24, ఫిబ్రవరి 2021, బుధవారం

సమస్య - 3645

25-2-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు”
(లేదా...)
“ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్”

71 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    చదువులు చంక నాకగను చాకిరి గానక డబ్బు లేకయే
    ముదమున సాఫ్టు వేరుదగు ముద్దుల కన్నెను మోసగించుచున్
    కుదురుగ నుండ జాలకయె కూరిమి మీరగ పెండ్లియాడగా
    ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్...

    రిప్లయితొలగించండి
  2. మనుమరాళ్లను గాంచియు మమత తోడ
    ముదిమినిన్ గన్నె పిల్లల ముద్దిడ దగు
    ననుచు పెద్దలు వచియింతు రదియె పుడును
    దోష మనగ రాద దెవ్వరు దురిత మనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. "దోష మనరా దదెవ్వరు/దోష మనగ రాదెవ్వరు.." అనండి.

      తొలగించండి
  3. వన్నెచిన్నెలపసిబాలవంకలేక
    దరినికనరాగమురిపానతాతచెలిమి
    చేరఁదీయగపరుగునచెంతఁజేరె
    ముదిమినింగన్నెపిల్లలముద్దిడఁదగు

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    సంప్రదాయమ్ము వీడని సద్గుణాల
    చదువులందు సరస్వతీ సములనంగ
    మనవరాండ్రట బామ్మకుఁ దనరనుండ
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    చంపకమాల
    వదలక సంప్రదాయముల పర్వదినమ్ముల నర్చనాదులన్
    మొదలిడి పాయసాన్నముల ముందుగ దైవనివేదనన్ శుభ
    ప్రదమన దీర్చఁగన్ మనవరాండ్రట బామ్మకుఁ జూడముచ్చటై
    ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్

    రిప్లయితొలగించండి
  5. కాన రాకుండె కన్నులు , కమిలిపోయె

    ముడుతలు పడెను చర్మము , మూలబడితి

    ముదిమినిం , గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    కాలుని భటియై దరిచేరగ చెలిమిగను

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. చదువులతల్లిబాలగనచంచలదీక్షనుదేవిరూపునై
    పదిలముగాగభావననుపండితలోకపుకాంతిరేఖగా
    కదలగకన్నుదోయినటకాంచెనుసాధనపోతనార్యుడున్
    ముదిమినిఁగన్నెపిల్లలకుముద్దిడగన్ఁదలపోయుటోప్పగున్

    రిప్లయితొలగించండి
  7. పెదవులు బద్దలయ్యెనుర పెద్దగ పల్కను వీలు కాదురా

    కదలక కాలు చేతులును కయ్యపు నాట్యముజేసె ప్రీతిగన్

    పధమున కాలుడంపగను వాలిరి కన్నెలు మృత్యు భృత్యులై

    ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి


  8. ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు
    చెప్పు దెబ్బలు తప్పవు చెంపపెట్టు
    తధ్య మోయి తాత విను ప్రతాప మేల
    చద్ది యన్నము తిని తొంగు జల్ది గాను!


    ఎవరా తాత ?/ఏమా కత :)
    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. బామ్మ చెంతకు చేరిన పడచు వార
    లైన మనుమరాండ్రనుగాంచి అబ్బురమున
    యంక పాళిమి గైకొని యాదరమున
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిద దగు.

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    ముదిమిని గన్నెపిల్లలకు
    ముద్దిడగం దలపోయు టొప్పగున్

    ( బామ్మలు బంగారు మనవరాండ్రకిచ్చే బహుమతి ముద్దులేగా )

    చంపకమాల
    .................

    సదమల మైన వర్తనల
    సంతసమున్ సమకూర్చు చెప్పుడున్
    గదలికలెల్ల నాట్యముగ ;
    కమ్మనిమాటలె పాటతీరుగా ;
    నెదలను బారవశ్యమున
    నెంతయు ముంచగ ; బామ్మలందరున్
    ముదిమిని గన్నెపిల్లలకు
    ముద్దిడగం దలపోయు టొప్పగున్ .

    రిప్లయితొలగించండి
  11. గనుము పండంటి బిడ్డల, ఘనముగాను
    వర్ధిలు ,సుఖముగానుండు స్వస్తి యిదని
    మోమున , నగవులను చిందు ముత్తయిదువ
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    రిప్లయితొలగించండి
  12. చదువుల కోసమంచు నభసమ్మును దాటి విదేశమేగినన్
    వదలక సంకురాతిరిని వత్తురు ప్రేమగ బామ్మగారితో
    ముదమున వేడ్కలన్ జరుప ముద్దుల పౌత్రికలన్ గనంగనే
    ముదిమినిఁ గన్నె పిల్లలకు ముద్దిడగన్ దలపోయుటొప్పగున్.

