16, ఫిబ్రవరి 2021, మంగళవారం

సమస్య - 3637

17-2-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొగడినట్టి వారలను జంపుటయె నీతి”
(లేదా...)
“పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ”

61 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  "ప్రభాకర శాస్త్రీయము":

  వెగటగు మాటలాడుచును వెఱ్ఱిగ మొఱ్ఱిగ వేషమేయుచున్
  నగరపు నెన్నికందునను నాట్యము జేయుచు వీధివీధులన్
  తెగడుచు కేసియారునిట త్రిప్పలు బెట్టుచు, భాజపాను భల్
  పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "ఆర్యా, వ్యక్తిగత రాజకీయములకు ఇది వేదిక కారాదు. మీరు "సరదా" పూరణ అని చెప్పినా, ఇది ఎంతోమంది నొచ్చుకునేలా ఉన్నది. నమస్సులు. 🙏🙏🙏"

   తొలగించండి
  2. వేషమేయుచున్ అనుట దోషమనుకుంటాను శాస్త్రి గారు !

   తొలగించండి
  3. __/\__

   ఏయు = వేయు, వైచు, ఉంచు (ఆంధ్రభారతి)

   తొలగించండి
  4. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. కుటిల బుద్ధుల చర్యలు కుట్ర లెల్ల
  మంచి పనులని మిక్కిలి మాన్యు లనుచు
  పొగడి నట్టి వారలను జంపుట యె నీతి
  యనుచు విజ్ఞులు పల్కుదు రవని యందు

  రిప్లయితొలగించండి
 3. తగవులు బెట్టువారలను తంపులమారి యనంగ జూడమే
  మగసిరి గల్గి నట్టి మగ మాన్యులు యోచన చేయజాలరే
  ఎగయగ నెంతురెప్పుడును నిట్టి విదూషక చక్రవర్తులౌ
  పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ!!

  రిప్లయితొలగించండి
 4. తలచకను ముందు వెనుకల తన విరోధి
  పొగడినట్టి వారలను జంపుటయె నీతి
  కార్యమను కొనిన జగము కాష్టముగను
  మారు, మరు భూములెమిగులు మనిషికిలన

  రిప్లయితొలగించండి
 5. కులసతిని నిండు సభనను కులటయనుచు

  సెంక లేక వివస్త్రను చేయమనిన

  దుష్ట ధుర్యోధన ప్రభును శిష్ఠుడనుచు

  పొగడినట్టి వారలను జంపుటయె నీతి

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 6. మేటితానెయనుచునుతామేలిరుచుల
  కలలఁదేలుగాదెకుఱుచకలుపుమోక్క
  మేలునీయనిమాటలుమేటిగావు
  పోగడినట్టివారలనుచంపుటయెనీతి

  రిప్లయితొలగించండి
 7. తేటగీతి
  వైరులుగ జన్మనెత్తుచు చేర నొప్పి
  ద్వారపాలకు లారీతి శౌరికైరి
  నియతి శిశుపాలుఁడందెను, నిందలనఁగ
  పొగడినట్టి వారలను జంపుటయె నీతి

  చంపకమాల
  వెగడి సనందనాదులట వెట్టగ శాపము ద్వారపాలకుల్
  పగతురు లౌచుఁ జేర హరి వల్లె యనంగను, చేది రాజుగన్
  దెగడఁగఁ జక్రియై యుసురుఁ దీసెను! ముందుగ నొప్ప నిందలన్
  బొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ!

  రిప్లయితొలగించండి
 8. కపట ప్రేమను జూపుచు కల్మషమున
  నీతిబాహ్యపు పనులెల్ల నేర్చినారె
  హితుల మధ్యన సఖ్యత చెరుప జూడ
  పొగడినట్టి వారలను జంపుటయె నీతి!!

