15, అక్టోబర్ 2020, గురువారం

సమస్య - 3516

16-10-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే"

(లేదా...)

"కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్"

100 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  దుష్టులు దుర్మతుల్ విధిగ తోషము మీరగ దుడ్డు పంచుచున్
  నష్టము లెల్ల తీర్చుకొని నందము నొందుచు గుఱ్ఱమెక్కుచున్
  భ్రష్టులు నేతలెల్లరును పండుగ జేయుచు గెల్వ వారికిన్
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్...

  రిప్లయితొలగించండి
 2. ప్రజాసేవలో జీవితమెల్ల ధారపోసి తాను కష్టాలనుభవించినా కొనసాగిన వాని గూర్చి..(డొక్కా సీతమ్మగారు గుర్థొచ్చారు)

  ఉ||
  కాష్టమునందు వాని మృతకాయము భగ్నమవంగ వానియం
  దిష్టము గల్గువారు పరిశీలన జేసె మహానుభావుడే
  శిష్టుడు ధర్మధాత జనసేవను జీవితమిచ్చెనింకనీ
  కష్టములన్ని దీరెనని కంటను నీరిడి యేడ్చిరెల్లరున్

  రోహిత్🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవంగ' అన్న ప్రయోగం సాధువు కాదు. "మృతకాయము కాలుచునుండ.." అనండి. కర్తృపదం 'వారు' బహువచనం, క్రియాపదం 'చేసె' ఏకవచనం. "పరిశీలన జేసి" అనండి.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సుష్టుగ లైను కట్టుచును జుఱ్ఱుచు గంజిని చిన్న ప్రాయమున్
  ముష్టికి పోవుటన్ విడిచి మోసము జేయుచు పాలిటిక్సునన్
  పుష్టిగ మేయుచున్ తనరి పూర్వపు రోజులు గుర్తురాగ మా
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. 'గంజి నుండి బెంజి వరకు' కాప్షన్ బాగుంది.

   తొలగించండి

  3. "గంజి తిన్న అనుభవం అదే సమయంలో బెంజిలో తిరిగిన అనుభవం నాకుందంటూ చిరంజీవి తన అనుభవాలను సమసమాజ సమస్యలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నారు. "

   https://www.google.co.in/amp/s/m-telugu.webdunia.com/ap-elections-news/%25E0%25B0%2597%25E0%25B0%2582%25E0%25B0%259C%25E0%25B0%25BF-%25E0%25B0%25A8%25E0%25B1%2581%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BF-%25E0%25B0%25AC%25E0%25B1%2586%25E0%25B0%2582%25E0%25B0%259C%25E0%25B0%25BF-%25E0%25B0%25A6%25E0%25B0%25BE%25E0%25B0%2595%25E0%25B0%25BE-108082600067_1.htm%3famp=1

   తొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తుష్టిని పొందిరి పౌరులు
  కష్టమ్ములు దీరెననుచు; గన్నీరిడిరే
  నష్టము గలిగెడి రీతిని
  భ్రష్టులు సలిపెడి ఖలమగు పాలన వలనన్.

  రిప్లయితొలగించండి
 5. మార్కండేయుని ఉపాఖ్యానం ఆధారంగా

  కం.
  శిష్టాచారము గలిగిన
  ముష్టిందయడే సబబని మురిసిన జనులే
  క్లిష్టముగ తనయునికి (నీ
  కష్టమ్ములు దీరె!) ననుచుఁ గన్నీ రిడిరే

  (నీకు + అష్టమ్ములు )

  ముష్టిందయడు = శిశువు
  అష్టమ్ములు =16 సంవత్సరాలు (అష్టము = ఎనిమిదింటి సమూహం )
  ----- శ్రీరామ్

  రిప్లయితొలగించండి
 6. విష్టిగ డబ్బులన్ కరొన పేరును చెప్పుచు గుంజుచున్ పా

  పిష్టి మనంబుతో ప్రజను పీల్చుచు వైద్యులు నుండగన్ తా

  కష్టము నేమియన్ పడక కాసులు వారలు పొందు చుండన్

  పుష్టిగ యిళ్లలో జనులు‌ భోజనమున్ తినుచుండగన్ అ

  దృష్టము గా జనంబునకు‌ తేలిక నవ్వగ, స్వస్తత తో

  కష్టము లెల్ల దీరెనని కంటను‌నీరిడి యేడ్చి రెల్లరున్


  కరోన తగ్గుతూ ఆస్పత్రు లలో పడకలు తగ్గుతూ ఉండ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల ఆ వేదన

  విష్టి =బలవంతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం అన్ని పాదాలలో గణభంగం. "గుంజునట్టి పా... వైద్యులు నుండగాను తా... పొందుచుండగన్... పుష్టిగ నిళ్లలో... తినుచుండగానె యదృష్టముగా... స్వాస్థ్యమందగా కష్టములెల్ల..." అనండి.

