11, ఫిబ్రవరి 2021, గురువారం

సమస్య - 3632

12-2-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి”
(లేదా...)
“నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్”

49 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    చేతులు కాలగా విరివి చింతను జేయుచు గోల్డు ఫ్లేకునున్
    వేతన మెల్ల పోవగను పీకలు కాల్చగ వంగభూమినిన్
    ప్రీతిని పీల్చగా పొగను వేడుక మీరగ చౌక బేరమున్
    నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్...

    రిప్లయితొలగించండి
  2. వాతలు బెట్టినారు తలవ్రాతలు మార్చిరి నేతిబీరలో
    నేతిని దీసినారు మననేతలు నేతులు ద్రావినారు మా
    మూతుల వాసనల్ గనుడి మోద మొసంగగ నీటి వ్రాతలో
    *“నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్”*

    రిప్లయితొలగించండి
  3. అందమైన సాగర తీరమందు మెరిసె

    వంగిన హరివిల్లును బోలు సుందరమగు

    నాతి! వైజాగులో :; చార్మినారుఁ గంటి”

    కాని సంచునా పడతికి కాదు సాటి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    (సంచు= శోభ)

    రిప్లయితొలగించండి
  4. నూతన ధూమవర్తులిల నూటికి మించిన వేళ గాంచగన్
    తాతల నాటివెన్నొ యపిదానమయెన్ గద యౌవ్వనమ్ములో
    ప్రీతిగ త్రాగినట్టి సిగరెట్టు నిమిత్తము దేవులాడగా
    నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్

    రిప్లయితొలగించండి
  5. చలన చిత్రము గాంచుచు చకితు డగుచు
    భార్య తో ననియె నొకడు భామ వినుమ
    నాతి ! వైజాగు లో చార్మినారు గంటి
    నిట్టి సాంకేతిక త మబ్బె నిప్డు మనకు

    రిప్లయితొలగించండి
  6. నా చెలిమికాడు వేసిన నాణ్యమైన
    చిత్ర రాజము నపహరించె నొకడంచు
    వాడ వాడల వెదికెడు పాళమందు
    నాతి వైజాగులో చార్మినారుఁ గంటి.

    రిప్లయితొలగించండి
  7. నాతి "వైజాగు లో చార్మినారు గంటి
    యనుచు" వేరొక పడతితో యనగ,"నేను
    హైదరాబాదునందున హార్బరుకని
    యుంటి"ముసి ముసినవ్వు తో యువతి జెప్పె!

    రిప్లయితొలగించండి
  8. వెడలె పిల్లల తీసుకు, వేడుకగను
    పుట్టినింట నుండెను తాను మోదముగను
    నాతి వైజాగులో ,చార్మినారుఁ గంటి
    సెలవు నాడు నేనొంటిగ, సేద దీర!

    రిప్లయితొలగించండి
  9. ఖ్యాతినిగాంచినట్టి ఘనకట్టడమున్ దిలకించదల్చి నే
    ప్రీతిని స్నేహబృందమును వేడ్కనుతోడ్కొని రైలునెక్కగా
    నాతి! విశాఖ పట్టణమునన్; గనుగొంటి చార్మినారునున్
    చేతుల శోభగూర్చెడిని చిత్రవిచిత్రపు కంకణమ్ములన్

    రిప్లయితొలగించండి
  10. నూతన బాధ్యతల్ గొనె ననూహ్యత హైదరబాదు మేయరై ;
    మా తలరాత మారెనిట మాగతి యేమని కార్మికాదులా ;
    నేతలు నెవ్వరైన సరి నేమము దిమ్మెల రీతి యన్చు నే ;
    నాతి!, విశాఖపట్టణమునన్, గనుగొంటిని చార్మినారునున్.

    రిప్లయితొలగించండి
  11. తాగుబోతుల మేలుయే తనకుయెంతొ
    ముఖ్యమనెడి మంత్రివరుల ముదముగూర్చ
    తప్పతాగుచు తూలుచు చెప్పిరిటుల
    “నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి”

    రిప్లయితొలగించండి
  12. నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్.

    నా ప్రయత్నం:

    చేతము రంజిలన్ దెలిపె చెల్వున కిట్టుల యాత్ర గూర్చి, యా
    నాతి! విశాఖపట్టణమునన్: "కనుగొంటిని చార్మినారునున్,
    భూత నివాస యోగ్యమయి పూర్తిగ గూలిన గోలకొండనున్,
    ఖ్యాతి వహించినట్టియురు గౌతమ బుద్ధుని హైద్రబాదునన్."

