13, అక్టోబర్ 2020, మంగళవారం

సమస్య - 3514

 14-10-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని"

(లేదా...)

"మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్"

75 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  బలుపౌ బిర్యని కుమ్మగన్ వడివడిన్ వాలంగతా నిద్రనున్
  తలనున్ త్రెంచెడు చోరునున్ గనగనున్ దాక్షిణ్యమే లేకయే
  కలనున్ గానుచు భీకరంబుగనయో కంగారునన్;... గావగన్;...
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్;..దత్సతిన్

  రిప్లయితొలగించండి
 2. పసువుల‌కు గడ్డి కోయుచు‌ పడతి నొక్క

  పామును గని‌ బెదరి నేల‌ పడగ, దాని

  గాంచిన మగడు చెట్టుపై నుంచి‌ వడిగ

  దూకుచు తన మొలను గత్తి‌ దూసి పొడిచె,

  సతిని‌ కరువ బోయిన పాము‌ చచ్చి పడెను

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Bollywood Othello:

  కులమున్ గోత్రము నెంచకన్ విడుచుచున్ ఘోరంబుగా సిగ్గునున్
  తలనున్ వాల్చుచు హృత్తునన్ నగవుచున్ తాదాత్మ్యమున్ జెందుచున్
  విలనున్ ప్రీతిని కౌగిలించగనయో బీభత్సమున్ జేయుచున్
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్

  రిప్లయితొలగించండి
 4. అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ యత్నం..

  *ఆ వె*

  వైద్య వృత్తి జేయు పతియొక దినమున
  తాను వేగిరమున తప్పు జేసె
  పురుడు బోయ దలచి ఉదరము చేబట్టి
  *"మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏😊

  రిప్లయితొలగించండి
 5. సమస్య :
  మొలను గత్తి దూసి పొడిచె సతిని

  ( భార్యాభర్తల చిలిపి కలహం )
  ఆటవెలది
  ...............
  ప్రక్క కొట్టు నుండి ప్లాస్టికు కత్తిని
  అప్పడాలకర్ర నాలుమగలు
  కొనిరి ; కర్రతోడ కొట్ట పతి నగుచు
  మొలను గత్తి దూసి పొడిచె సతిని .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "తమలపాకు తొడిమతో నువ్వట్లా అంటే తలుపు చెక్కతో నేనిట్లా అంటా" అన్నట్టున్నది. బాగున్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ధనము నాహరించు దస్యుని నాధుడు
  మొలను గత్తిదూసి పొడిచె; సతిని
  పట్టి చేరదీసి భయమును పోజేసి
  నిలిచె ధైర్యమెంచి నిబ్బరమున.

  రిప్లయితొలగించండి
 7. వన విహార మందు భర్తయే వేగాన
  మొలనుఁ గత్తి దూసి పొడిచె, సతిని
  సంహరింపబోవు శార్దూలమునువేగ
  రక్ష జేసె నతడు రమణి నపుడు.

  రిప్లయితొలగించండి
 8. తలలో మల్లెలు హేమభూషణములన్ తాఁ దాల్చి ప్రాణేశుతో
  నెలదోటన్ విహరించు వేళ నటనో హీరమ్మునే గాంచగన్
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్, మోదంబునన్ దత్సతిన్
  దలగాచెన్ ఘన వీరుడౌ పతియె యుద్యానమ్ములో నత్తఱిన్

  రిప్లయితొలగించండి
 9. ఇలలో పూరుషజాతికిన్ సతులగున్
  నీర్ష్యా విమోహంబులున్
  తలపుల్ వీడుచు నిగ్రహించి మనమున్ దాదాత్మ్యమున్ బొందుచున్
  విలువౌ నాత్మను బొందగా దనియుచున్ పీయూషపాథోధిలో
  మొలలో కత్తినిదీసి ఱేడు పొడిచెన్
  మోదంబునన్ దత్సతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సతులపై" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. సవరణతో

   ఇలలో పూరుషజాతికిన్ సతియగు
   న్నింపైన మోహంబదే
   తలపుల్ వీడుచు నిగ్రహించి మనమున్ దాదాత్మ్యమున్ బొందుచున్
   విలువౌ నాత్మను బొందగా దనియుచున్ పీయూషపాథోధిలో
   మొలలో కత్తినిదీసి ఱేడు పొడిచెన్
   మోదంబునన్ దత్సతిన్

   ధన్యవాదములు గురుదేవా! సవరించితిని!
   🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 10. కె.వి.యస్. లక్ష్మి:

  పట్టగు విదమొంది బాగుగ వీధిని
  నాటకము జరిగెడు నపుడు భర్త
  కలహమాడు నట్టి కాండమ్ము పండించ
  మొలను కత్తిదూసి పొడిచె సతిని.

