2, ఫిబ్రవరి 2021, మంగళవారం

సమస్య - 3623

3-2-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వర్ణమృగముఁ దెమ్మని యుమ శంకరుఁ గోరెన్”
(లేదా…)
“స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్”

68 కామెంట్‌లు:

  1. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు రు భ్యో న మః ( నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన )
    .........................................................................................

    చాన ! నీ ముఖబింబము - చందమామ |

    నెలత ! నీ చిరునవ్వు - వెన్నెలల నిగ్గు |

    కనుల నానంద బాష్పముల్ తొనకుచుండ

    కనుల పండుగ గూర్చె > రక్తంపు ఝరులు


    { నీ కనుల లోని ఆనందాశ్రువులు =
    అనురాగ యుక్తమగు ఝరులు }

    [ రక్తము = అనురాగము గల ; రక్తపు = అనురాగ యుక్త మైన ]

    *****************************************

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పర్ణము లన్నియున్ కలిపి వండగ భీముడు ముత్తుకూరునన్
    జీర్ణము చేయజాలకయె జింకది మాంసము మెండు కుమ్మగా
    కర్ణ పిశాచి జేరుచును కమ్మగ పల్కగ నాటకమ్మునన్
    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్...

    రిప్లయితొలగించండి
  3. శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు, అనే భావముతో చేసిన పూరణ.

    🌹కందము🌹
    వర్ణపు మోజున కోరె

    స్వర్ణమృగముఁ దెమ్మని యుమ ; శంకరుఁ గోరెన్”

    నిర్ణయము చెప్పు మనుచు సు

    పర్ణుని ప్రభు రాముడు మురిపపు బాలుండున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( 2వ పాదములో
    ఉమ= సతి
    సుపర్ణుని ప్రభు = గరుత్మంతుని ప్రభువు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో "కోరెను" అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
    2. మొదటి పాదములో
      కోరె బదులు కోరెను అని చదువుకొనవలసింది

      తొలగించండి
  4. ఉత్పలమాల:
    ------------
    వర్ణముజూచిమోజుపడి,వాసవి గోముగ దానిదెమ్మనెన్
    స్వర్ణమయూఖముల్బడగ,స్వాతిశయమ్మునుబెంచివేయ నా
    పర్ణపుశాలనందున నపర్ణయు,మోజుగముద్దులాడుచున్
    స్వర్ణమృగమ్ముదెమ్మనుచు శంకరుగోరెను గౌరిప్రేముడిన్

    రిప్లయితొలగించండి
  5. తూర్ణమడి గె సీత పతిని
    స్వర్ణ మృగము దెమ్మని : యమ శంకరుని గోరెన్
    నిర్ణయము గైకొని తనను
    పూర్ణ మనస్కు డయి సతిగ పొందు మటంచున్

    రిప్లయితొలగించండి
  6. స్వర్ణదితలదాల్చుచునా
    కర్ణాంతముబూదినలమికడుపేదయ్యెన్
    అర్ణవసారముఁదెలియగ
    స్వరణమ్రుగముఁదెమ్మనియుమశంకరుఁగోరెన్

    రిప్లయితొలగించండి
  7. ఉత్పలమాల:
    ------------
    స్వర్ణపుకాంతులీనుచును,శంకరుడుండిన వెండికొండపై
    యార్ణవమాయెసంతసము,నాశగ లేడియె చేరువైగనన్
    చూర్ణముజేసె గుండియను,చూపులుద్రిప్పకచూడ నప్పుడే
    స్వర్ణమృగమ్ముదెమ్మనుచు శంకరుగోరెను గౌరిప్రేముడిన్

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తూర్ణమె రాము ననిచె కుజ
    స్వర్ణమృగము దెమ్మని; యుమ శంకరు గోరెన్
    వర్ణము లన్నిటి యందున
    స్వర్ణపు వన్నెకు నొఱపు నొసంగుము ననుచున్.

    రిప్లయితొలగించండి
  9. కందం

    వర్ణించిరి క్రొత్తగ కథ!
    కర్ణములవి చాటలంత కరమది పొడవౌ
    నిర్ణయమె? మృతశిశువునకు
    స్వర్ణమృగముఁ దెమ్మని యుమ శంకరుఁ గోరెన్!

    ఉత్పలమాల

    వర్ణన జేసి క్రొత్త కథ వార్చిరి దర్శకులిట్టి పోకడన్
    గర్ణములుండెఁ జాటలనఁ గాంచఁగ నొప్పని తొండమంచు మీ
    నిర్ణయమిట్లు నా శిశువు నిల్పఁగ జంతు ముఖాన మేలనన్
    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్

    రిప్లయితొలగించండి
  10. కర్ణముతాటియాకులనుపార్వతిదాల్చెనుపేదరాలునై
    చూర్ణముబూదిపండునదిశూలియుఁబూసెనుసైచడెవ్వడున్
    నిర్ణయమీవిధంబుగనునేగతిజీవికసాగునంచునా
    స్వరణమ్రుగమ్ముదెమ్మనుచుశంకరుగోరెనుగౌరిప్రేముడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. కాంతయుదాల్చెనుఅనిసవరించితినిస్వీకరింపగలరు

      తొలగించండి
  11. సమస్య :
    స్వర్ణమృగమ్ము దెమ్మనుచు
    శంకరు గోరెను గౌరి ప్రేముడిన్

    ( ఉపాధ్యాయుని ప్రశ్నలు - శిష్యుల సమాధానాలు )

    ఉత్పలమాల
    ..................

