సూరుని వోలె తేజమున శోభిలు కర్ణుని జూడ యుద్ధమున్ పోరుట సాధ్యమే జగతిఁ పూనిక ప్రాణము తీయు బాణముల్ సారథి మెచ్చ నా పటిమ సాయము వేడగ శాంతి గూర్చగన్ భారత యుద్ధ రంగమున పార్థుడు పొందె పరాజయమ్మయో
మా భక్త మండలిలో ఒక భజన గీతము ఆధారంగా వ్రాసిన పూరణ. ఆ భజన ఈ విధముగా సాగుతుంది-- "వీడు కర్ణుడు గాడు రణమున చూడదగు సూర్యుని విధమున -- నేడు నగుపడు వీనితో పోరాడ లేడె వ్వాడి జగతిగ-- బావా వెనుకకు ద్రిప్పు రథము....
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
దూరమునుండి జూచి తన తుంటరి బంధుల సైన్యవాహినిన్
గారము మీరగా నచట కౌరవ పక్షపు గుర్వులందునన్
పోరను పోరనంచు భళి పొందుగ ప్లేటును త్రిప్పివేయగన్
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్లేటు త్రిప్పడం' అనే అన్యభాషా జాతీయం ఎందుకు? "మునుముందుగ విల్లును బాఱవేయగన్" అంటే ఎలా ఉంటుంది?
తొలగించండి🙏
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మీరిన గర్వమందహహ మెండుగ కోతలు కోయుచున్ కడన్
తీరుగ వెండి జుత్తుగల ధీరుడు తాతను పెక్కురోజులన్
పోరను లేక;...సారథియె బోరును సైచక నేల దూకగన్;...
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో...
'కుప్పించి యెగసిన సారథి'ని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఒక రాజుకు వేదాంతమును బోధిస్తూ గురువు..
రిప్లయితొలగించండికం.
భారత రణాంగణమ్మున
వీరుండే కాని మోక్ష విజ్ఞానంబున్
జీరక నిహమను "భూసం
భార...! తరణరంగమందుఁ బార్థుం డోడెన్
భూసంభార = రాజ్యమును చక్కగా వహించేవాడు (రాజు)
గీతాసారము తెలిసిన వాడు ఐనప్పటికీ మోక్షము కోరి కన్నప్పగా జన్మనెత్తవలసిందికదా..
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండివీరుడననినమ్మ బలికి
రిప్లయితొలగించండియేరులు పారించె ధనము నెన్నికలందున్
బీరములని తెలిసె తుదకు
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్!!
***పార్థుడు=రాజు (పాలకుడు).
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికౌరవుల గెల్చె బలిమిని
భారత రణరంగమందు బార్థు0; డోడెన్
రారాజు సైన్యమంతయు
వీరులు పాండవులదోడి పెనకువ నందున్
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారికి నమస్సులు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిధీరులు భీష్మ ద్రోణుల
వారించెడు మర్మము హరి బనుపనఁ దెలియన్
గూరె జయము! నైతికముగ
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్!
ఉత్పలమాల
సారధియైన యాదవుడసాధ్య నదీజుని కుంభసంభవున్
జీరెడు మర్మముల్ దెలియ సిద్ధము జేసియు ధర్మనందనున్
గూరిచినట్టిదౌ జయము గొప్పననొప్పునె? నైతికమ్ముగన్
భారతయుద్ధరంగమునఁ బార్థుఁడు పొందె పరాజయమ్మయో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి_/\_ధన్యోస్మి గురుదేవా_/\_
తొలగించండిధీరత విజృంబి o చెను
రిప్లయితొలగించండిభారత రణ రంగ మందు బార్థు : డోడె న్
కారణమౌ శాపము తో
వీరుడు కర్ణుo డు దాను విజయుని చేత న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. 'విజృంభించెను' అన్నపుడు 'వి' లఘువే! "ధీరతను విజృంభించెను" అనండి.
ఉ.
రిప్లయితొలగించండిచేరి సహోదరుల్ రణము సేసిన భుమది నెద్ది? బుద్ధి నే
పారగ ద్రోణు మానసము బాళి యొనర్చిన శిష్యుడెవ్వడో?
కోరుచు నన్యసంపదల, గోమలి బొచ్చిన వాడు నేమయన్?
భారత యుద్ధరంగమునఁ....., బార్థుఁడు...., పొందెఁ బరాజయమ్మయో!
బాళి = ఆనందము
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొన్ని టైపాట్లున్నవి.
చేరి సహోదరుల్ రణము సేసిన భూమది నెద్ది? బుద్ధి నే
తొలగించండిపారగ ద్రోణు మానసము బాళి యొనర్చిన శిష్యుడెవ్వడో?
కోరుచు నన్యసంపదల, గోమలి బొచ్చిన వాడు నేమయన్?
