30, అక్టోబర్ 2020, శుక్రవారం

సమస్య - 3530

 31-10-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్”  

(లేదా…)
 

“కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో”

80 కామెంట్‌లు:

 1. చం||
  ధ్రువమగు కావ్యశక్తులను తోయదమండలమంటు భావముల్
  వివిధ విశేషవైఖరుల వెల్లువధారల పద్యమాలికన్
  సవరణజేయు ముందు గల సంకలనంబున తప్పులుండవే?
  కవివరుడంచు గీర్తిగను గాదె గణమ్ములు భంగమైనచో

  రోహిత్

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  స్వగతం:

  కువలయ మందునన్ గనని కుచ్చిత బుద్ధులు గైకొనిన్ మదిన్
  నవనవలాడు రీతులను నవ్వులు చిమ్ముచు రాజకీయమున్
  పవలును రేయినిన్ తనరి పల్కగ చిల్లర పూరణాలిటన్
  “కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కైకొనిన్' అన్న ప్రయోగం సాధువు కావు. 'కుత్సిత బుద్ధులు పొంది నెమ్మదిన్' అనండి.

   తొలగించండి
 3. రవిగాంచనిచోటన గను
  కవివరుడెటులైన నెపుడు కవితలు జెప్పున్
  ప్రవరుండగు,విప్రవరుడు
  కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యం బాగుంది. కాని పూరణ భావం బోధపడలేదు. 'చోటను' అనడం సాధువు.

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. చంపకమాల
   ఎవరికినైనఁ దొల్దొలుత నెప్పుడొకప్పుడనంగ దొర్లవే?
   చివరికి పాండితీశిఖరిఁ జేరితరింతురు నిత్యసాధనన్
   సవరణఁ జూపగల్గ గురుశంకరులట్లుగ 'పద్యమందునన్'
   గవివరుఁడంచు గీర్తిఁగనుఁగాదె 'గణమ్ములు భంగమైనచో'

   తొలగించండి
 5. కందం
  ఎవరికినైన తొలిదశన్
  కవనంబున దొరలు నవియె గడచిన పిదపన్
  సవరింపఁ దగిన పటిమన్
  గవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్

  రిప్లయితొలగించండి
 6. ప్రవిమల కావ్య రీతుల శుభంకర పద్యములొప్పువాడు స
  త్కవివరుడంచు కీర్తి కను గాదె!గణమ్ములు భంగమైనచో
  కవులకు సిగ్గు కాదె!నవ కాంతుల రాయలు దిగ్గజంబులన్
  దివిజులు గూడ మెచ్చునటుతీరిచి దిద్దె యశోవిలాసుడై.

  రిప్లయితొలగించండి
 7. కవిగామనుటకుగణమది
  పవిగాదుగపాదుకోనగభావుకుడగుటే
  కవితకునియతియుమేలగు
  కవితల్లజుడనగనోప్పుగణభంగమునన్

  రిప్లయితొలగించండి

 8. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కవికిని కాకికిన్ కడకు గాఢపు భేదము కానజాలకే
  చవిగొని పూలమాలలను చక్కగ కూర్చి వధానమందునన్
  చవటలు చేరి మెచ్చగను చాకలి వీధిని ముత్తుకూరునన్
  "కవివరుఁడంచు గీర్తిఁగనుఁగాదె గణమ్ములు భంగమైనచో"

  రిప్లయితొలగించండి


 9. అవియివి యన్నియు కలగల
  పువిషయముగ వ్రాసి తనొక వుద్ధండునటం
  చు, విదురు డటంచు భళిరా
  కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తను, వుద్ధండుడు' అన్నవి సాధుశబ్దాలు కావు. "వ్రాసి తానె యుద్ధండు నటంచు..." అనండి.

   తొలగించండి
 10. చవు లూరించెడు కవితతొ
  కవి తల్లజు డనగ నొప్పు :గణ భంగ మునన్
  భువి లో నందరి చేతను
  కువిమర్శ కు పాత్రు డౌను కుకవి యు మిగులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కవితతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చవులూరించు కవితతో" అనండి.

