9, ఫిబ్రవరి 2021, మంగళవారం

సమస్య - 3630

10-2-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్”
(లేదా...)
“మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”

84 కామెంట్‌లు:


  1. మైలవరపు వారి పూరణ

    ఈ గతి మాకు వచ్చుటకునెట్టిదొ దోసము జేసియుంటిమో!
    భోగము కోరియుంటిమొకొ పూర్వపు జన్మమునందు నీశ్వరా!
    భోగివిభూష! కావుమని మ్రొక్కగనీశ్వరదివ్యసత్కృపన్
    మూగ వచింప గన్ చెవిటి మోదముతో వినె గాంచెనంధుడే!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    "మూకం కరోతి వాచాలం"

    మూగుచు చెట్టు క్రిందనహ ముగ్గురు మూర్ఖులు ముత్తుకూరునన్
    వేగమె రాగనచ్చటకు వేదపు బ్రాహ్మణ పండితుండయో
    త్రాగగ గీతనున్ తనరి తాటిది కల్లును వోలు తృప్తినిన్
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే...

    రిప్లయితొలగించండి
  3. రాగలయాపదయిదియని
    ఆగనియార్తినిమునియునునాడెనునిజమున్
    దాగినదౌర్బల్యంబున
    మూగవచింపఁగఁజెవిటియెమోదమునవినెన్
    మునియనగమాట్లాడనివాఁడు

    రిప్లయితొలగించండి
  4. సైగలను పలుకు రాదనె

    మూగ; వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    భాగవత గాధ , కలిగెను

    భోగము భాగ్యము సిరులును బొందెను రమతిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( రమతి... స్వర్గము)

    రిప్లయితొలగించండి
  5. రోగిని తాకిన తోడనె
    వేగము నయమౌట గనగ వింతగ నుండన్
    త్యాగ ధనుడగు ముని వలన
    మూగ వచింపగ జెవిటి యె మోదమున వినెన్

    రిప్లయితొలగించండి
  6. మూగలు బధిరుల కోసము
    సాగెడు కార్యక్రమమున చదువక వార్తల్
    సైగలతో వివరించుచు
    మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    రిప్లయితొలగించండి
  7. కందం
    సాగింప జంట జీవన
    రాగము, లోపాల మఱచి రసమయమనఁగన్
    సైగలతో ముచ్చట్లను
    మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    ఉత్పలమాల
    మూగ రచించ పాటొకటి ముచ్చటగన్ బధిరుండు పాడఁగా
    నూగెను పూలతో లతలు నుత్సుక దృశ్యము గాంచినట్లుగన్
    రాగముఁ గల్పి యంధుడట లాసము జేసెను! 'మానసమ్ముతో'
    మూగ 'వచింపఁగన్' జెవిటి మోదముతో 'వినెఁ' 'గాంచె' నంధుఁడే!

    రిప్లయితొలగించండి
  8. వేఁగనురిత్తజీవితమువీఁడుముహింసనిమౌనిఁజెప్పగా
    ఆగినబుద్ధితోనరుడునాశనువీడకపెట్టడేచెవిన్
    తాఁగనెనంధుడున్నెరుకనాత్మనుపారముముట్టెగాతుదిన్
    మూగవచింపగన్ఁజెవిటిమోదముతోవినెఁగాంచెనంధుడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హింస+అని' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. వేడుముహింసనుఅనివ్రాయాలి, తప్పుగావ్రాశాను

      తొలగించండి
  9. లోగడ విఠలా చార్యుం
    డే గారడి చిత్రమొకటి నివ్విధి తీసెన్
    జోగి యొకడు తాకిన తరి
    మూగ వచింపఁగ జెవిటియె మోదమున వినెన్.

    రిప్లయితొలగించండి
  10. నేగంటి ననెగ నంధుడు
    మూగ వచింపఁగఁ, జెవిటియె మోదమున వినెన్
    జేగంటలు బలు మ్రోగెను
    ఆగక, వైఙ్ఞానిక ప్రభ అనితరము సుమీ!

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. ఉ.
      భాగవతామృతంబు గొన పాపచయంబులు భస్మమౌట చే
      వేగమె షడ్రిపుల్ సమయ, ప్రేమము తోడుత విష్ణుఁ వేడగా
      యాగ శతాధికంబుల సమాచర పుణ్యఫలంబు లబ్బి.... యా
      మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే.

