23, అక్టోబర్ 2020, శుక్రవారం

దత్తపది - 173

24-10-2020 (శనివారం)

కవిమిత్రులారా,

దుర్గాష్టమి శుభాకాంక్షలు!

“మాద్రి – కైక – రాధ – రుద్రమ”

పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ

మీ కిష్టమైన ఛందంలో దుర్గాదేవిని స్తుతిస్తూ

పద్యం వ్రాయండి.

58 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ఒక రాత్రిన్ కడు రాధనమ్ము గొనుచున్ హుగ్లీనదీ తీరమం
    దొక కైకట్టున రుద్రమౌ పురమునన్ హుందాగనీ మాద్రిగన్
    నికటంబందున దీదికిన్ కలుగగన్ నిర్వాణమీ యెన్నికన్
    ప్రకటింపంగను నోటమిన్ కొలిచెదన్ వంగమ్మునన్ దుర్గమా!

    రాధనము = సంతోషము
    కైకట్టు = సందర్భము
    రుద్రమౌ = భయంకరమౌ
    మాద్రి = మాదిరి

    (ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి
  2. మాద్రి కైక రాధ రుద్రమ

    కం||
    దేవీ దుర్గ హిమాద్రిజ
    నీవేయగు జనులకై కనికరము జూపన్
    త్రోవ ధరాధరములయన్
    గావే శ్రీరుద్రమార్గకారిణి జననీ

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నీవగుదువు జనులకై..." అంటే బాగుంటుంది.

      తొలగించండి
  3. దత్తపది :
    మాద్రి - కైక - రాధ -రుద్రమ పదాలతో
    అన్యార్థం లో దుర్గాస్తుతి
    ( దేవతలు , మహర్షులు దేవిని ప్రార్థిస్తూ )
    తేటగీతి
    .............
    పశ్చిమాద్రిని గ్రుంకును భాస్కరుండు ;
    సకల లోకైకరక్షణ సలుపుమమ్మ !
    మహిషు , నసురాధము వధింప , మాత ! రమ్ము ;
    రుద్రమయవైన దుర్గాంబ ! భద్రమిడుమ !!

    రిప్లయితొలగించండి
  4. నీవు హి'మాద్రి' కన్యకవు
    నీ దయ'కై క'నులందు భక్తిస
    ధ్భావన నిండ గొల్చి ప్రజ
    భాసిల'రా! ధ'నమంది నీ కృపన్!
    పావనివౌచు దుర్మతుల
    పాలిటి 'రుద్ర మ'హాకరాళివై
    దీవనలిచ్చి బ్రోచెదవొ
    దివ్యమహత్తున భద్ర దుర్గవై!

    రిప్లయితొలగించండి
  5. రమణీ! హిమాద్రిపుత్రీ!
    నమామి లోకైకమాత నాట్యవినోదీ!
    అమలా! రుద్రమనోహరి!
    ఉమా! తవారాధన మ్ముపశమించు రుజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరిపాదములో
      పోకార్చు రుజన్ గా చదువ ప్రార్ధన! 🙏🙏

      తొలగించండి
    2. మరొక ప్రయత్నం

      దుర్గా! హిమాద్రిపుత్రీ!
      భార్గవి! లోకైకమాత! భద్రమునిమ్మా!
      నిర్గుణ! రుద్రమనోహరి!
      దుర్గమ! రాధనమునీవె! దురితనివారీ!

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ చివరి పాదంలో (మీ సవరణలోను) యతి తప్పింది. "తవారాధమ్మె యూడుచును రుజన్/యూడ్చు నిడుములన్" అనవచ్చు.

      తొలగించండి
    4. సవరణతో
      రమణీ! హిమాద్రిపుత్రీ!
      నమామి లోకైకమాత నాట్యవినోదీ!
      అమలా! రుద్రమనోహరి!
      ఉమా! తవారాధనము యూడ్చు నిడుములన్
      🙏🙏🙏

      తొలగించండి
  6. క్షేమాద్రిసుత హిమజ నీ
    నామమె రాధనమనుచును నమ్మితి మమ్మా
    భ్రామరి యేకైక జనని
    మా మొరలాలించు రుద్ర మగనాలి కదా.
    క్షేమ+అద్రి......రాధనము=సంతోషము

    రిప్లయితొలగించండి
  7. నమ్మితినిహి(మాద్రి)తనయా నన్నుఁ గావ
    కరుణఁ జూడుము నీవె యే(కైక) దిక్కు
    నాదుయప(రాధ)ములుసైచి యాదుకొనగ
    నద్రివైనిలచితివీవు (రుద్రమ)హిషి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నా దురపరాధములు..." అంటే బాగుంటుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ 🙏

      నమ్మితినిహి(మాద్రి)తనయా నన్నుఁ గావ
      కరుణఁ జూడుము నీవె యే(కైక) దిక్కు
      నాదురప(రాధ)ములుసైచి యాదుకొనగ
      నద్రివైనిలచితివీవు (రుద్రమ)హిషి

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:
    మ.
    అపురూపమ్ముగ వెల్గు (రుద్రమ)యవౌ నార్యాణి! దుర్గమ్మ! నే
    నపచారమ్ములు లేని సేవకుడనై నా(కైక)టాక్షించి నా
    నెపముల్ దీర్చు హి(మాద్రి)పుత్రియనుచున్ నేనమ్మితిన్ మాతరో
    అప(రాధ)మ్ములు బాపుచున్ కరుణతోడన్ నన్ సదా కాయుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు. పొరబాటును సవరించాను.