    చెల్వుడు-భర్త

    రిప్లయితొలగించండి
  13. సమస్య :
    నాతి విశాఖపట్టణము
    నన్ గనుగొంటిని చార్మినారునున్

    ( విశాఖపట్టణంలో ఎగ్జిబిషన్ లో కృత్రిమంగా నిర్మించిన చార్మినార్ ను చూచిన శంకరార్యులు సతీమణితో )

    ఆతతమైన , శ్రేష్ఠతర
    మైన , మనోహరపట్టణంబిదే !
    చాతురితోడ కట్టి రిట
    సాగరతీరమునందు సొంపుగా ;
    నే తరి గాంచలే దహహ !
    ఎగ్జిబిషన్ కడ నిల్పినారలే
    నాతి ! విశాఖపట్టణము
    నన్ గనుగొంటిని చార్మినారునున్ !!

    రిప్లయితొలగించండి
  14. నేతిని పంచదారలను నేర్పుగ బొమ్మలు చేసి కూర్పునన్

    భూతల బ్రహ్మగా జనులు భూరిగ మెచ్చగ సంద్ర తీరమున్

    కోతులు కొండముచ్చులును కోమలి బొమ్మలునమ్ముచుండెనా

    నాతి! విశాఖపట్టణమునన్ , గనుగొంటిని చార్మినారునున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  15. వత్సుని నచట కనినది వ్రాయుమంటి
    నాతి! “వైజాగులో చార్మినారుఁ గంటి”
    ననుచు వ్రాయ దానినికని యచ్చెరుపడి
    సంతసించుచు మెచ్చితి చాతురుడని

    రిప్లయితొలగించండి
  16. నేడు యేతెంచి యిచటకు నిన్నుజూడ
    నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి
    చార్మినారన నానాటి చౌకయైన
    ఘాటు సిగరెట్టు యీనాడు కానరాదు

    రిప్లయితొలగించండి
  17. ఆతత తోయరాశి గనులారగ గంటి ప్రభాతభానునిన్
    నాతి! విశాఖపట్టణమునన్; గనుగొంటిని చార్మినారునున్
    ఖ్యాతిని గాంచినట్టి పలు కట్టడముల్ మన రాజధానినిన్
    సాతమునొంది జేరితిని చక్కగ యాత్ర ముగించి యింటికిన్

    రిప్లయితొలగించండి
  18. వైజాగు బీచు లలరారుచు యారాడా ఆర్కే భీమ్లీ
    కంబాల కొండ తొట్ల కొండ బొజ్జన కొండ గాంచి
    ముప్పది యేండ్ల నుబంధ మది మరువ జాలున
    అచ్చోట బురుజుపేట సిరిమాలచ్చి కనకమహాలక్ష్మీ దీవెన

    చార్మినార్ ఓరుగంటిన గాఁచితి రుద్రదేవ సహస్ర స్థంబాల కోవెల
    పద్మాక్షి భద్రకాళిక నేత్ర పర్వమాయే శోభిల్లే కోట గోడల
    రామప్ప లక్నవర కొలను యలల వడ్డేపెల్లి జెరువు కాజిపేట
    విశాఖపట్టణం-అనకాపెల్లి-సామర్లకోట-రాజమహేంద్రి-ఏలూరు-బెజవాడ-ఖమ్మమ్-వరంగల్-ఘట్కేసర్-బీబీనగర్-సికింద్రబాద్-ఇత్యాదులట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చార్మినార్: నాలుగు నెలలుగా*
      [అక్ట, నవ, డిసె, జన]

      *మా మాతృకలో

      తొలగించండి
  19. తేటగీతి
    కమిలి విషవాయు విస్ఫోటనమున జనులు
    రాలుచుండఁగ, స్వప్నాన జాలిఁగొలుప
    ' కలర' నిర్మూలనార్థంపు కట్టడమన
    నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి

    ఉత్పలమాల
    వాతము నందు జిమ్మ విషవాయువు నొక్క పరిశ్రమంబె! యా
    ఘాతము రాల్చఁగన్ జనుల గాసిలుచున్, కలరానడంచఁగన్
    రాతిఁ బ్రతీకగన్ వెలసి రాజిలు కట్టడమౌచు స్వప్నమై
    నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్


    రిప్లయితొలగించండి
  20. కె.వి.యస్. లక్ష్మి:

    కనకమాలక్ష్మిని గనెను కన్నులార
    నాతి వైజాగులో; చార్మినారు గంటి
    నందమైన భాగ్యనగరమందు నేను
    శిల్పకళయందు రెండును శ్రేష్ఠతరము.

