2, అక్టోబర్ 2020, శుక్రవారం

సమస్య - 3505

 3-10-2020 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సింగము మరణించెఁ జీమ వలన"
(లేదా...)
"సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే"
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)

66 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    రంగుల పండుగందునను రమ్యపు రీతిని వంగభూమినిన్
    చెంగున నాట్యమున్ సలిపి చేవను పూర్తిగ కోలుపోవగన్
    భంగును త్రాగి మైకమున ప్రాణము పోవుచు నుండగానటన్
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వంగుచు వార్ధకమ్మునను వానల నందున నేలగూలుచున్
    క్రుంగుచు క్షుత్తునోర్వకయె కుంటుచు నీడ్చి కళేబరమ్ము వే
    మ్రింగుచు క్రుళ్ళి పోయినది మేషపు మాంసము మూర్ఛపోవగా
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
  3. తనబలాన్ని హెచ్చుమదింపు చీమ స్థితి
    పులిని చూసి నక్క వాతల మాదిరిగా

    ఉ||
    శృంగమువంటి సిం హమును జేరగ చీమ దలంపసాగె సా
    రంగమునిట్లు జంపును పరాగమువంటి ననున్ వధించునే
    భంగముజేతునన్న తన పట్టును హుష్షని యూదినంతనే
    సింగము, బ్రాణమున్ విడిచె చీమ చిటుక్కున గుట్టినంతనే

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  4. ఆ॥వె॥

    వేట గాడు శరము విడువగ నది తాకి
    సింగము మరణించెఁ ; జీమ వలన
    వార్త దెలిసి జంతు బలగ మడవిలోన
    సభను పన్ని తెలిపె సంత సమును

    పన్ను = ఏర్పరచు

    రిప్లయితొలగించండి
  5. రంగవల్లిలోన రాజగు సింగము
    బొమ్మగీసి రంగు బూసి మురియ
    పిండితిండిగాదె బియ్యము వాడిన
    సింగము మరణించెఁ జీమ వలన

    రిప్లయితొలగించండి
  6. ప్రతిభ తోడ నెదిగె పండితారాధ్యుల
    బాలసుబ్రమణ్య పండితుండు
    కూత మూగ బోయె కోవిడు నలిపేయ
    సింగము మరణించెఁ జీమ వలన.

    రిప్లయితొలగించండి


  7. (సహదేవుని చేతిలో ప్రాణం కోల్పోయిన శకుని )

    రంగులు మార్చి మార్చి తన
    రాజసభావన రాజరాజులో
    బొంగగజేసె నా శకుని ;
    పోటరి ధీరుడు మాద్రిపుత్రుడే
    చెంగున దూకి ఖడ్గమున
    జెండగ ఖండితమస్తకుండయెన్ ;
    సింగము ప్రాణమున్ విడిచె
    జీమ చిటుక్కున గుట్టినంతనే .
    ( పోటరి - శూరుడు ; మాద్రిపుత్రుడు- సహదేవుడు )

    రిప్లయితొలగించండి
  8. రంగని కాలు జూచి యధరంబులపై దరహాసమొప్ప సా
    రంగముగా దలంచిన కిరాతుడు వీడిన వాడియైనదౌ
    శృంగజ దొడ్డ ఘాతమున కృష్ణుడు గ్రుంకెనదేమి చోద్యమో
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు మీ పూరణ! సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శృంగజ తీవ్ర ఘాతమున..." అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. సవరణకు ధన్యవాదములు. నేను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు చాలా వ్యస్తంగా ఉండే అవకాశాలు ఎక్కువ. వీలైనంతగా పూరణలు చేయాలని ఉంది. ఆ పైన ఈశ్వరేచ్ఛ. 🙏🙏🙏

      తొలగించండి
  9. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య.

    సింగము మరణించె చీమ వలన

    ఇచ్చిన పాదము ఆట వెలది
    నా పూరణ సీసములో


    పసితన మందునే పడతి పూతన యొక్క
    ప్రాణముల్ దీసిన బాలు డతడు,

    కాళీయు‌ తలలపై కాలును మోపి నా
    ట్యము లాడి పీచ మడచిన వాడు,

    కొనగోటి తోడ నా గోవర్ధ నంబెత్తి
    గోవులన్ గాచిన గొప్ప వాడు,

    నిండోలగములోన నెలతి ద్రౌపది మాన
    రక్షణ చేసిన రక్షకుండు,

    కురుక్షేత్ర యుద్ధాన కూర్మితో
    సాయమున్
    చేసి విజయము నిచ్చిన ఘనుండు,

    నేడొక్క బోయవాని శరము
    చేత బ్రా
    ణంబులు బాసెగా, నమ్మ జాల

    లేరు యగ్రజా నాపల్కు లెపుడు ,వినుము

    నీదు సోదరుండు‌ సతము నిజము‌నే వ

    చించు ,(సింగము మరణించె చీమ వలన)

