5, అక్టోబర్ 2020, సోమవారం

సమస్య - 3508

6-10-2020 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను"
(లేదా...)
"మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే"
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)

72 కామెంట్‌లు:

  1. తాపసుండిచ్చు మంత్ర సంధానగరిమ
    పామరుడు దివ్య శక్తి సంపాదనమున
    రాణకెక్కెను సర్వ సమ్రాట్టు వోలె
    'మేక మృగరాజునుంగాంచి మిడిసిపడెను'

    రిప్లయితొలగించండి
  2. సమస్య :
    మిడిసిపడెన్ మృగేంద్రు గని
    మేక భయం బిసుమంత లేకయే

    ( భారతదేశపు సరిహద్దుల గూర్చి తలతిక్క
    మాటల నాడుతున్న నేపాల్ దేశం )
    చంపకమాల
    ..................
    చిడిముడిపాటు లేక , చిరు
    సిగ్గును శూన్యము కాగ , చైనకున్
    మడుగుల నొత్తుచున్ , మనదు
    మైత్రిని వీడుచు , బుద్ధిహీనయై
    యెడపెడ " హద్దు త " ప్పనును
    నివ్విధి " నేపలుదేశమే " ; యిసీ !
    మిడిసిపడెన్ మృగేంద్రు గని
    మేక ; భయం బిసుమంత లేకయే .
    ( చిడిముడిపాటు - తొట్రుపాటు )

    రిప్లయితొలగించండి
  3. గొర్రెలగుంపును చంపడానికి తీసుకెల్తుంటే దారిలో circus కనబడింది.. అందులో ఒక సిమ్హమును అమానుషంగా హింసిస్తుంటే అది హుంకరిస్తుంటే దాని దుస్థితి చూసి ఈ మందలో ఒక మేక ఎగిసి పడింది

    చం||
    కడువిషమంబు మానవుని క్రౌర్యము జంతువు పట్ల లోకమున్!
    సుడుమును జంపివేయుటకుజూడ పథంబున సర్కసున్ మహా
    బిడియపు సింహహుంకృతులు విన్ననటన్ గని దానిదాస్యమున్
    మిడిసిపడెన్ మృగేంద్రు గని మేక భయంబిసుమంత లేకయే

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహా బిడియపు..' దుష్టసమాసం. "సర్కసందు పెన్ బిడియపు..." అందామా?

      తొలగించండి
  4. నేటి శంకరాభరణము వారి సనస్య

    మేక మృగరాజు నుంగాంచి మిడిసి పడెను

    నా పూరణ సీసములో


    రాజ సూయ యాగములో సింహము వంటి శ్రీకృష్ణుని గాంచి మేక లాంటి శిశుపాలుడు మిడిసి పడు సందర్భంలో


    పాలీయ వచ్చిన పడతిపై కెగసిని
    స్సిగ్గుగా చంపిన‌
    శీను డితడు

    నల్లని‌ పిల్లిలా నడయాడి పాలు వె
    న్నలు దొంగి లించిన నాచు గాదె,

    జలకము లాడు నాంచారుల
    నగ్న రూ
    పంబులు కాంచెడు పాపి యితడు,

    తల్లి సోదరుడను ధర్మమే
    తలచక
    నతనిని చంపిన
    హంతకుండు,

    పాండవాగ్రజా యని శిశు పాలుడు సభ

    లో వచించె, తరచి చూడ గా వనమున

    మేక మృగరాజును గాంచి మిడిసి పడెను

    యను పగిది నుండె గాయని ఘనులు పలికె


    నాచు = దొంగ
    శీనుడు = మూర్ఖుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేటరి యొక ఛాగిని గని వేసె శరము
      గాని పక్కన నిదురించు గజరిపువుకు
      దగలి మరణించగ దవకు తప్పెననుచు
      మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను

      ఛాగి = మేక

      తొలగించండి
    2. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలె'ను 'లా' అనరాదు. "పిల్లిగా/పిల్లియై" అనవచ్చు. 'పడెను+అను' అన్నపుడు యడాగమం రాదు. కర్తృపదం 'మునులు' బహువచనం, క్రియాపదం 'పలికె' ఏకవచనం. అన్వయం కుదరదు.