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పొలుపున్నొప్పెడు తోటలో తిరుగుచున్ పొంగారు దేవేరినిన్
  పులిదాజూచి రయ్మముగా నచటకున్ పోబోవ దానిన్వడిన్
  మొలలో కత్తినిదూసి ఱేడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్
  తలగాచెన్ సమయోచితంబగు పసన్ తళ్కొందుచున్ గొప్పగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పొలుపున్+ఒప్పెడు' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు వర్జించండి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు. మీరన్నట్లు ఇకనుండి ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జిస్తాను. ధన్యవాదములు.

   తొలగించండి
 12. చెలరేగెన్ గడు ధూర్తుడై యొకడు దుశ్చేష్టన్ మహారాణిపై
  సలుపన్ కామ వికార సంజ్ఞలను రోషావేశమందుగ్రుడై
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్; మోదంబునన్ దత్సతిన్
  నిలిపెన్ అంతిపురంపు గౌరవము రాణిల్లంగ పాలించుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిలిపెన్+అంతిపురంపు=నిలిపె నంతిపురంపు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.

   తొలగించండి
  2. 🙏 సవరించిన పాఠము

   చెలరేగెన్ గడు ధూర్తుడై యొకడు దుశ్చేష్టన్ మహారాణిపై
   సలుపన్ కామ వికార సంజ్ఞలను రోషావేశమందుగ్రుడై
   మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్; మోదంబునన్ దత్సతిన్
   నిలిపెన్ గారవమొప్ప నంతిపురి రాణిల్లంగ పాలించుచున్

   తొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  కలిమింగల్గు నృపాలునిన్ వలచి పైకంబున్ హరింపంగ., కౌ..
  గిలినిత్తున్దరిజేరరమ్మనుచు., యాగీ చేయనెంచంగ కో...
  మలి పన్నాగమెరింగి., వంచకిని చంపన్ తప్పుకాదంచునా
  మొలలో కత్తిని దూసి ఱేడు పొడిచెన్ మోదమ్మునన్ తత్సతిన్ !!

  (యాగీ పదం ... మాండలికమైనను సార్థకమని ప్రయోగించితిని.)

  ( మోదమ్మునన్.... ముందుగానే తెలుసుకొన్నాననే సంతోషముతో..)

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 14. బోయని గుడిసెపయి పులి యొకటి దుముక
  మొలనుఁ గత్తి దూసి పొడిచె , సతిని
  యాదు గొనగ , నంత నామె పతినిగాంచి
  పొంగిపోయె మదిని ముదము తోడ

  రిప్లయితొలగించండి
 15. కలహ మెపుడు లేని కాపుర మ్మైనచో
  యెంతొ చక్కగుండు నెంతొ సుఖము
  కల్ల యయ్యె బ్రతుకు కలగాంచి యొకరాత్రి
  మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కాపురమ్మైనచో నెంతొ చక్కనుండు..." అనండి.

   తొలగించండి


 16. ధైర్యవంతుడతడు దస్యుని వెనువెంట
  మొలనుఁ గత్తి దూసి పొడిచె, సతిని
  గాచె! తృటిని తప్పె ఘాతము! పరికించి
  నట్టి జనులు మెచ్చి నారు మగని!


  కథ కంచికి :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఒక్కొక్కరికి ఒక అలవాటన్నట్లు ఈయన గారికి సంతోషమైన కబురు విన్నపుడంతా తన మొలనుఁగల యొఱలోని కత్తిఁదీసి తిరిగి దానిలోకే దూయటం అలవాటు. లోకో భిన్న రుచి: యని అన్నారందుకే నేమో...

  ఆటవెలది
  కలుగ సంతసమ్ము ఖడ్గమ్ము నొఱలోనఁ
  దీసి తిరిగి దూయు తీరు నబ్బ
  ముదిత శుభముఁ బలుక ముమ్మారు లొఱలోన
  మొలనుఁ గత్తి దూసి పొడిచె ఱేఁడు!


