5-10-2020 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల"
(లేదా...)
"రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై"
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల"
(లేదా...)
"రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై"
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
కపటమ్మైనవి కార్యముల్ సలుపుచున్ కంగారులన్ కూలుచున్
తపనల్ తాళక కాపురమ్ములనిటన్ తాదాత్మ్యమున్ కోరుచున్
జపముల్ జేయుచు రాత్రినిన్ పవలునున్ శ్రద్ధాళురై కంసునిన్
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కంసరా। డ్రిపునిం గాంచి..." అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండిఅంత పెద్ద సమాసం నా వల్ల కాదుగా!
*5-10-2020 (సోమవారం)*
రిప్లయితొలగించండి*సమస్య - 3507*
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
*"రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల"*
(లేదా...)
*"రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై"*
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమా ర్ గారికి ధన్యవాదాలు)
నా పూరణ
చల్లని కిరణములు వెద జల్లుచు జగ
ముకు వెలుగు నిడ, ప్రాఙ్నగముల నడుమన
శోభతో దర్శనము నిడు చుండు తిమిర
రిపుని గాంచి వందన మిడిరి జను లెల్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జగ।మునకు వెలుగిడ... నడుమను.." అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
2014:
తపనల్ తీర్చెడి నేతనున్ వెదకుచున్ తంటాలనున్ సైచుచున్
చపలమ్మయ్యెడి భారతీయ కలినిన్ జాగ్రత్తగా నెన్నుటన్
విపినమ్మందున రాజకీయ విటపిన్ పేరొందినన్ తిమ్మనిన్
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరావణాసురు నడచి ధరణిజ తోడ
మురియుచు నయోధ్య జేరిన పురుషవరుని
ధర్మవిదుడు రాముని విష్ణుతత్త్వపు మధు
రిపుని గాంచి వందనమిడిరి జనులెల్ల.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభానుడుదయించె నింపుగ పగటి రేడు
నిఖిల జీవుల చైతన్య నియతి తోడ
కమలములుమురిసెవిడిన కనులc, గలువ
రిపుని గాంచి వందనమిడి రి జనులెల్ల
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదైవమును జూడ కాశికి తరలి రెల్ల
రిప్లయితొలగించండిరచ్చముగ గంగలో తానమాచరించి
యచటనున్న దేవాలయమందు మదన
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల
అచ్చము = శుచి
మదనరిపుడు = శివుడు
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికరమున మురళి ధరియించి యురము నందు
రిప్లయితొలగించండికౌస్తుభమ్మును గలిగిన కంభుధరుడు
యదుకులోత్తము డైనట్టి హరిని కంస
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కంబుధరుడు" టైపాటు.
కరిమొరవిని దురమునను పరుగిడు
రిప్లయితొలగించండివర
దుని మకరహరుని ఖరుని దునిమిన
ధర
ణిజ వరుని దశరథ సుతుని హరిని
ముర
రిపుని గాంచి వందనమిడిరి జనులెల్ల
అపురూపంబగు రాజసూయమున
నగ్రాధ్యాసనంబున్ దగన్
తపనున్ బోలెడుకాంతితో దనరు పద్మాక్షున్ జగన్నాథునిన్
తపసుల్ నిత్యము ధ్యానమందునను
సందర్శించు వానిన్ తమో
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్
ప్రీతిన్ మహోత్సాహులై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసర్వలఘు తేటగీతి (సమస్యను విడిచి) బాగున్నది.
ధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివిపులంబైన పరాక్రమంబున ననిన్ పెచ్చారి లంకేశునిన్
ఉపపాతమ్మొనరించి భార్య కుజతో నుప్పొంగు నానందమున్
అపురూపమ్ముగ నేగుదెంచెడి దొరన్ యారామునిన్ రావణా
రిపునింగాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"దొరన్+ఆ" అన్నపుడు యడాగమం రాదు. 'రావణరిపునిం' అనడం సాధువు. అక్కడ "దైత్యరా।డ్రిపునిం గాంచి.." అందామా?
