19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

సమస్య - 3640

20-2-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్”
(లేదా...)
“వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్”

38 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  ప్రొద్దున లేచి స్నానమిడి బొబ్బటు తోడుత పండుగందునన్
  ముద్దుగ నాదు పత్నియహ ముచ్చట మీరగ కాల్చ నేడిటన్
  తద్దినమందు లాగినవి తట్టల తట్టల గారెలాదటన్
  వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్...

  రిప్లయితొలగించండి
 2. ముద్దుగ చేతులు కలుపును

  వద్దనె నమసులు తెలుపుట, వాలె కరోనా

  సుద్దులు మారెను జగతిన

  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. అద్దిరకరోనపోయెను
  హద్దులుచెరుపుచుజనుఁడునుహాయనినీల్గెన్
  విద్దెలనెలవులువెలిగెను
  వద్దనికోరినవెమరలవచ్చెమురిసితిన్

  రిప్లయితొలగించండి


 4. అదే !మళ్లీ కందం :)  హద్దరి బన్నా ! చూడిటు
  వద్దని కోరినవె మరల వచ్చె! మురిసితిన్
  పద్దెములను వ్రాయుచు నే
  నద్దరి నిద్దరి తిరిగితి నవ్యపు రీతిన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. ముద్దునికోరగ మగడుయు
  వద్దనివారించెసతియు, బంధువు లుండెన్
  ప్రొద్దున వెళ్ళగ వారలు
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 6. సమస్య :
  వద్దనుకొన్నవే మరల
  వచ్చెనటంచు ముదంబు నొందితిన్

  ( అనాలోచితనిర్ణయంతో ఆలుబిడ్డలను వీడివెళ్లిన పెద్దమనిషి వెదకుతూ వద్దకు వచ్చిన వారిని చూచి అనిర్వచనీయమైన ఆనందంతో యిలా అనుకొంటున్నాడు)

  ఉత్పలమాల
  ...................

  ఎద్దియొ తొందరన్ బడుచు
  నింటిని భార్యను పిల్లలందరిన్
  ముద్దును ముచ్చటన్ మరచి
  మోటుగ వీడితి నద్దరిన్ ; భళా !
  యిద్దరి వచ్చి స్వాంతమున
  కెంతయొ సాంత్వన నిచ్చిరిప్పుడున్ ;
  వద్దనుకొన్నవే మరల
  వచ్చెనటంచు ముదంబు నొందితిన్ .

  ( స్వాంతము - మనస్సు ; సాంత్వన - ఓదార్పు ; అద్దరి - ఆ ప్రక్క ;ఇద్దరి - ఈ ప్రక్క )

  రిప్లయితొలగించండి


 7. అమలా! జిలేబి ! శనివా
  రము! వద్దనుకొన్నవే మరల వచ్చెనటం
  చు ముదంబు నొందితిన్ శీ
  ఘ్రముగా పనుల తెములుకొని రావడి‌చేయన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. హద్దులుదాటుచుననుకొని
  వద్దని"ఎన్నికధిపతి"ని పంపగ నపుడున్
  కొద్దిసమయంబునతిరిగి
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 9. మనవడి ముద్దు మురిపాలు --

  ముద్దుల పట్టికి బిడ్డడు
  అద్దపు చెక్కిలి నసొట్ట, యదియే నగవున్
  ముద్దు లొలుకు మాటలు, పో
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 10. చద్ది తిన గోరనేమిర
  పెద్దత్తకు చెప్పలేను బిడియము తోడన్
  ముద్దియనన్నమ్మునడుగ
  వద్దని, కోరినవె మరలవచ్చె, మురిసితిన్.

  రిప్లయితొలగించండి
 11. హద్దులు బెట్టుచు బెండ్లికి
  వద్దని వరకట్నము కడు వాదముసేయన్
  ముద్దుగ చదివింపులనగ
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  ముద్దుగ బెంచినట్టి తనపూర్వికులన్ విడి దూరమేగకే
  ఒద్దిక నింటనుండి బహు యుక్తిగనేర్వగ సాఫ్టు
  వేరునున్
  గద్దియ నెక్కగా దొరికె కంపెని కొల్వులు సింగపూరులో
  వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్

  రిప్లయితొలగించండి
 12. శ్రద్ధగ జేయు కార్యమని చచ్చిన వారికి పెట్టు నట్టిదే
  అద్దినమంచు పిల్వ నమృతాన్నమునే భుజియింపనెంచి యా
  మిద్దెకు చేరుకుంటిని, ప్రమీఢము గల్గిన వృద్ధు లెల్లరుల్
  వద్దను కొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్.

