16, అక్టోబర్ 2020, శుక్రవారం

సమస్య - 3517

 17-10-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు”

(లేదా...)

గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై

(ఈ సమస్యను పంపిన రామ్ డొక్కా గారికి ధన్యవాదాలు)

64 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    అన్నంబున్ విసిరేయుచున్ ముఖముపై హంగామనున్ జేయుచున్
    దున్నన్ నున్ కడు పోలుచున్ గృహమునన్ దుర్మార్గుడై త్రాగుచున్
    తన్నంగా తన తల్లినిన్ నడుముపై తంటాలనున్ మాపగన్
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు.
      *దున్నన్ మిక్కిలి పోలుచున్* అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  2. చిన్నదానికొరకుకోకలుగొనిపెట్ట
    యమ్మపసిడినగలనమ్మెనంచు
    దూరెతండ్రిసుతునిదూరముబెట్టగ
    *గన్నునెక్కుపెట్టెఁగన్నకొడుకు*

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మధువు గ్రోలి యుండి మత్తులోన మునిగి
    తూలుచుండి వచ్చి గోల తోడ
    చిందులేయ తండ్రి మందలించినయంత
    గన్నునెక్కు పెట్టె గన్న కొడుకు.

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చెన్నై పట్టణమందునన్ పెరుగుచున్ చిన్నారి వీరప్పగన్
    కన్నున్ గొట్టుచు చెల్లికిన్ ముదమునన్ కాట్లాడి పోట్లాడమన్
    పన్నాగంబును చేసి దాగి వెనుకన్ పైకెత్తి దీపావళిన్
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై...

    రిప్లయితొలగించండి
  5. కన్న కొడుకు మీద నెనలేని ప్రేమతో
    కడప నుండి తండ్రి గన్నుఁ దెచ్చె
    దాని పనినిఁ జూడఁ దలచిన తమకాన
    గన్ను నెక్కు పెట్టె కన్న కొడుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "కన్నకొడుకు మీద నున్నట్టి ప్రేమతో" అందామా?

      తొలగించండి
  6. కరోన్ లాక్ డౌన్ లో కాలక్షేపం

    పరికిణి కరములకు బాగుగ చుట్టియు
    పట్టివేసితినని బల్కెబుత్రి
    దొంగ దొరికెనంచు తొందర పడసతి
    గన్నునెక్కుపెట్టెఁగన్నకొడుకు

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    తగవు నింట ననుచు తాత నాశ్రమమునఁ
    జేర్చ బోవు తండ్రి సిగ్గు వడఁగఁ
    దాత ప్రేమఁ దనరి లేత చేతుల బొమ్మ
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు!

    శార్దూలవిక్రీడితము
    ఎన్నంగన్ పితరుండుఁ దాతఁగొనుచున్ వృద్ధాశ్రమంబేగగన్
    గన్నీరొల్కెడు జాలిమోము గనుచున్ గారుణ్యముప్పొంగగన్
    జిన్నారెంతగ దల్లడిల్లి పితయే సిగ్గొందగన్ బొమ్మదౌ
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై!

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తెన్నున్ లేని విధంబునన్ పెరిగి రీతిన్ జూపకున్
    చెన్నున్ లేక సతమ్ము పానగృహముల్ చిట్టాడుచున్ మత్తునన్
    దున్నన్ మాదిరి తూలుచున్ వదరగా దూషించు నావేళలో
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. చూసుకోలేదు. ఇప్పుడు సరిజేసినాను.

      తెన్నున్ లేని తెఱంగునన్ పెరిగి రీతిన్ వీడి పేట్రేగుచున్
      చెన్నున్ లేక సతమ్ము పానగృహముల్ చిట్టాడుచున్ మత్తునన్
      దున్నన్ మాదిరి తూలుచున్ వదరగా దూషించు నావేళలో
      గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై.

      తొలగించండి
  9. కన్నయ్యే యిలలో సమస్త జనులన్ గాపాడు సర్వజ్ఞు డే?
    కన్నా!చూ పుమునీదునాధు డిచటీ కంబమ్ము నందుండె నా?
    యన్నాదానవనాధుతోడ పలికెం హాఁయంచు బ్రహ్లాదు డే
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుడే కన్నట్టి యాతండ్రి పై

    యన్న+ఆదానవనాధు

    రిప్లయితొలగించండి
  10. పన్నుల్ గట్టక దోచి పేదలను సంపాదించి కోట్లాదిగా
    గన్నున్నాడు కొనెండు బొమ్మగ నిడన్ గారాబు పుత్రుండు దా
    పెన్నున్ పేపరు బట్టకే దిరుగుచున్
    విద్యావిహీనుండునై
    యెన్నెన్నో వ్యసనంబులంబడి కటా హెచ్చైన నున్మత్తతన్
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుడే కన్నట్టి యా తండ్రిపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సైన్యమన్న ప్రియము సాహస వంతుడు
      దేశభక్తి మెండు దేహమందు
      తల్లిదండ్రి మెచ్చ దండున జేరుచు
      గన్ను నెక్కుబెట్టె గన్నకొడుకు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
  11. కె.వి.యస్. లక్ష్మి:

    ప్రేమ మీర పెంచి పెనుపునన్నిటి గూర్చి
    పెద్ద జేసి నంత పేరు నొంది
    తండ్రి మందలించ తలబిరుసుతనాన
    గన్ను నెక్కుపెట్టె గన్నకొడుకు.

