భారత దేశమందుగల భామల బాధల గూర్చి తెల్పుచున్ జారిణి జీవితమ్ముపయి చక్కటి గాథను వ్రాయనెంచినన్ భారముకాదటంచు తన బాధ్యతగాను చరిత్ర కారుడే వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
బెంగాల్ నేపథ్యంతో రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన 'అమర్ ప్రేమ్' చిత్రంలో (దీనికి కచ్చితంగా ఏదో బెంగాలీ నవల ఆధారమై ఉంటుంది) దేవీ నవరాత్రుల కొరకు విగ్రహాలు తయారు చేసేవారు వేశ్యావాటికకు వస్తారు. వేశ్యావాటిక నుండి కొంత మట్టి తీసుకు వెళ్ళి విగ్రహాలు తయారు చేసే మట్టిలో కలపడం సంప్రదాయం అంటారు. ఆ సన్నివేశం గుర్తుకు వచ్చి నా పూరణ....
మీరక సంప్రదాయమును మేలుగ నా నవరాత్రి పండుగన్ గోరి యొనర్ప విగ్రహము కోర్కెలు దీర్చెడి దేవి రూపునన్ వారలు మట్టి సేకరణ పద్ధతిగా నొనరింపఁ బూనుచున్ వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ.
శిష్టుల మతి శైలాభము సేసి చింత వారును వనితలే యని వారి కీయఁ గరుణ గౌరవ జీవన సరణి నిట్టి శిష్టులకు వారకాంతల చెలిమి మేలు
హారతు లిండు తెచ్చిరి జయమ్మును జేసిరి సాహసమ్మునం గీరితి నిచ్చు నట్టి ఘన కృత్యము పెక్కు దినమ్ము లచ్చటం బోరిరి యుద్ధ మందు విధి పూర్వక బుద్ధి వహించి సైనికుల్ వారక వార కాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిధారుణిఁబాపకూపమున దారుణరీతిని మ్రగ్గు వేశ్యలన్
వీరత జూపి వారి విడిపింపగ రక్షకవృత్తి వెంటనే
జేరగ యత్నమున్ సలుపు చిత్రపరిస్థితి యందునొప్పగున్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండి
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తీరుగ కల్లు త్రాగుచును తిప్పలు బెట్టెడి భర్తగారినిన్
పోరుచు రాత్రి ప్రొద్దుటను పోవగ కాంతయె పుట్టినింటికిన్
కోరగ చెడ్డ రోగములు కోపము హెచ్చగ భార్యమీదనున్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిచేరినచేరనీయకయెచీరలుసారెలుమాటిమాటికిన్
రిప్లయితొలగించండిగోరుచుకోర్టుమెట్టులనుకోపముతోతిరుగాడిబంధువుల్
బోరినలెక్కసేయకవిభున్నడివీధికినీడ్చుచున్నచో
*“వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదైవ భక్తి యు సేవయు దయను గల్గి
రిప్లయితొలగించండిపెద్దలను గౌరవించుట ప్రీతి యగును
శిష్టు లకు : వార కాంతల చెలిమి మేలు
వావి వరుసల నెరుగని పాలసులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రమమున పలుకుమెవరికి కద్దు మెప్పు
రిప్లయితొలగించండిఎవరి పొందు తగదు మంచి బావకిలన
వంద వేలు ధనముకన్ననేది మేలు
శిష్టులకు , వారకాంతల , చెలిమి మేలు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మెప్పు+ఎవరి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "మెప్పు । లెవరి... బావ కిలను.." అనండి.
ధన్యవాదములండీ
తొలగించండిమీ సూచనలు పాటిస్తాను
వాదులాడగజ్ఞానియైవనితతోడ
రిప్లయితొలగించండితనదుభావంబుసరిఁజేయుదారితెలిసి
శంకరుండునుకనుగోనెచరమదశను
శిష్టులకువారకాంతలచెలిమిమేలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కనుగొనె' టైపాటు.