      తొలగించండి
    3. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. అయ్యరు జిలేబి మాటాడ గా జడవక,
    పిల్ల వాడయ్య చేతిని బెత్తము గని,
    మేఁక మృగరాజునుం గాంచి, మిడిసిపడెను
    కల చెదిరె మత్తు వీడెను కంది వర్య!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలాకాలం తర్వాత 'అయ్యరు' గారిని పద్యంలోకి లాక్కొచ్చారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీకు రోజుకో పద్యాన్ని అంకితమిచ్చే శాస్త్రి గారు 'ప్రెంచ్ లీవ్' తీసుకున్నారు.

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. గడఁగొని వేటగాడొక డగడ్తను ద్రవ్వె గజేంద్రుడందునం
      బడునని దల్చి యట్లకట! పాపఫలమ్మదొ! దుర్విపాకమో!
      యడవికి ఱేడు సింహమొక టందునఁ గూలి తపించె, నత్తరిన్
      మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అస్త్ర శస్త్రముల్ మరచిన యంగరాజు
    అనిని పార్ధుని చంపెదనని బలుపుగ
    మాటలాడి కూలుటదియ మదిని తోచె
    మేక మృగరాజునుంగాంచి మిడిసిపడెను.

    రిప్లయితొలగించండి
  8. మరో పూరణ

    సుడివడి బిట్టు మూర్చిలగ సోదరలక్ష్మణు డమ్ము వేటునన్
    మడిసెనొ యంచు రామడటఁ బంధురదుఃఖము నొంద నయ్యెడన్
    వడిఁగని మేఘనాథుడట ఫక్కున నవ్వెను మేలమాడుచున్,
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బెడగుగ తాను యుద్ధమున పేరగు నస్త్రములాడు శక్తినిన్
    పొడవడగించుకొంచును యపూర్వపు మాటలనెంచి పార్ధునిన్
    దొడరుచు కర్ణుడా యెడను దోరుట జూడగదోచె డెందమున్
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అడగించుకొంచును+అపూర్వపు= అడగించుకొంచును నపూర్వ...' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  10. ఆదిభట్ల సత్యనారాయణ

    అక్షరంబులు నేర్చిన యవనిలోన
    పండితుండౌనె కావ్యాల పఠన లేక
    మదిని దోచు వాచాలు మోము గనిన
    మేక మృగరాజునుంగాంచి మిడిసి పడియె


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం, యతిదోషం. సవరించండి.

      తొలగించండి
  11. పంజరమ్మున జంతువుల్ బంది యైన
    చోటి కరుదెంచి తిరుగుచు చోద్య ముగను
    మేక మృగరాజు ను o గని మిడిసి పడెను
    ధైర్యముగ తాను బాహ్యాన తనివి తీర

    రిప్లయితొలగించండి
  12. ఆదిభట్ల సత్యనారాయణ

    అక్షరంబులు నేర్చిన యవనిలోన
    పండితుండౌనె కావ్యాల పఠన లేక
    యిట్టి వాచాలు గానగా నింతె గాదె
    మేక మృగరాజునుంగాంచి మిడిసి పడియె

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులు జి. ప్రభాకర శాస్త్రి గారు కొంతకాలం ఫ్రెంచ్ లీవ్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారి సత్వర పునరాగమనాన్ని ఆకాంక్షిద్దాం.