    రిప్లయితొలగించండి
  12. పెన్నుగన్నులందు పదునుదేనికనగా
    చెలగె యింటిలోన చర్చయొకటి
    కోపమావహింప కలమును విసరుచూ
    గన్ను నెక్కుపెట్టె గన్నకొడుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆస్తిపాస్తులన్ని అరమరికలులేక
      కలసిపంచమనిన కుదరదుయని
      కోపమావహింప కలహమాడగనెంచి
      గన్ను నెక్కుపెట్టె గన్నకొడుకు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "చెలగె నింటిలోన... విసరుచు..."
      "కుదురదనుచు" ... అనండి.

      తొలగించండి
  13. సమస్య :
    గన్ను నెక్కుపెట్టె గన్నకొడుకు

    ( తండ్రి దేశద్రోహి - కొడుకు దేశభక్తుడు )
    ఆటవెలది
    ...................
    ప్రక్క దేశమునకు బానిసగా మారి
    మాతృదేశమునకు మారి యైన
    తుచ్ఛుడైన తండ్రి దునుమాడగా నెంచి
    గన్ను నెక్కుపెట్టె గన్నకొడుకు .

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి నమస్కారం

    నా పూరణ ప్రయత్నం

    దేశరక్షజేయదేహమ్ముగానక
    రణములోనదూకిరయముగాను
    చైనవాసు లైనశత్రుమూకలపైన
    గన్నునెక్కుపెట్టెగన్నకొడుకు

    *యస్ హన్మంతు*

    రిప్లయితొలగించండి
  15. పక్క నున్న యింటి పడతుక తన వాలు
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు
    పైకి , యనుచు తెలియ వప్రుడు జరిపించె
    పెండ్లి యిరువురికిని పేర్మి తోడ

    వప్రుడు = తండ్రి

    రిప్లయితొలగించండి
  16. ఉన్న యాస్తి యేదొ యుమ్మడిగానుంచి
    కష్ట పడుచు మనము కలసి సాగుదమన్న
    కాదు కూడ దనుచు కయ్యమునకు దిగి
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  17. వెన్నుజూపకుండ కన్ను మలుపకుండ
    కాపుగాసె శత్రు కనుమలందు
    తండ్రి తనయు జూసి తన్మయమ్మందగ
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు!!

    రిప్లయితొలగించండి
  18. తండ్రియుద్ధమందు త్యజియించెఁ బ్రాణము
    తల్లికుములుచుండ తల్లడిల్లి
    శత్రువులనుతాను చంపితీరెదనని
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు

    రిప్లయితొలగించండి
  19. సైన్య మందు జేరి శత్రు భయంకరు
    డగుచు పోరు సలుపు న దను నందు
    హద్దు దాట నున్న నరివర్గ మున్ గని
    గన్ను నెక్కు బెట్టె కన్న కొడుకు t

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    నన్నుంబెంచిన నీ పయిన్ ఖలులు నిందన్ మోప., నా వృత్తియే
    నన్నీరీతినశక్తు జేసినది నాన్నా! నిన్ను రక్షింపనే...
    నున్నానిక్కడ! న్యాయమే గెలిచెడున్! యూ ఆరరెస్టంచు దా
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  21. తండ్రి చోరుడాయె తనయుడాతడిని మిం
    చెను! జిలేబి కొరకు చెంగు మనుచు
    దూకి గోల చేసి దొరికిన వారిపై
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  22. ఛిన్నాభిన్నము చేసె చట్టుమనుచున్ శీర్షమ్మునే వేగమై
    మున్నాభాయి విచిత్ర మైన ద్రుహుడౌ మూఢత్వశృంగమ్మురో
    రన్నన్నా విను చిన్నపాటి కథయౌ! రాపాడు దార్ఢ్యమ్ముతో
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. కలవు యింటి లోన యెలుకలధికముగా

