7, ఫిబ్రవరి 2021, ఆదివారం

సమస్య - 3628

8-2-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగవాఁడో సతియొ చందమామయొ రవియో”
(లేదా…)
“మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా”
(బాబు దేవీదాసు గారికి ధన్యవాదాలతో...)

79 కామెంట్‌లు:

  1. పగవాడైననునేమీ
    రగులంగ వలదన వినగరారే చెప్పన్
    నిగుడమగుమాట పల్కిన
    మగవాఁడో సతియొ చందమామయొ రవియో!!


    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    సొగసుల్ మూటలు గట్టి కుల్కుల గనన్ సొంపారునా యింతియో
    తగ గాంభీర్యము పూరుషాకృతియనన్ ధైర్యమ్ము చిందాడె., న..
    వ్వగ చంద్రాంశువులట్లు తేజమున భాస్వద్భానుడా క్రీడినాన్
    మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  3. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నగుచున్ చేయుచు యాగముల్ విరివిగన్ నందమ్మునన్ తీవ్రతన్
    తగవుల్ తీర్చుచు బస్సు డ్రైవరులతో ధారళపుం కాన్కలన్
    మొగమందున్ భళి కుంకుమన్ పొదవుచున్ పోరాడు మానేతయే
    మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా...

    రిప్లయితొలగించండి
  4. మృగమొకటి కాను పించెను
    భగవంతుని యొక్క సృష్టి ప్రజ్ఞ ను దెలియన్
    సుగమము గాదది యేదో
    మగవాడో సతియొ చంద మామయొ రవియో?

    రిప్లయితొలగించండి
  5. కందం
    రగులఁగ నరకునిపై, తా
    వగలొలుకగ పతికి ముందు, వయ్యారిగ న
    వ్వగ, సత్య యలకలఁ జెలఁగ,
    మగవాఁడో! సతియొ! చందమామయొ! రవియో!

    మత్తేభవిక్రీడితము
    రగులన్ మారణహోమమందు నరకున్ మ్రందించు నవ్యాకృతిన్,
    సెగలన్ జిమ్మఁగ పారిజమ్ముకొరకై శ్రీకృష్ణు బాసాడుటన్,
    వగలన్ వెన్నెలమోమునన్ గురియఁగన్ వయ్యారి సత్యాంబయే
    మగవాఁడా! వనితాలలామ యగునా మార్తాండుఁడా! చంద్రుఁడా!

    రిప్లయితొలగించండి
  6. పగఁజూపరుద్రమకాగా
    సిగపూవాడకసిరులనుచెంతకుఁజేర్చున్
    పగలేచంద్రుడుపడతియు
    మగవాడోసతియోచందమామయోరవియో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "పగ జూపగ రుద్రమగా/యై" అనండి.

      తొలగించండి


  7. జగణపు జిలేబి యెవరో!
    మగవాఁడో! సతియొ! చందమామయొ! రవియో!
    చిగురాకులలో చిలకయొ
    జగడాలమ్మియొ! జనులు విచారించిరిగా!


    :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జిలేబి' అన్నది ఎవరో పురుషుని కలం పేరని ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు.

      తొలగించండి
    2. జగణపు జిలేబి జగడపు జిలేబి జిగిబిగి పద్యం!
      👌👌👌
      మీకూ అన్నయ్యకూ ఆత్మాశ్రయకవిత్వం తగియున్నది!😀😀

      తొలగించండి
  8. భగవంతుండని యెల్లరున్ దలప తద్భావంబుగన్ దోచెడిన్
    జగమంతన్ దను నిండి కాచు సద యాజంగంబు నెవ్వేళలన్
    తెగ వీక్షింపఁగ, దా నిరంజనుఁడు, నేతీరున్ ప్రశంసింతునే
    మగవాఁడా? వనితాలలామ యగునా? మార్తాండుఁడా? చంద్రుఁడా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పగలున్ రేయిని గాచు చక్షువులు దీప్తంబయ్యె నెవ్వేళలన్
      తిగకంటీ! నిను గొల్వ బూన సతికిన్ దేహార్ధ భాగంబిడన్
      నిగమాకార! మరేమనందునిక? నిన్నేరీతి భావింతునే?
      మగవాఁడా? వనితాలలామ యగునా? మార్తాండుఁడా? చంద్రుఁడా?

      తిగకంటి- త్ర్యంబకుడు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'తాను'ను 'తను' అనరాదు. "జగమందంతట నిండి కాచును కృపన్ జంగబె యెవ్వేళలన్" అనండి.