విపులంబైన పరాక్రమంబున ననిన్ పెచ్చారి లంకేశునిన్
తొలగించండిఉపపాతమ్మొనరించి భార్య కుజతో నుప్పొంగు నానందమున్
అపురూపమ్ముగ నేగుదెంచు ప్రభువున్నారామునిన్ దైత్య రా
డ్రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై.
గురువుగారికి నమస్సులు.
తొలగించండిభీష్ము డెరిగింప తొలిపూజ వేణు ధరుని
రిప్లయితొలగించండికొసగ రాజసూయమునందుఁ నొప్పు కొంచు
స్వీకరించగ శ్రీకృష్ణు, చేద్యధీషు
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చేద్యధీశు" టైపాటు.
సమస్య :
రిప్లయితొలగించండిరిపునిం గాంచి నమస్కరించిరి జనుల్
ప్రీతిన్ మహోత్సాహులై
( బుద్ధభగవానుని దర్శించిన ప్రజలు )
" ఉపమింపంగ మరొక్కరేరి ? " యని శా
క్యోత్తంసుడౌ బుద్ధునిన్
గృపలన్ జిందెడి మానవత్వమహితున్
హృద్యున్ శుభాంగున్ ఘనున్
దపమున్ జేయుచు జ్ఞానమున్ గనిన యా
ధన్యాత్ము మాయాతమో
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్
ప్రీతిన్ మహోత్సాహులై .
( శాక్యోత్తంసుడు - శాక్యవంశాభరణుడు ;
మాయాతమోరిపుడు - అవిద్య అనే చీకటికి శత్రువు )
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి పూరణ
రిప్లయితొలగించండిఅనయము విశ్వపాలనజనావనకార్యనిమగ్నచక్రి శ్రీ
వనితను భూసతిన్ వరుస భార్యలుగాఁ గొనె,నందు నుర్వికిన్
జననము నొందెఁ సీత శివచాపవిభగ్నధృతావతారుడై
తన సుతఁ బెండ్లియాడె, నొక తండ్రి సుధీజనులెల్ల మెచ్చఁగన్.
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిಜನುಲು పಲು ಬಾಧಲಂದಿರಿ ದನುಜು ವಲನ
రిప్లయితొలగించండిಶರಣು కోರಿರಿ పరమాత్ముకరుణ చూప
తమను రక్షింప వచ్చిన దనుజ సంఘ
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెಲ್ಲ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒకటిన్నర పాదాలు కన్నడంలో టైపు చేసారు !
రిప్లయితొలగించండిరావె శంకరాభరణము రమ్మనె త్వరి
తముగ తేటగీతి ని వ్రాయ తరము గాను
పొద్దు పొడిచె నదిగొ తూరుపు దెస తిమిర
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల
ఉభయకుశలోపరి
శుభోదయం
జిలేబి
తొలగించండిఆహా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ దర్శన భాగ్యం!
ఈరోజు నిజంగానే ప్రొద్దు పొడిచింది జిలేబీ గారి రూపంలో... సంతోషం.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విపులజ్ఞానవిశేషశాస్త్రవిదునిన్ విఖ్యాతతత్త్వజ్ఞునిన్
రిప్లయితొలగించండికృపతో శిష్యులఁ జూచు సద్గురువునిన్ శ్రేయోవిధిక్దర్శకున్
వ్యపనీతావృతదుఃఖవారకుని గాఢాజ్ఞానసమ్మోహధీ
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగిరినిధరియించి వేలిపై కృష్ణమూర్తి
రిప్లయితొలగించండిగోవులకుగోకులమునకు గూర్చెమేలు
కరుణతోవారిగాచిన గట్టుదాయ
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాళ హస్తికి యాత్రగా కదలి వెళ్లి
రిప్లయితొలగించండిభక్తి పూర్వక హృదయాన ముక్తి కొఱకు
మ్రొక్కు లిడుచును వరుసగా పోయి మదన
రిపుని గాంచి వందన మిడిరి జను లెల్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెళ్లి' అన్నది వ్యావహారికం. "వెడలి" అనండి.
