2-2-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు”
(లేదా…)
“కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:పన్నుగ మిత్రులన్ గలిసి పండుగ పూటను సంకురాతిరిన్చెన్నుగ బోవుచున్ మురిసి చెట్టుల క్రిందను ముత్తుకూరునన్మిన్నగు కోడినిన్ గొనుచు మీరిన యాశను పందెమాడగా కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్...
ఆటవిడుపు సరదా పూరణ:(జిలేబి గారికి అంకితం)1960:మిన్న విశాఖపట్నమున మేలుగ జేరుచు నద్దెకొంపనున్ చెన్నుగ నద్దెమంచమును చేర్చగ రాత్రిని గోడచెంతనున్ పన్నుగ నల్లులందరము పండుగ జేయుచు కుట్ట శాస్త్రినిన్ కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏
ఎందుగలడు నీ హరి చూపుమిందుననగసంధ్య వేళ నృసింహుడు స్థంబముననుజీల్చెను , హిరణ్యు కడుపును జీల్చెను జనుకనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "స్తంభము నదె చీల్చి దానవుని కడుపు జీల్చెను..." అనండి.
ధన్యవాదములండీ
భాగ్య నగరున బోనాల పండుగదియె కనుల పండుగఁ గూర్చె, రక్తంపు ఝరులు పార కుండగ సర్కారు బలుల నచట యాపి వేయుచు నిచ్చిరే యాజ్ఞలిపుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరుడనిలోనభీముండువేగదుమికిపత్నిద్రౌపదిపంతంబుభావమరసిచీల్చెగుండెనుశాత్రవుఁజేరివడిగకనులపండుగఁగూర్చెరక్తంపుఝరులు
ఉన్నత ధర్మ శాస్త్ర సమయోచిత ధీరపరాక్రముండు విద్వన్నుత నీతిశాలి ప్రవిదారణభీకర జిత్వరుండు సంపన్న శరాస్త్రశోభితుఁడు పార్థు శరాహతిఁ సైంధవుండు తాఁకన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్ప్రవిదారణము = యుద్ధము
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మాత పితరుల కింటిలో మసలు నట్టి చిన్ని పాపల నవ్వులు చేష్ట లెల్ల కనుల పండుగ గూర్చు, : రక్తంపు ఝరులు కలుగ జేయున సహ్యంబు కల్ల గాదు
కాలు దువ్వగ నేలనొ కయ్యమునకునిలువ లేకున్న శరములనెక్కుబెట్టవైరి సేనల దునిమిన వీరులకునుకనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
ఎన్నడు గాంచలేదని సుహృత్తులు కోరగ వారితో సహా మిన్నగ నజ్జువాలముల మేడెము జర్గెడి యాంధ్రకేగితిన్ సన్నిహితుండ్రతో, కొమర సామిరథమ్ముల పోరుగాంచగా కన్నుల పండువై, తనువు గార్చె రణంబున రక్తధారలన్
తేటగీతితోయలి వలువలూడ్చిన దుస్ససేనుఱొమ్ము రుధిరమ్ము రణమున గ్రోలెదననివాయుసుతుఁడు కురుక్షేత్ర భరణిఁ జెలఁగకనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులుఉత్పలమాలఅన్నుల మిన్న ద్రౌపదిని నందరిముందర వల్వలూడ్చఁగన్గ్రన్నన దుస్ససేను రుధిరమ్మును త్రాగెడు బాస చేసి తానన్న విధంబుగా ననిని నందుచు భీముఁడు ఱొమ్ముఁ జీల్చఁగన్గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
చెన్నగు కాలమిద్దియని చేరుచునందరు పల్లెపట్టులన్ఎన్నికజేసి స్పర్ధకని నేపుగబెంచిన కోడిపుంజులన్ పన్నుగ పందెమొడ్డుచును పండుగపూటను కత్తిగట్టగాకన్నులపండుగై తనువుగార్చె రణంబున రక్తధారలన్
సవరించిన పూరణ 🙏🙏🙏చెన్నగు కాలమిద్దియని చేరుచునందరు పల్లెపట్టులందెన్నికజేసి స్పర్ధకని యేపుగబెంచిన కోడిపుంజులన్ పన్నుగ పందెమొడ్డుచును పండుగపూటను కత్తిగట్టగాకన్నులపండుగై తనువుగార్చె రణంబున రక్తధారలన్
కక్షగట్టిన భీముడు కదన మందుదుస్ససేనుని దునుమాడ తోషమందిద్రుపద కురులను ముడవగ రోషమరయకనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు!!
క్రొవ్విడి వెంకట రాజారావు: భూజ నరయగ జేసిన పోరు నందు రామచంద్రుని శరములు రయము తోడ రావణు నుదర మందున తావుగొనగ కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
ఉ: ఎన్నిక లందు నిల్చి కటు వెంచిన జిత్తుల వమ్ము చేయుచున్దన్ను గడింప వైరి జన తావుల దూరుచు బుజ్జగించుచున్మిన్నగ ఖర్చు జేయ బహు మెప్పుగ నెంపిక వెల్లడించగన్కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
తిన్ననగు కామ దహనపు దినమునందుపూని రెల్లరును గులాలు బూసుకొనగ ,రంగులపొడి నేత్రముల దొరగె బుడతడికనుల , పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
క్రొవ్విడి వెంకట రాజారావు: చెన్నుగ సీత నాదుకొన శ్రీరఘురాముడు దీక్ష బూనుచున్నున్నత శౌర్య బింకముల నూగుచు రావణు కుక్షినందునన్ తిన్నగ నంబకమ్ములను తీవ్రముగా నెలకొల్పినంతటన్ కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్.
