25, ఫిబ్రవరి 2021, గురువారం

సమస్య - 3646

26-2-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్”
(లేదా...)
“అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా”

31 కామెంట్‌లు:

  1. స్నేహితునికి హితబోధ చేస్తూ....
    కం.
    ఎత్తకు రోదితకంఠము
    సత్తువ నశియించిపోవు, సరి యట్లుండన్
    మెత్తగ మనలను దిట్టెడి
    నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    శిరమున కెత్తి ప్రీతిగను చేర్చుచు బంగరు వడ్డియాణమున్,
    పరువులు తీయు రీతిగను పండుగ పూటను వెక్కిరించుచున్
    బరువుగ మాటలాడుచును భార్యకు, నాదట తోడబుట్టులౌ
    యరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా...

    రిప్లయితొలగించండి
  3. కత్తులకంటెనుపదునై
    చిత్తమునందునకటువుగచేరినమాటల్
    మత్తునువీడగతెరువగు
    ఎత్తిపోడుపుమాటలేరుచించురిపులకున్

    రిప్లయితొలగించండి
  4. సమస్య :
    అరులకు నెల్ల నెత్తిపొడు
    పౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

    ( కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలు విభిన్నఫలితాల నిస్తాయి )

    చంపకమాల
    ...................

    అరిమురి చుట్టుకొన్న లత
    లన్నియు నందము నిచ్చెడున్ గదా
    తరులకు నెల్ల ; సూదిమొన
    తాకిడులే గద దూషణమ్ములే
    యరులకు నెల్ల ; నెత్తిపొడు
    పౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా
    వరులకు ; బ్రేయసీయధర
    పల్లవనిర్గతవేళలందునన్ .

    రిప్లయితొలగించండి
  5. ఉత్సాహము
    పెత్తనమ్ముఁ గట్టబెట్టవెడలి సంధి గూర్పఁగన్
    చిత్తగించిధర్మరాజు శ్రేయమెరిగి తత్సభన్
    కత్తిదూయ పలుకులాడెఁ గౌరవాలిఁ గృష్ణుడే
    యెత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్ సదా!

    చంపకమాల
    దరుమము రక్షఁజేయ నవతారము నెత్తిన కృష్ణమూర్తి తా
    పరుషములాడి పాండవుల పౌరుషమెంతయొ సెప్పి సంధికై
    దురమున కెంచ కౌరవులుఁ దోడ్పడె! నాశము దాపురించగా
    నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా!!

    రిప్లయితొలగించండి
  6. ఆట వెలది::

    ఎవడి బాబు సొమ్ము వేసుకున్నావను

    ఎత్తిపొడుపు మాటలే రుచించు

    రిపులకున్యముడు కరిని కాచినవ్వాన్కి

    పదము పట్టితయ్య పలుకడేమి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. కత్తులకంటెనుపదునై
    చిత్తమునందునకటువుగచేరినమాటల్
    మత్తునువీడగతెరువగు
    ఎత్తిపోడుపుమాటలేరుచించురిపులకున్

    రిప్లయితొలగించండి
  8. A
    మత్తున దూలుచు నొక్కడు
    చిత్తము వచ్చిన విధముగ ఛీత్కారము తో
    నుత్తము లని గమనింపక
    నెత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్

    రిప్లయితొలగించండి
  9. విరివిగమాటబాణముగవేఁగనెబాలుఁడుయుద్ధమందునన్
    తఱిఁగనిపౌరుషంబుననుతాల్మినివీడుచునూహకందకన్
    మెరసెనుపార్ధునందనుడునేరుపుమీరగచిచ్చురేపుచున్
    అరులకునెల్లనెత్తిపోడుపౌవచనమ్ములుశ్రావ్యముల్గదా

    రిప్లయితొలగించండి
  10. ఉత్తమంపు మాటలేల నూసుపోక నిత్తరిన్
    సత్తజూపు సమయమాయె సంధిపొసగ సాధ్యమే
    కత్తితోడ నుత్తరమ్ము కల్గునెడల మాధవా!
    ఎత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్ సదా

    రిప్లయితొలగించండి
  11. స్థిరతర నిర్మలప్రకట జీవన యుక్తియె ప్రస్ఫుటమ్మనౌ
    విరిసిన శాంతికాముకులు విజ్ఞత జూపుచు ధ్యానమగ్నులై
    కురియు ప్రశంస జల్లులును గ్రోలెదరట్లె విమర్శలెల్ల *నే*
    *ర్పరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి


  12. కత్తుల తో పొడుచు విధం
    బెత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్,
    వత్తాసు పల్కు నరులకు
    పొత్తంబొకటివలయును ప్రభో తెలుసుకొనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. కొత్తగ చెప్పున దేమిగ?
    సొత్తు కొరకు పోరు, "మాకె సొంతమెననుచున్"
    కత్తులు రువ్వు తరుణమున
    ఎత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్

    రిప్లయితొలగించండి
  14. చిత్తమునందున ద్వేషము
    మత్తత్వము నొరులయెడల మాత్సర్యంబున్
    కత్తులవంటి పదంబుల
    నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్

    రిప్లయితొలగించండి
  15. ఎత్తుగడలెన్ని పన్నిన
    చిత్తుగ నోడుట తిరమని జెప్పిన వేళన్
    కత్తులు దూయుట కంటెను
    నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్

    రిప్లయితొలగించండి


  16. పలుకు ప్రతి పలుకునకు తల
    పుల నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచన
    మ్ములు శ్రావ్యముల్ గదా కెలు
    క లబ్ధి కలుగననుచున్ వగచుచు జిలేబీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. చిత్తుగ మద్యము గ్రోలిన
    కత్తులనొరలో ధరించు కఠినాత్ముండా
    నత్తిగల వాడు పలికిన
    నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్.