  రిప్లయితొలగించండి
 9. సమస్య:
  *పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ*

  నా ప్రయత్నం:

  చం.
  వెగటుగ మాటలాడుచును వేదిజ వస్త్రములూడ్వ జూచుచున్
  తగులమునన్ సుయోధన నితాంత మదాంధత నొప్పు వారినిన్,
  దగదని యడ్డు సెప్పక, మదంబున మెచ్చుచు ధార్తరాష్ట్రులన్
  పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ

  వేదిజ-ద్రౌపది
  నితాంత-మిక్కిలి
  తగులము-ప్రేమ
  మదము-సంతోషం

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. హిరణ్యకశిపుడు మంత్రులతో

   తగదుర బాలకాయనుచు తండ్రిని జెప్పిన ధిక్కరించుచున్
   నిగుడుచు చక్రధారి ననునిత్యము జేరిభజించగా
   లలిన్
   రగులదె నాదుమానసము రాక్షసరాజును వైరివర్గమున్
   బొగడిన వారి ప్రాణముల బోరనదీయుటె నీతికార్యమౌ

   తొలగించండి
 11. మగువలు మల్లె పూవుల ను మెచ్చుకొని , వాటినే కడతేర్చారు... అనే భావనగా ఈ ప్రయత్నము.

  చం:

  నిగ నిగ లాడు మల్లెలట నిండుగ తోపున వ్యాప్తి చెందగన్
  మగువలు మెచ్చి కొప్పుముడి మాత్రమటంచని సేకరించుచున్
  తెగబడి పోగుజేసి కడతేర్చగ పూలు తలంచె నిట్లుగన్
  పొగిడిన వారి ప్రాణముల బోరన దీయుటె నీతి కార్యమౌ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 12. జగతికి మార్గదర్శి, నృప జాతిల మెచ్చిన మేటి, రాముపై
  పగగొని కల్ల మాటలను పన్నుగ కైకకు జెప్పి వైర బు
  ద్ధి గరపు నీచ మందరను దివ్య చరిత్ర యనన్చు మేదినిన్
  పొగడినవారి ప్రాణముల బోరన దీయుటె నీతికార్యమౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   జాతి+ఇల... అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "యటంచు.." అనండి.

   తొలగించండి
 13. సమస్య :
  పొగడినవారి ప్రాణముల
  బోరన దీయుటె నీతికార్యమౌ

  ( పింగళకుడనే సింహానికి ,సంజీవకు డనే వృషభానికి గల మైత్రిని చెప్పుడు మాటలతో చెడగొట్టిన కరటకదమనకు లనే కుత్సితపు నక్కలను వెంటనే వధించటమే నీతిమంతమైన పని )

  చంపకమాల
  ....................

  " అగణితవిక్రముండవు ; న
  నన్యవిరాజిత సద్గుణుండ ; వో
  మృగములరాజ ! పింగళక !
  భృత్యుడు సంజివకుండు ద్రోహియే ;
  వగవకు ; జంపుమాతనిని ;
  భద్రము నీ " కనె గుంటనక్క ; లా
  పొగడినవారి ప్రాణముల
  బోరన దీయుటె నీతికార్యమౌ .

  ( వగవకు - విచారించకు , బోరన - శీఘ్రముగా )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంజీవకుడు' సంజివకు డయ్యాడు.

   తొలగించండి
 14. సత్కరించదగు తన దేశవిభవమును
  పొగడినట్టి వారలను ; జంపుటయె నీతి
  వివిధదేశ సభలయందు పెడసరముగ
  పలుచనపరచి మాట్లాడు పాలసులను

  రిప్లయితొలగించండి


 15. తెగడుట పొగడుట జిలేబి, తేనెలూరు
  మాటల వెదజల్లి జనుల మదిని కొల్ల
  గొట్టుట తమ కెదురు తిరుగు ప్రజల భళి
  పొగడినట్టి వారలను జంపుటయె నీతి!  జిలేబి

  రిప్లయితొలగించండి


 16. కటకట బేడీ జీ! కు
  మ్ముట, పొగడినవారి ప్రాణముల బోరనఁ దీ
  యుటె నీతికార్యమౌ ప్రా
  కటమాయె కదా చలో జి! కాస్త రిలేక్స్ జీ ! :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. జగడములాడలేక జన చంద్రుల చెంతన జేరువారలై
  వెగటుగ మాటలాడి పలు వింతగు చేష్టలు నేతముందరన్
  పగతుర ద్రుంచ నెంచి పదవాశతొ పార్టిని వీడివచ్చినన్
  పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ !!