  మత్తేభవిక్రీడితము

  పులకల్ రేగఁగఁ దీసి దూయ నొఱలో మోదాన ఖడ్గమ్మ. .దే
  యలవాటయ్యె శుభమ్ములన్ వినుచు నాహ్లాదించు తీరన్నటుల్
  తెలుపన్ గర్భము దాల్చితంచు, నభినందించంగ, ముమ్మారొఱన్
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్!.,దత్సతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   కాని... పొడిచె అన్నదాని ఒరలో పెట్టడ మనే అర్థం ?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. గురువుగారూ! ఒఱలో దూరుస్తూ ఆనందం ఎక్కువై యొఱ అడుగుభాగము తగిలి శబ్ధం వచ్చే విధంగా పొడవడం అని నా భావన.

   తొలగించండి
 18. చెలితోఁ గూడి సుఖించఁ గోరి వెడెలెన్ సింగారపుం దోటకున్
  ఖలు డచ్చోట బలాత్కరించగ సతిన్ కామాంధునిం గుప్తుడై
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్, మోదంబునన్ దత్సతిన్
  పలు భంగుల్ దమిఁ దేల్చెఁ దాన నట నింపారన్ విలాసమ్ములన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి


 19. కలలో దస్యుడు మీద దూకె! తృటిలో ఘాతమ్ము తప్పింపగా
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్; మోదంబునన్ దత్సతిన్
  భళిగాచెన్! పతి సేవ గాంచి మురిసెన్ ప్రాణేశ! చుంబించె ని
  ట్టలమై! స్వప్నము వీడె! తూగె కెడ జట్కాబండిలో జాయయే


  హమ్మయ్య! కత ఐపోయింది !  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. సమస్య :-
  "మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని"

  *ఆ.వె**

  భక్తి పెంచ గోరి బ్రహ్మము చెప్పిన
  మాటలన్ని జెప్పె మగనితోడ
  కాయమందు సురుల కక్కడు జూడగ
  మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని
  ....................✍️చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం అర్థం కాలేదు.

   తొలగించండి
  2. శరీరంలో దేవతలున్నారని వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పగా విన్న కక్కని భార్య భర్తతో చెప్పింది.ఆయన శరీరంలో దేవతలు ఎక్కడున్నారో చూద్దామని ఆమెను కత్తితో నరికాడు

   తొలగించండి
  3. కక్కడు అన్నది నామవాచకం అనుకోలేదు. అందుకే అర్థం కాలేదు. బాగుంది.

   తొలగించండి
 21. వన విహార మందు వఛ్చిన ముష్కరు
  మొలను కత్తి దూసి పొడిచె : సతిని
  రక్ష చేసి పతియు రాణింప నయ్యెడ
  భార్య పంచె తాను వలపు న పుడు

  రిప్లయితొలగించండి
 22. టీవినందుచూపెడి ఘటను లిట్టివే
  మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని
  ఎట్టికాలమొచ్చె ఎంచరె మంచిని
  భావిజనులతలచి బాగుకోరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "టీవియందు... ఘట్టము లిట్టివే.. ఎట్టి కాలమిద్ది..." అనండి.

   తొలగించండి
 23. తలలోనిండుగపూలమాలయెదలోధ్యానంబుశృంగారిపై
  యిలలోప్రేమనురంగరించితినినాయీడంతనీకోసమే
  వలపోభృంగునిపైనవాజజమునన్బాషాణమేజేర్చఁదా
  *మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "శృంగారిపై నిలలో..." అనండి.

   తొలగించండి
 24. ఱంకుజేయజూచి వెంకనకోపాన
  మొలనుగత్తిదూసి పొడిచెసతిని
  మందలించవలెను మంచిమాటలతోడ
  నంతెకానిపొడువ న్యాయమగునె?

  రిప్లయితొలగించండి
 25. భార్య మెడను యున్న బంగారు గొలుసును
  తస్కరింప జూడ తస్కరుండు
  మొలనుఁ కత్తి దూసి పొడిచె ,సతినిగావ
  పతియొకండు మిగుల ద్రుతము తోడ!!!

  రిప్లయితొలగించండి
 26. పొలము నందున పనులను పొలతి తాను
  చేయుచుండసర్పమొకటి చెంత చేర
  దానిని గని యామె పతియు తత్షణమ్మె
  దూకుచు తన మొలను కత్తి దూసి పొడిచె సతిని

  రిప్లయితొలగించండి
 27. చెలువమ్మొప్పెడి చిన్నదాని గని తా చేపట్టగా భార్యగా
  విలువల్ వీడి చరించుచున్ పదవిపై స్పీతంపు యాపేక్షతో
  పలుయత్నమ్ముల చేయుచుండ కని కోపమ్మంది శీఘ్రమ్ముగా
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్

  రిప్లయితొలగించండి
 28. సమరరంగమునకు సన్నద్ధుడై రాజు
  కలతనిదురయందు కలను గాంచె
  కృద్ధుడయ్యె పరుల కుటిలత్వమునుగాంచి
  మొలను గత్తి దూసి పొడిచె సతిని.