    రిప్లయితొలగించండి
  13. చం:

    ముదమున ముద్దు పెట్టుటకు మూలము లేన్నియొ నెంచిచూడగన్
    వదనము నందు గాంచనగు వాంఛిత రీతిని స్పష్ట మైనదై
    కుదిరిన భావరాగములు కూర్మిని బెంచవె, సంతసమ్మునన్
    ముదిమిని గన్నె పిల్లలకు ముద్దిడగం తలపోయు టొప్పగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. పొందితి శాపము,పోయెనా యవ్వనము ,
    ముడుతలు పడెగా ముచ్చటైన

    కాయము,గురువు శుక్రా చార్యుడు కినుక‌
    తో శపించెను గా ముదుసలి రూప

    ము నను పొంద మనుచు, ముసలి తనము వచ్చె
    నాదు దేహమునకు, నమ్మ వలయు

    రాణులార మనసు రతి సుఖ మునుకోరు
    చుండెగా,రాగదె నిండు మనము

    తోడ పడకటింటికి సు మథుర మగు నథ

    రముల తోడ ముద్దు లిడుము రమ్య గతిని,

    ముదిమినిం కన్నెపిల్లలు ముద్దిడ దగు

    నని‌ యయాతి బలికెను వినయము తోడ


    యయాతి శాపము పొంది వృద్ధాప్యం పొంది నను కామ వాంఛ చావక. భార్య ‌లను‌ కనీసము ముదుసలికి ముద్దు అయనా పెట్ట వలయు నని ప్రార్ధించు సందర్భంలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీసం మొదటి పాదంలో గణభంగం. "పోయె యవ్వనమును ముడతలు పడెనుగా ..." అనండి.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. తదియ వ్రతంబు చేగొని సుతారపు మేనులలంక
      రించుచున్
      ముదమున చేడియల్ గలసి మ్రోయగగజ్జలు సందడించగా
      ముదితల ప్రీతిపాత్రమగు పూవుల నల్లెడు బామ్మగారికిన్
      ముదిమిని గన్నెపిల్లలకు ముద్దిడగం దలపోయుటొప్పగున్

      తొలగించండి
  16. తే.గీ//
    బిడ్డబిడ్డల నోదార్చి ప్రియముగాను
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు !
    చేష్టలుడిగి తిట్టవలదు యిష్టమైన
    రీతి, తాత జేజులహక్కు ప్రీతిగొలుపు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలదు + ఇష్ట' మన్నపుడు యడాగమం రాదు. "తిట్టగవల దిష్టమైన" అనండి.

      తొలగించండి


  17. వలపుల జూపి తినుచు పే
    లలు, ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం
    దలపోయు టొప్పగున్? దె
    బ్బలు తప్పవుగా? నదియె సఫలమాయె సుమీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. కోవిడు దయతో చేరువ కుదరదాయె
    తాకనివ్వదు ప్రేయసి దగ్గరైన
    సావకాశము దొరకిన స్వప్నమందు
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. సదనము నందు నవ్వులు సాదర మొప్పగ రాగభాషణల్
      పదముల నొత్తి పుత్రులును భక్తి ప్రపత్తుల సేవజేయగన్
      వదలక పుత్రు సంతతి సుభాషణ నంకము జేరి తాతనన్
      ముదిమిని గన్నెపిల్లలకు ముద్దిడగం దలపోయు టొప్పగున్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో 'నవ్వులును' అనండి. లేకుంటే గణభంగం.
      'తాత+అనన్' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. చెదగుమి దొల్చు దారుగతి ఛిద్రశరీరము విల్లువోలె కై
      నొదిగిన చేతికర్ర తగ నోసుతుడయ్యెను వీడు కోర్కెలన్
      ముదిమినిఁ, గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్
      కుదురుగ యౌవనమ్మొదవి కోర్కెలు పొంగ తరంగమట్లుగన్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. పదములు పాడనేర్చినది పావనరామపదారవిందమున్
    హృదయమునందునిల్పినదియింతులకిష్టముగారవంబునా
    మదవతిమేడమేయనుచుమానినినాయకిమెచ్చెబామ్మదా
    *“ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్”*

    మేడమ్ సినిమాలో కన్నెపిల్ల రాజేంద్రప్రసాద్ ను బామ్మ మెప్పుకోలు ఇతివృత్తం గా

    రిప్లయితొలగించండి
  22. బామ్మమాటలు బంగారు బాటలుగను
    బామ్మచేతి ముద్దలబహు వంటరుచియు
    అమృతమునుపంచిపెట్టెడి ప్రేమమూర్తి
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముద్దలతోడి వంట రుచియు..' అనండి.