  ***రెండవ పూరణ...

  రిప్లయితొలగించండి
 18. తెగబడి శత్రుసైన్యమును ధీరుడునై యెదిరించువాడినిన్
  మగటిమిదేశభక్తుని సమైక్యు లమేయ నిరంకుశాహమున్
  నగుచును నిందజేయుచు ననాదరణంబున నీచబుద్ధితో
  *“బొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ”*

  రిప్లయితొలగించండి
 19. పొగరుగ మాటలాడి హిత బోధల సుంతయు లెక్కసేయకన్
  తగదని జెప్పినన్ వినక తప్పుడు దారిని బట్టి పెద్దలన్
  తెగడుచు ఘోరకృత్యముల దేశము నాశము జేయు ద్రోహులన్
  పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ

  రిప్లయితొలగించండి
 20. ద్వేషము వహించి పగఁ బూని దేశ దళపు
  గుట్టు విప్పి జనుల కెల్ల ఱట్టు తెచ్చి
  పంతము వహించి పగవారి చెంతఁ జేరి
  పొగడి నట్టి వారలను జంపుటయె నీతి


  సుగతి నొసంగు వానిఁ గని శూర కులాంబుధి చంద్రుఁ గృష్ణునిన్
  విగత భయమ్ము నింద లిడి వెఱ్ఱియు నై పలుకంగ నేర్చెనే
  తెగడఁ దగుం గడింది పరిదేవిని నీ శిశుపాలు నిట్లనం
  బొగడిన వారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ

  రిప్లయితొలగించండి
 21. అగపడవీరుడేతనదునంగనసీతనుఁదెచ్చిదోషియై
  విగళితదేహుడైయనినివీనులవిందుగపల్కెనార్తితో
  పోగడెనువైరిరామునినిపోంగినమానసమందుశాంతితో
  పోగడెినవారిప్రాణములఁబోరనఁదీయుటనీతికార్యమౌ

  రిప్లయితొలగించండి
 22. స్వీయ పక్షము వాడయి విమతబలము
  బొగడినట్టి వారలను జంపుటయెనీతి
  శత్రు బలమును బొగడిన నేరినైన
  విడువకూడదు చంపుడు వెంటదగిలి

  రిప్లయితొలగించండి
 23. పొగరదిలేక వైరులకు బూర్తిగలొంగుచువారలన్గడున్
  బొగడినవారి ప్రాణముల బోరనదీయుటె నీతికార్యమౌ
  పగతురశిక్షజేయుట ను వద్దనిచెప్పరె,యెవ్వరెప్పుడున్
  బొగడత మానుటొప్పగను బుద్ధిగసత్యము జెప్పనేరుమా

  రిప్లయితొలగించండి
 24. హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునితో:

  అసురులకు శత్రువైననా హరిని నీవు
  పొగడనేలనొ డింభకా పూజ్యుడనుచు
  పుత్రుడైనను విడనాడ బోవ రిపుల
  పొగడినట్టి వారలను జంపుటయె నీతి

  రిప్లయితొలగించండి
 25. *శల్యుని మాటలు విన్న కర్ణుని అంతర్మదనము*
  ***** ***** ****** ***** ****** *****
  భీష్మ ద్రోణాది వీరులే విగ్రహమున
  నిలువకుండిరి కుంతికనిష్ఠు ముందు
  ననల కేలరణమంచు నర్జునుడను
  పొగడినట్టి వారలను జంపుటయె నీతి

  రిప్లయితొలగించండి
 26. *శల్యుని మాటలు విన్న కర్ణుని అంతర్మదనము*
  ***** ***** ****** ***** ****** *****
  మగటిమ కల్గినట్టి కురు మాన్యుడు భీష్ముడు ద్రోణులిద్దరున్
  జగడము నందు కూలిరి ప్రచండుడు కవ్వడి ముందు నీవు ని
  ల్వగఁ దగవంచు చోదకుడు పాండవ మధ్యము డైన యర్జునిన్
  పొగడిన, వారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ

  రిప్లయితొలగించండి
 27. పగతుఁడు తాను దానవుల పాలిట నంబుజనాభు డట్టి యా
  జగడపుమారి నివ్విధిని జంకక ప్రస్తుతి జేతువౌర నీ
  యగుణములన్ సహింప నిను నంతమొనర్చెద పుత్రకా! హరిన్
  పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ

  రిప్లయితొలగించండి
 28. తనకుచేసిన మేలును తలచుకొనక
  స్వార్థ బుద్ధిని పూనుచు జగతి యందు
  హానిచేయగ నెంచెడి యధములనిల
  పొగడునట్టివారలను జంపుటయె నీతి

  రిప్లయితొలగించండి