      అపురూపమ్ముగ వెల్గు (రుద్రమ)యవౌ నార్యాణి! దుర్గమ్మ! నే
      నపచారమ్ములు లేని సేవకుడనై నా(కైక)టాక్షించి నా
      నెపముల్ దీర్చు హి(మాద్రి)పుత్రియనుచున్ నేనమ్మితిన్ మాతరో
      అప(రాధ)మ్ములు బాపుచున్ దయను నోయమ్మా!సదా కాయుమా!

      తొలగించండి
  9. మగని తోడ మనెదవు హి’మాద్రి’పయిన
    దైత్యు దునిమిన యే’కైక’ ధాత్రి వీవు
    ‘రుద్రమ’తుడ నన్ను తరింపు లోకమాత
    శివము గోరి నీ యా’రాధ’న సేతు నమ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. "శివము గోరి యారాధన జేసెద నిదె/జేయువాడ" అనవచ్చు.

      తొలగించండి


  10. నమోస్తుతే !



    హేమాద్రి పుత్రి హేమల
    తే! మా యేకైక భగవతివి నీవే న
    మ్మా! మా ఆరాధనమా
    లామణి! ఆ రుద్రమంగళా! గౌరి! నమో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. శాకిని! హిమాద్రి తనయ, నీకై కవనము
    నల్లి యారాధనము సేయు నర్భకుడను
    దుర్గ! రుద్ర మనోహరి! దురితములను
    బాప వమ్మ నుతులు నీకు పార్వతమ్మ!

    రిప్లయితొలగించండి
  12. నిలచి యా హిమాద్రిని శివుని మనువాడ
    నదియె యేకైక తన లక్ష్య మనుచు నరిగి
    భక్తి నే యపరాధపు ల్పనులబోక
    రుద్రు పెంద్లాడి వరలెను రుద్రమాంబ

    రిప్లయితొలగించండి
  13. కందం
    హేమాద్రి తేజమున దు
    ర్గా! మాకేకైక దైవమని నిను గొలుతున్
    హోమాదిగ నారాధన
    మామది, హరి బ్రహ్మ రుద్ర మకుట పద ప్రభా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ దుర్గాష్టమి సహిత మహర్నవమీ పర్వదిన శుభాకాంక్షలు

      తొలగించండి
  14. వెలసియు హిమాద్రి సుతగ ను విశ్వ మాత
    లో క మున కై కసి ని పూని లోక కంట
    కుడగు నాపరాధ దైత్యుని కోప మూని
    చంపె రుద్ర మ యై జగతియు శరణు వేడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  15. చేరెహిమాద్రిని పార్వతి
    గోరఁగ నేకైకమూర్తిగూర్మినియనగన్,
    పారణనారాధనమున
    దారగనారుద్రమతినధర్మముసతియై

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గూర్మి ననంగన్/గూర్మిని ననగన్" అనండి.

      తొలగించండి
    2. చేరెహిమాద్రిని పార్వతి
      గోరఁగ నేకైకమూర్తిగూర్మిని ననగన్,
      పారణనారాధనమున
      దారగనారుద్రమతినధర్మముసతియై

      కొరుప్రోలు రాధాకృష్ణరావు

      తొలగించండి
  16. రక్షింపన్ భువిలో హిమాద్రి తనయన్ రాజిల్లు దైవంబుగా
    దీక్షంబూనినుతింతునేను మనమం దేకైక లక్ష్యంబుతో
    పక్షంబుండినినుం దలంచి యిలలో భక్తిన్ ప్రియారాధనల్
    నాక్షేత్రంబుననాచరించెదసుమీ నా రుద్ర మందాకినీ

    రిప్లయితొలగించండి
  17. “మాద్రి – కైక – రాధ –
    కం.
    హేమాద్రీసుత! మాతా!
    మేమే కైకట్టు నైన మేలుగ నిన్నే
    గోముగ నారాధింతుము,
    శ్రీ మాతా రుద్రమమిడి చెంగిట గొనవే!!

    రిప్లయితొలగించండి
  18. అటహిమాద్రిపై కొలువైన యమృతవల్లి
    ధర్మరక్షకై కదలెరా ధరణిపయికి
    రుద్రమహిమతో దురితముల్ రూపుమాప
    యింద్రకీలాద్రి దుర్గయై యిలనుబ్రోచె.