      తొలగించండి
  23. మది పరమాత్మ చింతనము మానక మన్నన నొందగాదగున్
    ముదిమినిఁ; గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్
    మదనుని ప్రేరణన్ మరగి మైమరపొందెడి యౌవనంబునన్;
    ముదమును గూర్చు నే వయసు ముచ్చట లప్పటి కన్వయంబుగాన్

    రిప్లయితొలగించండి
  24. మంచి యుద్యోగమునుబొంద మనుమరాలు
    మెచ్చి తాతయ్య ముదముగ నిచ్చెముద్దు
    మనసు నందున లేకున్న మలినమేమి
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    రిప్లయితొలగించండి
  25. పరుగు నందున బంగారు పతకమొచ్చె
    తనువు పులకరించి దరికి తాతవచ్చి
    ముదము తోటియు ముద్దిడె నుదుటి మీద,
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పతకమంద... ముదముతోడను ముద్దిడె.." అనండి.

      తొలగించండి
  26. పెద్దవయసున నుందురు పిల్లల వలె
    నసలు కన్నను వడ్డియె యగును బ్రీతి
    తాతకు మనుమ లన్నచోఁ దగని ప్రీతి
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు

    [కన్నె =కూతురు; కన్నె పిల్లలు = కూతురి పిల్లలు]


    సదనము నందు నిత్య మవిచారము సేయుచు నిత్యకృత్యముల్
    పదుగురి మేలు దల్చుచును బన్నుగ దైవ నిమగ్న చిత్తతం
    బదిలముగాఁ గరమ్ములను బట్టి ముదమ్మున నెత్తుకొంచునున్
    ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్

    [కన్నె =చిన్న; కన్నెపిల్లలు = చిన్న పిల్లలు]

    రిప్లయితొలగించండి
  27. ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడదగు
    దప్పులేదని భావింతు నొప్పెయగును
    ముదిమివయసున వారలు,మునిమనుమలు
    ముద్దులీయగ నర్హులుముదము జెంది

    రిప్లయితొలగించండి
  28. సదమల వృత్తితో బెనిచి చక్కని శిక్షణ పట్టిపట్టినిన్
    చదువుల లోన మేటియని సర్వజనాళి ముదమ్ము మెచ్చగా
    నదనున పెండ్లియౌ మనుమ రాలికి తోడుగ వెంట నంటి రాన్
    ముదిమినిఁ, గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్

    రిప్లయితొలగించండి

  29. పదియును నాలుగేండ్ల యొక బాలిక తోడుత పెండ్లి యెంతయున్
    గుదరదు! నర్మిలిన్ దెలుప కూడదు పూరుషు డెవ్వడేనియున్
    ముదిమిని గన్నె పిల్లలకు ముద్దిడగన్ తలబోయు టొప్పగున్
    ముదిత పదారు పాయమున మోదమునున్ దెలుపంగ నంతటన్
    (ఇటీవల పాకిస్తాన్ లో ఒక యాభై ఏళ్ల ఎంపీ పధ్నాలుగేండ్ల యువతిని పెండ్లాడిన సంఘటన విని వ్రాసిన పద్యం-. పదహారేళ్ల అమ్మాయినైతే చేసుకోవచ్చునట)
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  30. అదనునుజుచి యీయుటను నచ్చెరువందగ వారలయ్యెడన్
    ముదిమినిగన్నెపిల్లలకు ముద్దిడగందలపోయు టొప్పగున్
    మదినిగలుంగు నట్లుగను మానముసిగ్గులే యొక్కమారుగా
    సదమలదృష్టిగల్గుటకు చక్కని బుద్ధినిగోరుడీశునిన్

    రిప్లయితొలగించండి
  31. సరిచేసితిని గురూజీ!
    తే.గీ//
    బిడ్డబిడ్డల నోదార్చి ప్రియముగాను
    ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు !
    చేష్టలుడిగి తిట్టగవల దిష్టమైన
    రీతి, తాత జేజులహక్కు ప్రీతిగొలుపు !!

    రిప్లయితొలగించండి