భారత యుద్ధరంగమునఁ....., బార్థుఁడు...., పొందెఁ బరాజయమ్మయో!
భీష్ముని గూల్చెను భీకర మైనట్టి
రిప్లయితొలగించండికదన రంగమునందు కవ్వడి తన
శరములతో, దుష్ట సైంధవుని శిరము
ఖండించి చంపెనుగా కిరీటి,
మడగున దాగినన్ మరణము నొందెగా
వలలుని చేతను బలము పోయి
రారాజు భారత రణరంగ మందు,పార్ధుండోడె నెసలున దుర్భర ముగ
బభృవాహను నెదిరించి, పదునెనిమిది
దినములు కదన రంగమున్ తిరుగు లేని
పోరు సల్పిన వానిని దారుణముగ
సుతుడు పరిమార్చ బ్రహ్మ లి ఖితము గాదె
ఎసలు =యుద్దము
మీ పూరణ ప్రశంసనీయంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపోరగ నెన్నికల్లొ పలు బూతులు నోటన మాటలాడగా
రిప్లయితొలగించండివారునువీరలన్ యెవరు వారలు నాకిటు చెప్పగల్గుటే
పారడె పాలకుండయును బాధ్యత లేవియు పట్టకుండగా
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎన్నికల్లొ' అనడం సాధువు కాదు. 'నోటను' అనండి. 'వీరలన్+ఎవరు' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.
అందరికీ నమస్సులు🙏🙏
రిప్లయితొలగించండినా *సరదా* పూరణ యత్నం..
*(ప్రేరణ GPS శాస్త్రి ఆర్యులు)*😊
*కం*
వీరత్వము జూపగ మరి
యా రాహులు ఎన్నికలను నాసించగనే
పారక కాంగ్రెసు పాచిక
*“భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్”*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏😀
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీరుండగు రాధేయుని
రిప్లయితొలగించండిధారయె స్వప్నమ్మును గనె తారాభూషన్
దారుణముగ జరిగిన యా
భారత రణరంగమందుఁ బార్థుండోడెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం అర్థం కాలేదు. 'ధార' కాదు, 'దార' అనండి. 'తారాభూషన్'?
(బబ్రువాహను చేతిలో అర్జునుని ఓటమి)
రిప్లయితొలగించండికౌరవ గణమోడెనుగద
భారత యుద్ధరంగమునఁ ; బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో
పోరున తన తనయుడయిన
వీరుడగు మణిపుర రాజ్య విభువుని చేతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్యాపాదం కందం బదులు వృత్తం వేసారు.
🙏🏽
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరగు హామీ లిడినన్
నేరిమితో గూర్చడనుచు నెన్నికలందున్
పౌరులు త్యజించి నంతట
భారత రణరంగమందు బార్థుండోడెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోరునమడిసిరి భ్రాతలు
రిప్లయితొలగించండివీరులుగురువులునుమరియుభీష్ముడు మడిసెన్
మారణహోమానంతర
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీరెడు బ్రేమను బిల్వగ
రిప్లయితొలగించండికూరిమి చదరంగమాడ కూటమినందున్
క్రూరపు పన్నాగమునను
భారత రణరంగమందు పార్థుండోడెన్
పార్థుడు = ధర్మరాజు
భారత రణరంగము = చదరంగము
తేరును నిల్పగా నుభయ తిట్టల మధ్యన పార్థసారథే
భోరున నేడ్చెనే దునుమ పూజ్యుల
నొజ్జల బంధువర్గమున్
భారత యుద్ధరంగమునఁ బార్థుడు,
పొందెఁ బరాజయమ్మయో
మీరిన మోహభావనయె మీదట గృష్ణుని బోధనమ్మునన్
తేరుని నిల్పినంత నిరుతిట్టల మధ్యన గా చదువ ప్రార్ధన!
తొలగించండితేరును
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా! నమోనమః! 🙏🙏🙏
తొలగించండిసూరీడు గ్రుంకె! సైంధవ
రిప్లయితొలగించండివీరుని దునుమాడ లేదు! వీగెఁ బ్రతినయున్!
వైరిగణంబులనిరి యిఁక
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీరుగ నే రీతి తగడు
రిప్లయితొలగించండిపోరున తన వారి దునుమ భోరనినేడ్వన్
శౌరియె సాక్షిగ మనసను
భారత రణరంగమందు పార్థుండోడెన్
మూడవ పాదం:
తొలగించండిశౌరియె సాక్షి మనస్సను
వీరుగ నే రీతి తగడు
తొలగించండిపోరున పగవార దునుమ భోరనినేడ్వన్
శౌరియె సాక్షి మనస్సను
భారత రణరంగమందు పార్థుండోడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భోరున నేడ్వన్' అనండి.
రిప్లయితొలగించండినేటి భారతం!