మంచి మిత్రుడ నామాట మరువ బోకు
రిప్లయితొలగించండిసోదరా! వినుమిదియె తెచ్చు నప కీర్తి
శిష్టులకు వారకాంతల చెలిమి, మేలు
గూర్చదెవరికది తెలుసు కొమ్ము భువిని.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేరక వెళ్ళినా డనన నిక్కము నీవటు వంటి వాడవే
రిప్లయితొలగించండివేరుగ నుందమంచు సతి వెంటనె వీడెను భర్తయింటి నే
మారని భార్య వర్తనను మార్చగ బూనియు నిశ్చయమ్మునన్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నేరక పోయినాడ నన..." అనండి.
ధన్యవాదములార్యా!🙏
తొలగించండినేరకదేవదేవిదరినేరుపుమీరగబ్రాహ్మణుండునున్
రిప్లయితొలగించండిచేరియుభక్తిభావమునజిష్ణునిఁగోల్చెనుసచ్చరిత్రుడై
వేరగుబాధనాతడునువెఱ్పియుగాకనుమోక్షమందెగా
వారకవారకాంతలనివాసముఁజేరుటనిత్యక్రుత్యమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జిష్ణునిఁ గొల్చెను' టైపాటు.
వెఱ్ఱియు
రిప్లయితొలగించండిసరదాగా మిత్రుల సంభాషణ...
రిప్లయితొలగించండితేటగీతి
విశ్వదన్ బొంది తా నాట వెలదులొల్కి
నీతిశతకాన, తానేమి నీకునేర్పె?
వేమనవలె యోగిగ మారఁ బిదప ధరణి
శిష్టులకు వారకాంతల చెలిమి మేలు!
ఉత్పలమాల
మీరని సత్ప్రవర్తనల మేటి యటంచును నిల్ప నెన్నికన్
జేరువ గావలెన్ మిగుల సేమము గూర్చఁగఁ దప్పదన్నటుల్
గోరఁగ మద్దతున్ బడుగు, గొప్పని భేదములెంచకుండగన్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిదారుణ బాధలందునను తార్చెడి వారల కోరచిక్కిరే
రిప్లయితొలగించండిజారుల కోర్కె తీర్చగను జవ్వనమంతయునగ్గి కాలిరే
వారల బాల భామలను వన్నగు దారికి చేర్చు కోరికన్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి------------
భారముజేసెజీవితము,బాధ్యతలేమియు పట్ట రానిదై
నూరకనూళ్ళలన్ దిరుగు ,నూహలదేలుచునుండునామెతో
వేరుగజెప్పనేమిటికి,వేదనజెందుటకన్న మిన్నగా
వారక వారకాంతల,నివాసముజేరుటె శిష్టకృత్యమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రానిదై యూరక..." అనండి.
భారముజేసెజీవితము,బాధ్యతలేమియు పట్ట రానిదై
తొలగించండియూరకనూళ్ళలన్ దిరుగు ,నూహలదేలుచునుండునామెతో
వేరుగజెప్పనేమిటికి,వేదనజెందుటకన్న మిన్నగా
వారక వారకాంతల,నివాసముజేరుటె శిష్టకృత్యమౌ
[సవరణ పాఠము ధన్యవాదాలతో]
ఉత్పలమాల:
రిప్లయితొలగించండి------------
తారలనంటుకొందమను,త్రాణనువీడనినేతలందరున్
వీరులమంచు దల్చుకొని,వేరుగ తైతకలాడగోరుచున్
దారుణమైచరించుచును,దాతలకోసముచేయిజాచకన్
వారక వారకాంతల,నివాసముజేరుటె శిష్టకృత్యమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు,గురువర్యా!
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిభూరిగ దక్షిణాపథపు పుత్తడిబొమ్మల మాయమాటలన్
వేరుగ జేయు ముష్కరులు వేలుపుబానిస దారులందిడన్
దారిని జూపి వారికి సదాత్ముల మార్గము సూపనెంచగా
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ.