తపముంజేసెడువారికండయయివిద్యాదానమున్జేయుచున్
రిప్లయితొలగించండిజపమున్ధ్యానములన్బరాత్పరునినిష్కామంబునన్గొల్చుచున్
స్థపతిన్బోలిభజించుఛాత్రహితునిన్శ్రద్ధాంతరంగున్దమో
*రిపునింగాంచినమస్కరించిరిజనుల్ప్రీతిన్మహోత్సాహులై*
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమదకరిమొరలిడసుమనసులుబొగడగ
రిప్లయితొలగించండిగరుడగమనుడుహరిపరుగుపరుగు
నరుగుదెంచినగనినళినాక్షుగైటభ
*రిపునిఁగాంచివందనమిడిరి జనులెల్ల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిత్రిపురారిన్ భజియించి నిశ్చలపు భక్తిన్, దాటి యంభోనిధిన్
రిప్లయితొలగించండికపి సైన్యమ్ము సహాయ మీయ ననిలో ఖండించి దైతేయులన్
చపలా నాథుడు చేర రాజ్యమునకున్ సౌఖ్యమ్ముగా దైత్యరా
డ్రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమేలుమాటలు పలుకుచు మెల్లగ దరి
రిప్లయితొలగించండిచేరి నోటుల యెరజూపి చేయిచాప
ఎన్ని కలలో మనకు నేతయేడి లోక
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిహరి రథమొసంగ రణభూమి హరియనంగ
వెంట హరిసేన వెల్లువై వీరమాడ
రణము గెల్చియు వచ్చెడు రావణాఖ్య
రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల
మత్తేభవిక్రీడితము
అపురూపంబుగ బట్టమున్ గొనక పిత్రాదేశ బద్ధుండునై
విపినంబేగియు జింకఁగోరు సతికై వేటాడి కోల్పోయి యా
కపులన్ గూడి వధించ వైరి, సతితో కాకుత్స్థునిన్ లంక రా
ట్రిపునిన్ గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిచివరి పాదం తమరి సూచిత సవరణమేరకు సవరించుకుంటాను.
మత్తేభవిక్రీడితము
అపురూపంబుగ బట్టమున్ గొనక పిత్రాదేశ బద్ధుండునై
విపినంబేగియు జింకఁగోరు సతికై వేటాడి కోల్పోయి యా
కపులన్ గూడి వధించ వైరి, సతితో కాకుత్స్థునిన్ లంక రా
డ్రిపునిన్ గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
కాంతిపుంజము వెదజల్లికలుగుతిమిర
రిప్లయితొలగించండిరిపునిగాంచి వందనమిడిరిజనులెల్ల
సూర్యుడగుపించు దినమునేశుభదినమ్ము
గదలతురుగద మనవారు నుదయభాను!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలుగు=వచ్చు, ఆంధ్రభారతి
రిప్లయితొలగించండికపిసైన్యమ్మును వెంటబెట్టుకుని లంకా రాజ్యమున్ జేరి యా
రిప్లయితొలగించండిత్రిపురారిన్ గడు భక్తితో కొలచు దైతేయుండహం భావి యౌ
యపరాధిన్ దునుమాడినట్టి ఘనుడౌ యారామునిన్ దానవా
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅపరాధంబుల కంతు లేదకట దుష్టాత్ముండు దైత్యుండికన్
రిప్లయితొలగించండివిపరీతంబగు కామ వాంఛ నతివన్ వేధించి బంధింపగా
కపులన్ దోడ్కొని వారిధిన్ గడచి లంకానాథుఁ గూల్చన్ దమో
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరహరా మహాదేవ నగాత్మజా మ
తొలగించండినో ముదావహ పాపు మా బాము లనుచు
గరళ కంఠు శంకరుని ముక్కంటిఁ ద్రిపుర
రిపునిఁ గాంచి వందన మిడిరి జను లెల్ల
అపురూపమ్మగు విగ్రహాకృతి మహాం డాధీశుఁడే వెల్గఁగం
గృపతోడం దముఁ గావుమం చడరి వేకీర్తించి సద్భక్తినిన్
విపరీతోగ్ర మహా సుదర్శనము దుర్భేద్యమ్ము శ్రే ష్ఠాయు ధా
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
[శ్రేష్ఠ +ఆయుధ +అరిపుని =శ్రే ష్ఠాయు ధారిపుని; అరిపుఁడు = చక్రమున కధిపతి]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక వందనములు.
