4, ఫిబ్రవరి 2021, గురువారం

సమస్య - 3625

5-2-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు”
(లేదా…)
“మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్”

63 కామెంట్‌లు:

  1. మంచి చేసిన నేతను మనుజు లెల్ల
    పొగడి ముదమును దెలిపిరి పూను కొనియు
    మాల వేసి : దూషించి రమాత్యు ప్రజలు
    స్వార్థ పరుడయి మెలగంగ వ్యర్థు డగుచు

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మేలౌ రీతిని గానముల్ పలుకుచున్ మేధావులే కూడగన్
    పోలేరమ్మది కోవెలందు జనుచున్ పోగాల మేతెంచమన్
    పూలన్ వీడుచు పాదుకల్ గొనుచు భల్ పూజింపనున్ గోరుచున్
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్...

    రిప్లయితొలగించండి
  3. సేవ చేసెదననుచును చెప్పి చెలిమి

    మంత్రి పదవి పట్టి జనుల మరచెనొకడు

    మరల ఓటునడగ వచ్చె, మలక డాలు
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( మలకడాలు = చెప్పులు )

    రిప్లయితొలగించండి
  4. చెప్పిన పనులేవియుజేయ చీదరించి
    ఎన్నికల వేళ మరిచియు నేల వచ్చె?
    ఓటునిమ్మని కోరుచు నోటునివ్వ
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు!!

    రిప్లయితొలగించండి
  5. ప్రజల సొమ్మును తినుచుచు ప్రముఖు డొకడు
    ప్రస్తుతిని పొంద ననుకొని ప్రజల నుండి
    వేదికను నెక్కి జూడగ, పాదరక్ష
    మాలవేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
  6. పల్లెటూరులదిరుగకపారిపోవు
    మంత్రిగారికిమేధయుమరుగుపడెను
    నిజమునిష్ఠూరమునుగాదెనీరజాక్ష
    మాలవేసిదూషించిరమాత్యుప్రజలు

    రిప్లయితొలగించండి
  7. పెక్కు కుంభకోణములతో విరివిగాను
    ధనముఁబొంది పలువురు సుదతుల పట్టి
    మాన భంగము జేయగా మలకడాల
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు.
    . (విరించి).

    రిప్లయితొలగించండి
  8. ప్రేలాపంబులుమీవియేననగమీప్రేతంపువేషంబుమా
    కేలాయంచునుజాగ్రుతిన్జనులుతాకేల్మోడ్చికార్యంపుమా
    లాలంక్రుతుఁజేసితిట్టిరినిజామాత్యున్జనుల్సత్సభన్
    వేలున్జూపుచువీరులైపరిణితిన్వేగంబచైతన్యులై

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గౌరవించిరి గొప్పగా పౌరులెల్ల
    తమకు నుపకార మొనరించు త్రాత కచట
    మాల వేసి; దూషించిరమాత్యు ప్రజలు
    నతని మతిలేని పనులకు నడరు జెంది.

    రిప్లయితొలగించండి
  10. ఎన్నికలలొచ్చె ఓటును వేయ మనగ
    ఇన్ని యేడులు జుర్రితి వెర్రి నాన్న!
    ఏమి యున్నది తినుటకు గ్రామ మందు
    మాలవేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
  11. జాలిన్ జూపక పేదవారిపయినన్ షడ్భాగమున్ వేసెడిన్
    స్త్రీ లోలుండతడే నితంబవతులన్ జేపట్టెడిన్ దుర్మతిన్
    శీలంబన్నది లేనిమూర్ఖుడనుచున్ ఛీగొట్టి మేజోళ్ళతో
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్
    . . (విరించి).

