత్యంబులన్
జిందాబాదని బల్కి రూప్యములపై జిత్రించి నీరూపమున్
రిప్లయితొలగించండివందేమాతరమంచు నీప్రతిమనున్
పాతించి కూడళ్ళలో
సందుల్ గొందులకిచ్చి నీసమభిదన్
సమ్మానముల్ జేయుచున్
అంధీభూత జనమ్ము వేమరచి సత్యమ్మున్ విచారించగా
గాంధీజీ! తనజీవితమ్మున సదాకల్లల్ వచించెన్ గదా!
Dry Day 2nd October
రిప్లయితొలగించండిశా:
మందున్ మానగ బాస జేసె విధినిన్ మర్యాద నీ రోజుగన్
సందేహమ్మెటు లేదు రేయి కనగన్ సారాయి నాత్రమ్మునన్
బంధమ్మేదియు నింక మాట నిలుపన్ పక్కాగ స్వచ్చంధమున్
గాంధీజీ ; తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరంధిని సేసెను గాదె
రిప్లయితొలగించండిసంధించుచు సత్యమనెడు శరముల తోడన్
బాంధుడ వచింప నేలర
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
సంధింపంగను లేదు కత్తులను తా సంగ్రామమున్ జేయగా
రిప్లయితొలగించండిరంధిన్ జేసెను తాను సత్యమనె శస్త్రమ్మొక్కటిన్ బూని, హే
పాంధుండా! తగదంటినోయి తమరీ వాక్యంబులన్ బల్కగన్
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
సంధిన్చెన్గద సత్యమార్గమదిస్వాతంత్ర్యంబు కోసంబనన్,
రిప్లయితొలగించండిబంధుత్వంబది శాంతిమార్గమన సంపాదించె
భద్రంబునై
అంధత్వంబున కల్లలౌనుగద సత్యాహింస లేనేటికిన్
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా
కొరుప్రోలు రాధాకృష్ణరావు
గాంధీభారతి దాశ్య శృంఖలములన్గావింప విచ్ఛేదనన్
రిప్లయితొలగించండిబందీయాయెను, యుద్యమంబులనుతాబాటించె సచ్ఛీలుడై
గాంధీజీ తన జీవితమ్మున, సదాకల్లల్ వచించెన్ గదా
గాంధీపేరునుపెట్టుకొన్ననొకదుష్కర్ముండహో దైవమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంధత్వంబునుదోడనత్యధికమోహావేశమున్ నొందుచున్
రిప్లయితొలగించండిగంధంరాజయయిట్లుబల్కెనునహోగారమ్ముబోనాడగా
గాంధీజీతనజీవితమ్మునకల్లల్ వచించెన్ గదా
గాంధీనాబడుసత్యపాలకుడికన్ గర్వమ్ముభూదేవికిన్
సింధుజ యనుసతి సుతుడగు
రిప్లయితొలగించండిగాంధిని పెంచెను ముదమున కనురెప్పవలెన్
పాంధుడ గాంచగ నేడా
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
కందం
రిప్లయితొలగించండిగంధమనిరి స్వేచ్ఛను! దు
ర్గంధపుటవినీతి పొరలె ప్రభువుల్ నిత్య
మ్మంధమున నుంచి దోచిరె!
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్! !
శార్దూలవిక్రీడితము
అంధంబావులు గాక పంప మనమీ యాంగ్లేయులన్, నిత్య సౌ
గంధంబుల్ విరబూయు స్వేచ్ఛననిరే? కాంచంగ దుర్నీతి దు
ర్గంధంబుల్ భరతావనిన్ జెలఁగె స్వార్థంబెంచఁగా నేలికల్!
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా!!
చాలా మంచి భావము, చక్కని పూరణ
తొలగించండిఆర్యా!ధన్యవాదములు
తొలగించండిగాంధీ కులమునొక నలుసు
రిప్లయితొలగించండిబంధమున కలిగిన చాలు పార్టీ నిలచున్
అంధత తీరుననగ నా
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్
సింధూబాయికి పుట్టె నంగభవుడా చిన్నారినిన్ బ్రేమతో
రిప్లయితొలగించండిగాంధీజీయని పేరుతో పిలుచుచున్ గారంబుగా పెంచగన్
బంధుత్వమ్ముల కాలరాసెనతడో పాపాత్ముడై మూర్ఖుడీ
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా