6, అక్టోబర్ 2020, మంగళవారం

సమస్య - 3509

7-10-2020 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గజమునుం జంపెను హరి చక్రమ్ముతోడ"
(లేదా...)
"గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్"
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)

82 కామెంట్‌లు:

 1. లావొకింతయు లేదను రది మొర విని
  యధిక వేగమున వెడలి యచట గాంచె
  గజమునుం ; జంపెను హరి చక్రమ్ముతోడ
  మకరిని, సిసుని గాపాడు మతము తోడ

  రది = ఏనుగు

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హరియె హరునిజాడ నెఱిగి నరయ దనుజ
  గజమునుం జంపెను; హరి చక్రమ్ము తోడ
  మొండిపట్టున బాధించు మొసలి నడచి
  తనను వేడిన గజమును మనుపుజేసె.

  రిప్లయితొలగించండి


 3. కావు మయ్య యనుచు వేడ గాచి తృటిని
  గజమునుం, జంపెను హరి చక్రమ్ముతోడ
  మొసలిని! శరణాగతి మోక్ష మునకు మేలు
  మార్గమమ్మ జిలేబి ప్రమాణ మిదియె


  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. జీపీయెస్ వారి ఫ్రెంచ్ లీవ్ ఇవ్వాళ కూడానా ?  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఏల ఆభరణమును త్యజియించిరి ? :)


   జిలేబి

   తొలగించండి

  2. గత ఆరు నెలలుగా ఇల్లు కదలక పనీ పాటా లేకుండా తిని కూచొనడంతో జీర్ణ శక్తి దెబ్బ తిని నిరంతరం తూగు వచ్చి బుఱ్ఱ పనిచేయడం మానేసినది.

   తెల్లవారు ఝామున తెలివి వచ్చినది కొంచెం

   😊

   తొలగించండి
 5. త్రిజగద్రక్షకుడౌట కావు మనుచున్ దీనంబుగా బిల్వగా
  నిజ సత్వంబున రేగునక్రపు గతిన్ నిస్సారముం జేసి స్వీ
  యజనున్ బ్రోవగ భక్తి తత్పరుని న్యాయాధారు భక్తాగ్రగున్
  గజముం, జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. సుజనత్రాణపరాయణుండట! పయశ్చోరుండు దుశ్శీలుడై
   త్రిజగద్వంద్యుడ! నింద్యుడౌ నను
   శతాధిక్యప్రలాపమ్ములన్
   నిజగర్వోక్తులనున్ క్షమించి, క్షితిజానిం జేదిరాజన్యది
   గ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 7. శిశుపాలవధ

  మ||
  సుజనుల్ మెచ్చగ రాజసూయమును దిక్సూచిన్ వలెన్ కృష్ణుడున్
  ధ్వజమయ్యెన్ శిశుపాలుడచ్చటనసేవ్యంబైన వాగ్ధాటితోన్
  నిజమున్ బ్రేల శిరస్సు ద్రుంచెనట సందేహాత్ముడౌ దైత్యది
  గ్గజమున్ జంపెను మాధవుండు ఘనచక్రంబున్ బ్రయోగించియున్

  రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 8. దేనినిం కాచగన్ హరి మానినిన్ వ

  దలి పరుగిడె,మడుగున వదలక పట్టి

  న మకరిని చూచి యేరీతి నన్ వధించె

  గజమునుం,జంపెను హరి చక్రమ్ము తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోష మున్నట్టున్నది.

   తొలగించండి
 9. మొరలిడగను కాపాడంగ చేరె దీన
  గజమునుం, జంపెను హరి చక్రమ్ముతోడ
  మకరిని, విడువడట లక్ష్మికోక చెంగు
  భక్త రక్షణ మందున భార్య కనడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.