      తొలగించండి
    2. వేగమె వృద్ధిజెందగను వేదము లందలి వైద్యశాస్త్రముల్
      రోగములెల్ల భీతిలుచు లోకము నందున దూరమయ్యెగా
      నీగతి నశ్వినీసురులె యింపగు నింద్రియ దీప్తిగూర్చగన్
      మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే.

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. సమస్య :
    మూగ వచింపగన్ జెవిటి
    మోదముతో వినె గాంచె నంధుడే

    ( తన టేబుల్ పైనున్న మూతి , చెవులు , కళ్లు మూసుకున్న వానరత్రయప్రతిమను గురించి మిత్రునికి వివరిస్తున్న గాంధీజీ )

    ఆగుము ! మూడు వానరము
    లాదర మొప్పగ దెల్పుచుండెనే !
    యే గతి నున్న చెడ్డనుడు
    లెన్నడు పల్కకు ! నాలకించుటల్
    వేగముతోడ మానుమయ !
    వెర్రిగ దుష్క్రియ చూడబోకుమా !
    మూగ వచింపగన్ ; జెవిటి
    మోదముతో వినె ; గాంచె నంధుడే !

    రిప్లయితొలగించండి
  13. లోగడ నెన్నొ చిత్రముల లోకుల నబ్బుర పర్చు రీతిలో
    నాగువు తోడతీసె విఠలార్యుడు పెక్కుగ నొక్క దానిలో
    జోగియె మంత్రదండమును జూపుచు చేతులు త్రిప్పినంతనే
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే

    రిప్లయితొలగించండి
  14. ఆగముసేయసాగిరిట యాంధ్రుల భాగ్యము కేంద్రపెద్దలే
    వేగమె యాంధ్రబ్యాంకుగతి వీధికినీడ్చిరి పేరుబోవగా
    నాగక దుష్టచర్యలిట,నాంధ్రులహక్కులనమ్మజూపగా
    మూగవచింపగన్ జెవిటిమోదముతోవినె గాంచెనంధుడే
    +++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  15. ఉ:

    వేగమె నేడు యెల్లరకు వేదిక వాత్సపు ఫేసుబుక్కులై
    సాగుచు నుండ సర్వమును చప్పున చేరెడు వర్తమానముల్
    భాగము నయ్యె జీవనము బాధ్యత నోచని కట్టుబాటులన్
    మూగ వచింపగన్ జెవిటి మోదముతో వినె గాంచె నంధుడే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాత్సపు =whatsapp
      ఫేసుబుక్కు=face book గా గుర్తించగలరు

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేడు + ఎల్లరకు' అన్నపుడు యడాగమం రాదు. "నేడు సర్వులకు/నెల్లరకు" అనండి.

      తొలగించండి
  16. సాగగ బ్రతుకు ప్రయాణము
    వేగమెచని బధిరులబడి పేర్మిని నేర్వన్
    భాగస్వామికి సంఙ్ఞల
    మూగవచింపగ జెవిటియె మోదమున వినెన్

    ఆగని శాస్త్రవేత్తల శ్రమంబది మార్చుచు వైద్యరీతులన్
    లోగడ లేనివెన్నొ యపురూపపు సాధనముల్ సృజింపగా
    వేగమమర్చగా కనుల వీనుల కంఠములందు యంత్రముల్
    మూగ వచింపగన్ జెవిటి మోదముతోవినె గాంచెనంధుడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతోత్తముల్ దమదు భావమునందున నిల్పి
      కృష్ణునిన్
      మాగతి నీవెయే యనుచు మైమరపున్ భజనంబు సేయగా
      మాగిన ప్రేమతత్పరత మన్నన సేయడె తొల్గలోపముల్
      మూగ వచింపగన్ జెవిటి మోదముతోవినె గాంచెనంధుడే

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏

      తొలగించండి
  17. భాగవతుల్ రమాపతిని భావన సేసిరి భూరి భక్తి, నీ
    వే గతియన్చు వేడగను వేగమె మాన్పెను బాధలన్ని, యే
    రోగము రోదనైన నవరోధము జేయగలేవు నమ్ము మీ
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే

    రిప్లయితొలగించండి
  18. సైగలు వేడుక జేయగ
    రాగాలాపనల వోలె రంజిలు రీతిన్
    యోగమ్ములేకనేమౌ
    మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాగలకాలమ్మందున
      కాగల మాఱుపు కమనీయ కన్విందులివే
      బాగుగ గమనించ వలెను
      మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినున్