    బోను పెట్ట చేర బోవు నెపుడు

    ననుచు తండ్రి నాపి మేలైన నొక మించు

    గన్ను నెక్కు బెట్టె కన్న కొడుకు

    మించు గన్ను పిల్లి

    రిప్లయితొలగించండి
  24. విన్నాణంబునమేయమాయలనువైవిధ్యంపుమంత్రాంగమున్
    జిన్నానేర్చిననాడెవల్లభుడవర్చింపన్ప్రశస్తాస్త్రముల్
    గన్నున్బెన్నునుయుక్తివాడుమనమూర్ఖాజ్ఞాని *రోబోటు* లా
    *గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై*

    రిప్లయితొలగించండి
  25. ఆస్తినీయకుండ యప్పులుసెప్పగ
    గన్నునెక్కుపెట్టె గన్నకొడుకు
    నప్పుజెప్పునపుడెయాస్తినిజెప్పిన
    క్రూరభావముండదేరికైన

    రిప్లయితొలగించండి

  26. పిన్నక నాగేశ్వరరావు.

    మద్య సేవనమున మత్తులో తూగుచు
    తనయనే చెఱచగ తలచినంత
    దార యడ్డుపడగ దారుణముగ కొట్ట
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు.

    రిప్లయితొలగించండి
  27. అన్నప్రాశనమున జరిగే సరదా కార్యక్రమము గా ఈ నా ప్రయత్నము

    శా:

    కన్నా ! యెంచు మటయ్య నొక్కటిగ నీ కై మెచ్చి ప్రారంభమున్
    పెన్నున్ గన్నును పొత్తమున్ భవితగా వెన్నంట నాలోచనల్
    చిన్నా ! ప్రాకుము వేగమన్న, చని తా చేబూనె నాశ్చర్యమున్
    గన్నున్ గైకొని యెక్కుబెట్టె సుతుడే కన్నట్టి యా తండ్రిపై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. గన్నున్ గైకొనియెక్కుపెట్టెసుతుడేకన్నట్టియాతండ్రిపై
    యన్నా రాముడ!యేమివింతయిదిహాయబ్బాయికేమాయెనో
    గన్నున్ జూపెనె!ధర్మమేయిదియనెక్కాలంబునందుండెనేృ
    యెన్నన్వైరమునేలకోసుతునకున్నైశ్వర్యమూలంబునా?

    రిప్లయితొలగించండి
  29. అన్నల్ సేవకులంచు చేరి దళమున్ హర్షమ్ముతో కానలో
    గన్నున్ పేల్చుట నేర్చియోర్చుకొనుచున్ కష్టమ్ములన్ దీక్షతో
    మిన్నౌపేరునుబొంది నాయకునిగా మిన్నంటి, యాకట్టగా
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై

    రిప్లయితొలగించండి
  30. తర్క మందు మించఁ దండ్రిఁ గుమారుండు
    చక్క నొక్క స్రుక్కు వాక్కుఁ దక్కి
    వాగ్విదుండు చండ వాగ్బాణములను బా
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు

    [బాగు + అన్నున్ = బా గన్నున్; అన్ను = పారవశ్యము; ఇక్కడ బాగు పద మాశ్చర్య సూచకము; “బాగు” “అన్ను”నకు విశేషణము కాదు]


    కన్నున్ మిన్నును గాన కుండగను శ్రీకాంతున్ హరిం దిట్టుచుం
    దన్నంగం దనయుండ స్తంభమును వే తావచ్చునా యిందు నా
    వెన్నుం జూపు మనంగ విష్ణు వనెడిం బెంగోల, దం జూడ క్రే
    గన్నున్, గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై

    రిప్లయితొలగించండి
  31. ప్రియసుతుండడగగ ప్రేమతో జనకుండు
    దీవెలకుతుపాకి తెచ్చియిచ్చె
    కొంటె బాలుడపుడు తుంటరి తనముతో
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు.

    రిప్లయితొలగించండి
  32. కన్నుల్ గానక కామ వాంఛ నతివన్ కాటేసె ధూర్తుండయో
    ఖిన్నుండై యపరాధులన్ వెదకి రక్షింపంగ ధర్మంబు దా
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై
    మిన్నాగై కడతేర్చె నామె నతి దుర్మేధుం డతండే యనన్

    రిప్లయితొలగించండి
  33. నిన్నెవ్వండును కోరడయ్యె సుతుడన్ నేనేగదా కోరితిన్
    నాన్నా నాకొక బందుకిమ్మనగ నానందంతుకున్ బ్రేమగా
    గన్నున్ దెచ్చెను తండ్రి సంతఁ జని తత్క్షణంబె, తానవ్వుచున్
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై

    రిప్లయితొలగించండి


  34. జాత రందు తెచ్చె తాత మనవనికి
    నిమ్ము గాను తాను బొమ్మలెన్నొ
    తన్మయతను బూని తండ్రిని గని బొమ్మ
    గన్ను నెక్కుపెట్టె గన్న కొడుకు

    రిప్లయితొలగించండి