వేశ్య-వేలుపుబానిస.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేరణనొంది మిత్రతతి బీరునుదాగుచు పెచ్చరిల్లుచున్
రిప్లయితొలగించండిమీరుచు కట్టుబాటులను మెచ్చులగోరుచు నిశిన్
దూరకే
వారక వారకాంతల నివాసము ,జేరుటె శిష్టకృత్యమౌ
తీరుగ నింటికిన్ దనకు దీవెనలిచ్చెడి దల్లిదండ్రులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"బీరును ద్రాగుచు" అనండి.
రెండవ పాదంలో గణభంగం. "రాత్రి దూరకే" అంటే సరి!
ధన్యవాదములు గురుదేవా, సవరించెదను.🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ
తొలగించండిప్రేరణనొంది మిత్రతతి బీరునుద్రాగుచు పెచ్చరిల్లుచున్
మీరుచు కట్టుబాటులను మెచ్చులగోరుచు దూరకే
నిశిన్
వారక వారకాంతల నివాసము ,జేరుటె శిష్టకృత్యమౌ
తీరుగ నింటికిన్ దనకు దీవెనలిచ్చెడి దల్లిదండ్రులన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినీతి గూడిన పధమున నేగు చుండి
పేరు తోడుత కీర్తియు పెంపు గలుగు
శిష్టులకు వారకాంతల చెలిమి మేలు
చేయక ననాదరమ్మును చేర్చు నెపుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిఘోరకరోన వ్యాప్తి నట కూడుకు గుడ్డకు కష్ట మెంచగన్
దారుణ మైన క్షోభితము దాపుర మొందగ సానివాడగన్
చేరి సమాజ సేవకులు చిత్తము నిల్పిరి సాయమంచనన్
వారక వార కాంతల నివాసము జేరుట శిష్టకృత్యమౌ
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపేరును గన్న కాపురము వీడి విమోహము నెంచి తండ్రి తా
దారియె దప్పి వేశ్యముల తావును జేరి గృహమ్ము పాయగా
తీరుగ నాన్నకున్ హితము దెల్పి సుతుండిలు జేర్చు లక్ష్యమున్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశీలవతియగు చామయె శ్రేష్ఠ మౌను
రిప్లయితొలగించండిశిష్టులకు ; వారకాంతల చెలిమి మేలు
భ్రష్టులకు ; జోడు సరిపోయి వారి వారి
గుణగణములకు జక్కగ కుదిరియుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదుష్టులకు దూరమె హితము, దురిత ముగద
రిప్లయితొలగించండిశిష్టులకు వారకాంతల చెలిమి ,మేలు
చేయదెపుడు నెవరికైన, చెరపె చేయు
మనషికెపుడు ,దలచకుము మనసు నైన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వామీ! నమశ్శతమ్ !
రిప్లయితొలగించండివారక వారకాంతల నివాసము జేరుటె శిష్టకృత్యమౌ
మీరలు వింటె తెల్పెదను మేదిని లోనొక రాజు గాథ తా
భూరిగ బుద్ధి మాటలను భూమి జనాళికి తెల్పె తెన్గులో
వారెవరందురా ? వినుడు వాసిని గాంచిన వేమనార్యుడే !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదారి దప్పిన నేమౌను దయనుజూపి
రిప్లయితొలగించండిమంచియూహలు భావనల్ పెంచదగను
తప్పుజేసిన వారలు ఒప్పునటుల
శిష్టులకు వారకాంతల జెలిమిమేలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వారలె యొప్పునటుల" అనండి.
