6, ఫిబ్రవరి 2021, శనివారం

సమస్య - 3627

7-2-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి”
(లేదా...)
“ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్”

87 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కొంతయు కారమున్ మరియు కోరిక తీరగ నూనె మెండుగా
  సొంతపు తీరునన్ కలిపి సోయగ మొప్పెడు తెల్లజుత్తునన్
  సుంతయు మార్పు లేదుగద సుందరి నీదగు నావకాయలో
  నింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్...

  రిప్లయితొలగించు
 2. సోమకుడు, హిరణ్యాక్షుని సోదరుండు,

  రావణుడు, కంసుడాది కురక్కసులును

  ఇంతకు మునుపు గన్నదే :; యిపుడు గంటి”

  నీదు దివ్యమౌ రూపము నిదుర లోన

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించు
 3. బాల్యమందలితడబాటుబాధయంత
  మూడుకాళులనడకనుముసురుకోనియె
  జీవచక్రుంబునీరీతిచేదువిషము
  ఇంతకుమునుపుగన్నదేయిపుడుగంటిి

  రిప్లయితొలగించు
 4. బాల్య మందున గన్నట్టి భాసురంపు
  బొమ్మ లాట ప్రదర్శన కమ్మదనము
  మరల జూపంగ మిక్కిలి మరులు తోడ
  నింతకు మునుపు గన్నదే యిపుడు గంటి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మరులతోడ/మరులు గొలుప' అనండి.

   తొలగించు
 5. కుంతికి ముగ్గురే సుతులు , కూరిమి మాద్రికి కల్గిరిద్దరున్,

  సంతతి నూరు లెక్కగను శాశ్వతు పుత్రుకు , పాత చిత్రమున్

  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్”

  సుంతయు మార్పు లేదు కద చూడను నూతన చిత్ర రాజమున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  (శాశ్వతు పుత్రుడు అనగా వ్యాసుని పుత్రుడు, ధృత రాష్ట్రుడు)

  రిప్లయితొలగించు
 6. పంతము బట్టినారొ పలు భావదరిద్రము గల్గినట్టి దౌ
  వింతగ గన్పడంగ నిది వింతలు గొల్పెడు చిత్రమంచు వా
  డెంతయు నాలసించకను నేపుగ బెట్టెడు చిత్ర రాజమున్
  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్!!

  రిప్లయితొలగించు
 7. తేటగీతి
  నటన వారసత్వమ్మౌచుఁ బొటమరింప
  కథలు దొరకని దౌర్భాగ్య గమనమనఁగ
  తండ్రితీసిన చిత్రమే తనయుఁడెంచ
  నింతకు మునుపు గన్నదే యిపుడు గంటి

  ఉత్పలమాల
  సొంతమె మాకు నీ నటన చూడుమటంచన వారసత్వమై
  గంతలుఁ గట్టి ప్రేక్షకుల కళ్లకు భావ దరిద్ర్యమందునన్
  దింతక! తండ్రి గారు మును దీసిన చిత్రమె పుత్రుఁడెంచఁగా
  నింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 8. ఇరువది వయసు నాడున నీదు సొగసు
  అరువది వయసు నేడు నీ అంద మంత
  ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి
  భార్య షష్టిపూర్తిన నాడు భర్త నుడువె

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించు
 9. ప్లేగు రోగము కవిగొన్న వేళయందు
  బోసివోయిన గ్రామాల వోలె నేడు
  విశ్వమంతట కోవిడు వ్యాప్తి చెంద
  ఇంతకు మనుపు గన్నదే యిపుడు గంటి.

  రిప్లయితొలగించు
 10. పంతము బూని తాను పరిపాలన జేయగ కేంద్రమందెన
  క్షాంతము, వేరొకండకవకాశము నివ్వగ నందమూరి తా
  జింతిలకుండ నావహముచే యధికారమునొందిన వేడ్కగాంచగా
  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 11. మైలవరపు వారి పూరణ

  కంతుని రాణివీవు., సతి! కంజము నీ వదనమ్ము, రేయినేన్
  సుంతయు వాడబోదు.. నవశోభల వెల్గు దినమ్మునందు., నే
  కాంతకు లేని లక్షణము కన్నులవిందొనరించు చిత్రమే!
  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 12. అంతయు నీదుసత్తయని యన్యములేదని
  జాటిచెప్పు నీ
  వింతల సృష్టిలో నెపుడు వేసటలేకయె సూర్యచంద్రులున్
  వంతుల వారిగా వెలుగు బంచగ నిత్యము రేబవళ్ళలో
  నింతకుముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. చింతిలు నెంతయో తనదు జీవితభామిని వీడ
   కాయమున్
   వింతగ నొక్కవత్సరము పిమ్మట నంతయు విస్మరించుచున్
   సంతసమందుచున్ గొనును చక్కగ రెండవ భార్యనున్ భళా
   యింతకుముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