    ననుచు పలికెను విజయుడు నన్న తోడ



    శ్రీ కృష్ణుడు వైకుంఠము‌ చేరెనను వార్త తెల్పగా ధర్మరాజు నమ్మడు
    అప్పుడు
    అర్జునుడు నిజమిది‌ నేను సత్యము పలుకు‌ చున్నాను అని చెప్పు సందర్భము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కురుక్షేత్ర' అన్నపుడు 'రు' గురువై గణభంగం. "చేసిన రక్షకుడు కు।రుక్షేత్ర యుద్ధాన దీక్షతో సాయమున్..." అనండి. 'నమ్మజాలలేరు+అగ్రజా' అన్నపుడు యడాగమం రాదు. "లేరు సోదరా..." అనవచ్చు.

      తొలగించండి
  10. దేశ సేవయె తన ధ్యేయముగా నెంచి
    సాగినాడు స్వేచ్ఛ సమరమునకు
    బానిసత్వ మేగె బాపూను దివికేగె
    సింగము మరణించెఁ జీమ వలన

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. పొంగిన పౌరుషమ్మెసగఁ బోరున ఢీకొని జేతు వ్రక్కలన్
      తుంగనగమ్ము నంచనుచు దోర్బలగర్వి పొటేలు పర్వునన్
      శృంగముతోడ వ్రేటిడగఁ జెచ్చెరఁ జచ్చె చలించు నెట్టు లా
      సింగము?...., ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'నేను కుట్టగానే చావాలి' అని కోరుకున్న చీమను ప్రస్తావించారు. బాగుంది.

      తొలగించండి
  12. చెట్టుమీదనున్నపిట్టపై గురివెట్టి
    కొట్టబోవునంత కుట్టె జీమ
    కోలగురినితప్పి గుచ్చెను సింగమున్
    సింగము మరణించెఁ జీమ వలన

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    ముంగిట మృత్యురూపమున బుట్టినదీ క్రిమియే కరోనయై
    మ్రింగుచునుండెనెందరినొ., ., మేదినిఁ జీమను బోలి., కుట్టగా
    ఖంగున మ్రోగు గొంతుకను., గానమహావనరాజునేగెడిన్!
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. బలవంతుడగుచు పలువురి బాధింప
    అదను కొఱకు వేచి యల్పు డొకడు
    వాని జంప నెంచె వలను బన్ని యు నప్డు
    సింగము మరణించె జీమ వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "బలము గలదటంచు పలువుర బాధింప..." అనండి.

      తొలగించండి
  15. రంగమునందు శత్రువుల ప్రాణములన్ వడిఁ దీసి ధైర్యమున్
    భంగము చేయు శిష్యులను ప్రాకటమౌగతిఁ దీర్చి యొజ్జయే
    పొంగగ దుఃఖపాటు విని పుత్రునిఁ జావు త్యజించి యస్త్రముల్
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
  16. ఆ.వె.
    తేటతెనుగులోన తరియించ మంచిదౌ
    పరులభాషవెనుక పరుగులేల
    మాతృభాష నెపుడు మరువంగరాదకొ
    సింగము మరణించెఁ జీమ వలన

    ఆ.వె.
    చలనచిత్రమందు చెలరేగువీరులు
    చితకగొట్టగలరు చిందులేసి
    జీవితమ్మున వెరజారు వారలె చూడ
    సింగము మరణించెఁ జీమ వలన

    రిప్లయితొలగించండి
  17. భంగమొనర్చెరాక్షసులవంచనసంచితపాపకర్మపున్
    దంగునుభంగపెట్టెద్రుపదాత్మజమానముగాచెగ్రీడికిన్
    సంగరమందుసిద్ధినిడెశైలికుబాణముదాకినంతనే
    *సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే*

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. అంగనయై జనించినను అంబ దపంబొనరించి బూనికన్
      పుంగవు రూపమొందె పరిభూతను జేసిన భీష్ముఁ జంపగా
      సంగరమందు నర్జునుని స్యందనమందున నిల్చె నక్కటా
      సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

      తొలగించండి
  19. పొంగుచు బ్రహ్మయిచ్చెనని ముట్టిన
    వెంటనె జంపుశక్తినే
    హంగుగ బోయికుట్టె పరిహాసము జేయుచు సింహపాదమున్
    భంగముగాగ నిద్రతన పాదము క్రిందను నొక్కిపెట్టగా
    సింహము, ప్రాణమున్ విడచె జీమ
    చిటుక్కున గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
  20. అంతుచిక్కనిరుజమబ్బుటమూలాన
    సింగముమరణించె,జీమవలన
    గడ్డకట్టెనెత్రుగవరవర్ణముతోడ
    కుట్టకాలుమీదగట్టిగాను

    రిప్లయితొలగించండి
  21. కదన మందెదుట శిఖండిని గాంచిన
    శాంత నవుడు వీడి శస్త్రములను
    చేరె నంప శయ్య గోరుచు మరణము
    సంగము మరణించెఁ జీమ వలన.