   తొలగించండి
  2. చే , తో , లో ఎప్పుడు దీర్ఘాంతములే

   తొలగించండి


 11. కందా చంప్స్


  విలువైన పదములిడ చవి
  గల కవి వరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె, గణ
  మ్ములు భంగమైనచో నత
  డిలలో పేరొందడే నుడివితి సఖి వినన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. నవ కవితా ప్రపంచమున నవ్యపథాలవిహారమందునన్
  ప్రవిచయమంది విస్తృతిని
  రాజిలు రమ్య సరిత్ప్రభా రుచిన్
  కవనమునల్ల, దద్గతిని
  గాన్పడు భావవిశేష సంగతిన్,
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ
  గాదె గణమ్ములు భంగమైనచో!


  రిప్లయితొలగించండి
 13. నవ కవితా ప్రపంచమున నవ్యపథాలవిహారమందునన్
  ప్రవిచయమంది విస్తృతిని
  రాజిలు రమ్య సరిత్ప్రభా రుచిన్
  కవనమునల్ల, దద్గతిని
  గాన్పడు భావవిశేష సంగతిన్,
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ
  గాదె గణమ్ములు భంగమైనచో!


  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వివిధములైన ధర్మములు ప్రేపునగూర్చి మనోహరమ్ముగన్
  సవురును చెందు పద్ధతిని ఛందము తప్పక కైతలల్లగా
  కవివరుడంచు గీర్తిగనుగాదె; గణమ్ములు భంగమైనచో
  సవరణ జేయకున్న నవి చక్కని సూక్తులునౌచు నెక్కొనున్.

  రిప్లయితొలగించండి
 15. కె.వి.యస్. లక్ష్మి:

  కవనపు కార్యము నందున
  కవులకు పఱతెంచవచ్చు గణభంగమ్ముల్
  సవరణ నేర్చుచు సాగిన
  కవితల్లజు డనగ నొప్పు గణభంగమునన్.

  రిప్లయితొలగించండి
 16. నవలామణి యేల పలికె
  దవీవిధమ్మున విరివిగ తప్పులతోడన్
  కవితల నల్లెడు కాకవి
  కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్?

  రిప్లయితొలగించండి
 17. కవనమ్మున రసము తొణక
  నవకావ్యము లల్లి తాను నాణ్యపు రీతిన్
  సవినయముగ దొలగించగ,
  కవితల్లజు డనగనొప్పు,
  గణభంగమునన్

  నవనవభావ సంపదల నాణ్య
  పుపేటిక గేయ కావ్యమై
  కవనము వ్రాయగా జనులకందెడు భాషను మేలుకొల్పుచున్
  కవివరుడంచు గీర్తిగొనుగాదె; గణమ్ములు భంగమైనచో
  ఠవఠవ యేమిలేదుగ మిఠాయిని
  బోలెడు గద్యకైతలన్

  రిప్లయితొలగించండి
 18. వివరముగా వచింతు వినవే! ధవళాంగి కృపారసమ్ము సౌ
  ష్టవముగ పొంది వాలయము జాతిని జాగృత పర్చువాడెగా
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె, గణమ్ములు భంగమైనచో
  కవులన బోరు వారినిల కాకవు లంచును వెక్కిరింపరే!

  రిప్లయితొలగించండి
 19. సమస్య :
  కవివరుడంచు గీర్తి గను
  గాదె గణమ్ములు భంగమైనచో

  (కవివరుడు - కపివరుడు )

  నవరసభావపూర్ణమగు
  నాణ్యపు ఛందపు పద్యవిద్యలో
  వివిధమనోజ్ఞవర్ణనల
  వేడుక గొల్పెడి శక్తిశాలియే
  కవివరుడంచు గీర్తి గను
  గాదె ; గణమ్ములు భంగమైనచో
  చవటగ నెంచి నవ్వుకొని
  చయ్యన వీడుచు బోవరే జనుల్ !

  రిప్లయితొలగించండి
 20. కవనము తలపుల ముంగిట
  చివురులు తొడిగిన పదముల చిత్రము గాదా !!
  చవిజూచి జనులు మెచ్చిన
  కవి తల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్ !!

  రిప్లయితొలగించండి
 21. కవితను చక్కగ చెప్పిన
  కవితల్లజుఁ డనఁగ నొప్పు, గణభంగమునన్
  కవితలు చెప్పుచు తానొక
  కవినని చెప్పుకు తిరుగ కవి తా నగునా?