    రిప్లయితొలగించండి
  12. మేలైనట్టి కవిత్వవైఖరులు జృంభించన్ లసత్కావ్యముల్
    లీలాచాతురిఁ సృష్టిఁజేసిన వచశ్రీమూర్తినిన్ ధీమతిన్
    నీలప్రస్తర మౌక్తికంబులిడుచున్ "నిందాస్తుతి" ప్రోక్తమై
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్

    రిప్లయితొలగించండి
  13. శా:

    వాడైధూర్తు వికాసమన్న నెపుడున్ పట్టించుకోకుండగన్
    వేళల్నెంచక జూదమున్ తనరుచున్ పేకాట లాడంగనై
    కూడంబెట్టగ వేలకోట్లు, విధిగా గుర్తించి నభ్యర్థిగా
    మాలాలంకృతు జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. సమస్య :
    మాల వేసి దూషించి రమాత్యు బ్రజలు

    ( సార్థకనామధేయురాలైన విద్యావతికి తన పుత్రుని కాదన్నదన్న అసూయతో పామరుని పండితునిగా చూపి పెండ్లి చేయించిన వంచకమంత్రికి పౌరుల శిక్ష )

    తేటగీతి
    ...........
    " పసుల కాపరి కాలుని పట్టి తెచ్చి
    రాచకొమరిత బ్రతుకును రట్టుజేసి
    నట్టి నీచుడ ! మడియర ! " యనుచు చావు
    మాల వేసి దూషించి రమాత్యు బ్రజలు .

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    స్త్రీలన్ బట్టుచు కాముకత్వమున దుశ్శీలుండునై మీఱుచున్
    కైలాటమ్ముల నెంచుచున్ ప్రజల యాకాంక్షల్ విఘాతించుచున్
    మేలుంగూడని రీతినిన్ చెలగు నా మ్లేచ్ఛున్నటన్ జోళ్ళతో
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్

    రిప్లయితొలగించండి
  16. సాలాముల్ దగజేయుచున్ బ్రజలకున్ సాష్టాంగ దండంబులన్
    మేలమ్ముల్ కరచాలనమ్ములనహో మీరేగ మావేల్పులన్
    వేళాయంగద వోట్లకైయనుచు భల్
    వింతైన శల్యంపుదౌ
    మాలాలంకృతు జేసితిట్టితిరి నిజామాత్యున్
    జనుల్ సత్సభన్

    రిప్లయితొలగించండి
  17. చేసి తివి తప్పుడు పనులు, చిక్కితివిగ
    మాకు నేడు వదలమని మంది గూడి
    చీడ పురుగుయె వీడని,చెప్పుల జత
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పురుగు+ఎ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "చీడపురుగె వీడని చెప్పి చెప్పుల జత" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు శంకరయ్య గారు. అలాగే!

      తొలగించండి
  18. పురమునందలి ముఖ్యులు పూనుకొనగ
    బూతు మాట్లాడు నేతకు బుద్ధిజెప్ప
    రచ్చకు బిలిచి , యట పాదరక్షలున్న
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
  19. చేసి తివి తప్పుడు పనులు, చిక్కితివిగ
    మాకు నేడు వదలమని మంది గూడి
    చూడు తగిన శాస్తి యిదని,జోళ్ళు గూర్చి
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి


  20. అరరే! మాయల చేయుచు
    పరులకు కీడు తలపెట్టి ప్రబలంబవ గా
    నరె మాల వేసి దూషిం
    చి రమాత్యుఁ బ్రజలు కనలుచు చిందుల తోడై


    జిలేబి

    రిప్లయితొలగించండి


  21. నేలన్వీడెను! దుష్టబుద్ధి ముదురై నీమమ్ములన్ తప్పుచున్
    మూలాలన్నియు కూల్చగా ప్రజలకో ముప్పొద్దులాకష్టముల్!
    కాలాతీతము గాక మేల్కొని భళా కాండ్రించి కోపమ్ముతో
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. జనుల సేవకు నంకిత మనుచు తాను
    గద్దె నెక్కిన పిమ్మట గతము మరచి
    పేదకన్యాయ మొనరింప పాదరక్ష
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
  23. నింద దూషణల్ మదిదాగు నిచ్చదీర్చు
    మూఢ నమ్మకాలెక్కువై మూర్ఖమంత్రి
    పాపి కోరగా వేసారి పాదరక్ష
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
  24. శీలంబూడ్చిధనంబునూడ్చివిలువల్చేజార్చిమంత్రాంగమున్
    జాలన్వేదనపాలుజేసిప్రజకున్సంతోషమున్ద్రుంచమే
    ల్మేలీతండనిమంత్రులేబొగడగామేలెంచియోట్లేయనన్
    *“మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్”*