    రిప్లయితొలగించండి
  18. కరణపు వారి షడ్డకుడు గాయకుడంచును ముచ్చటింపగా
    విరుపుల నివ్వకుండ కడు బిగ్గరగా తన మాతృభాషయౌ
    యరవము నందతండు పరిహాసము లాడగ నాలకింటు బ
    ర్బరులకు నెల్లనెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా.

    రిప్లయితొలగించండి
  19. మరువని ఈటెపోటులవి మాయనిమచ్చలు మానశీలురౌ
    నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు, శ్రావ్యముల్ గదా
    యరయ త్రపావిహీనులకు నా పనిదొంగల కప్రతిష్ఠులౌ
    దురితగుణావలంబులకుఁ, దొల్గు మరో చెవినుండి యా నుడుల్.

    కంజర్ల రామాచార్య.


    రిప్లయితొలగించండి
  20. సరులగు యత్త కోడలును శాంతము వీడుచు వీధికెక్కియున్,

    మరువక పాత రచ్చలను, మాటల ఈటెల రువ్వుచుండగన్

    పొరుగునయున్న పంకజము పొందెను మానసమందు తోషమున్

    అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. చం:

    నిరతము దృష్టి గోచరము నీల్గుడు బుద్ధులు పుర్రెకొక్కటై
    స్థిరమగు మాటలేదు నిలదీయగ వింతగ మాటలాడుచున్
    సరిపడ నెంత కూడినను చాలగుటన్నదిలేక సామ్యమౌ
    అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు, శ్రావ్యముల్ గదా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. కత్తులు దూసి రణంబున
    సత్తువ జాటంగలేక చాటుగ సారా
    మత్తున దేలుచు ప్రేలెద
    రెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్

    రిప్లయితొలగించండి
  23. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    ఎత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణము సీసములో

    పాండు సుతులను గాంచి రణ భూమిలో సుయోధనుడు పలుకు సందర్భం

    పదుగురి ముందట భార్యకున్ వలువల
    నూడ్పించ మెదలక నూరకుండి


    శిరముల నెత్తక చేతలు డిగినట్టి
    పౌరుష హీనులు మీరు గాదె,

    ముష్డి నెత్తు కొనుచు కష్టబడితి రేకచక్ర
    పురమున లజ్జను వదలచు,

    యిపుడు మీకెత్తి పొడుపు మాటలే రుచిం
    చు,రిపులకు నెపుడు సోమ
    ముండ

    దగును,రాజుల భీరులై ధర్మ మనుచు

    సత్య మనుచు సమర మందు చవటలవలె

    పలుక రాదు మీ రెల్లరు పాండు తనయు

    లార యని సుయోధను డనె రణము లోన


    సోమము పరాక్రమం

    రిప్లయితొలగించండి
  24. బత్తిన రత్తయ పలికెను
    నెత్తిపొడుపుమాటలే రుచించు రిపులకున్
    మత్తును వదలిన పిమ్మట
    మెత్తగ మాట్లాడె,రిపులుమెచ్చువిధముగా

    రిప్లయితొలగించండి
  25. విత్తార్జనమే ముఖ్యము
    నిత్తెము వీరికిఁ గడింది నీ వే మన్నన్
    సత్తెము చలింప రీ నరు
    లెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్


    తరుణము వచ్చెనీకు వితతమ్ముగఁ దిట్టిన శంక వీడి యే
    నరులును నిన్ను నాప రిట నారుల సన్నిధి రెచ్చి పోయి నీ
    యరులను దల్చి పల్కినవి యన్నియు, నీ పగవారి వైరు లీ
    యరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

    రిప్లయితొలగించండి
  26. తరుణికి మాటనిచ్చిపతి తప్పని కార్యము నందుచిక్కి తా
    నిరవుకు రాకయున్న క్షమియించక, కోపము వృద్దిపొందగా
    నిరవధికమ్ముగా వధువు నిందన చేయగ, ప్రక్కయింటిలో
    నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా


    రిప్లయితొలగించండి
  27. శరములకన్న కక్కసము సంకటపెట్టును వైరి దూషణల్
    కురుసభయందు కౌరవులు కూటపు ద్యూతము గెల్చి దుర్మతిన్
    పరుషపు ప్రల్లదంబులను పాండు కుమారుల గేలి చేయరే!
    యరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

    రిప్లయితొలగించండి
  28. ఖరముల వారసుల్ కనగ గద్దియ నెక్కిన నేత లిత్తఱిన్
    పరులను గారవించుటన వారిక సుంతయు మెచ్చబోరుగా
    మురియుచునుందురెన్నడును మూఢులు వారల దాసులాడెడిన్
    అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

    రిప్లయితొలగించండి
  29. అరులను ధర్మజాగ్రజుని యానతి నొంపు తలంపు నా వృకో
    దరుడు మనంబునన్ విడిచి దండన మెందుకు సంధిజేయ నా
    మురహరు గోర జక్రి తలపున్ గన మేలము లాడ రెచ్చె దా
    **నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా”*

    రిప్లయితొలగించండి
  30. పరులను నిందజేయుటను బాపముగానెదలంచువారికిన్ దరతమభేదముల్గనక ధార్మికదృష్టిని సాయమెంతయో
    యొరవడి దిద్దునట్లుగను నొవ్వనీవానికుబాటుగా వెసన్
    నరులకునెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్గదా

    రిప్లయితొలగించండి
  31. నెయ్యము వలదెపుడు స్నేహితుల వరుగ
    ఎత్తి పొడుపు మాటలే రుచించు
    రిపులకున్ సహజము రీతిలేని నడత
    మసలిన ఎడముగను మనకె శాంతి

    రిప్లయితొలగించండి