   తొలగించండి
 7. రిప్లయిలు
  1. కందం
   శిష్టులు నమ్మిన రాముడు
   నిష్టపడుచు తండ్రి కోర నేగగ వనికిన్
   తుష్టినిఁ గైకేయి మదిని
   కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే!


   ఉత్పలమాల
   స్పష్టముఁ జేసి నాథునకుఁ బట్టిన పంతము తీర్చమన్ననే
   శిష్టులు నమ్మురాముడటు చేరఁగఁ గానల తండ్రి కోరికన్
   దుష్టిని గల్గి కైకకిక నోచిన నోముల పండి నుర్విపై
   కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్


   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. స్పష్టత లేని పద్ధతులు బాధలనెన్నియొ తెచ్చెనంచు వి
  స్పష్టము గాను చెప్పె కడు వ్యాకుల చిత్తము తోడ నాటి యా
  నష్టము తొల్గెనే మనుకునంటువు నీదగు భూరి సాయమున్
  కష్టము లెల్లఁ దీరెనని, కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 9. కష్టాలెన్నియొ గాదే
  భ్రష్టుల సహవాసమంచు వ్యాకులు డైతా
  మిష్టులతో చెప్పుచు నే

  కష్టమ్ములు దీరె ? ననుచుఁ గన్నీ రిడిరే

  రిప్లయితొలగించండి
 10. దుష్టుండగు నా కీచకు
  నిష్టముగా భీమసేనుఁ డేచుక చంపన్
  నిష్టుర మాడెడు జనులే
  కష్టమ్ములు దీరెననుచుఁ గన్నీరిడిరే!

  రిప్లయితొలగించండి
 11. తుష్టిగ వెన్నపాలనిట దూగెడు ముద్దుల నందబాలునిన్
  దుష్టులు రాక్షసాధములు దుర్భర రీతిని కష్టపెట్టగా
  శిష్టులు నిర్ణయించి వ్రజసీమను వీడగ
  నల్లనయ్యకున్
  కష్టములెల్ల దీరెనని కంటను నీరిడి యేడ్చిరెల్లరున్

  ఆనంద బాష్పములు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇష్టుని పాలనమందున
   తుష్టిగ దొరుకగ పదవులు తోషముతోడన్
   భ్రష్టాచారులు చెలగుచు
   కష్టమ్ములు దీరెననుచు కన్నీరిడిరే

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏

   తొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తుష్టిని గూడి పౌరులిట దొడ్డగ సొక్కుచు సందడించె మా
  కష్టములెల్ల దీరెనని; కంటను నీరిడి యేడ్చిరెల్లరున్
  భ్రష్ఠుడునై చరించుదమ పాలకుడెంచెడి తీరుతెన్నులన్
  నష్టమొనర్చు కార్యములు నాటెడి దుష్ఫలితమ్ము లెంచుచున్.

  రిప్లయితొలగించండి
 13. కె.వి.యస్. లక్ష్మి:

  అష్టమ గర్భము నందున
  దుష్టుని సదమద మొనర్చి దు:ఖము దీర్చన్
  ఇష్టుడు కృష్ణుడు వెలయగ
  కష్టమ్ములు దీరెననుచు గన్నీరిడిరే!

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఇష్టుడు రఘుపతి తా నా
  దుష్టుడు రావణు నడంచ తోషముతోడన్
  నష్టము జెందిన వారలు
  కష్టమ్ములు దీరెననుచు గన్నీరిడిరే.

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఇష్టుడు నౌచు విశ్వమున నింపెసలారిన రామభద్రుడున్
  భ్రష్ఠుడునైన రావణుని పంతముగూడి వధించి నంతటన్
  నష్టముజెంది దు:ఖమున నల్గిన వారలు సంతసించుచున్
  కష్టములెల్ల దీరెనని కంటను నీరిడి యేడ్చి లెల్లరున్.