వారెవ్వా ! ప్రశ్నలు ! లే
దే రవ్వంతయు సమస్య తెరిపినివంగా
తీరగు జవాబులరరే
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తెరపు నిడంగా/గన్' అనండి.
రిప్లయితొలగించండినేటి భారతం
ఆరని మంటలాయె! సమయానికి లేవుపరిష్కృతుల్ సదా
తీరని కాంక్షలాయె మది తీరుగ నెమ్మది గానదే సఖీ
వేరుకు బట్టె చీడయు ప్రవిష్టుడు కూలెను శక్తి హీనుడై
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిభారతయుద్ధరంగమున
బార్థుడు బొందె బరాజయమ్మయో
(కర్ణుడు సైన్యాధిపతిగా వచ్చి మధ్యందిన
మార్తాండునిలా ప్రకాశిస్తుంటే తట్టుకోలేక
రణరంగాన్ని వీడుతున్న అర్జునుడు )
ఉత్పలమాల
...................
" ధీరుడు కర్ణునిం గనిన
తేజము దప్పుచు నుండె మాధవా !
తేరుకొనంగ దత్క్షణమె
తేరును వెన్కకు ద్రిప్పుమయ్య ! నే
గోరెద విశ్రమంబు " నని
గొంకుచు వేగమె బోవుచుండెనే ?
భారతయుద్ధరంగమున
బార్థుడు బొందె బరాజయమ్మయో !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికౌరవవీరులెల్లరును కర్ణుడు భీష్మపితామహుండు దు
రిప్లయితొలగించండిర్వారమదోద్ధరుండునుపరాక్రమశాలిసుయోధనాదులున్
పోరుననేలకూలనిక పొందినదేమి రణంబు గెల్చినన్
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోరున తలపడ తలచిన
రిప్లయితొలగించండిపురషునకున్ రాజకీయ బుద్ధులు వేయును
మరి యవి లేకనె కాదా
భారత రణరంగమందు పార్థుం డోడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలయున్
రిప్లయితొలగించండిఆరడిబెట్టినారు ద్రుపదాత్మజ వస్త్రములూడ్చినారుదు
రిప్లయితొలగించండిర్వారదురంతదుఃఖభరులర్భకులైరిసభాస్థలంబులో
బోరదినిశ్చయంబయెసమూహముగాంచివిషణ్ణచిత్తుడై
*“భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో”*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివీరులజేయులుబోరిరి
రిప్లయితొలగించండిభారత రణరంగమందుఁ,బార్థుండోడెన్
శూరు డిరావంతుడనె శ
రీరజు ఢీకొని యులూపి హృదయజు చేతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికురుసంగ్రామం లో యుద్ధవిముఖుడైన పార్థునితో శ్రీకృష్ణుడు...
రిప్లయితొలగించండి"భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో
శూరధనుర్ధరుండని విశుద్ధయశస్సు గడించియుం, గటా!
కౌరవయుద్ధమందొనరు ఖ్యాతి గతించె" నటంచుఁ దూరరే
వీర! ధనంజయా!, కడగు భీరువు కాకుమ పోరు సల్పుమా!.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురం
సారథి కృష్ణుడాతనికి సాత్యకి ఛాత్రుడు నాజి భీములౌ
రిప్లయితొలగించండివీరు లజేయ సోదరులు వెన్నుగ దన్నుగ పుత్రరత్నముల్
శూర ఘటోత్కచుండు నరి సూదను డా యభిమన్యు సాయమున్
*“భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ; బరాజయమ్మయో”*
శూరుడు దానవీర రవిజుండు మహాస్త్రము మొక్కచేయగా
ఓౌరా యేమిది?చిత్రమె
రిప్లయితొలగించండియీఱేయినినాకువచ్చెనేమనినుడువన్
నీరకముగగలయాయెను
భారతరణరంగమందుబార్ధుండోడెన్
పోరగ నెన్నికందు పలు బూతులు నోటను మాటలాడగా
రిప్లయితొలగించండివారునువీరలన్నెవరు వారలు నాకిటు చెప్పగల్గుటే
పారడె పాలకుండయును బాధ్యత లేవియు పట్టకుండగా
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో!