   తొలగించు
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వయసు పెరిగి తలయె పండి వన్నెమీఱు
  దార వంటజేయు విధము మారలేదు
  సాద మందలి రుచిగూడ సరిగ నేను
  యింతకు మునుపు గన్నదే యిపుడు గంటి.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నేను+ఇంతకు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

   తొలగించు
  2. గురువుగారికి నమస్కారములు. తమరి సూచనను గమనించినాను.

   తొలగించు
 14. తేగీ.
  ఎన్ని యుగములు గడచిన నేమి ఫలము?
  యంతర రిపులార్వుర నింత నాప దరమె
  కామ మొక్కటె మూలమ్ము కష్టములకు
  ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి.

  ఉ.
  అంతము నొందెనంచు నిక యన్యుల పాలన భారతా వనిన్
  సొంతపు పాలనే మనకు సొంపని జబ్బలు బాదుకుంటిమే
  అంతయు మేయు పాలకు లసాంతము దోచెడి స్వార్థచింతనే,
  యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 15. చిత్తరువు లనెన్నియొ గీచె చిత్రముగను
  బహుమతులగెల్చినట్టివి ప్రక్క నుంచి
  పాత దైనటువంటిది పటము జూప
  ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి!!

  రిప్లయితొలగించు
 16. ఉ:

  చింతన చేయతొల్లినొక చిత్తరు రూపు నలంకరించనై
  వంతుకువచ్చె నింతి తన పంతము నెగ్గగ నందగత్తె గా
  నంతము, నింటిపట్టు కడ నబ్బుర మొందితి గాంచ సాజమై
  యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచు నుంటి వింతగన్

  వంతుకువచ్చు=పోటీకివచ్చు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కాంతకు నీడు పెర్గినను కాయము నందున మార్పులొచ్చినన్
  సుంతయు నామె పాకమున చొప్పది నేమియు మారలేదయా!
  కొంతయుగూడ పాడవని కూరల స్వాదము గాంచ నేనిటన్
  యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వచ్చినన్'ను 'ఒచ్చినన్' అనరాదు. "చొప్పది యేమియు..." అని ఉండాలి.

   తొలగించు
  2. గురువుగారికి నమస్కారములు. తమరి సూచనను గమనించినాను.

   తొలగించు
 18. ఎంత వచించెదోయి కత
  మేమని చెప్పెద నిప్పుడీ విధిన్
  కొంచెము మార్చలేమిటను
  కోరిన దేదియు కానమేలనో
  వింతగ దోచు నీ రుచిర
  విశ్వ వికాస సమీకృతా కృతిన్
  ఇంతకు ముందు చూచినదె
  యిప్పుడు చూచుచునుంటి వింతగన్!

  ఇంత విశాల విశ్వమున
  నెప్పటి వోలెను సూర్యచంద్రులు
  న్నంతము లేని కాలపు ప్ర
  యాణముతో జను జీవరాసులున్
  చెంతను సాగు శైశవము
  చిత్రపు యౌవన వార్ధకమ్ములున్
  ఇంతకు ముందు చూచినదె
  యిప్పుడు చూచుచునుంటి వింతగన్!

  రిప్లయితొలగించు
 19. చలన చిత్రము మాయాబజారు జూడ
  నింతకు మునుపు గన్నదే యిపుడు గంటి
  గాని మరల మరలజూడ గాంక్ష నాకు
  పొసగుచుండు నా జీవము ముగియువరకు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అవును! ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం 'మాయాబజారు'

   తొలగించు
 20. అంతట పట్టణీకరణమై జనులందరు వీడ పల్లెలన్
  సుంతయు తీరుపాటు గన శూన్యమయెన్ గద జీవితంబులన్
  వంతలు వెట్ట వైరసిక పల్లెల బాటకు మళ్ళిరందరున్
  చింతలు లేక వారలట సేదను దీరుచు హాయినుండగా
  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 21. సమస్య :
  ఇంతకు ముందు చూచినదె
  యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  ( ఎన్నో యేండ్ల క్రితం స్నేహితుని పెండ్లిని తిలకించిన నేను ఇప్పుడు అతని షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్లితే అక్కడ
  నా కంటబడిన మనోహరసన్నివేశం )

  ఉత్పలమాల
  .....................