    రిప్లయితొలగించండి
  19. ఇల హి *మాద్రి* పై వాసించు లలిత, ప్రజల
    *కై క* దలి రమ్ము పెద్దమ్మ కనకదుర్గ
    భువిని యసు *రాధ* మునినుండి ప్రోచుమమ్మ
    కొలుతు *రుద్ర* మనోహారి కొండచూలి

    రిప్లయితొలగించండి
  20. ధాత్రిగాపాడునేకైకతల్లియగుచు
    దనర హిమాద్రిదుహితగాధరణియందు
    రుద్రమహిషియౌశాంభవిసదయజూడు
    భక్తినిడుదునునోయమ్మ!వందనములు

    రిప్లయితొలగించండి
  21. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

    దత్త పది

    మాద్రి, రాధ , కైక , రుద్రమ,

    ఈ పదములు అన్యార్ధములో ప్రయోగించి

    దుర్గా దేవి ప్రార్ధన.


    నా పూరణ సీసములో


    జన్మించితివి అంకుసంబు(మాద్రి)న యీవు భారతీ రూపమున్ భవ్య శీల,

    ఘనమౌ విజయవాటికన మందర ధ(రాధ)రము పైన వెలసిన రంభ వీవు,

    తొలుత నగముపైన వెలసితి వట (రుద్ర మ)గురూపమున నీవు, మంత్ర మొకటి

    యాది శంకరుడు వేయంగ ప్రసన్నతన్ కలిగి మారితివిగ కనక దుర్గ


    వై నచట, తల్లి, చేతును వందనములు,
    ఖలము నేలెడు సుతిని, నీ(కై క)నకపు
    హారమును తెచ్చితిమిపుడు, ననుగు తోడ
    కరుణ జూపి మమ్ము సతము కాచ వలయు




    అంకుసంబుమాద్రి = మూలా నక్షత్రము ,మంధర ధరాధరము =ఇంద్ర కీలాద్రి,రంభ = పార్వతి ,సుతిని = తల్లి ,అనుగు = ప్రేమ

    రిప్లయితొలగించండి
  22. సతత మరుద్రమణీ యా
    ర్చిత! రమ్యత మాద్రి వాస! శీఘ్రైకై కాం
    చిత హృద యా రాధన భ
    క్త తమో లయ కారిణీ! నత సురా! దుర్గా!

    రిప్లయితొలగించండి
  23. దుర్గా దేవి స్తుతి:

    తే.గీ.

    ఇలగ పాపుమా ద్రిష్టించి నీ కరోన
    రుద్ర మడుగంట విషమగు రోగ మడచ
    బ్రోచు నపరాధముల నెల్ల బుద్ధి నొసగి
    నిదియె కైకట్టు దెలుపంగ నీదు మహిమ

    దృష్టించు=చూచు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. ఉత్తమాద్రికి పుత్రికా!ఉవిద!దుర్గ!
    దేవి!యేకైక మహిత మూర్తివి గదమ్మ
    నిత్యమారాధనలనందు నీలవేణి!
    రుద్ర,మాహేశ్వరాన్విత!భద్ర కలిత!

    రిప్లయితొలగించండి
  25. మాతా మన్మధ నాశు నీశ్వరివి హే *మాద్రీ* శు సత్పుత్రి యా
    ద్యోతాభిఖ్యముపార్జనోక్త్యమలవో దుఃఖాంత లో *కైక* స
    న్మాతాపర్ణ న *రాధ* మాంతకి మహానారాయణీ *రుద్రమా*
    చేతఃప్రాణ జయంకరీ శుభకరీ శ్రీచక్ర సంచారిణీ

    రిప్లయితొలగించండి
  26. ఓ హిమాద్రి సుతా! మహేశ్వరి! యో కృపామయి! శూలినీ!
    పాహి దుర్గమ దైత్య భంజని! పాహి రుద్ర మనోహరీ!
    ఐహి కైక జనావనీ! యని యార్తి ని న్శర ణంటిమే
    త్రాహి దుర్గ! క్షమించి మా యప రాధము ల్మము నేలవే.

    రిప్లయితొలగించండి
  27. అమ్మ హిమాద్రి నందన భయం బుడుపంగ జయం బొసంగ మా
    యమ్మ దయా పయోధివని యార్యు లనార్యులకై కరాళికా
    యమ్మగురా ధనంబిడు ప్రియంబు మహత్తు జగద్దితంబిడు మా
    యమ్మయె రుద్ర మాంబయగు నంధత శిష్టుల గష్ట పెట్టినన్

    రిప్లయితొలగించండి
  28. నిలిచె హి(మాద్రి) నగజయై
    పొలుపుగ లో(కైక) వంద్య భువనేశ్వరి దా
    నలరగ నిరతా(రాధ)న
    మెలయుచు భవ (రుద్ర మ)హిత హ్రీంకారంబై

    రిప్లయితొలగించండి
  29. కొలువు దీరె హేమాద్రి పై కూర్మితోడ
    మహిషు జంపిన నేకైక మాత నెల్ల
    వేళనారాధనము చేయ వేగ కరుణ
    చూపు రుద్రపత్ని సతము సుదతులకును

    రిప్లయితొలగించండి