    " వర్ణము గాంచుచున్ భ్రమను
    వల్లభు రాముని సీత యేమనెన్ ?
    బర్ణము సైతమున్ దినక
    బట్టిన దీక్ష శివార్ధభాగమౌ
    పూర్ణయె కాలకూటమును
    పూర్తిగ మ్రింగుమటంచు నెట్లనెన్ ? "
    " స్వర్ణమృగమ్ము దెమ్మనుచు ; "
    "శంకరు గోరెను గౌరి ప్రేముడిన్ . "

    రిప్లయితొలగించండి
  12. ఉ:

    కర్ణ కఠోర మాటలుగ కన్నియ కాదనె బెండ్లియాడగన్
    వర్ణము లెంచి చూచుటయు భారమటంచన లేమిడెంచగన్
    నిర్ణయ మొంద వాంఛితము నిక్కము నిచ్ఛను చిత్తగింపనై
    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కఠోర మాటలు' దుష్టసమాసం. "కఠోర వాక్కులుగ" అనండి.

      తొలగించండి
  13. పర్ణముల మేయు పిడిఁ వరి
    వర్ణిని గని సీత గోరె వాస్తవమిదియే
    వర్ణిక నెరుగని మూఢుడ
    స్వర్ణమృగముఁ దెమ్మని యుమ శంకరుఁ గోరెన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పిడి' తరువాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  14. పర్ణములన్ భుజించుచు దవమ్మున గెంతుచు చల్లనైన శ్రీ
    పర్ణిక ఛాయలో తిరుగు ప్లావిని జానకి గోరె నయ్యె, సం
    పూర్ణముగా నెఱుంగక విమూఢుడవై పలుకంగనేలరా!
    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్?

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తూర్ణమె రామునిన్ కుజ మృదూక్తుల గోరుచు నంపె కానకున్
    స్వర్ణమృగమ్ము దెమ్మనుచు; శంకరు గోరెను గౌరి ప్రేముడిన్
    చూర్ణముజేసి తారకుని చొప్పున జంపిన దీప్తిమంతుడౌ
    పూర్ణసుతుండు షణ్ముఖుని పూజిత నేతగ నేటుసేయగన్.

    రిప్లయితొలగించండి
  16. వర్ణన చేయుచూ గురువు ప్రశ్నను వేసె "నరణ్యకాండమున్
    పర్ణపు శాలనిన్ తిరుగు బంగరు జింక కథేమి చెప్పుమా"
    పూర్ణపుబూరె బుగ్గలిడు బొట్టెడు కొంటెగ నిట్లనెన్ కటా!
    "స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్"౹౹

    రిప్లయితొలగించండి
  17. భాగవతము శివుడు పార్వతికి చెప్పు వేళ, పార్వతీ దేవి అడిగె

    కర్ణామృతము!, మరలనిది
    వర్ణించుము, రామునేల, పార్థివి యడిగెన్?
    "పర్ణము లందము గదిను
    స్వర్ణమృగముఁ దెమ్మని", యుమ శంకరుఁ గోరెన్

    రిప్లయితొలగించండి
  18. పర్ణకుటీరవాసిని యపర్ణను గోరివరించగ శంకరుండనున్
    స్వర్ణపు వృత్తికారుడిల సారసనేత్రికి ప్రీతిగూర్చగా
    స్వర్ణపు కాన్కనొక్కటిని వైభవమొప్పగ గోరుకొమ్మనన్
    స్వర్ణమృగమ్మును దెమ్మనుచు శంకరుగోరెను గౌరిప్రేముడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరించిన పూరణ

      పర్ణకుటీరవాసిని యపర్ణను పెండ్లిని శంకరుండనున్
      స్వర్ణపు వృత్తికారుడిల సారసనేత్రికి ప్రీతిగూర్చగా
      స్వర్ణపు కాన్కనొక్కటిని వైభవమొప్పగ గోరుకొమ్మనన్
      స్వర్ణమృగమ్మును దెమ్మనుచు శంకరుగోరెను గౌరిప్రేముడిన్

      తొలగించండి
    4. డా. సీతా దేవి గారు శంకరుండనున్ ? శంకరుం డను వాఁడనియా మీ భావము? అప్పుడు ద్రుతముండదు.
      సారస నేత్రకు సాధువు.