  ఎంతయు ప్రాణమిత్రుడగు
  నీశ్వరరాయని షష్టిపూర్తికై
  యింతిని వెంటబెట్టుకొని
  యేగితి ; దంపతులింక పెండ్లికై
  సుంతయు సిగ్గుచెందుచును
  చోద్యపు తంతును సల్పుచుండగా
  నింతకు ముందు చూచినదె
  యిప్పుడు చూచుచునుంటి వింతగన్ .

  రిప్లయితొలగించు
 22. చిరునగవులు మెరయు మోము చిన్ని బొజ్జ
  చిలిపి కన్నులు, సన్నని, చిట్టి ముక్కు
  అమ్మ పోలిక మాబాబు, అమ్మ లోన
  ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి

  రిప్లయితొలగించు
 23. 07.02.2021

  అందరికీ నమస్సులు🙏🙏

  నా పూరణ ప్రయత్నం..

  *తే గీ*

  లోకమంతయు నప్పుడు రోగమొచ్చి
  జనుల పద్దతి మారగ సంతసించి
  మంచి జరిగెననునుకొంటి మాయగాదె
  *“ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి”*


  _*ఎన్నికల తరువాత ప్రతి పౌరుని మనోగతం.*_.😊👇

  *ఉ*

  చింతలు దీర్చువాడొకడు శీఘ్రము వచ్చును మమ్ము గావగన్
  అంతయు మారు చున్నదని యందరు జెప్పగ నమ్మితిన్ గదా
  పొంతన లేని యూహలవి పుట్టెను నాకని నిగ్గుతేలెనా?
  *“ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏🙇‍♂️🙏

  రిప్లయితొలగించు
 24. సొంత గూటికి తా జేరి నంత జూచె
  తనను మరువని మిత్రుల తనివిదీర
  మాయ గానట్టి భాంధవ్య మాధురులను
  ఇంతకు మునుపు గన్నదే యిపుడు గంటి

  రిప్లయితొలగించు
 25. ఉత్పలమాల:
  +++++++++++++
  పంతముబట్టిపుత్రులను,పండుగజేయగనెట్టచిత్రముల్
  సుంతయు శుద్ధిలేకనిట,చుక్కలుజూపెను పల్కులందునన్
  చింతలురాగ వీక్షకులు,చీదరబుట్టుచుత్రోసిరాజనన్
  యింతకుముందుచూచినదె,యిప్పుడుజూచుచునుంటి వింతగన్.

  రిప్లయితొలగించు
 26. ఈ రోజు, నా పెళ్ళి రోజు వేళ, ప్రత్యేక పూరణ.
  ( సమయానికి తగు సమస్యనిచ్చిన, ఆచార్యులు కంది శంకరయ్య గారికి ధన్యవాదములతో)

  🌹ఉత్పల మాల🌹

  పంతులు చెప్పగన్మెడను భందము కట్టితి మంచి వేళనన్

  సంతును కల్గె , జుట్టునకు రంగును మారెను సాగె వర్షముల్

  గుంతలు పడ్డ భార్య మెడనందము చిందెడు వెల్గు జిల్గులున్

  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించు
 27. చిన్న తనమున నాయూరి వన్నెలన్ని
  కాలగర్భాన క్రమముగా కలిసిపోయె
  చెక్కు చెదరక యానాటి శిల్పమొకటి
  యింతకు మునుపు గన్నదే యిపుడు గంటి

  రిప్లయితొలగించు
 28. పద్యము వ్రాయు బూనుట యవశ్యనిదేశమ! శిక్ష కర్హమా!
  చోద్యమ! హాస్యమా! సరసవాగ్విభవస్ఫురితార్దృతార్తిసం
  వేద్యము గాని పద్యము లవేలనొ! వ్యర్థపదాన్వితమ్మునౌ
  పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్.

  కంజర్ల రామాచార్య

  రిప్లయితొలగించు
 29. అంతయు భ్రాంతమంతమె నిరంతపరిభ్రమణమ్ము జీవిత
  మ్మంతయు నీ విముగ్ధవదనాంబుజమే కనుచుంటి యైననున్
  వింతగ తోచుచుండగ! నవీన
  కళాకృతి నిత్యనవ్యమై
  యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించు


 30. కిట్టి ఆత్మహత్యకుపయోగించినట్టి
  యింతకు మునుపు గన్నదే! యిపుడు గంటి
  మరల వాడిచెంతనయయొ! మదిని దొలచె
  ఘటన! కర్మ వదలదాయె గట్టి దాయె!