  రిప్లయితొలగించండి
 13. తెల్లవారు జామున వచ్చు కలలు నిజమౌతాయని చెపుతారు. ఆ అంశము ఆధారంగా నా ప్రయత్నము:

  ఉ:


  ప్రొద్దిటి పూట వచ్చు కల పోవడకుండ ఫలించు నందురే
  పెద్దల మాట లెంచి కడు వృద్ధిని గోర నభీష్ట సిద్ధికై
  సిద్ధులు సంభవించెనని శీఘ్రమె తీరగ సాధ్యమంచనన్
  వద్దను కొన్నవే మరల వచ్చె నటంచు ముదంబు నొందితిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి

 14. నాప్రయత్నం:
  మాతృమూర్తి యంతరంగము:
  ఉ.
  ముద్దుగ పెళ్లి జేయ మమ పుత్రిక మెచ్చిన వానితోడ, వా
  రిద్దరి ప్రేమ కానుకగ నింటను బుట్టగ చిన్నిపాపడే,
  కొద్ది యుగాంశకంబులకు కోమలి కింక ప్రసూతి నొప్పులే
  వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్.

  రిప్లయితొలగించండి
 15. ముద్దుగ బెంచెడు బూతిక
  లద్దరి శునకమును జూసి యడలుకొనక నా
  వద్ద సహాయము వాటికి
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  పూతిక = పిల్లి

  రిప్లయితొలగించండి
 16. అద్దిర! ప్రాస క్లిష్టమగు నంచు సమస్యలఁ గ్రొత్తవానినిన్
  బెద్దలనైన కష్టములఁ బెట్టు విధంబున నే నొసంగినన్
  బద్దెము వ్రాయ నోటువడి పల్కిరి వారలు నన్నుఁ జూచి "రా
  వద్దనుకొన్నవే మరల వచ్చె" నటంచు; ముదంబు నొందితిన్.

  రిప్లయితొలగించండి
 17. మిద్దెలు కాసు రాశులును మేటలు వేసిన స్వర్ణ రాశులున్

  ముద్దుల ముద్దరాలు, సతి మోజుల కౌగిలి బిర్రునొద్దనిన్

  శుధ్ధిగ చేసి పూజలను శోభగ చేరితి రంభ చప్పలన్

  వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  ( చప్ప = ఊరువు)

  రిప్లయితొలగించండి
 18. పెద్దగ చదువులు నేర్వక
  హద్దులు దాటక సుజనుల నను బంధ ముతో
  పద్దెముల రచన దనకు న్
  వద్దని కోరినవె మరల వ చ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 19. హద్దులు దాటి వర్తిలుచు నాలము కోరుచు చీనిదేశమున్
  జద్దగు పాకు దేశమట చైనకు నొద్దిక వంత పాడ వీ
  రిద్దరి కంత్యకాలము గరిష్టముగన్ కలదంచు మేముగా
  వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్

  ఆలము = యుద్ధం, చీని = చైనా, జద్దు = కఠిన హృదయము

  రిప్లయితొలగించండి
 20. పెద్దలు చెప్పిన వృత్తులు
  వద్దని యేగిన తెలిసెను పడమటి లోనన్
  ముద్దె మన సంస్కృతులంచు ,
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  మనం వేద విద్యలు, పౌరోహిత్యాది కర్మలు, భారతీయ సంస్కృతి వద్దని అమెరికా వెళ్లి అక్కడ మన సంస్కృతి గొప్ప తనాన్ని గుర్తించి అక్కడ వాటి నే ఆచరిస్తూ అభివృద్ధి ని పరుస్తున్న మనవారెందరో !
  🙏🙏🙏
  ✍️ కొరిడె విశ్వనాథ శర్మ

  రిప్లయితొలగించండి
 21. నిన్నటిపూరణ.

  వాలము మక్షికాదుల నివారణశూలము జంతుసంచయా
  స్ఫాలన కాలవాలమగు వాయుసుతానలదాహకోగ్రకా
  కోలము మూలమై తగి ప్రకోపనిదర్శనసూచనాదులన్
  వాలము శాత్రవాళికరవాలము చాలము దాని మెచ్చగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. కందం
  అద్దరి రథసప్తమికిన్
  ముద్దు సతుల తిరుమలేశు ముందుంచఁగ, మ
  మ్మద్దెస బ్రహ్మోత్సవముల
  వద్దని, కోరినవె మరల వచ్చె మురిసితిన్

  (కరోనా వలన గత బ్రహ్మోత్సవాలు స్వామి వారికి ఏకాంతంగా జరిపారు. రథసప్తమి అంటే, తిరువీధులలో ఏడువాహనాలలో మలయప్ప విహరించే ఒకరోజు బ్రహ్మోత్సవాలే)