    రిప్లయితొలగించండి
  22. గంగను శీర్షమందు నహిఁ గంఠము నందు ధరించినట్టి యా
    జంగమ దేవుడౌ శివుని సన్నిధి జేరి వరమ్ము పొందెనా
    శృంగము లేని కీటకము చీమ, వనమ్మున కానవచ్చెనో
    సింగము, ప్రాణమున్ విడిచెఁ జీమ, చిటుక్కునఁ గుట్టినంతనే.

    రిప్లయితొలగించండి
  23. ఉ:

    పొంగెను భావగీతములు పొద్దటి వేళన హృద్యమందగన్
    చెంగున దూకి వ్రాయు టకు చేతను బూనగ పెన్ను పేపరున్
    తొంగుడు, చాలు మింక నిశి, తొందర యేలని మందలింపగన్
    సింగము ప్రాణమున్ విడిచె చీమ చిటుక్కున గుట్టి నంతనే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. ఆటవెలది
    పూని పాడినంత పొంగించు హృదయాల
    నింగి మెరుపు! కురియు నీరమట్లు!
    కూల్చె నొక నదృశ్య కోవిడు గురిచూసి
    సింగము మరణించెఁ జీమ వలన!

    ఉత్పలమాల
    నింగిని జారు వర్షముగ నేలను వెల్గెడు దివ్వెలట్లుగన్
    గంగున మ్రోగు కంఠమున గానము సేయగ వేలపాటలన్
    దొంగగ దూరి యూపిరుల దోచె నదృశ్య కరోన ప్రాణముల్
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
  25. చావు పుట్టుక లిల దైవ సంఘటనము
    లెల్ల దాట నెవరి వల్ల కాదు
    శివుని యాజ్ఞ కాఁగఁ జీమ కుట్టెను వింత
    సింగము మరణించెఁ జీమ వలన


    భృంగ విహంగ తుంగతమ శృంగ వరాంగ సుసంగ శృంగులున్
    స్వంగ తురంగ పింగళ నృ జంగమ కోటులు నంగ జార్తులే
    సంగమ మైన తత్క్షణము శాప వశమ్మున గండుచీమ నా
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
  26. భంగురజీవితమ్మునెడబాయుట తథ్యముయేరికైన నా
    సంగతెరింగియున్ బ్రతుకుశాశ్వతమట్లుతలంప నేలొకో
    సంగరమందుశాత్రవుల చంపి పదంపడి రాజ్యమేగి రా
    సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తథ్యము+ఏరికైన' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! తథ్యమదేరికైన అని మార్చుకుంటాను,

      తొలగించండి
  27. అంగమునంతయున్ రుజమువ్యాకులజెందగనోర్వలేకనే
    సింగముప్రాణమున్ విడిచె,జీమచిటుక్కునగుట్టినంతనే
    యంగజమంతయున్ గరుడునయ్యెనుభీకరమౌవిధంబుగా
    జంగమదేవునాఙ్ఞనిలజాలమికుట్టదుచీమయైననున్

    రిప్లయితొలగించండి
  28. బలము గల్గి యుండి తెలివిని గోల్పోవ
    నలము కొనును గాదె యలుగులములు
    పరుగు నాపి లేడి పడినది పులినోట
    సింగము మరణించెఁ జీమ వలన!


    అలుగులములు=ఆపదలు

    రిప్లయితొలగించండి
  29. బలము గల్గి యుండి తెలివిని గోల్పోవ
    నలము కొనును గాదె యలుగులములు
    పరుగు నాపి లేడి పడినది పులినోట
    సింగము మరణించెఁ జీమ వలన!


    అలుగులములు=ఆపదలు

    రిప్లయితొలగించండి
  30. వేటగాడు కొట్ట వేదన నొందుచు
    *సింహము మరణించె,చీమ వలన*
    బలము కల్గి నట్టి వ్యాళమె జచ్చున
    టంచు పల్కుచుందు రార్యు లెపుడు

    రిప్లయితొలగించండి