      తొలగించండి
    3. మీ యాశీసులే మా కవితా బలము.
      🙏🏻🌺🙏🏻

      తొలగించండి
  9. సగభాగంబునుకాంతగాచెలిమితోసంగయ్యతోనుండెలే
    సెగతోరాక్షసుమర్దనన్వెలయనాసీమంతినీసూర్యుడే
    సిగలోచంద్రునిధారణన్సుదతియున్సిత్రంబుగాఁదోచులే
    మగవాడావనితాలలామయగునామార్తాండుడాచంద్రుడా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంగయ్య' ? 'సీమంతిని సూర్యుడే' అనాలి. అలా అంటే గణభంగం అవుతుంది. 'సిత్రము' గ్రామ్యం. సుదతియున్ జిత్రంబుగా... అనవచ్చు.

      తొలగించండి
    2. తప్పిలనుశిరసావహించుచున్నాను

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వగలును చిందెడి వనితయొ
    సెగలను బాపెడి విబుధుడొ చేకల ఖగుడో
    నిగదించుము బృహన్నల
    మగవాడో సతియో చందమామయో రవియో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  11. తొగచెలి వెన్నెల హాసము
    సొగసగు హొయలు కనుచూపు జుహువాహనమై
    మగటిమ గలదేహము గన
    మగవాఁడో సతియొ చందమామయొ రవియో

    రిప్లయితొలగించండి
  12. సమస్య :
    మగవాడా వనితాలలామ యగునా
    మార్తాండుడా చంద్రుడా

    ( సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరమూర్తిని అవలోకించి ఆనందతన్మయత్వంతో ఆదిశంకరులు అనుకొంటున్నారు .)

    మత్తేభవిక్రీడితము
    .........................

    నగజాతన్ దన యర్ధదేహమున నా
    నందంబుతో నిల్పి యా
    జగదీశుండిదె దర్శనంబొసగె ; నా
    జన్మంబు ధన్యం బహో !
    యగునా ? దేవుడ ? దేవియా ? కనులవే
    యౌనా ? సుతత్త్వం బిదే ;
    మగవాడా? వనితాలలామ యగునా ?
    మార్తాండుడా ? చంద్రుడా ?

    రిప్లయితొలగించండి
  13. మగనికి వలపుల దృక్కులు
    పగవాడగునరకునకును పదునగు శరముల్
    మగనాలు సత్య కనగా
    మగవాఁడో సతియొ చందమామయొ రవియో

    రిప్లయితొలగించండి
  14. మొగమాటంబున బెట్టెను
    దగ చిత్రంబొకటి జూపి దన ప్రతిభంచున్
    నిగదింప నశక్యంబది
    మగవాఁడో సతియొ చందమామయొ రవియో

    రిప్లయితొలగించండి
  15. మ:

    పగతో కక్షలు పెంపు చేయ నకటా వర్గమ్ము నే కూర్చనై
    పగలున్ రేయిని వీడకుండగను వాగ్వాదమ్ములన్ దేలుచున్
    మగతన్ తేలిక మాటలన్ బలుక సమ్మానమ్ము గా నిట్లనెన్
    మగవాడా వనితా లలామ యగునా మార్తాండుడా చంద్రుడా!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నారదుని పై నా ప్రయటము

      మ:

      వగలన్ గూడిన బల్కులన్ వనితయే వాదించ నౌతీరుగన్
      తగవుల్ బెట్టుచు సంచరించుచును తాదాత్మ్యమ్ము నే బొందుచున్
      తెగువన్ జూపడె తానెయై సకలమున్ ధీటెంచి రక్షింపగన్
      మగవాడా వనితా లలామ యగునా మార్తాండుడా చంద్రుడా

      వగలు=మాయ
      ధీటు=చక్కబరచు

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  16. పగవానిన్గనినంత పౌరుషము పెంపారంగ నుగ్రాకృతిన్
    సెగలన్గక్కు దృగంచలంబులను, వీక్షింపంగ నాథున్ సదా
    వగలన్ జూపుచు వెన్నెలల్ గురియునా వయ్యారి నేత్రంబులన్
    మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా

    రిప్లయితొలగించండి
  17. పగులుల్ వాఱు ద్విచక్ర బండిదగు లోపట్టీ మరమ్మత్తు, తీ
    యగ స్వాదంబు మసాలలూరు పలుభక్ష్యంబుల్ తయారీలు, చ
    క్కగ సాధించెనె నాదిలక్ష్మియె తెలంగాణా మెకానిక్కహో
    మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా౹౹

    (https://www.indiatoday.in/india/story/adilaxmi-telangana-only-woman-mechanic-1760389-2021-01-19)

    రిప్లయితొలగించండి
  18. నృసింహుని జూచిన పరివారజనుల సంశయం

    కం.
    మృగరాజా మనుజుండో
    పగవారలు బెదరు ధీర భాసుర మూర్తే
    నగమో మెకమా యెవరే
    మగవాఁడో సతియొ చందమామయొ రవియో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏 సవరించి

      కం.
      నగమా! మెకమా ! మాయా !
      పగవారలు బెదరు ధీర భాసుర మూర్తే !
      మృగరాజా ! మనుజుండో!
      మగవాఁడో! సతియొ! చందమామయొ! రవియో!