  జిలేబి

  రిప్లయితొలగించు


 31. సుచరిత సుందరి చెఱగుపె
  నచె! ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూ
  చుచునుంటి వింతగన్ చూ
  డ చూడ వింతయె సుమా పడతుల బిగువులున్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 32. పూర్వాశ్రమంలోనున్న స్నేహితుని జూసిన సందర్భంగా
  సుంతయులేదుచింతమనసూరటబొందప్రవృత్తివ్రాతలే
  కాంతప్రశాంతసౌధమునుగౌరవజీవముపింఛనాసరా
  చెంతనవన్యజీవులువసింప గనవ్వుచుమాటలాడునే
  *“నింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్”*

  రిప్లయితొలగించు
 33. *“ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్”*
  గుంతలరోడ్లువృక్షములుగోవులుగోష్ఠములందువీధిలో
  కాంతలుకయ్యమాడుచునుకాంతులుద్రావుచుపిల్లకాయలున్
  సుంతయుచింతలేకనగుచున్నడయాడుచుబుడ్డగోచితో
  సంతులురచ్చబండపయిసభ్యులుబావులనీరుజేదుపూ
  బంతులుసందుగొందులనువాదములాడుచుత్రాగుబోతులున్
  సాంతమునూడ్చివేయువ్యభిచారిణులాడెడుజూదరుల్ప్రజల్
  సంతలబేరమాడుచునుసంకులమైగనపట్టెపల్లెలో

  రిప్లయితొలగించు
 34. అంతములేని కాలగతి యందున నంతయు నంతరించు నా
  వంతయు నంతరించనిది యమ్మకు బిడ్డలపైన ప్రేమయే
  సుంతయు మార్పులేదు మనసున్ దనియించెడు నమ్మ ప్రేమలో
  నింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 35. ఎంతటి ఘోరమోకద మహీతల మందున పచ్చకారులే
  పుంతలు గాచి దోచిరట పూర్వము పాదవికుండ్ర, నేడిలన్
  క్రంతిని మధ్యమధ్య గన కప్పము పేరిట దుడ్డు లాగగన్
  ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 36. పంతము బూని వైరిజన వర్గములన్ పరిమార్చుపద్ధతుల్
  వింతగు వేషధారణ వివేకవిహీనత దుష్టకార్యముల్
  భ్రాంతిమయంపు భాషణలవశ్యము కల్గెడు దోషభావమే
  యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచునుంటి వింతగన్

  పంతమును వీడి నావైపు పరుగుబెట్టి
  చెంత చేరంగ వచ్చెడు చెలియ కనులు
  వింత గొలుపుచు మధురమౌ ప్రియవదనము
  నింతకు మునుపు గన్నదే యిపుడు గంటి

  రిప్లయితొలగించు
 37. సంతసమ్మునఁ బయనమై సంత కేను
  గంతు లిడుచుండఁ దీగపై నంత బాల
  వింత పుట్టించు మెయిఁ బులకింత వార
  లింతకు మునుపు గన్నదే యిపుడు గంటి


  అంతట నుండె హస్తి మశ కాంతర మప్పటి కింక నేటికిం
  బొంతన మింతయుం గన మపూర్వపు వృద్ధి గడింప నింపుగా
  నెంతటి మార్పు తెచ్చును మహీతల మందు గతించి కాలమే
  యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచు నుంటి వింతగన్

  రిప్లయితొలగించు
 38. రామలింగేశుజూడగ రహినినేగి
  భక్తిశ్రద్ధలసేవించి రక్తిజూడ
  నింతకుమునుపుగన్నదే యిపుడుగంటి
  పాలకొల్లునగలయట్టి పసిడిప్రతిమ

  రిప్లయితొలగించు
 39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 40. చింతలపాడునందుగల శేషునిచూచుటకేగగానటన్
  నింతకుముందుచూచినదెయిప్పుడుచూచుచునుంటివింతగన్
  గొంతయుమార్పులేదచటకోనలుగుట్టలునొక్కరీతిగా
  వింతగగానిపించెరమ!బీటలువారినగోడపంక్తితోన్

  రిప్లయితొలగించు
 41. సంఘటనలు కొన్ని తొలుత జరిగి నటుల
  దోచు నాకు కనుల ముందు తొట్రుపడగ
  నింతకు మునుపు గన్నదే యిపుడు గంటి;
  నందురు 'డె జావ 'నుచు దీని నాంగ్లమందు

  * de javu = a feeling of having already experienced the present situation

  రిప్లయితొలగించు
 42. నాడు ఆలయద్వారపు గోడ లందు
  కాని పించిన సుమధుర ఘట్టము లవి
  చెక్కు చెదరక యుండుటన్ చిత్తమలర
  యింతకుమునుపు గన్నదే యిపుడు గంటి

  రిప్లయితొలగించు