    రిప్లయితొలగించండి
  21. నాతి!వైజాగులోచార్మినారుగంటి
    నుక్కుఫ్యాక్టరీనమ్మెనునోబులమ్మ
    కృష్ణజలరాశి యింకెను నుష్ణమునకు
    నిట్టిమాటలుబలుకుటయెటులపాడి?

    రిప్లయితొలగించండి
  22. సంతసమ్మున నొక తరి వింతలు గన
    మిత్ర వర్గయుత విహార యాత్రఁ జలుపఁ
    జనఁగ నే భాగ్యనగరికిఁ జదువుచుండ
    నాతి! వైజాగులో గంటి నాల్గు నిట్ట /
    నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి


    ప్రీతిఁ దురుష్క కోటికిఁ బవిత్రపు వేశ్మము లెల్ల చోటులన్
    భాతిని వెల్గుచుండు నవి పన్నుగ నిట్టలు నాల్గు నిల్వఁగా
    నీ తరి నేఁగ నేను పురి కింపుగ నట్టిది యచ్చటుండఁగా
    నాతి! విశాఖపట్టణమునం గనుగొంటిని నాల్గునిట్టనున్ /
    నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్


    రిప్లయితొలగించండి
  23. నాతి!విశాఖపట్టణముననన్ గనుగొంటినిచార్మినారునున్
    గాతరమొందకుండగనుగాంచుమ తప్పకయోలలామరో
    తాతలనాటిగోడలవిదానిని హైదరబాదులోదగన్
    బ్రీతినిజూడగల్గుదువువేమరు,కాదువిశాఖలోసుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఈ పద్యమును ఎక్కడెక్కడ విడగొట్టి చదువ వలెను :)



      జిలేబి

      తొలగించండి
    2. చార్మినారు చాల ప్రాచీనమైనకట్టడము దానిని విశాఖలోకాదు హైదరాబాదులో చూడుము అనేభావనతో వ్రాసాను. పద్యముకుదరలేదా! జిలేబి గారు

      తొలగించండి
    3. నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్
      గాతర మొంద కుండగను గాంచుమ తప్పక యో లలామరో
      తాతల నాటి గోడ లవి దానిని హైదరబాదులోదగన్
      బ్రీతిని జూడ గల్గుదువు వేమరు, కాదు విశాఖలో సుమా

      అన్నయ్య, జిలేబి గారి యుద్దేశ్య మిట్లు విడ గొట్ట మని కాబోలు.

      తొలగించండి


  24. ఓసి! నీపాసగూల! ప్రలోల! చుప్ప
    నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి
    వా జిలేబి ? కతలు బాగు బాగు పోవె
    నీదు డంబములు తెలియనివకొ రమణి!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  25. వనధిని జిలేబి! బింబా
    నన! నాతి! విశాఖపట్టణమునన్ గనుగొం
    టిని, చార్మినారునున్ గం
    టిని హైద్రాబాదులో పటిష్టముగ సుమీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. ఉ:

    రాతిరి వేళ వీధులను రంగులు జిమ్మెడు దీపకాంతిలో
    చూతమటంచు నింతి జత సుంతయు జాగుయె లేక సాగుచున్
    ఖ్యాతిని గొన్న చిహ్నమును గాంచగ కూడలి దారి దెల్పు, హే
    నాతి! విశాఖ పట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. చేవఁదెలిసినజనులునుజేలుగోట్టి
    అప్పనంబుగవచ్చెడిహంగులెంచి
    జగతిజీవనమార్గంబుజారుకోనక
    నాతివైజాగులోచార్మినారుగంటి

    రిప్లయితొలగించండి
  28. ఖ్యాతి గడించినట్టి దిది కట్టడమెంతయు సుందరమ్మెగా
    ప్రీతిగ జూడనెంతురిట ప్రేమతొ హైదర బాదునందునన్
    నేతలు యెవ్వరైన నట నేరుగ జూచిరదేమొచిత్రమున్
    నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్!!

    రిప్లయితొలగించండి
  29. సాగర సొబగులను గంటి జతగ నుండ
    నాతి,వైజాగులో చార్మినారు గంటి
    భాగ్య నగరము నందున వాసిగాను
    వేసవిసెలవులిడినంత వేడ్క తోడ.

    రిప్లయితొలగించండి