19, అక్టోబర్ 2020, సోమవారం

సమస్య - 3520

 20-10-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్”

(లేదా...)

“భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై”

94 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  దోమలగూడ నందునను తొమ్మిది రోజుల పర్వమందునన్
  భీముని పాత్రనాడుటను భీతిని జెందుచు సమ్మతించగన్
  గోముగ స్వప్నమందునను గొప్పగ కాయము పుల్కరించగా
  భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై....

  రిప్లయితొలగించండి
 2. అందరికీ నమస్సులు..

  నా పూరణ యత్నం..

  *కం*

  నామది కోరగ నిప్పుడు
  'సామ్నే' జూడగ సమస్య సంబర పడితిన్!
  ఏమది అకటా! ఎవరా
  *“భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్”*?

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏🙏
  (ఇప్పటికింతే)😀

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సామునె' అనండి. లేకుండా ప్రాసదోషం.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువు గారు

   నామది కోరగ నిప్పుడు
   'సామునె' జూడగ సమస్య సంబర పడితిన్!
   ఏమది అకటా! ఎవరా
   *“భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్”*?

   *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*

   తొలగించండి
 3. అద్భుతరామాయణంలో సీత రావణుని కూతురు

  ఉ||
  రాముడు సీతనిన్ గనుట లాలితమైన సుకావ్యమైననున్
  కోమలి సీత రావణుని కూతురెయద్భుతరామగాధయం
  దేమనిచెప్పెదన్ విధములెన్నియొ రాముడు యుద్ధశౌర్యతన్
  భీముడు రావణాసురుని బిడ్డను బెండిలియాడె ప్రీతిమై
  రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వేములవాడ నెన్నికను వెఱ్ఱిగ జేయు ప్రచారమందునన్
  తామస రీతి త్రాగగను దండిగ విస్కిని తూలిపోవుచున్
  గోముగ పల్కెనాదటను కొండొక నేతయె నవ్వి యివ్విధిన్:
  “భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బి.కాం.లో ఫిజిక్స్ చదివిన నాయకుని వంటివాడేమో? అందులోను మందేసి ఉన్నాడు.
   మీ ఆటవిడుపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. రాముడు భీముడు కవలలు
  కాముని పున్నమి దినమున కోమలి గోరన్
  రాముడు గూడెను సీతను
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  రిప్లయితొలగించండి
 6. ఏమని వగచిన నేమగు
  భామలు తలచిన వరదలె బ్రతుకున మిగులున్
  క్షేమము గోరిన వినడే
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భామ హిడింబి పతి యెవడు?
  రాముడెవని జంపె? విలువిఱచి రఘుపతియే
  భూమి సుతనేమి జేసెను?
  భీముడు, రావణుని, సుతను పెండిలి యాడెన్.

  రిప్లయితొలగించండి


 8. మామా శకార! రా ర
  మ్మా మమ్ముల కావగా సమస్యకు చెప్పం
  గా మాకు పరిష్కృతినిదె!
  "భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్"


  శకార నీవే దిక్కు :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. ఆమనిలో రావణి గని
  సోముని తోడ్పాటున జని జోరుగ గుడిలో
  కాముడు ప్రేరేపించగ
  భీముడు రావణుని సుతను పెండిలి యాడెన్

  రావణి = రావణుని కూతురి పేరు
  అందరూ కలికాలంలోని వారే!

  తమిళనాడు కథ

  రాముడు మంచిబాలుడు పరాక్రమ వంతుడు భామ రావణిన్
  ప్రేమను కోరగాను తనపేరది నచ్చక
  పిల్లనీయనన్
  నామము మార్చుకొన్న బహునందము నందగ మామగారు ధీ
  భీముడు రావణాసురుని బిడ్డను పెండిలి యాడె ప్రీతిమై

  రిప్లయితొలగించండి
 10. సమస్య :
  భీముడు రావణాసురుని
  బిడ్డను బెండిలియాడె బ్రీతిమై

  ( రాక్షసశిల్పి మయుని కుమార్తె సులోచన
  రావణబ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తును
  వివాహమాడుట )

  ఆ మయు గూర్మి పుత్రి ; కమ
  లాయతనేత్ర; మనోజ్ఞవాక్య ; ని
  ష్కామ ; సుశీల ; ధీరవరు -
  సత్కులజాతుని - మేఘనాదునిన్ -
  భ్రామితభామినీగణుని -
  రాజితు - సంగరరంగమందహో !
  భీముడు - రావణాసురుని
  బిడ్డను - బెండిలియాడె బ్రీతిమై .
  ( రావణాసురుని బిడ్డను - ఇంద్రజిత్తును )

  రిప్లయితొలగించండి
 11. మామయు నల్లుడు రావణ
  భీముల పాత్రల వెలిగిరి పేరెన్నికగా
  ఆమంత్రితులిక బల్కిరి
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  రిప్లయితొలగించండి
 12. రామాయణ మంత వెదుక
  తామసియగు దశముఖునికి తనయలు లేరే !
  బామము వలదెట్టుల యే
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్ ?