  రిప్లయితొలగించండి
 16. కష్టములిచ్చెను వరదలు
  నష్టము కలుగని వసతులు నాయకులీరే
  పుష్టిని కోరగ పౌరుల
  కష్టమ్ములు దీరు ననుచుఁ గన్నీ రిడిరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇష్టుడు కృష్ణుడు వచ్చెన్
   నష్టము గూర్చిన దనుజుల నాశము జేసెన్
   దుష్టుల్ సమసిరని జనుల్
   కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 17. సమస్య :
  కష్టములెల్ల దీరెనని
  కంటను నీరిడి యేడ్చిరెల్లరున్

  ( బొబ్బిలియుద్ధానంతరం ఫ్రెంచిదొర బుస్సీ రంగరాయని పుత్రుని రాజును చేసినప్పుడు ప్రజల భావన)

  " నష్టము నందినార మభి
  నంద్యులు వేంగళ రంగరాయలున్ ,
  శ్రేష్ఠుడు పాపరాయడును
  శిష్టయు మల్లమ వీడిపోవ ; సం
  క్లిష్టత నుంటిమే ! యిపుడు
  కీర్తిని బొందును జిన్నిరంగడే !
  కష్టములెల్ల దీరె " నని
  కంటను నీరిడి యేడ్చిరెల్లరున్ .
  ( రంగరాయడు, వేంగళరాయడు సోదరులు .
  మల్లమ రంగరాయని రాణి . పాపారాయడు
  మల్లమ అన్న .)

  రిప్లయితొలగించండి
 18. ఉత్పలమాల:
  +++++++++++
  నష్టపుజాతకమ్ముదని,నల్గురు దానిని దిట్టిపోయగా!
  దుష్టునివోలె నవ్వుచును,దూరుచుపేలుచు నట్టివారినిన్
  శిష్టముగాను వాక్సినిక,శీఘ్రముగానిక వచ్చువార్తతో
  కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 19. కె.వి.యస్. లక్ష్మి:

  ఇష్టుడు హనుమను వేడిన
  కష్టములు నీఱగు ననగ వినిన భక్తుల్
  స్పష్టమ్ముగ మహిమలుగని
  కష్టములు దీరె ననుచు గన్నీరిడిరే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం రెండవ గణం జగణమయింది. "కష్టమ్ములు నీఱగు..." అనండి.

   తొలగించండి
 20. ఉత్పలమాల:
  +++++++++++
  ఇష్టములేని పాలకులె,యిబ్బడిముబ్బడి ముద్దులిచ్చి మా
  కిష్టుడువీడులే యనగ కీర్తివహించెను ,వోట్లుగెల్చుచున్
  కష్టములన్నిబెట్టుచును,కర్షకులందరు దిట్టిపోయ,నే
  కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కీర్తి వహించిరి.." అనండి.

   తొలగించండి
  2. ఇష్టములేని పాలకులె,యిబ్బడిముబ్బడి ముద్దులిచ్చి మా
   కిష్టుడువీడులే యనగ కీర్తివహించిరి ,వోట్లుగెల్చుచున్
   కష్టములన్నిబెట్టుచును,కర్షకులందరు దిట్టిపోయ,నే
   కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.
   [సవరణ పాఠము ధన్య వాదాలతో]   తొలగించండి
 21. భ్రష్టుడునేతగాగ పరిపాలనయెట్టుల పాడియౌనులే?
  కిష్టుని మామకంసుడిల,కీర్తివహించెన కాలమందునన్
  తుష్టియె యున్నచాలదిట, త్రుళ్ళుచుపేలుజనాళియుండ నే
  కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కిష్టుడు'?

   తొలగించండి
  2. భ్రష్టుడునేతగాగ పరిపాలనయెట్టుల పాడియౌనుసం
   క్లిష్టముగాను కంసుడిల,కీర్తివహించెన కాలమందునన్?
   తుష్టియె యున్నచాలదిట, త్రుళ్ళుచుపేలుజనాళియుండ నే
   కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.
   [సవరణ పాఠము ధన్య వాదాలతో]   తొలగించండి
 22. కష్టపుకాలమందుననె కాసులుబట్టగ నాసుపత్రులే
  పుష్టిగ జేబుదొంగలుగ,పూర్తిగ దోచుట జూడగానయెన్
  నష్టపుజాతకమ్ములయి,నాశముగోరెడు వైద్యులుండ,నే
  కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.