   తొలగించండి


 10. వ్రజనాథున్ కొనియాడు! గావు మన భావావేశుడై గాచెనా
  గజముం, జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్
  ప్రజవిన్ కుంభిని! పూసపాటి శరణారథ్యమ్మె మేలైనదై
  రుజుమార్గంబగు మోక్షగాములకు నారూఢమ్ముగా నేర్వగా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. మకరిబారినచిక్కిన మదగజంబు
  రావెయీశ్వరాయనివేడ రక్షజేయ
  గజమునుం, జంపెను హరి చక్రమ్ముతోడ
  మకరినార్తరక్షకుడౌట మాధవుండు

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అజునిన్ గర్భమునందు దాచుకొని నానందించు దైత్యుండునౌ
  గజముం జంపెను మాధవుండు; ఘన చక్రమ్ముం బ్రయోగించియున్
  ధ్వజమున్నేనుగు నొవ్వజేయు మకరిన్ తా జంపి కీర్తించు నా
  గజమున్నాదుకొనెన్ దయాహృదయుడై ఖ్యాతిన్ననంతుండటన్.

  రిప్లయితొలగించండి
 13. తేగీ.
  కరి,మకరులు పోరాడెడు క్రమమునందు
  చేవ చచ్చిన గజరాజు చేతలుడగ
  హా! యనుచు నమ్మి మొరలిడి నంతఁ నంబు
  గజమునుం జంపెను హరి చక్రమ్ముతోడ.

  అంబుగజము-మొసలి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. బాగున్నది. అభినందనలు.
   మొరలిడినంత... తరువాత అరసున్న అవసరం లేదు.

   తొలగించండి
 14. బాధతో వేడ నాలించి వచ్చి గాచె
  గజమును o : జంపె ను హరి చక్రమ్ము తోడ
  మొసలి కుత్తుక ఖండించి మోద మునను
  కరుణ తో ముక్తి నొసగెను కరికి తాను

  రిప్లయితొలగించండి
 15. ఆదిభట్ల సత్యనారాయణ

  సమర మొనరించె నరకుతో సత్యభామ
  వినుత గంభీర శౌర్యాన విభ్రమముగ
  సరసు డయ్యును రిపుహారి శౌరి,దైత్య
  గజము నుంజంపెనుహరి చక్రమ్ముతోడ

  రిప్లయితొలగించండి

 16. మకరి కాలును పట్టంగ మ్రాన్పడి మొర
  పెట్ట కావగ శ్రీహరి వేగ వచ్చి
  గజమునుంజంపె ను హరి చక్రమ్ము చేత
  జలచర మ్మున కత్తిరి శాపముడిగె.


  అజరుద్రాదులు వేడగా వడిగ తానచ్చో టకంబమ్ము న
  క్కజమౌరీతిగబుట్టనెల్లరును దిగ్భ్రాంతిన్ దిశల్ గాంచగన్
  కుజనుండౌకనకాక్షుసోదరుడునౌక్రూరుండునౌదైత్యది
  గ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'జలచరమ్మున కత్తరి...' టైపాటు.
   రెండవ పూరణలో హిరణ్యకశిపుడు హరి చక్రంతో చంపలేదు. గోళ్ళతో చీల్చి చంపాడు.

   తొలగించండి
 17. ఈనాటి శంకరా భరణము వారి సమస్య


  గజమునుం జంపెను హరి చక్రమ్ము తోడ

  ఇచ్చిన పాదము తేట గీతి
  నా పూరణ సీసములో


  సిరికిని‌ చెప్పక,కరమున శంఖు చ
  క్రమ్ములను ధరించ క
  సతతంబు

  వెన్నంటి కాచెడి ప్రియ పరి వారమున్
  వెంట తోడ్కొనక,
  విక్కిజ ఘను

  వాహనం బెక్కక వదనపు తిలకము
  సరిచూసు కొనక కేశములను ముడి

  పెట్టి బిగించక వేలి నఖ ములలో
  దూరిన పద్మాక్షి చీరను విడ

  వక ,పరుగును బెట్టుచు నా భువనము‌ లోని

  సరసు వద్దకు జేరి మకరపు బంధి

  యైన గజమును కాంచి రయముగ అంబు

  గజము నుం జంపెను హరి చక్రమ్ము తోడ

  అంబు గజము= మొసలి
  విక్కిజము = పక్షి

  రిప్లయితొలగించండి
 18. జి. ప్రభాకర శాస్త్రి గారి సరదా పూరణ....

  భుజమున్ లాగుచు నక్రమే మురియగన్ మోసమ్మునన్ నీటనున్
  "భజగోవిందము" పల్కుచున్ మనమునన్ బంగాలు రాష్ట్రమ్మునన్
  గజమే కూయగ, గాఢనిద్ర తెగగన్ కంగారునన్ మత్తునన్
  గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. భజగోవిందపు కేకలన్ వినగ తా వయ్యారియౌ భామనున్
   భుజమున్ మోసెడి వాహనంబు విడుచున్ ముగ్ధుండునై పర్వుచున్
   గజమున్ లాగెడు నక్రమున్ వడివడిన్;... గారాబుగా బ్రోచుచున్
   గజముం;...జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 19. భుజగర్వమ్మున చేదిరాజు వదరన్ మూర్ఖత్వమున్, గాచె నం
  బుజనాభుండిల నూరుతప్పులను సంమోదమ్ముతో నత్త నీ
  రజనేత్రున్ దయచూప కోర పిదపన్ రాజాధమున్ చైద్య ది
  గ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

  రిప్లయితొలగించండి
 20. ప్రజ కారాధ్యుని పాండవేయులకు సామ్రాజ్య ప్రసాదిన్హరిన్
  భుజ గర్వోద్ధతి ఛేది రాడ్విభుడు దుర్మోహంబు నన్దూర నం
  భుజగర్భుండు యశోద నందనుడు ధర్మోద్ధారణన్దైత్యది
  *"గ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్"*

  రిప్లయితొలగించండి
 21. మైలవరపు వారి పూరణ

  గజమానాడు సరస్సులో దిగగనే గ్రాహంబుచే జిక్కి., యం...
  బుజమున్ తొండముతోడనెత్తి., హరినంభోజాక్షునిన్ భక్తితోన్
  భజియింపన్ శరణంచు., వారిచరమున్ దంతప్రయోగార్తస...
  ద్గజమున్ జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
 22. శరణు శరణంచు వేడిన కరి మొర విని
  పరుగు పరుగున వచ్చెనా పావనుండు
  బైరి కోరల నుండి కాపాడ దలచి
  గజమునుం, జంపెను హరి చక్రమ్ము తోడ.

  రిప్లయితొలగించండి
 23. చక్రిచూసెనుబాధతోగ్రుంగిపోవు
  గజమునుం,జంపెనుహరిచక్రమ్ముతోడ
  గరినిబట్టినమొసలినిగరుణవీడి
  భక్తరక్షణజేయునుబ్రత్యగాత్మ

  రిప్లయితొలగించండి
 24. కె.వి.యస్. లక్ష్మి:

  కరి మకరులు పోరాడెడి కాలమందు
  డస్సిన కరి, హరిదయవేడగ నిలిపెను
  గజమునుం; జంపెనుహరి చక్రమ్ము తోడ
  మొసలిని నొసగెను పరమమ్ము కృప జూపి.

  రిప్లయితొలగించండి
 25. రిప్లయిలు
  1. తేటగీతి
   చేవ చాలదు ధైర్యము చిన్నబోయె
   నీవె శరణంచు నార్తితో నింగిఁ జూడ
   నిర్దయఁ జెలఁగు మకరినిన్ నిల్ప, కావ
   గజమునుం, జంపెను హరి చక్రమ్ముతోడ

   మత్తేభవిక్రీడితము
   అజుడౌ కృష్ణుని యగ్రపూజకని యాహ్వానించఁగన్వచ్చి ధ
   ర్మజ! చోరున్ బరకాంతలన్ మరుగుచున్ రంజిల్లు మోహాంధునిన్
   ద్విజుఁడెట్లందువనన్ శతాధికముగన్ నిందించెడున్చైద్య ది
   గ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 26. అజునిన్ జంపె మహేశ్వరుండు దన కోపాగ్నిన్ బ్రయోగించియున్,
  గజమున్ గాచెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్;
  నిజమెట్లౌ నిటు బల్కుటే దగదుగా నీవెన్నడున్ నాయనా
  "గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్"

  రిప్లయితొలగించండి
 27. సుజనోద్ధారకుడాప్తమిత్రుడనుచున్ స్తోత్రంబునే జేసి యం
  బుజనాభుండను గారవించి కొలువన్ మూర్ఖుండొకండంతటన్
  త్రిజగద్వంద్యుని దూరుచున్ సభను సందేహింప నాదుష్ట ది
  గ్గజముం జంపెను మాధవుండు ఘన చక్రమ్ముం బ్రయోగించుచున్.