  రిప్లయితొలగించండి
 13. రాముడు మనువాడె రతిన్,

  భీముడు రావణుని సుతను పెండిలి యాడెన్,

  కాముడు సిరినేలు కొనెన్

  నీమము తోననుచు నొక్క నిగ్గడి పలికెన్

  రిప్లయితొలగించండి
 14. రాముడు రావణాసురుని రమ్యపు పాత్ర ధరించు చుండన్
  సోముడు భీమనర్తనుగ శోభిలు చుండుట గాంచిరెల్లరున్
  గ్రామపు పెద్దలందరును గారవ మొందుచు చెప్పినట్లుగన్
  భీముఁడు రావణాసురుని బిడ్డనుబెండిలియాడెఁబ్రీతిమై

  రాముడు - యన్టి రామారావు(సీనియర్)
  సోముడు - చంద్రబాబు

  రిప్లయితొలగించండి
 15. తాగుబోతు కుమారుని‌ చూసి తండ్రి పలుకులు

  ఏమాయె నీకు మూర్ఖా?

  క్షేమము కాదిటుల పలుక , చెప్పుల తోడన్

  మోమున కొట్టెద ,నెప్పుడు

  భీముడు రావణుని సుతను పెండిలి యాడెన్

  రిప్లయితొలగించండి
 16. భామ హిడింబిపతి యెవరు,

  రాముడెవరిని దును మాడె,రాముడు జేసెన్

  యేమది జనకుడు కోరగ,

  భీముడు,రావణుని, సుతను పెండిలి యాడెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హిడింబ' అనండి. 'చేసెన్+ఏమది' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 17. భీముడు రావణు పాత్రలు
  రాముదు సోముడును వేసి రంజిలు వేళన్
  ప్రేమతొ బంధువు లవగా
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రేమతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ప్రేమను" అనండి.

   తొలగించండి


 18. కందోత్పల

  కలగంటిని ! సరి జేసి కు
  రుల, భీముఁడు రావణాసురుని బిడ్డను బెం
  డిలియాడెఁ బ్రీతిమై! కల
  తొలగెను చక్కటి సమస్య తోచె జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. భీముండాతడుబలమున
  సామజగమననుమనసునసతిగా గోరెన్
  దీమసముగరణముసలిపి
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  రిప్లయితొలగించండి
 20. మైలవరపు వారి పూరణ

  నామములయ్యె పాత్రలవి నాటకబృందములోని వారికిన్
  భీముడునాంజనేయుడు విభీషణుడట్టులె రావణుండనన్
  ప్రేమగ రావణుండు తన బిడ్డను కొమ్మని కోర భీమునిన్
  భీముడు రావణాసురుని బిడ్డను బెండిలి యాడె బ్రీతిమై.

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 21. ఏమేమో యోచించుచు
  పామరుని కరణిని తాను పవళించు తరి న్
  రాముడు కలలో గాంచెను
  భీముడు రావణుని సుతను బెండిలి యాడె న్

  రిప్లయితొలగించండి


 22. గ్రామము నందు రావణుని గాధను జూచితి నాటకమ్ముగా!
  భీమును చిత్రమొక్కటి రవీంద్ర థియేటరు లోన చూచి వి
  శ్రామము జేయ సంలయము! స్వప్నము సమ్మిళతమ్ము! బాపురే
  భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. రిప్లయిలు
  1. శ్రీమహనీయభవ్యగుణశీల, మనోజ్ఞసులోచనాఖ్య, సు
   త్రామజిదగ్రణిన్ దనుజరాజకుమారుని నుగ్రవీరునిన్
   ధీమతి మేఘనాథుని యుయుత్సువినిర్భరధైర్యనాశకృ
   ద్భీముఁడు రావణాసురుని బిడ్డను, బెండిలియాడెఁ బ్రీతిమై

   కంజర్ల రామాచార్య

   తొలగించండి
  2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 24. డా.బల్లూరి ఉమాదేవి.

  కామిని వేషమున దునిమె
  నామానినికావ జంపె నా రాఘవుడున్
  సోమునివిల్విరిచి జనకు
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్”

  రిప్లయితొలగించండి
 25. లేమ హిడింబి నెవ్వడు భళీ యన పెండిలియాడె ప్రీతిమై?
  ధీమతి లక్ష్మణుండెవని తేకువతో నెదిరించె నాజిలో?
  రాముడు భూమిజన్ జనకరాజ సుతన్ ముదమేమి చేసెనో?
  భీముడు-రావణాసురుని బిడ్డను-పెండిలి యాడె ప్రీతితో.

  రిప్లయితొలగించండి
 26. భామ హిడింబి పతి యెవరు?
  రాముడెవండను వధించె? రాజు జనకుడా
  రామునకు బంధు వెట్లగు?
  భీముఁడు, రావణుని, సుతను పెండిలియాడెన్.