  రిప్లయితొలగించండి
 29. సమరరంగమునకు సన్నద్ధుడై రాజు
  కలతనిదురయందు కలను గాంచె
  కృద్ధుడయ్యె పరుల కుటిలత్వమునుగాంచి
  మొలను గత్తి దూసి పొడిచె సతిని.

  రిప్లయితొలగించండి
 30. సమరరంగమునకు సన్నద్ధుడై రాజు
  కలతనిదురయందు కలను గాంచె
  కృద్ధుడయ్యె పరుల కుటిలత్వమునుగాంచి
  మొలను గత్తి దూసి పొడిచె సతిని.

  రిప్లయితొలగించండి
 31. ఆ.వె.
  సతినిఁజూచితాను సరసమాడగనెంచి
  బొమ్మ కత్తిఁ దెచ్చి బూనిచేత
  కత్తిఁజూచి లేమ కలవర పడుచుండ
  మొలను కత్తి దూసి పొడిచె సతిని

  మ.
  వలపు క్రీడల కైనొకా నొకడు తేవ్రంబైన యాకాంక్షతో
  నెలతం గాంచివి లాససా రసకళానిర్మాణ పారంగుడై
  తలపన్ రబ్బరు కత్తినిండుగను చేతన్దాల్చి సంరంభుడై
  మొలలో కత్తినిదూసి ఱేడు పొడిచెంమోదంబుగా తత్సతిన్

  రిప్లయితొలగించండి
 32. చెప్ప నెంచి తేనిఁ జెప్పు వివరముగఁ
  జాల దిట్టు లనిన నేల శంక
  యెవ్వ రెందు నెప్పు డెవ్వాని పత్నిని?
  మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని


  ఇలలో ఱేఁ డనఁ బౌర రక్షణము లే యే వేళ లావశ్యక
  మ్ములొ వీక్షించుచు నుండఁగా వలెను గా ముమ్మాటికిన్ నిత్యముం
  జెలరేఁగం దమి దుండఁగీఁ డపుడు దా శీఘ్రంబ, రక్షించఁగా
  మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్, మోదంబునన్ దత్సతిన్

  రిప్లయితొలగించండి

 33. పిన్నక నాగేశ్వరరావు.

  కాటు వేయ బోవు కాలసర్పముఁ గాంచి
  మొలనుఁ గత్తి దూసి పొడిచె; సతిని
  కాచిన పతిని బిగి కౌగిలిలో జేర్చి
  ముద్దులిచ్చి సతియు మురిసి పోయె.

  (రెండవ పూరణము)
  భార్య తిరుగుచుండ పర పురుషుని తోడ
  భర్త మందలించి భంగపడగ
  నంతులేని కోప మావేశమున భర్త
  మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని.  రిప్లయితొలగించండి
 34. మొలలోగత్తినిదూసిఱేడుపొడిచెన్ మోదంబునన్ దత్సతిన్
  గలయోమాయయొయేమిటీరచనదాకత్తిన్ దూసెబెన్మిటిన్
  నిలలోనిట్లుగనుండునోజెపుమయోయేకాంబరాధీశుడా!
  నెలతిన్ జంపగరాదుగాభువినిదానేర్వండేభూపతుల్

  రిప్లయితొలగించండి
 35. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. భార్యా పీడితుడి ఆలోచన:

   మ:

   పులిలా చూపు, చివాట్లు నిత్యముగ, సంపూర్ణాతి తైతక్కలున్
   బలియై పోతిని పెండ్లిచేసుకొని సంభాళింప విన్యాసముల్
   కలలో నిట్లు విచారమెంచ నగునో కాపాడు కోనెంచగన్ !
   మొలలో కత్తిని దూసి రేడు పొడిచెన్ మోదంబునన్ తత్సతిన్

   వై.చంద్రశేఖర్

   తొలగించండి
 36. మంచితనమువీడిమసలుట తగదని
  సంచితముగనఘము నించునంచు
  హితముదెలుపనలుకహెచ్చిన పతియప్డు
  మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని

  రిప్లయితొలగించండి
 37. కాననంబులందు కఱకు రక్కసి డాసి
  మొలను కత్తి దూసిపొడిచె;సతిని
  కావనెంచి;రామ కార్యముల్ ఘనములౌ!
  నగుచు వీర లక్షణంబుఁజూపె.

  రిప్లయితొలగించండి