  రిప్లయితొలగించండి
 23. అష్టమి నాడు పుట్టె పరమాత్ముడు కృష్ణుడు ధర్మమూర్తియై
  భ్రష్టుడు చీరనూడ్చుతరి పాహియనంగనె బ్రోచెనాతడే
  శిష్టుల రక్షజేయు ఘన చిన్మయ రూపుని వల్లనే గదా
  కష్టము లెల్లఁ దీరెనని, కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 24. ముష్టి దొరుక తుష్టి బడిరి
  కష్టమ్ములు దీరె ననుచుఁ ; గన్నీ రిడిరే
  మృష్టాన్నము గాదిదియ ని
  కృష్టులు విష గలిపిరను యొకింత
  యనుమనన్

  విష = విషము
  అనుమ = అనుమానము , ఊహ

  రిప్లయితొలగించండి
 25. సమస్య :-
  "కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే"

  *కందం**

  ఇష్టమ్ముగ కొలిచిన నే
  కష్టమ్ములు దీరె? ననుచుఁ గన్నీ రిడిరే!
  స్పష్టమ్ముజేయ మేలగు
  భ్రష్టాచారమది కష్టపడమను దేవా!
  ...............✍️చక్రి

  రిప్లయితొలగించండి


 26. ఇచ్చిన కంద పాదమెక్కడే జిలేబి‌?  అనఘా! కవివర! చోద్యము
  గనున్న దే ? యెవ్వరష్టకష్టమ్ములు దీ
  రెననుచుఁ గన్నీ రిడి, రే
  గిన మది కలతలను మరిచి కినుక విడిచిరో?


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి


 27. విలేకరి బాలకృష్ణ గారికి‌ అంకితం :)


  "వడి దాటె కరోన మురువ
  నడ! కష్టము లెల్లఁ దీరెనని కంటను నీ
  రిడి యేడ్చి రెల్లరున్!" భళి
  సడించెను విలేకరి ! తన శైలిని సుదతీ!  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. విష్టిగగడ్పుసూలయనివిప్రుడొకండుగతించనెంచినన్
  శిష్టుడుదేశికుండునరసింహసరస్వతిగాంచిబెట్టెసం
  తుష్టిగపంచభక్ష్యములుదోషమురోగముశోకమూడనీ
  *కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్*

  రిప్లయితొలగించండి
 29. దుష్టుని పాలన పోయె
  న్నిష్టముగా పనులు చేయు నేలుబడొచ్చె
  న్స్పష్టము సుఖములు మనకిక
  కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే

  రిప్లయితొలగించండి
 30. ఉ:

  దుష్టుల గూడి దిర్గుచును దోపిడి దొంగగ ఖ్యాతి గాంచగన్
  ముష్టియె నెత్తు వారలకు మోదమునొందగ ధర్మశాలకై
  పుష్టిని గూర్చ నా విధికి పూజ్యుడ వంచని ప్రస్తుతించగన్
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 31. దుష్టుని రాముని చంపెను
  నష్టము నొందిరి దనుజులు నవనిజఁ దెచ్చెన్
  స్పష్టము గారాముఁ దలచి
  కష్టములు దీరెననుచును గన్నీరిడిరే

  రిప్లయితొలగించండి
 32. మైలవరపు వారి పూరణ

  క్లిష్టపరిస్థితిన్ నిదురలేని నిశల్ గడిపెన్ వనాంతరా
  విష్టనిశాచరాళి పరివేదనలన్ భరియించి సీత., సం..
  క్లిష్టపరిస్థితిన్ మరల కీలలలో బడెనింకనీమెకున్
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 33. నష్టము కల్గించు నరకు
  దుష్టుని కృష్ణుడు దునుమగ దుఃఖము తొలగన్
  తుష్టిగ లోకము లయ్యెడ
  కష్టములు దీరె ననుచు కన్నీరి డి రే

  రిప్లయితొలగించండి
 34. దుష్టుండా శిశుపాలుడు
  భ్రష్టుండైకృష్ణుచేత మ్రగ్గగ దానే,
  శిష్టులునాపాండుసుతులు
  కష్టమ్ములు దీరె ననుచు కన్నీరిడిరే!

  రిప్లయితొలగించండి
 35. కం
  కష్టమ్ముల దీర్చెదనని
  శిష్టజనమ్ముల ధనమును స్తేయముజేసెన్
  సుష్టిగ మోసమిదియె, ము
  క్కష్టమ్ముల దీరె!ననుచు కన్నీరిడిరే

  ముక్కష్టము = క్షవరము
  తీరె = విధము

  రిప్లయితొలగించండి
 36. (అవినీతి అధికారిని అవినితినిరోధక శాఖ పట్టుకుంటే నిజాయితీ గల ఉద్యోగుల ఆనంద భాష్పములు)
  ఇష్టమువచ్చినట్లు కొని యెక్కువ బియ్యము స్వార్థబుద్ధితో
  నష్టముచేయ పాలకుడు నాణ్యత చూడక, పట్టి చారులే
  బ్రష్టుని తీసివేయ, పరిపాలన మందున మంచి కూరగా
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 37. చేష్టలు వీడి దుఃఖమున చేతులు కాళ్ళు కదల్చలేక సు
  స్పష్టత లేని భాషణలఁ బొరలి శయ్యలనై మలమూత్రముల్ కటా!
  కోష్టనిబద్ధగోవు వలె కుంది హతుండగు వానిఁ గాంచుచుం
  గష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 38. శిష్టుల కావగ నెంచుచు
  అష్టమ గర్భమున బుట్టి యష్టమినాడే
  యిష్టముతో చెర విడునని
  కష్టమ్ములు దీరెననుచు కన్నీరిడిరే.