సమస్య :
రిప్లయితొలగించండివారక వారకాంతల ని
వాసము జేరుటె శిష్టకృత్యమౌ
( తనకు బ్లడ్ కేన్సర్ అని తెలిసిన ప్రేమికుడు ప్రేయసికి తనపై వైముఖ్యం కలగటానికి చేసిన పని " ప్రేమాభిషేకం " చిత్రస్ఫూర్తితో )
ఆరని ప్రేమతోడ ముద
మారగ నుండెడి మంచివేళలో
దారుణరక్తరోగమది
తల్లడబెట్టగ ప్రేమికుండికన్
గోరిన చిన్నదానికయి
కోతను పొందెడి మానసమ్ముతో
వారక వారకాంతల ని
వాసము జేరుటె శిష్టకృత్యమౌ .
( రక్తరోగము - కేన్సర్ )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశివుని చేరుమార్గమరయ సేదదీర
పనికి రాదు, మేలొసగదు, పాటిగాదు
శిష్టులకు వారకాంతల చెలిమి; మేలు
వారికి గురువుల కొలువు వారిజాక్షి
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిటులుగ మారుచు పలుకుచు
లట, వారక వారకాంతల నివాసముఁ జే
రుటె శిష్టకృత్యమౌ? చే
యుట వలదిటువంటి పనులు యుక్తము కాదోయ్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదారుణ బాధలొందుచును తార్చెడి వారల కోరచిక్కిరే
రిప్లయితొలగించండిజారుల కోర్కె తీర్చగను జవ్వనమంతయునగ్గి కాలిరే
వారల బాల భామలను వన్నగు దారికి చేర్చు కోరికన్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి+++++++++++++
భారిగబుద్ధిహీనులకు బాధ్యతలిచ్చుటతప్పె యౌగదా!
నేరపుతీరువారలకు,నెయ్యముజేసెడు రీతినిచ్చులే
వారినిచెంతజేర్చుకొని,వాసినిబొందగ నెంచ మానుచున్
వారక వారకాంతల నివాసము జేరుటె శిష్టకృత్యమౌ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు,గురువర్యా!
తొలగించండిభారత దేశమందుగల భామల బాధల గూర్చి తెల్పుచున్
రిప్లయితొలగించండిజారిణి జీవితమ్ముపయి చక్కటి గాథను వ్రాయనెంచినన్
భారముకాదటంచు తన బాధ్యతగాను చరిత్ర కారుడే
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రూరుల ధూర్తకార్యములకున్ ఫలితమ్ముగ చిట్టితల్లు లా
రిప్లయితొలగించండిదారుల దూరి రక్కట! యుదారత వారల నుద్ధరించ సం
స్కారులు సంఘసేవకులు సభ్యసమాజము నందు జేర్చగన్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ.
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపడుపు వృత్తితో జీవిక గడుపువారు
రిప్లయితొలగించండినీతి బాహ్యులు జీవింత్రు నియతిలేక
వారిజీవన సరళిని బాగొనర్ప
శిష్టులకు వారకాంతల చెలిమి మేలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబెంగాల్ నేపథ్యంతో రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన 'అమర్ ప్రేమ్' చిత్రంలో (దీనికి కచ్చితంగా ఏదో బెంగాలీ నవల ఆధారమై ఉంటుంది) దేవీ నవరాత్రుల కొరకు విగ్రహాలు తయారు చేసేవారు వేశ్యావాటికకు వస్తారు. వేశ్యావాటిక నుండి కొంత మట్టి తీసుకు వెళ్ళి విగ్రహాలు తయారు చేసే మట్టిలో కలపడం సంప్రదాయం అంటారు. ఆ సన్నివేశం గుర్తుకు వచ్చి నా పూరణ....
రిప్లయితొలగించండిమీరక సంప్రదాయమును మేలుగ నా నవరాత్రి పండుగన్
గోరి యొనర్ప విగ్రహము కోర్కెలు దీర్చెడి దేవి రూపునన్
వారలు మట్టి సేకరణ పద్ధతిగా నొనరింపఁ బూనుచున్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ.