      తొలగించండి
    5. అవునండీ, శంకరుండనే అనవలెనా? సారసనేత్రి విషయమున సందేహముండినది! 🙏🙏🙏

      తొలగించండి
    6. శంకరుండు నా / స్వర్ణపు ... సరి పోవును.
      నాన్- ద్రుతాంతము

      తొలగించండి
    7. ధన్యవాదములండీ! సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
    8. పర్ణకుటీరవాసిని యపర్ణను పెండ్లిని శంకరుండు నా
      స్వర్ణపు వృత్తికారుడిల సారసనేత్రకు ప్రీతిగూర్చగా
      స్వర్ణపు కాన్కనొక్కటిని వైభవమొప్పగ గోరుకొమ్మనన్
      స్వర్ణమృగమ్మును దెమ్మనుచు శంకరుగోరెను గౌరిప్రేముడిన్
      🙏🙏🙏🙏

      తొలగించండి


  19. అనుగున నవనిజ కోరెను
    చనువుగ పెనిమిటిని బిలిచి స్వర్ణమృగముఁ దె
    మ్మని, యుమ శంకరుఁ గోరెన్
    తనవారింటికి వెడల విధాత పలుకుగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  20. పెనిమిటి నడిగె కుజయె ద
    న్నున స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు, శంకరుఁ గో
    రెను గౌరి ప్రేముడిన్ భళి
    తనవారింటికి వెడల విధాత పలుకుగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. పర్ణ కుటికన కుజ యడిగె
    స్వర్ణమృగముఁ దెమ్మని ; యుమ శంకరుఁ గోరెన్
    పూర్ణముగ జీవి యాయువు
    నిర్ణయమును సలుపుట దన నేర్పుగ నుండన్.

    కుజ = సీత
    యమ = యముడు

    రిప్లయితొలగించండి
  22. కర్ణపు కమ్మగన్మమరు కాంచన లేళ్లని ముద్దు ముద్దుగ

    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్

    పర్ణపు శాలనుండు రఘు బాలుడు త్రుంచెను విల్లు పెండ్లికై

    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనగ సాధ్యమ విల్లును లేకనీశుకున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  23. పర్ణకుటీరముచెంతను
    నర్ణవ సముడౌ రఘువరు నాలియు వేడెన్
    పర్ణమును తినక తపమున
    స్వర్ణమృగముదెమ్మని యుమ శంకరు గోరెన్

    రిప్లయితొలగించండి
  24. పర్ణకుటిని సీత కొసరె
    స్వర్ణమృగముఁ దెమ్మని; యుమ శంకరుఁ గోరెన్
    వర్ణితమగు హరు సన్నిధి
    నిర్ణీతిగ నెపుడు దనకు నెలవౌ వరమున్

    రిప్లయితొలగించండి
  25. కర్ణ కఠోరంబుగ న
    న్నార్ణంబులు ముట్ట నంచు నాత్మ జనం బా
    కర్ణింపఁ బెండ్లి కానుక
    స్వర్ణమృగముఁ దెమ్మని యుమ శంకరుఁ గోరెన్

    [ఈ యుమా శంకరు లాధునిక భార్యాభర్తలు]


    పూర్ణ మనమ్మునం బతిత పుత్రుని ప్రాణము శైలపుత్రికా
    పర్ణ నిజాత్మ నాథుఁ గని పాడియె కోరినఁ బీత కాల దు
    ర్వర్ణ కురంగ రాజమును రాఘవుఁ డొల్లఁడె సీత కోరఁగా
    స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు, శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్

    రిప్లయితొలగించండి
  26. పర్ణకుటీరమందుగుజవల్లభురాముని వేడె నర్మిలిన్
    *“స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు ;శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్”*
    జీర్ణ మొనర్చ క్ష్వేళమును జీవులగావగ సర్వమంగళా
    పర్ణకు ప్రీతియెంతయొ శుభంబిడ లోకములెల్లమెచ్చగా

    రిప్లయితొలగించండి
  27. కర్ణకఠోరమయీయది
    స్వర్ణమృగముదెమ్మని యుమశంకరుగోరెన్
    పర్ణకుటీరపుభూమిజ
    వర్ణంబులుగల హరిణముబట్టగగోరెన్

    రిప్లయితొలగించండి
  28. పర్ణకుటీరమందు కుజ వల్లభు గాంచుచు నేమిదెమ్మనెన్?
    తూర్ణము గాను సూనునెడ దోషము నెంచక నాదరమ్ముతో
    పూర్ణము గానుజీవమును బోయమనంచును గోరెనెవ్వరిన్
    స్వర్ణమృగమ్ము దెమ్మనుచు, శంకరుగోరెనుగౌరి ప్రేముడిన్!!!

    రిప్లయితొలగించండి
  29. స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరెనుగౌరిప్రేముడిన్
    కర్ణకఠోరమాయెనిదికానగరానిదిభూతలంబునన్
    స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరుట నవ్వులాటయే
    వర్ణమువర్ణముల్గలిగిభాసిల భూమిజగోరెలక్ష్మణున్

    రిప్లయితొలగించండి