తొలగించండినిపుణన్ గాంతిని నిచ్చుచున్ జనుచునానీలాకాశమున్ దమో
రిప్లయితొలగించండిరిపునింగాంచినమస్కరించిరిజనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
యెపుడా సూర్యుడుగన్పడున్ మనకునయ్యెంభవ్యమానాడుగా
నపురూపంబగుబింబమాతడుగదాయార్యా!విలోకించగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "నీలాంబరంబున్ దమో..." అంటే సరి!
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండితస్మై కృష్ణాయ నమః🙏🙏💐🌹🚩🕉
అపురూపంబగు రూపమానగవులాహా! కోటిచంద్రద్యుతుల్!
ద్విపగంభీరములైనవా నడకలున్., దృక్కుల్ గనన్ నిత్యని...
ష్కపటమ్ముల్., చనుదెంచుచుండెననుచున్ కంసాదిదైత్యాళికిన్
రిపునింగాంచి నమస్కరించిరి జనుల్
ప్రీతిన్ మహోత్సాహులై!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
తొలగించండిమ:
రిప్లయితొలగించండివిపరీతంబగు వర్షమున్ విసుగునిన్ వేసార ధారాళమై
చపలాకాశము మేఘ గర్జనము జంఝావాతముల్ నిత్యము
న్నపరా చిత్తుని వేడగా తెరపి జ్ఞానంబొందె నన్నట్లు రే
రిపునిన్ గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
అపరా చిత్తుడు=శివుడు
రేరిపుడు=సూర్యుడు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిధన్యవాదములు
తొలగించండికొండపై తిరువీధి వేడుకగ దిరిగి
రిప్లయితొలగించండిభక్తి పొంగార మదినిండ స్వామి దలచి
మొక్కుతీర్చగ పొర్లుచుబోయి కంస
రిపుని గాంచి వందన మిడిరి జనులెల్ల
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి
కొండపై తిరువీధి వేగిర దిరుగుచు
తొలగించండిభక్తి పొంగార మదినిండ స్వామి దలచి
మొక్కుతీర్చగ పొర్లుచుబోయి కంస
రిపుని గాంచి వందన మిడిరి జనులెల్ల
ధన్యవాదాలు, గురువర్యా🙏🏻
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
రావణ వధ పిదప రఘురాము డవని
జ సహితముగ నయోధ్యకున్ జనగ నచట
వీధులన్ నిలబడి రామవిభుని, దైత్య
రిపుని గాంచి వందనమిడిరి జనులెల్ల.
ఉపవాసమ్ములు బ్రహ్మచర్యజప శాస్త్రోక్తేతరేజ్యావిధుల్
రిప్లయితొలగించండితపముల్ చేసిన రాని భాగ్యమనుచున్, తద్దర్శనాకాంక్షులై,
స్వపురంబందరుదెంచ ద్వారకపతిన్ సాల్వాదిదైత్యాళికిన్
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
కృప యాభూషణమై సమస్త దిశలన్ కీర్తి ప్రసారంబుతో
రిప్లయితొలగించండినుపకారం బిలవారికిన్ బ్రతిదినం బుత్సాహియై చేయు టల్
తపమం చెంచెడి స్నేహితున్ గని యనెన్ దా నొక్క డోయీ! యస
ద్రిపు! నిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
ద్వాపరయుగమున జనించె వాసుదేవు
రిప్లయితొలగించండిడనగ శిష్ట జనులకావ నవని హరియు
నమరవరులు మెచ్చ ఖలుల నణచిన ముర
రిపుని గాంచి వందన మిడిరి జనులెల్ల
దుష్టశిక్షణమును చేసి శిష్ట జనుల
కావ ధరలోనవతరించె కంబుపాణి
కన్న వారల చెరబాపి కాచిన మధు
రిపుని గాంచి వందన మిడిరి జనులెల్ల