  రిప్లయితొలగించండి
 28. పుత్రులు నమాత్యు లసురులు పోరుచు మడి
  యంగ దారుణ రీతిని సంగరమున
  రావణుం డచ్చెరువు నంద రఘువరుండు
  గజమునుం జంపెను హరి చక్రమ్ముతోడ

  [గజము =గజములతోఁ గూడికొన్నది, గజబలము; హరి చక్రము = కోతుల సమూహము]


  సృజియించంగను రక్ష నీయగను దాక్షిణ్యమ్మునం జంపగం
  ద్రిజగద్వ్రాతము నందు శ్రీహరియె యా శ్రీకాంతుఁడే దిక్కగున్
  గజముం గాంచి తదార్తనుం గరుణఁ దాఁ గాపాడి తన్నక్ర రా
  డ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

  రిప్లయితొలగించండి
 29. తే. గీ.
  ఒకనిషాదుని గజమును నొంచ జూసె
  వేట సాగించె సింగము వివిధ గతులఁ
  గాని యోడి కుటిల బుద్ధిఁ గరిని జంప
  "గజమునుం జంపెను హరి చక్రమ్ముతోడ"

  హరి = సింహము
  చక్రము = సమూహం
  ------- శ్రీరామ్ 10వ తరగతి

  రిప్లయితొలగించండి
 30. త్రిజగద్వంద్యుడుచూచెనచ్చటనుభీతింవిహ్వలంబొందునా
  గజముం,జంపెనుమాధవుండుఘనచక్రమ్ముంబ్రయోగించియున్
  సుజనుల్ మెచ్చుచుదీవనల్ నొసగనాసుత్రామురక్షించగా
  నజునిన్ బోషణరక్షణన్ మెలగునాయారాక్షసాగ్రాధిపున్

  రిప్లయితొలగించండి
 31. మ:

  విజయంబెంచి ప్రతీకగా జరుపు నీవిశ్వంబు దీపావళిన్
  ప్రజలీరోజు టపాసులున్ మిగుల నిప్పంటించి జై కొట్టరే
  గజ గుర్తుండిన విష్ణుచక్ర మట నొక్కందాని గాల్చంగనా
  గజముం జంపెను మాధవుండు ఘన చక్రమ్మున్ బ్రయోగించగన్


  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 32. భక్తితో హరిని గొలచి బిలువ వచ్చె
  కరుణతో స్వామి మకరిని గనగ దునిమె
  నచట కానరాని మదమత్సరమును పెను
  గజమునుంజంపెను హరి చక్రమ్ముతోడ

  రిప్లయితొలగించండి
 33. మూడవ పాదం:
  నచట కానరాని మదమత్సరమను పెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, మూడవ పాదాలలో యతిదోషం. సవరించండి.

   తొలగించండి
  2. నిజవాసంబగునీటిలోనకరినిన్ నిర్జించనుద్యుక్తయై
   గజపాదంబునుబట్టెనా మకరి నాగంబంతటన్ వేడ యం
   బుజనాభుండరుదెంచినక్రమునుకోపోద్విగ్నతన్, కావగన్
   గజముం, జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్

   తొలగించండి
 34. భక్తితో హరిని గొలవ భారమనక
  కరుణతో స్వామి మకరిని గనగ దునిమె
  నచట మదమత్సరములుగ నరుని దాగు
  గజమునుంజంపెను హరి చక్రమ్ముతోడ

  రిప్లయితొలగించండి
 35. వ్రజభూమీశుడు రాధికాసఖుడు
  గోపాలావళిన్ బ్రోచెడిన్
  త్రిజగన్మోహను డామురారి బహు ధాత్రీశుల్ విరాజిల్లెడున్
  విజయోత్సాహపు పర్వమున్ కినియుచున్ ప్రేలాపనల్ నాపగా
  గజముం జంపెను మాధవుండు ఘన చక్రమ్మున్ బ్రయోగించుచున్

  గజము మదమునకు ప్రతీక
  శిశుపాలుడు మదోన్మత్తుడు

  రిప్లయితొలగించండి
 36. మకరి కాలును పట్టంగ మ్రాన్పడి మొర
  పెట్ట కావగ శ్రీహరి వేగ వచ్చి
  గజమునుంజంపె ను హరి చక్రమ్ము చేత
  జలచర మ్మున కత్తిరి శాపముడిగె.

  రిప్లయితొలగించండి