      తొలగించండి
  19. అగుపించరు గద కనులకు
    మగవాఁడో సతియొ, చందమామయొ రవియో
    తగు వెలుగు నీయ కున్నను
    మిగులును చీకటి యెయిలన, వెలుతురె కరువౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యెయిలన'?

      తొలగించండి
    2. అగుపించరు గద కనులకు
      మగవాఁడో సతియొ, చందమామయొ రవియో
      తగు వెలుగు నీయ కున్నను
      మిగులును చీకటియె మనకు, వెలుతురె కరువౌ-- ok?

      తొలగించండి
  20. 🌹కందము🌹
    (అర్ధ నారీశ్వరుని చూచిన వేళ)

    రుగుదేవుగని మెర కలిగె

    మగవాఁడో సతియొ; చందమామయొ రవియో”

    శిగననహి పడగనుండిన

    పగడపు మణి భ్రమగొలిపెనపర్ణా నాధా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...
    ( రుగు దేవు.. శివుడు
    మెర ... సంశయము)

    🌹మత్తేభము🌹

    (హిరణ్య కశిపుడు కొడుకుతో పలికిన పలుకులు)

    తగునే చంపగ నన్ను భూతలమునన్ దారేది ప్రహ్లాద కా

    నగ నీ విష్ణుకు దైత్య వైరికి హిరణ్యాగ్రేశు సంహారికిన్

    పగలో రేయినొ మేటి ఖడ్గధరొనెవ్వండొచ్చురా చంపగన్

    మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. అగజాతో-ఈశ్వరుడో;
    మగవాఁడో- సతియొ; చందమామయొ- రవియో;
    జగముల తల్లియొ-హరియో;
    జగడము లాడక నడచిన జగతికి మేలున్

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. సెగకంటన్ నెఱిజిచ్చు మిన్నెగయ నిస్సీమప్రకోపమ్ముతో
      తొగకంటన్ మధురానుభూతు లొలయన్ తోరంపు రూపమ్ముతో
      తెగటార్చన్ నరకాసురున్ భయదసంతృప్తస్వరోపాకృతిన్
      మగ వాఁడా వనితాలలామ యగునా! మార్తాండుఁడా చంద్రుఁడా!

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'స్వరోపాకృతిన్' అర్థం కాలేదు.

      తొలగించండి
  23. ధన్యవాదములండి.
    స్వరూపమ్మునన్ ఉండాలి
    పొరపాటు టైపు అయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సెగకంటన్ జ్వలితాగ్ని మిన్నెగయ నిస్సీమప్రకోపమ్ముతో
      తొగకంటన్ మధురానుభూతు లొలయన్ తోరంపు రూపమ్ముతో
      తెగటార్చన్ నరకాసురున్ భయదసంతృప్తస్వరూపమ్మునన్
      మగ వాఁడా వనితాలలామ యగునా! మార్తాండుడా, చంద్రుఁడా!

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  24. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    *“మగవాఁడో సతియొ చందమామయొ రవియో”*
    (లేదా…)
    *“మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా”*

    నాప్రయత్నం

    కందము

    జగమున నీచుడు కీచకుఁ
    దగురీతిని సంహరింపఁ దరుణీ మణిగా
    పగఁబూని భీముడేగిన
    మగవాడో సతియో చందమామయొ రవియో

    పగవానిన్ నరకాసురున్ దునుమ నాభామ క్రియాదక్షతన్
    తగునౌరీతిగ కార్ముకంబుగొని ప్రత్యాలీఢ పాదంబుతో
    సెగలంగ్రక్కెడి యస్త్రముల్ విడువ
    నిశ్చేష్టాంగులై చూడగా
    మగవాడా!వనితాలలామయగునా!మార్తాండుడా! చంద్రుడా!