  రిప్లయితొలగించండి
 27. కాముకుడైన భీముడను గండర గండుడు భంగ ద్రావియిన్
  గోమలినిన్ గమించి నను గొంగున గట్టు మటంచు వాగె మున్
  *“భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై”*
  కామిని తద్విధిన్ వరునిగా వరియింపని వెంబడించెలే

  రిప్లయితొలగించండి
 28. సామీరి యన నెవడు? సీ
  రాముం డెవరిని వధించె రణ రంగములో?
  నామైందహనుడు భీష్మకు
  *భీముఁడు;రావణుని;సుతను పెండిలి యాడెన్*

  రిప్లయితొలగించండి
 29. గురుశిష్యుల సంవాదం:

  కందం
  రామయణ, భారతముల
  ప్రామాణిక ద్వ్యర్థి కావ్య భావము వినియున్
  సోమరి వెధవా! పల్కితె!
  "భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్"

  ఉత్పలమాల
  ఏమని జెప్పితీకు విన నింపుగ రాఘవపాండవీయమన్
  రామచరిత్ర పాండవుల రాజిత గాథను ద్వ్యర్థి కావ్యమున్
  నా మరియాద నువ్ మఱచి నల్గురు నవ్వగ శిష్య! పల్కితే
  "భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై"

  రిప్లయితొలగించండి

 30. పిన్నక నాగేశ్వరరావు.
  ( క్రమాలంకారము)

  భామ హిడింబి పతి యెవరు?
  రాముడెవరిని వధియించె లంకను? విల్లున్
  రాముడు విరిచియు జనకుని....
  భీముడు; రావణుని; ....సుతను బెండిలి
  యాడెన్.

  రిప్లయితొలగించండి
 31. రామాయణమంతయు విని
  రాముని కేమగును సీత రమణీ యనగా
  భామకు చిఱ్ఱెత్తి యనెను
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  రిప్లయితొలగించండి
 32. ఏమీయిట్లంటిరియిట
  భీముడురావణునిసుతనుపెండిలియాడెన్
  రామాయణభారతములు
  సామీయిటజేర్చిరార్య!సరియనదగునా?

  రిప్లయితొలగించండి
 33. భూమిజగ వెలసె మిథిలన్
  రాముడు మునితో కదల విరిసెగ వదనముల్
  సామజగమనుడు రణమున
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్

  (సీతమ్మ వారు రావణతనయని ప్రతీతి) 🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 34. ఉ.
  శేముషి మీరఁగీచుకుని చెండినఁగుంతి సుతుండు యెవ్వఁడో?
  రాముడు లంకకేగిఁదన రాణినిఁబొందగఁజంపెనెవ్వనిన్?
  హైముడు శీతశైలపతి హర్షము నొందగ నేమి జేసెనో?
  భీముఁడు..., రావణాసురుని..., బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై!

  హైముడు = శివుడు
  -------- శ్రీరామ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుతుండు+ఎవ్వడో' అన్నపుడు యడాగమం రాదు. "కుమారు డెవ్వడో" అనండి.

   తొలగించండి
 35. ఉ:

  రాముడి వేషముందనుచు రమ్మని బిల్వగ జేర రంగమున్
  మోమున దెల్పిరచ్చటన ముచ్చట భీముని పాత్ర గైకొనన్
  సామును జూచు రావణుడు చావడి జేర నియుక్తుడిట్లనెన్
  భీముడు రావణాసురుని బిడ్డను బెండిలి యాడె బ్రీతమై

  నియుక్తుడు=Agent

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 36. ఆ మయు నాత్మజన్మ కమలాక్షి గుణోత్తమ శీలియైన యా
  భామిని యంబుజాక్షి సతి వారిరు హాసన పుష్కలాక్షియా
  రామ సులోచనాంగనయె రాక్షస ధీమతి, భండనమ్మునన్
  భీముడు రావణాసురుని బిడ్డను బెండిలి యాడెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 37. గోముగఁ గన్పడు కాంతను
  జామల నెంచంగ దిట్ట చారుతర ముఖిన్
  మా మంచి పట్టణమ్మున
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్


  ఏ మిది నే నెఱుంగ నసురేంద్రున కింపుగ బిడ్డ లుండిరే
  కోమలు లున్న నిక్కముగఁ గూతురునిన్ దశకంఠ తుల్యుఁడౌ
  భీమ పరాక్రమోన్నతపు వీరున కిచ్చును సత్య మందుకే
  భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 38. భీముడురావణాసురునిబిడ్డనుబెండిలియాడెబ్రీతిమై
  యేమనియంటిరిటయీపదమారయనమ్మబల్కునే
  భీముడుభారతమ్ముగదపెండిలియాడుటనెట్లుగానగున్
  దాముగజింతజేయుడిదితామునునచ్చెరువందురేగదా

  రిప్లయితొలగించండి
 39. భీముఁడతండు రావణుఁడు పిల్లకుదండ్రి గుణమ్ములందునన్
  భామనుజూచి మోజుపడి భార్యగజేకొనుదంచు కోరగన్
  భామినివల్లెయంచుతెలుపన్ కుతుకంబెసగంగ చెచ్చెరన్
  భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 40. ఏమనిజెప్పంగ వలెను
  భీముని రామాయణమున..,భీకరమిదియే
  రా! మునివర్య యిదేమీ
  భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్!!

  రిప్లయితొలగించండి