  రిప్లయితొలగించండి
 22. కవనమున శిక్షణ నొసగ
  గవితల్లజుఁ డనఁగ నొప్పు ; గణభంగమునన్
  అవలీలగ సరి దిద్దుచు
  నవ కవులుకు ధీమసమును నడపు చుండన్

  రిప్లయితొలగించండి
 23. నవతర పద్య భావనల నారయఁ గూర్చుచుగొప్ప దక్షతన్
  నవరస పోషణాచతుర నవ్యకవిత్వ పటుత్వ ధీమతే
  కవివరుడంచు కీర్తి గను గాదె, గణమ్ములు భంగమైనచో
  నెవరును మెచ్చరిమ్మహిని నీరస కైతలనోపలేరికన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధీమత+ఏ' అన్నపుడు సంధి లేదు. అక్కడ "ధీమతన్" అనండి.

   తొలగించండి
 24. నవతర పద్యసంపదల నాదిన లేతపదాల కూర్పుతో
  కవనములల్లు రోజుల నొకంట గణంబు పొరంబ డున్గదా
  చివరకు పండితాగ్రజులు చేకొని సూచనలీయ మేలగున్
  కవివరుండంచు కీర్తి గనుగాదె గణమ్ములు భంగమైనచో

  రిప్లయితొలగించండి
 25. కవితా వల్లరి గణములు
  కవనగమనమునకుజవముగణములెగూర్చున్
  కవియదిపాటింపకెటుల
  కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్

  రిప్లయితొలగించండి
 26. వివిధములైన వృత్తములు భిన్నయతుల్ విలసిల్లు బ్రాసలున్
  నవరసభావయుక్తముల నాదృతసారవిహీనపద్యముల్
  చవిగొనఁ వ్రాయఁ బూనిన, నశక్తుడు
  ఛందసయుక్తదోషకృ
  త్కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 27. నవరసభక్తిభావముననైచికిబోలిశుభాళిమంగళం
  బవిరలచిత్తశాంతియుశుభార్థములర్థములర్థశుద్ధితో
  *కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె ,గణమ్ములు భంగమైనచో*
  ప్రవిమలభారతీమతినభామమనర్థమునష్టకష్టమున్

  రిప్లయితొలగించండి
 28. కవనము లల్లెడి వేళల
  తవణించకపద్యమందు తప్పులు దొరలన్
  జవమును దిద్దుకొనంగను
  కవితల్లజుడనగ నొప్పుగణభంగమునన్

  రిప్లయితొలగించండి
 29. మైలవరపు వారి పూరణ

  ప్రవిమలభారతీకృప రవంత లభించినఁ జాలు నాల్కపై
  కవనము జాలువారు పదకంజవినిర్గతసౌరభమ్ములన్.,
  నవశశిబింబమధ్యమున నల్లని మచ్చ గణింపబోరిలన్!
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 30. అవిరళసాధనంబుగురునాదరపూర్వక శిక్షణంబునున్
  ప్రవిమలవర్తనంబున నపారపరిశ్రమ జేయు నప్పుడే
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె! గణమ్ములు భంగమైనచో
  సవరణజేసి నిక్కమగుచాతురిజూపు కవిత్వ మందునన్

  రిప్లయితొలగించండి
 31. రిప్లయిలు
  1. భవముగ నేర్చి ఛందమును భారత భాగవతాది కావ్యముల్
   అవగతిఁ గూర్చగా గణములందున పద్యము భావయుక్తమై
   కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె; గణమ్ములు భంగమైనచో
   అవకరమౌను పద్యములు నాదరమున్ లభియింపదెన్నడున్

   తొలగించండి
 32. నవరసపుగవితగలిగిన
  కవితల్లజుడనగనొప్పు,గణభంగమునన్
  వివశతనొందునుబద్యము
  కవితకుమఱియుండవలెను గణములగూర్పున్

  రిప్లయితొలగించండి
 33. కె.వి.యస్. లక్ష్మి:

  కవినను ప్రఖ్యగల్గగను కబ్బములన్ని ఛందము తోడుతన్
  అవిరళకృషిన్ సలిపి నచ్చగురీతి లిఖించినంతటన్
  కవివరుడంచు కీర్తిగను గాదె?; గణమ్ములు భంగమైనచో
  అవకరమౌను పద్యములు నాశమునొందగనౌను కీర్తియున్.