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి


  25. అగణిత సుందర రూపున
    నిగమ వినుతుడచట మోహినీ రూపమున
    న్నుగుపించతలచిరిసురలు
    మగవాడో సతియొ చందమామయొ రవియో


    రిప్లయితొలగించండి
  26. ( *మోహిని రూపంలో నున్న హరిని గాంచి ముక్కోటి దేవతలలో నొకడు సూర్యచంద్రులతో పల్కిన మాటలుగా* )
    ****** ***** **** *** ** * * ** ***
    ఖగరాట్వాహను డంబుజోదరుడు ప్రాగ్వంశుండు భూభృత్తు ప
    న్నగ పర్యంకుడు మారె మోహినిగ స్త్యానమ్మున్ విభాగింపగా
    జగదానందకరుండఁ గాంచి యొకడాశ్చర్యంబుతో పల్కెనే
    మగవాఁడా వనితాలలామ యగునా? మార్తాండుఁడా, చంద్రుఁడా

    రిప్లయితొలగించండి
  27. బృహన్నల

    పగతుల పాలిటి కాలుడు
    నగవుల్ జిందుచు హొయలను నాట్యముజేయన్
    జిగురించెను సందేహము
    మగవాడో సతియొ చందమామయొ రవియో!

    జయలలితమ్మ

    పగవారిన్ దగు పట్టుబట్టి బరిలో భంగమ్ముగావించి బల్
    యగచాట్లన్ దొలగించగా ప్రజలుతా మమ్మాయనిన్
    బిల్వగా
    సెగలన్ బ్రేమల నేకకాలమున విక్షేపించెడిన్ మంత్రి తా
    మగవాడా? వనితాలలామ యగునా! మార్తాండుడా
    చంద్రుడా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన మత్తేభము

      జయలలితమ్మ

      పగవారిన్ దగు పట్టుబట్టి బరిలో భంగమ్ముగావించి వే
      యగచాట్లన్ దొలగించినంత ప్రజ మాయమ్మంచు బూజించగా
      సెగలన్ బ్రేమల నేకకాలమున విక్షేపించెడిన్ మంత్రి తా
      మగవాడా? వనితాలలామ యగునా! మార్తాండుడా
      చంద్రుడా ?

      తొలగించండి
  28. జగములు నిల్చు నుదరమున
    భగవంతుని లీలఁ బ్రళయ పరితప్తులునై
    విగత ప్రాణులు కారే
    మగవాఁడో సతియొ చందమామయొ రవియో


    బృహన్నల విరాటుని కడ కేతెంచు సందర్భము:
    సమస్యా పాదమునకు మూడవ పాదమునఁ గ్రమాలంకారము కూడ ద్యోతకము.


    మృగరా జాభ విలగ్న చిత్ర తను గంభీ రోద రావర్తమున్
    విగతైశ్వర్య నరేంద్ర సన్నిభుని వే వీక్షించి మాత్స్యుం డనెం
    దగ నా ఠీవిని సుందరాస్యము లసత్తాపమ్ము శాంతమ్మునన్
    మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా

    రిప్లయితొలగించండి
  29. అద్భుతమైన పూరణలార్యా! నమోనమః! 🙏🙏🙏💐💐💐

    రిప్లయితొలగించండి
  30. అగణితశౌర్యపుధాటికి
    విగతుడుగానైననతడువిరటునిబావే
    పగతీర్చినభీముడరయ
    మగవాడోసతియొచందమామయొరవియో

    రిప్లయితొలగించండి
  31. పొగలన్గ్రక్కుచు జాహ్నవీ సుతుని సంపూజ్యుణ్ణి భీష్ముణ్ణి యా
    పగతున్గూల్చ శిఖండి క్రీడి రథమున్ బ్రాకన్ విలక్షించుచున్
    బుగులున్బొందుచు వైరి యోద్ధ లనరే పుణ్యుండు నెవ్వండొకో
    *“మగవాఁడా !వనితాలలామ యగునా! మార్తాండుఁడా !చంద్రుఁడా!”*

    రిప్లయితొలగించండి
  32. సగమంబాకృతియొంపుసొంపులుమహాక్షాత్రంబువేరొక్కప్ర
    క్కగనన్రౌద్రముతాండవంబుగనులన్గార్చిచ్చుముక్కంటియో
    శిగలోజంద్రుడుజాహ్నవీవిభుడొకోశ్రీమంతుడెవ్వండొకో
    *“మగవాఁడా ?వనితాలలామ యగునా? మార్తాండుఁడా? చంద్రుఁడా?”*

    రిప్లయితొలగించండి
  33. ద్విగుణమ్మైన విలాసమున్ పుడమిపై దేదీప్యమానమ్ముగా
    వగలన్ జూపుచు కాశ్యపేయులకు దేవాన్నమ్ము పంచంగ నా
    మగువన్ కన్గొని భర్గుడే తలచె కామమ్మూని చిత్తమ్ములో
    “మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా”

    రిప్లయితొలగించండి