  ఉత్పలమాల
  ముద్దులు జిందెడున్ హరిని మోహన రూపుని తిర్మలేశునిన్
  శ్రద్ధగ శ్రీనివాస రథసప్తమి గాంచితి వేంకటాద్రి మ
  మ్మద్దెస బ్రహ్మసేవలకు హద్దుల నుంచఁగఁ జూడలేమనన్
  వద్దను కొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   ముద్దుల సూనకున్ మనువు, ముందుగ నాభరణాలఁ గొంటి నే
   నిద్దురఁ దూగుతున్ దిగితి నేరక బండిని వీడి సంచినిన్
   బొద్దున చోదకుండుఁ గొని ముచ్చట నిచ్చెను దెచ్చి, జ్యూవెలర్స్
   వద్దను కొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్!

   తొలగించండి
 23. వద్దవి పాత పద్ధతులు వందనమేలని చేతులూపుచున్
  ముద్దని కోరి దెచ్చితిరి మోజుగ నాంగ్ల విదేశ సంస్కృతిన్
  హద్దును దాటగా దగదటంచు వెలార్చ కరోన నేడికన్
  వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్

  రిప్లయితొలగించండి
 24. పెద్దలభావజాలమునుపేర్మినికాదనిబాల్యమందునన్
  హద్దులుమీరుచున్తిరిగిహానినిఁజేసితినాత్మకీగతిన్
  విద్దెలసారమంతటినివింటినిరోసితిబాల్యచేష్టలన్
  వద్దనుకోన్నవేమరలవచ్చెనటంచుముదంబునందితిన్

  రిప్లయితొలగించండి
 25. పెద్దలు మంచిగ చెప్పిన
  సుద్దులు పెడచెవిని పెట్ట క్షోభయె మిగిలిన్
  బుద్ధికి తెలిసిన పిమ్మట
  వద్దన కోరినవి మరల వచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 26. పెద్దగ జదువులు నేర్వమి
  పద్దెములన్ వ్రాయరాక పండితసభలన్
  దద్దయు బిడియము నొందగ
  వద్దనికోరినవె మరలవచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 27. మొద్దు విధమ్మున నేరక
  గద్దెలు మిద్దెలు వలదని గర్వముతో నే
  నద్దినమున నట్లన్నను
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్  విద్దెల యందు మేటి ధృతి విక్రముఁ డా నరసింహరావు నాఁ
  బెద్ద ధరామరాగ్ర్యునకుఁ బిల్చి యొసంగఁగ రాచ కోర్కిలే
  సద్దు మణంగ గ్రద్దనఁ బ్రశాంత మనమ్మునఁ దిర్గి పోవఁగా
  వద్దనుకొన్నవే మరల వచ్చె నటంచు ముదంబు నొందితిన్

  రిప్లయితొలగించండి
 28. ముద్దగ తడిసితి వానల
  వద్దిక చాలంటి నాడు; భానుండటుపై
  హద్దెరుగక రేగ జడిసి
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 29. *“వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్”*
  సుద్దులు వద్దు వద్దనుచు జోద్దెము పద్దెము లిద్ధరిత్రికిన్
  నిద్దుర బద్దకంబు విననేరని విద్దెలటంచు దూరి నా
  వద్దకు బెద్దలానతిని వద్దని జెప్పిన విద్దెనేర్వగా
  నొద్దిక ముద్దుముద్దుగ సముద్ధతి జారగ నేగు దెంచినన్

  రిప్లయితొలగించండి
 30. హద్దులు మీరి నిద్దురకు నంత మొసంగి నిశాపవళ్ళుగా
  నెద్దుగ మొద్దుగా దిరిగి నేరక దుర్భర రోగగ్రస్తుడై
  పెద్దల సుద్దులొద్దిక నవీనుల పద్ధతు లాటకెక్కగా
  *“వద్దనుకొన్నవే మరల వచ్చెనటంచు ముదంబు నొందితిన్”*

  రిప్లయితొలగించండి
 31. నిద్దుర వోవగ కలలో
  నద్దము ముందర లతాంగి యగుపించెను నా
  హద్దులెరిగి యిట్టికలలు
  వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్

  రిప్లయితొలగించండి
 32. పెద్దగ సుద్దులన్ బలుక భీతినినొందుట కారణంబుగా
  దద్దయు పండీతోత్తముల ధార్మికసూక్తుల నొల్లలేకనే
  వద్దనుకొన్నవే మరలవచ్చెనటంచు ముదంబునొందితిన్
  వద్దనుకొన్న మానవవి వచ్చుచునుండును జోద్యమొందగన్

  రిప్లయితొలగించండి