      తొలగించండి

    2. రెండే పాదములో వుండాల్సిన
      మార్పు















      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బాగుగ వేంకటేశ్వరుని పాదములంటుచు భక్తి భావమున్
    సాగుచు నిత్య ప్రార్థనల సంస్తుతి జేయు కురూపు రూపులన్
    వేగమె మారె చిత్రముగ వెన్నుని నచ్చపు నక్కసమ్మునన్
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే1

    రిప్లయితొలగించండి
  20. సైగయె నోటి పలుకవగ
    వేగమె గమనించు చూపె వీనుగ నుండన్
    కాగలదీగతి నిజముగ
    “మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్”

    రిప్లయితొలగించండి
  21. ఆగమ వినుతుండగు హరి
    నా గరుడ గమను ననంతు నభ్యర్చింపన్
    యాగ ఫలంబుగ నత్తరి
    మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    రిప్లయితొలగించండి


  22. ఆ గమ్యము చూపింపను
    మూగ, వచింపఁగఁ జెవిటియె, మోదమున వినెన్
    దాగిన నుత్సాహముతో
    వేగిర ముగ నంధుడొకడు వెంబడి చనుచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  23. అనఘా! పాపుల్లార! భు
    విని మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో
    వినెఁ గాంచె నంధుఁడే! ప్రభు
    వుని దీవెన! రండిటు కొలువుడి మన నాధున్!


    పరలోకపు తండ్రీ
    వీరిని గాచుము
    ఆమెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. భోగములందుపారమునుమోహమునన్ దుదిగాంచియంత్యమం
    దాగమునైతినంచునొకదాంతునితాంతుప్రశాంతుడౌమహా
    భాగునిపాదపద్మములబట్టిగతాఘములూడ్చిసాధనన్
    *“మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”*

    రిప్లయితొలగించండి
  25. రాగమువీడిమాధవునిప్రాంజలిజేసిమహావిరాగియై
    యోగముజేయుచున్ ప్రభుని యోగివిరాట్టుకృపావిశేషతన్
    భాగవతుండునయ్యెభవబంధమునూడ్చెవిముక్తిభుక్తియౌ
    *“మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”*

    రిప్లయితొలగించండి
  26. సాగెనుమూకపంచశతిసాగరధారగఁబల్కనెవ్వ
    రో?
    సాగిలిజెవ్వినన్బలుకశైలపుమల్లనయేమిజేసెనో?
    సాగుచువిశ్వరూపమునుచక్కగజూడగఁగన్నులివ్వగన్
    మూగ వచింపఁగన్ ,జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  27. రోగినివెజ్జుమార్చెనునిరోగిగవైద్యవిభూతిఛాయలో
    భోగములందివచ్చిననుమోహమడంచకరిక్తపథ్యమం
    దాగమునయ్యెనంగమువదాన్యుడొసంగినసాధనంబుతో
    మూగవచింపఁగన్జెవిటిమోదముతోవినెఁగాంచెనంధుఁడే

    రిప్లయితొలగించండి
  28. (కురుక్షేత్ర యుధ్ధములో 9 వ రోజు భీష్ముని ప్రతాపము మిన్నంటిన సందర్భము)

    సాగర పత్ని పుత్రుడును సామ్యముజేసిన వీర యోధుడున్

    వేగపు బాణ ఘాతముల వేడిననర్జును ముంచె, కోపము

    న్వేగిన పాండు సేన తమ వీసర మర్చియు తల్లడిల్లగా

    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( సామ్యము= ప్రతిజ్ఞ
    వీసర= లోపము)

    రిప్లయితొలగించండి
  29. రాగవిరక్తిసంగతనిరంతరభక్తిని శ్రీశుఁ గొల్వగా
    మూగిన యాపదల్ దొలగి మోదముఁ గల్గి సుఖమ్ములబ్బవే!
    రాగనిమజ్జితాంధ్యధృతరాష్ట్రడె సాక్ష్యము, తత్కృపాప్తితో
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  30. మ్రోగగ కృష్ణుని వేణువు
    సాగరమంతయు నెగిసెను సంతోషముతో
    రాగముతో శరణ మనగ
    మూగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    రిప్లయితొలగించండి
  31. ఏ గతి గద్దెనెక్కిరిది యెంతటి దుష్పరిపాలనమ్మహా
    ఆగము జేసిరాంధ్రులను అన్నిట ద్రోహము సల్పుచుందగా
    హా గమనింప నద్భుతమెగా మన నేతల హావభావముల్
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే

    రిప్లయితొలగించండి
  32. బాగుగఁ జెవి దూదిని నిడి
    దాఁ గడపుచు నుండు భర్త తఱచు దినములన్
    వేగ మొకనాఁడు శ్రీమతి
    మూఁగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

    [1. మూఁగ = మూఁగఁగ; 2. మూఁగ = హంస; 1. శ్రీమతి మూఁగఁగఁ జెప్పుటకు; 2. శ్రీమతి యను హంస వచింపఁగ]


    ఈ గతి వింత లారయ మహీతల మందు నసంభవంబు నా
    వాఁగెడు భక్తి హీనులకు భంగము గాఁగ నిజోగ్ర దర్పమే
    సాగరకన్యకుం బతిని శ్రద్ధగ భక్తినిఁ గొల్చి నంతనే
    మూఁగ వచింపఁగం జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే

    రిప్లయితొలగించండి
  33. రోగనిదానమివ్వుడని, రోజుకు రోజుకు దైవప్రార్ధనల్
    యాగక జేయుచున్ బ్రజలె ,యాతృతదగ్గెడు ప్రశ్నవేయగా
    పాగలుగాళ్ళువీరనుచు,ఫక్కుననవ్విరదేమిచోద్యమో
    మూగ వచింపగన్ జెవిటి ,మోదముతోవినె, గాంచెనంధుడే
    ++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  34. త్రాగుచునూగగాజనులు,ధన్యతజెందిరినేతలందరున్
    వేగమె రామరాజ్యమని,వేలును లక్షలె వోట్లువేయగా
    సాగకనాగిపోయెగద సర్వులుశాంతినిగోలుపోవగా
    మూగ వచింపగన్ జెవిటి ,మోదముతోవినె, గాంచెనంధుడే
    ++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  35. ఆగమ వినుతుని దయచే
    సైగల గమనించి చాకచక్యము తోడన్
    రాగాలాపన లన్నియు
    *మూగ వచింపఁగఁ, జెవిటియె మోదమున వినెన్*


    భాగవతామృతమ్మునిటు వారము రోజులు శ్రద్ధగా వినన్
    రాగము తోడ పాటనిట రక్తియు కల్గెడి రీతిపా డగన్
    గోగణ సేవితుం డగుచు గోత్రము నెత్తిన శ్రీశునచ్చటన్
    “మూగ వచింపఁగన్, జెవిటి మోదముతో వినెఁ, గాంచె నంధుఁడే”

    రిప్లయితొలగించండి
  36. మ్రోగెను గంటలన్నియును ముద్దుగ దేవళ మందునన్ న్నెదో
    రాగము తాళముల్ వినగ రమ్యత గోచరమవ్వగా మదిన్
    వేగమె జెప్పవట్టె కడు వింతగ సైగలతోడను ముద్దు ముద్దుగా
    మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే!!

    రిప్లయితొలగించండి

  37. సైగల జేయుచున్ తన వి
    చారము దెల్పె నొకండు చూడగన్,
    వేగముతో చరించ నట
    వీనుల నిల్పెను వైనమందుచున్,
    రాగ సుధా రసాంచిత ప
    రాగము లద్దిన భావ మందిలన్ -
    మూగ వచింపఁగన్; జెవిటి మోదముతో వినెఁ; గాంచె నంధుఁడే!

    రిప్లయితొలగించండి
  38. సమస్య - 3630

    10-2-2021 (బుధవారం)

    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది....

    “మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”

    నా పూరణ :-
    ఉ.
    యోగసునిష్ఠితాస్వనితయోజితమాధవభక్తిగల్గుచున్
    భోగవిహీనకర్మ పరిపూర్తవిరక్తసుభావబంధులై
    భాగవతోత్తముల్ కనగ భాగ్యమునొందుచు మారగానిటన్
    “మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”

    ఆస్వనితము = చిత్తము

    (మూకం కరోతి వాచాలం
    పంగుం లంఘయతే గిరిమ్ ,
    యత్కృపా తమహం వందే
    పరమానందమాధవమ్

    శ్లోకభావ ప్రేరణతో)

    🙏🙏🙏🙏🙏🙏

    ✍️ కొరిడె విశ్వనాథ శర్మ.

    రిప్లయితొలగించండి