  రిప్లయితొలగించండి
 39. దుష్టుని పాలనమ్మునకు దూరము బెట్టుచు క్రొత్తవానినిన్
  శిష్టుడటంచు పగ్గములు చేతి కొసంగ దలంచి నెంతయో
  యిష్టము జూపి ఎన్నుకొన నిమ్ముగ నాతడు రాజ్యమేలగా
  కష్టము లెల్ల దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 40. రెండవ ప్రయత్నము:
  ఉ:

  చేష్టలు మీర వల్లభుడు శీఘ్రమె వెన్నలు దొంగిలించుచున్
  పుష్టిగ మెక్కుచున్ కడకు పోవడు మాతృక కొంగు చాటుకున్
  వేష్టితమొంద గొల్లతలు వేదన దీర్చగ వేణుగానమున్
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 41. దుష్టమ్మగుపాలనలో
  కష్టమ్ములు కాటువేయ కలవర పడగన్
  దుష్టుని దునుమాడ ప్రజలు
  కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే

  రిప్లయితొలగించండి
 42. అష్టమగర్భుడుకృష్ణుడు
  దుష్టుడుశిశుపాలుజంపదుష్టినిప్రజలున్
  నిష్టతబండుగజేసిరి
  కష్టమ్ములుదీరెననుచుగన్నీరిడిరే

  రిప్లయితొలగించండి
 43. ఇష్టమువచ్చినట్లుగనునీశునినిందనుజేయుచుండుచున్
  దుష్టునిమార్గమున్దనరితోటిప్రజావళిహింసజేయగా
  శిష్టజనంబులోనొకనిజేతలమంచినిజేయుచుండుటన్
  గష్టములెల్లదీరెననికంటనునీరిడియేడ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 44. దృష్టం బదృష్ట మంచును
  హృష్టాంతఃకరణు లా నరేశులు సకలా
  భీష్టములు ప్రాప్తములు గాఁ
  గష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే


  దృష్టి యరిష్టముల్ చెలఁగఁ దీవ్ర తరమ్ము నిరంతరమ్ముగా
  నష్టము మీద నష్టము లనంతము గాఁ గన నక్కజమ్ముగన్
  స్పష్టముగా నెఱింగితిమి శత్రుల కోరిక, మమ్ము ముంచఁగాఁ
  గష్టము లెల్లఁ, దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 45. ఇష్టముగానె యెంచుకొని, నిందివరాక్షునిప్రేమగెల్వగా!
  కష్టములెన్నివచ్చినను,కాననమందున కాపురమ్ముతో
  దుష్టులతీరు దెల్సుకొని,దూరముగానిక నుండమేలయెన్
  కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.

  రిప్లయితొలగించండి
 46. కష్టములెన్నిగల్గిననుకాంతనుపుత్రునికోలుపోయిసం
  క్లిష్టముగాగజీవనము క్లేశములొందుచు సత్యమూర్తియై
  నిష్టనునిల్పినట్టిధరణీశునిమెచ్చగనీశ్వరుండు నీ
  కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్
  (సత్యహరిశ్చంద్ర పతాక సన్నివేశం)

  రిప్లయితొలగించండి
 47. దిష్టిని తీయరే శతము దీవెనలీయరె
  చిన్నికన్నకున్
  సృష్టిని కుక్షినిన్ నిలిపి చిత్రముగా నడయాడు వానికిన్
  పుష్టిగనుండు మానులవి పుట్కున
  గూలగ ఱోటలాగినన్
  నష్టము దప్పిపోయెనని నందుని పుత్రుని ముద్దులాడుచున్
  కష్టములన్ని దీరెనని కంటను నీరిడి యేడ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 48. భ్రష్టుండా కఠినాత్ముడ
  యిష్టత జూపుచు దన సతి నిడుముల వెట్టన్
  దిష్టాంతము నొందగ నిక
  కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే

  రిప్లయితొలగించండి