    రిప్లయితొలగించండి
  14. ఎన్నికల పెద్ద పండగ మంచి రోజు
    మన్నిక గల నాయకులను మరువ రాదు
    నేడు ఓటరు వేలెత్తి నిక్కి నిలువ
    మేఁక మృగరాజునుం గాంచి మిడిసినట్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నికల పెద్ద పండగ మంచి రోజు
      పౌరు నేతకు దీవెన పొదుగు రోజు
      నేడు ఓటరు వేలెత్తి నిక్కి నిలువ
      మేఁక మృగరాజునుం గాంచి మిడిసినట్టు

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    3. ఎన్నికల పెద్ద పండగ యెప్పుడైన
      పౌరు నేతకు దీవెన పలుకు రోజు
      నాడు ఓటరు వేలెత్తి నిక్కి నిలువ
      మేఁక మృగరాజునుం గాంచి మిడిసినట్టు

      ధన్యవాదాలు, గురువర్యా 🙏🏻

      తొలగించండి
  15. ఒడయడునగ్రరాజ్రమునకొక్కడుదక్షుడురక్షకుండునె
    న్నడుగణియింపడీవసుధనాధులనొక్కడనేపొలీసునం
    చడుగడుగందునడ్డుపడుచయ్యొకరోనకుజిక్కమ్లేచ్ఛుడే
    *"మిడిసిపడెన్, మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే"*

    (మ్లేచ్ఛుడైన చైనా(మేక)వాడు ట్రంపు(మృగేంద్రుఁడు)కు కరోనా సోకిందని సంబరపడడం)

    రిప్లయితొలగించండి
  16. అడవిని స్వేచ్ఛతోడ తిరుగాడుచు నుండగ, వేటగాడటన్
    విడువగ బాణముల్ కరము వేగము తోడుత, దృష్టి లోపమే
    ర్పడి కొనలేక భోజ్యములు పండుకొనన్ గతిలేక, ప్రీతితో
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి
  17. శాప ఫలమున నాజిలో శరము లెల్ల
    వ్యర్థ మైన భీకరముగ పలికె కర్ణు
    డర్జునునణచె దననుచునహముతోడ
    మేక మృగరాజునుంగాంచి మిడిసి పడెను:

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. 06.10.2020
      అందరికీ నమస్సులు 🙏

      *"మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను"*

      నా పూరణ ..

      *తే గీ*

      వారి రోగము చైనాయె పంచెనెల్ల
      తెల్ల రేడు తా ప్రెక్కుగ తెగువ జూపె
      తనను నంటగ వైరసు తడబడంగ
      *"మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను"*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*

      తొలగించండి
  19. పారిపోవుటమొదలిడెభయముతోడ
    మేకమృగరాజునుంగాంచి,మిడిసిపడెను
    దానుధరియించు నగలను దానుజూచి
    పెనిమిటికిజూపిచూపుచు బిల్లలకును

    రిప్లయితొలగించండి
  20. పడసిన నీశ్వరప్రదిత బాళిని సైంధవు
    డాజినిన్ భళా
    చిడిముడి జేసి భీమునటు చేరగనీయక పార్ధుసూనునిన్
    వడలగజేయ నొక్కదిన భాగము నందున గాంచదోచెనే
    మిడిసిపడెన్ మృగేంద్రుగని మేక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి
  21. తేటగీతి
    రాజరాజువై ద్రౌపదిన్ రమ్మనుచు మ
    దాంధ! తొడజూపితే గదన్ ద్రచ్చెదనను
    భీముని సుయోధనుఁడు వడి వెక్కిరించె
    " మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను!"

    చంపకమాల
    తొడరిన రాజ్యసంపద నధోముఖుఁ జేయఁగ ద్రౌపదీసతిన్
    దొడలను జూపి కూరుచొన ధూర్త! వచించితె? గూల్తునంచు భీ
    ముడట మహోగ్రుడై రగిలి బూనిక బల్కిన రాజరాజనెన్
    "మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే!*

    రిప్లయితొలగించండి
  22. అడవికేరాజు కేసరియన్ననడలు
    నన్ని జంతువులనిశమాయడవియందు
    విధివశంబుననూబిలో వెరపుచెంద
    మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను

    రిప్లయితొలగించండి
  23. బెడిదపు సేనలన్ గనుచు భీతిలి యుత్తరుడంత వెన్ను జూ
    పెడు తరి శ్వేతవాహనుడు బీరువుకున్ విషయమ్ము తెల్పగన్
    నడుకును వీడి మారెను ధనంజయ సారథిగాను, గాంచగన్
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి
  24. సారథి బృహన్నలయె సవ్య సాచి యనుచు
    తెలిసినంత నుత్సాహియై తెగువ చూపు
    కాకరూకుడుత్తరునట గాంచినంత
    మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను

    రిప్లయితొలగించండి
  25. చిడిముడిపాటునొందుగనిసింగమునెంతటి యేనుగేనియున్
    వడివడిపారిపోవుతమ ప్రాణభయంబుననెల్ల జంతువుల్
    తడబడియొక్కనాడుపరితాపముచెందుచునుండనూబిలో
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి
  26. మిడిసిపడెన్ మృగేంద్రుగని మేకభయంబిసుమంత లేకయే
    తడబడువానివోలెనిటదప్పుగనిచ్చుటబాడియేరమా!
    మిడిసిపడంగవీలగునెమేకకు సింహముజూడజెప్పుమా
    యడలుచు బారిపోవునని నార్యులుసెప్పిరిగాదెనీకునున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పారిపోవునని యార్యులు..." అనండి.

      తొలగించండి

  27. పిన్నక నాగేశ్వరరావు.

    నూరు తప్పుల వరకు నేనోర్తు ననుచు
    చెప్పినట్టి హరిని లెక్క చేయక శిశు
    పాలుడు వరుసగా తప్పిదాలు చేయు
    టను వచించి రిట్లు కవుల మనముఁ దోచ
    "మేక మృగరాజునుం గాంచి మిడిసిపడెను".

    రిప్లయితొలగించండి
  28. ఆఁకలికి నోర్వఁ జాలక తోఁక నిటు న
    టు వడి నూపుచు నేఁగఁ బటువగు మృగము
    నరసి యొక్క చోటున సింహి యారగించి
    మేఁక, మృగరాజునుం గాంచి మిడిసిపడెను


    అడవికి నేఁగి యొక్క తరి నయ్యజ రాజు విహార కేళినిం
    గడు ముద మంది డెందమున గంతులు వేయుచు నబ్బురమ్ముగాఁ
    దడఁబడి చూడ నచ్చముగఁ దన్ను దలంపఁగఁ జేయు దానినిన్
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    [మృగేంద్రుఁడు = జింకలలో శ్రేష్ఠుఁడు]

    రిప్లయితొలగించండి
  29. భీష్ముడాకురు క్షేత్రాన భీకరముగ
    చీల్చి చెండాడ వీరుల చేవలుడుగ
    బాలు డభిమన్యు డెదిరించు వాలకమ్ము
    మేఁక మృగరాజునుం గాంచి మిడిసిపడెను

    రిప్లయితొలగించండి
  30. చం:

    గడగడ లాడ యాసురు ల గాయము జేయుచు లంక గూల్చగన్
    ముడిబడి జేరె నా హనుమ ముంగిట రావణు కోర్కె మేరకున్
    బడబడ రామనామమును బల్కుచు ధైర్యము గొన్న రీతినిన్
    మిడిసిపడెన్ మృగేంద్రుగని మేక భయం బిసు మంతలేకయే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. వడివడి బాణముల్ విడువ బాలకుఁడా యభిమన్యుడంతలో
    తడబడజేయ తాత మహితాత్ముని భీష్ముని యుద్ధ తంత్రమున్
    బుడతని యుద్ధకౌశల మమోఘమటంచు దలంచె, కాంచగా
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి
  32. వడకుచు పారి పోవు గద ప్రాణులటంచు పరాచకంబుగా
    మిడిసిపడెన్ మృగేంద్రుఁడల మీరిన యౌవన గర్వమందునన్;
    సడలిన దేహమున్ గదల శక్తియు లేక వయస్సు పైబడన్
    మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే

    రిప్లయితొలగించండి