శిష్టుల మతి శైలాభము సేసి చింత
రిప్లయితొలగించండివారును వనితలే యని వారి కీయఁ
గరుణ గౌరవ జీవన సరణి నిట్టి
శిష్టులకు వారకాంతల చెలిమి మేలు
హారతు లిండు తెచ్చిరి జయమ్మును జేసిరి సాహసమ్మునం
గీరితి నిచ్చు నట్టి ఘన కృత్యము పెక్కు దినమ్ము లచ్చటం
బోరిరి యుద్ధ మందు విధి పూర్వక బుద్ధి వహించి సైనికుల్
వారక వార కాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
[వార = వారే; కాంతలు = భార్యలు]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమేలుజరుగదు పుడమికి బాలవినుము
రిప్లయితొలగించండిశిష్టులకువారకాంతలచెలిమి,మేలు
చేయునిరతముజపియించ శివునిపేరు
ముక్తినిచ్చునుదప్పక మోదమంది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాసులతో కాక కేవలం మల్లెలతో వచ్చిన విటునితో వారకాంత...
రిప్లయితొలగించండిమూరెడు మల్లెపూలు గొని ముగ్ధమనోహరమైన రూపమున్
తేరగ దోచవచ్చితివి తీయని వాతెర తీయలేనురా
నేరవె కాసులీక రమణీమణి దక్కునె యేలనీగతిన్
*వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ??!*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచీరలు దొంగిలించిన విశిష్టుని శిష్టుని చిన్నికృష్ణునిన్
రిప్లయితొలగించండిద్వారకనుండి తెచ్చి పరివారము తోడ వరాంగనాళి సొం
పారగ వాద్యగీతముల పాడెదరంట కనంగ వేడుకన్
*వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ!*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపేరిమి ధర్మ వర్తనమె పెన్నిధిగా మది నెంచి కోవెలన్
రిప్లయితొలగించండిజేరును సజ్జనుండు హరి సేవనమే దన నిత్యకృత్యమౌ
జారుని కెన్నడేని మధుశాలల మత్తున మున్గి దేలుచున్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివారలజీవితంబులనుబాగుగజేయుతలంపుగల్గుటన్
రిప్లయితొలగించండివారకవారకాంతలనివాసముజేరుటెశిష్టకృత్యమౌ
వారునునందజేయునెడభాసురమొప్పగసాయమున్దగన్
వారలజీవితంబులికభావితరాలకుమేలుజేయుగా
కోరిక లశ్వముంబగిది కోమలి వెంబడి సంచరించ నా
రిప్లయితొలగించండివారువమున్ బిగించుకొని వావిరి సంయమనంబు జూపుచున్
తీరుగ వారిజీవితము తీరిచి దిద్దగ నుత్సహించుచున్
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
నేరమయంపు జీవితము నేర్పిన విద్యల కారణమ్ముతో
రిప్లయితొలగించండిపోరుల చెంతచేరి కడు మోసపుమాటల వేశ్యవాటికన్
చేరుచు చుండ, వారలకు చేయ సహాయము నాత్మశుద్ధితో
వారక వారకాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ
రాజకీయము లందును రాటు దేలి
రిప్లయితొలగించండిసాయ మొనరించ నెంచెడి చా(సా)నలున్న
దేశ భద్రత కోరెడు ధీయుతులగు
*శిష్టులకు వారకాంతల చెలిమి మేలు*
తేరగగెల్చి రాష్ట్రమును,దెయ్యపు బొమ్మగ రాజధానితో
రిప్లయితొలగించండిమీరుచు వ్యక్తి దూషణలు,మించుగజేయుచు పాలనమ్ములో
ధీరత జూపలేకనిక,దేబెమొఖాలుగ సంచరించ కన్
వారక వారకాంతల నివాసముజేరుటె శిష్టకృత్యమౌ.
చీరలపైనమోజుగల,చేడియనేడిటునంగలార్చుచున్
రిప్లయితొలగించండిభారముజేసెజీవితము,బాధ్యతెఱుంగని భార్యతీరుతో
వేరుగజెప్పనాతరమ,వేదనబెంచెడు నిట్టి దాయతో
వారక వారకాంతల,నివాసముజేరుటె శిష్టకృత్యమౌ