    రిప్లయితొలగించండి
  25. జాలిన్ జూపక జాతి సంపదను దా స్వార్ధంబుతో దోచెనే
    చాలున్ చాలికనీ ప్రబుద్ధునికికన్ సన్మాన మెట్లర్హమౌ
    వేలాకోలమె వీనికిన్ సరి గదా వేరేలనిన్ పాదుకా
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్

    రిప్లయితొలగించండి
  26. జనుల మద్దతు తోడనె జయము నంది
    తిరిగి చూడని వానికి తెలుపు బుద్ధి
    కుళ్ళిన టమాటపళ్ళను కూర్చి పెద్ద
    *“మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    రిప్లయితొలగించండి
  27. మేలు కలిగించు పనులను చాలజేయు
    పాలకునిసత్కరించిరి పౌరులు గజ
    మాలవేసి, దూషించరమాత్యు ప్రజలు
    కాని పనులను జేయగ హీనుడనుచు !!!




    రిప్లయితొలగించండి
  28. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

    పాలున్ బువ్వయు నీడ ఫించ। ననుచున్ బల్ మాటలన్ జెప్పగా

    చాలన్ జేయు,మహామనీషి, యనుచున్ చక్కంగ గెల్పించితే!

    చాలామోసము చేసెనే!యనుచు దుష్టంబైన పుష్పాలతో

    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ బ్రజల్ సత్సభన్.

    మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

    రిప్లయితొలగించండి
  29. తేటగీతి
    నదుల పారింతు మీ కని వదరి వదరి
    బిందె నీటికి నామళ్ళు కుంద నడుచు
    యిడుములాపకె మరి యోట్ల నడుగఁ! దిట్ల
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    శార్దూలవిక్రీడితము
    సౌలభ్యమ్ముగ నీరమంద నదులున్ సంధించు వాగ్దానముల్
    గాలిన్ గల్పుచు, నీటికై చెలమలన్ గాలించు దౌర్భాగ్యముల్
    దాళన్జాలక, తిర్గియోట్లనడుగన్ దా రాగ, లోటాలతో
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్!

    రిప్లయితొలగించండి
  30. మంత్రియయ్యును నభివృద్ధి మాటమఱచి
    బ్రాదిసీసాలద్రవమును ద్రాగుచుండి
    పనులుసేయమి కోపానపావకోళ్ళ
    మాలవేసిదూషించిరమాత్యుబ్రజలు

    రిప్లయితొలగించండి
  31. దుష్టులను ద్యజియించుట కష్ట మైన
    దేశమునకు మే లొనగూడు లేశ మైనఁ
    గీడు వాటిల్ల దని పరికించి వాని
    మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు

    [దూషించు = త్యజించు]


    కాలాంతర్గత మత్సరాదులను శంకన్ వీడి వాక్రుచ్చఁగాఁ
    జాలుం జాలును మంత్రి వర్య నిఁక నిశ్శబ్దమ్ము మేలం చహో
    వాలాయమ్ముగ బుద్ధి సత్వరము నేర్పం దామ్రచూ డాండ దు
    ర్మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్

    రిప్లయితొలగించండి
  32. కె.వి.యస్. లక్ష్మి:

    పదవు లెక్కగ ప్రతినలు పలికె నెన్నొ
    ఓటు లచ్చుగ పొందెను నోటు కపుడు
    గద్దెనెక్కి గతమువీడగా నిరసన
    మాలవేసిదూషించిరమాత్యుబ్రజలు.

    రిప్లయితొలగించండి
  33. జాలమ్మున్ పొనరించి గెల్చి పదవిన్ సాధించి తాన్ మంత్రిగా
    స్త్రీలోలుండయి నిత్యమున్ తిరుగుచున్ చేయించి దుష్కృత్యముల్
    ఆలోకించక గ్రామవృద్ధి మది మద్యమ్మాని రాన్ గడ్డిదౌ
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్

    రిప్లయితొలగించండి
  34. వేళంజూడకత్రాగుచుండియుసభావేదిన్ త్వరంజేర,పూ
    మాలాంకృతుజేసితిట్టిరినిజామాత్యున్ జనుల్ సత్సభన్
    జాలున్ మాటలుపొమ్ముదుష్టుడ!యికన్ సాహాయ్యమీబోకుమా
    కాలాతీతముజేయబోకుముసుమాకర్కోటకుండా!యికన్

    రిప్లయితొలగించండి