  రిప్లయితొలగించండి
 34. భువిలోనాజిని సేనా
  ప్రవరాధిపతి రిపు హర్త భంధించ రిపు
  ప్రవరులఁ జక్కఁగ నాతఁడు
  కవితల్లజుఁ డనఁగ నొప్పు గణ భంగమునన్

  [కవి = కళ్ళెము; గణము = సేనా విభాగము]


  కవిజన చిత్త తోష పద కాయ వికాస వినోద సత్సుధా
  వివిధ కథౌఘ సంకలిత విజ్ఞద చోదిత భవ్య చింతనా
  వివృత విశేష భావ యుత విస్తృత శుద్ధ వచో౽ర్థ భంగముల్,
  కవివరుఁ డంచుఁ గీర్తిఁ గనుఁ గాదె, గణమ్ములు భంగ మైనచో

  [గణములు = సమూహములు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్షౌహిణి:
   రథ గజ తురగ కాల్బలము మొత్తము నరులు

   బత్తి 1 1 3 5 12
   సేనా ముఖము 3 3 9 15 36
   గుల్మము 9 9 27 45 108
   గణము 27 27 81 135 324
   వాహిణి 81 81 243 405 972
   బృతన 243 243 729 1215 2916
   జమువు 729 729 2187 3645 8748
   అనికిని 2187 2187 6561 10935 26244
   అక్షౌహిణి 21870 21870 65610 109350 262440

   తొలగించండి
 35. చం:

  కవనము వ్రాయుటన్న తొలి గావలె భావ కవిత్వ సంపదల్
  సవరణ సేయ గూర్చనగు చక్కని పద్యమటంచు నేర్పుగా
  నవగత మొంద ఛందమును నా మటుకై నిక తప్పకుండగన్
  కవివరుడంచు గీర్తి గను గాదె గణమ్ములు భంగమైనచో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 36. అవిరత శంకరాభరణమందు సమస్యల శంకరార్యుడే
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె : గణమ్ములు భంగమైనచో
  సవినతి చెప్పుచుండి కొనసాగు నట్టుల సమీక్ష తోడనన్
  నవ కవులందు కౌశలము నాటి సుశిక్షణంబిడన్

  రిప్లయితొలగించండి
 37. కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె, గణమ్ములు భంగమైనచో
  నవి యొక రెండుచోటులను నన్యమనస్కత యావహింపగాఁ,
  జవి రహితంబు గాక రసవంత కవిత్వము నల్లుచో! గులా
  బి విరికి నంద మూడునొకొ వీఁగఁగ రేకులు రెండుమూడునున్!

  రిప్లయితొలగించండి
 38. అవిరళమైన సేద్యమున నార్యుల కబ్బములన్ పఠించుచున్
  ప్రవిమలమైన ధారగొని పద్యములన్ లిఖియించి మించుచున్
  చవిగల కైతలన్ వెలయు సాత్వికునిన్ చిరు దోసమడ్డునే
  కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో
  అసనారె

  రిప్లయితొలగించండి
 39. కె.వి.యస్. లక్ష్మి:
  క్షమించాలి. సవరించిన పూరణ:

  కవినను ప్రఖ్య గల్గగను కబ్బము ఛందముతోడ వ్రాయగన్
  అవిరళమెంతయున్ కృషిని నచ్చగు రీతి లిఖించి నంతటన్
  కవివరుడంచు కీర్తిగను గాదె?; గణమ్ములు భంగమైనచో
  అవకరమౌను పద్యములు నాశమునొందగనౌను కీర్తియున్.

  రిప్లయితొలగించండి
 40. రాముని వివాహసమయము లో భట్రాజులు రాముని కీర్తిస్తూ
  చ||
  అవికులవంశసోముడు ! మహాగుణశాలి ! మహోన్నతుండు! దా
  నవకుల నాశకుండు! నభినమ్రుడు భద్రగజాధిరూఢుడై
  అవనిజ సీతనున్ మనువుయాడ నుతించెడి భాగ్య మన్న "మా
  కవి"...వరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో

  వరుడు = పెళ్ళికుమారుడు, గణము = సమూహము, భంగము = అల (కెరటము)

  రిప్లయితొలగించండి
 41. నవరసభాజనంబయిసనాతనధర్మములాచరించుచో
  కవివరుడంచుకీర్తిగనుగాదె,గణమ్ములుభంగమైనచో
  వివశతనొందిపద్యములుపేలవమొందుచునుండుగాననా
  కవనమువ్రాయకుండగనుగైకొనిఛందమువ్రాయనొప్పగున్

  రిప్లయితొలగించండి