***సవరణతో...
భారతయుద్ధరంగమునబార్ధుడుపొందెబరాజయమ్మయో
రిప్లయితొలగించండివీరుడుపొందునాననినిభీకరయోటమిజింతజేయగన్
గౌరవసేననున్మొదలికర్ణునిద్రోణునినెల్లవారినిన్
బోరుననేలగూల్చెనుగపౌరుషమొప్పగనేకవీరుడై
ఉ:
రిప్లయితొలగించండిసూరుని వోలె తేజమున శోభిలు కర్ణుని జూడ యుద్ధమున్
పోరుట సాధ్యమే జగతిఁ పూనిక ప్రాణము తీయు బాణముల్
సారథి మెచ్చ నా పటిమ సాయము వేడగ శాంతి గూర్చగన్
భారత యుద్ధ రంగమున పార్థుడు పొందె పరాజయమ్మయో
మా భక్త మండలిలో ఒక భజన గీతము ఆధారంగా వ్రాసిన పూరణ. ఆ భజన ఈ విధముగా సాగుతుంది-- "వీడు కర్ణుడు గాడు రణమున చూడదగు సూర్యుని విధమున -- నేడు నగుపడు వీనితో పోరాడ లేడె వ్వాడి జగతిగ-- బావా వెనుకకు ద్రిప్పు రథము....
వై. చంద్రశేఖర్
పారావార సమాన మ
రిప్లయితొలగించండిపార రణాంగణమునఁ గని పరసైన్యమునన్
మూరి తన వారి నెల్లర
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్
[ఓడెను = భయపడెను]
వీరలు వార లేమి యట వీరులు వారల వారు వారి యె
వ్వారలు వీరి వారలకు వారల వారల కోడి రెల్లరుం
గౌరవ పక్షమందుఁ బ్రతి కాంతుఁడు పార్థుని యస్త్ర శక్తికిన్
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో
[పార్థుఁడు = 1. అర్జునుఁడు, 2. రాజు]
ఆరవి పుత్రుడాహవము నద్భుత రీతిని చెంగలింపగా
రిప్లయితొలగించండికౌరవ సేన పైకొనగఁ గాంచి భయమ్మును పొంది, పార్థుడే
తేరును త్రిప్పమంచు కడు దీనత కేశవుఁ గోరె నవ్విధిన్
భారత యుద్దరంగమున పార్థుడు బొందె పరా జయమ్మహో
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆరయ నస్త్రశస్త్రవిషయమ్ములనేర్పె గుఠారధారి., చే..
కూరెను వానికా కవచకుండలముల్ సహజమ్ముగా.,ననిన్
ధీరత గెల్చుఁ గర్ణుడని, దీనతఁ గుంతి యనెన్ బ్రసుప్తయై
భారతయుద్ధరంగమున బార్థుడుపొందె పరాజయమ్మయో!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరగు మాటలాడుచు ప్రతీతమునౌ ప్రతినల్ ఘటించుచున్
బీరములాడు నాయకుని భేషజముల్ మది నూహజేయుచున్
పౌరులు నొక్కటై చెలగి వానిని నెన్నికలందు వీడగా
భారత యుద్ధరంగమున బార్థుడు పొందె బరాజయమ్మయో!
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండివీరుడనగ విజయుడె గద!
భారత రణరంగమందు పార్థుం డోడెన్
నేరదు పలుకగ నిటులన్
పోరు నెవరు నర్జునునకు పోటీ కొచ్చున్?
నరుమాటల్ విని నవ్వుతో 🙏🙏🙏
రిప్లయితొలగించండిభీష్మరాజ స్తవము
సారథిగా రథమ్మునని జక్కగ నిల్పుచు పార్థుసూనుకున్
కౌరవపక్ష వీరులను కన్నుల జూపుచు నొక్కరొక్కరిన్
నేరుపు లాగివేయగను నిశ్చయ మందరి ప్రాణవాయువుల్
భారత యుద్ధరంగమున బార్థుడు పొందె పరాజయమ్మయో
భారతమంతయు విని నీ
రిప్లయితొలగించండివీ రీతిని బలుక దగునె వెంగళితనమున్
ఊరక వాగుట గానెటు
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికౌరవ రాజులందరిని కాట్పడ జేసె పరాక్రమంబునన్
భారత యుద్ధరంగమున బార్థుడు; పొందె బరాజయమ్మయో
పోరున ఘోరమౌ విధము పూర్తిగ రాజు సుయోధనాదులున్
వారొనరించినట్టివగు పాపక్రియా ఫలితమ్ములొందగన్.
ఘోరపరాజయమ్ము కురుకూటమి పొందునటంచు నాడు కం
రిప్లయితొలగించండిసారి వచించెనంచువిని సాద్వసమందగ కర్ణపత్నియే
చారికయుగ్గడించె నిశి స్వప్నము గంటి భయంబు వీడుమా
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో
వీరత్వమ్మును చూపగ
రిప్లయితొలగించండితీరుగ విచ్చే సెగాని తేరది క్రుంగన్
భీరువుగానిల్చిగనుచు
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్
కౌరవ సేనలోనచట కల్గెను భీతియు చూచు చుండగా
సారథి గానువీ రుడగు శల్యుడె యున్నను నస్త్రధా టికిన్
తేరది క్రుంగగాబలముదీనముగావిలపించుచచ్చటన్
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో”*
పార్థుఁడు:కర్ణుడు.