సమస్య : కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్ ( నరునికి నారాయణునికి నడుమ నిలబడి భీష్ముని పాటును పరికిస్తున్న శిఖండికి ఒకేసారి ఆ గాంగేయుని స్థైర్యానికి ఆశ్చర్యం - కోరిక తీరినందుకు ఆనందం . )ఉత్పలమాల ....................వెన్నుని వెన్క నిల్వబడి వీరుడు పార్థుని బాణవర్షమే మిన్నగ గుర్యుచుండగను మిన్నక నుండిన భీష్ముదేహమే సన్నని చిల్లులై యెదయె ఝల్లన గాంచెడి యా శిఖండికిన్ గన్నుల పండువై ; తనువు గార్చె రణంబున రక్తధారలన్ !!
కుటిలముగ రణమున నలుగురు గలిసి హతంబు జేయగ, దయ లేక, దారుణముగ,ఉబికె కన్నీరు జనులకు, ఉత్తరకిలకనుల పండుగఁ, గూర్చె రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఉత్తరకు కనుల పండుగ'?
గ్రామ వృద్ధియు నొకచోట గాంచి జూడకనుల పండుగ గూర్చు, రక్తంపు ఝరులుపార నొకచోట పంతాలు పట్టి యుండమనుజులందరు మంచిగ మసల రేమి ?
నిన్న బడ్జెట్టు వేళ సీతారామన్ గారి సేల పసను :)ఎరుపు రంగు చిహ్నంబాయె నే ప్రగతికికనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులుగల పసను పారు సేలయు, ఖచ్చితముగదేశ మింక సాగును ముందు తీయబోడి!జిలేబి
పన్నిన పద్మ యుక్తినను పార్ధుని పుత్రుడు వైరి సేనలన్ఛిన్నము సేయ మేఘములు చేసెను నాట్యము, దేవతాళికిన్కన్నుల పండువై ; తనువు గార్చె రణంబున రక్తధారలన్ఎన్నడు నీతినొల్లమను ఏలిక తొత్తులు చుట్టుముట్టగన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
పన్నులపైనపన్నులు సభాస్థలి మన్యపు వీరులందరున్దిన్నగ కాకతీయనృపతిన్ జని పన్నులు గట్టలేరు నాపన్నుల రక్షసేయుమన భండన మేశరణంబునయ్యెగా*“కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్”*సమ్మక్క సారలమ్మల రక్తంతో
మన్నన సేయడయ్యె హనుమంతు హితోక్తులు భార్య మాటలన్మిన్నగుతాతవాక్కులనుమేలునొసంగెవిభీషణోక్తులన్గ్రన్ననవీడుసీతననకాతరుడయ్యుదశాననుండునాపన్నులుయక్షరాక్షసదివౌకసచారణసిద్ధకోటికిన్*“గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్”*
స్వేఛ్చనిచ్చి నాంగ్లేయుల వెన్నుసఱచి కనుల పండుగఁ గూర్చె, రక్తంపు ఝరులుపార నీయక దెచ్చిన వారి నెల్ల భారతీయులు నర్పించె వందనాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'స్వేచ్ఛ నిచ్చి యాంగ్లేయులు... భారతీయు లర్పించిరి వందనాలు' అనండి.
వెన్నును జూపరైరి అరి వీర భయంకర యుద్ధమందు నాపన్నుల గాచనెంచి తమ భద్రత నించుక లెక్కసేయకేమన్నన బొందరేల, యిక మాన్యులె వైరుల ద్రుంచువారలైకన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్!!
అన్న యనుజ్ఞ లేక నడగారితి నాగితి నిన్ని నాళ్ళుగామన్నున గూల్చినాడ గను మత్సరినా కురు రేని ద్రౌపదీనిన్ను పరాభవించె గద నేడిటు జూడుము వాని దుర్గతిన్కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
రామున కిరుగడల సీత, లక్ష్మణుండుమెలగు చుందురు కద కూర్మి మేలు నెంచి,యసురు డెడబాప నెంచె, నయ్యాజి నందుకనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు.
ఆ బకాసురుడును జంపి యందరకునుప్రాణభయమును పోగొట్ట వాతసుతుడునేకచక్రపురంబున లోకులకునుకనుల పండుగ గూర్చె రక్తంపు ఝరులు!!!
(బడ్జెటు - ఎన్నికల వస్తువు)తే.గీ.నీటు బడ్టెటు నీయగ నిర్మలమ్మపెంచె ఖర్చుల ఘాటుగ పేర్మితోడఎర్ర జెండాల రాజ్యాల నెన్నికలలదీది పినరాయి బోతురా దిక్కులేకకనుల పండుగఁ గూర్చ రక్తంపు ఝరులు
రత్న నిభ కణ విలసిత నూత్న నీర సంగ తుంగ విస్ఫారి తాభంగ భంగ భార గోదావరికి రాఁగ వరద లంతఁ గనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు [రత్నము = నవరత్నములలోని ప్రవాళము; రక్తంపు = ఎఱ్ఱని]అన్న బలమ్ము నైపుణము నక్కజమై తనరారె నమ్మరో క్రన్నన దండకా వనినిఁ గార్ముక హస్తుఁడు వీర రాఘవుండున్నెడఁ దొమ్మి దేను వెయి లుండిన రక్కస మూక కత్తరిం గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
వైరి తతులను మార్కొను బలయు తుండు వెన్ను జూపక రణమందు వీరు డగుచు పోరు సల్పెడు తరుణాన పొల్పు గాను కనుల పండుగ గూర్చు రక్తంపు ఝరులు
శ్రీనివాసునిమెడలోని యాణిపూసకనులపండుగగూర్చె,రక్తంపుఝరులుయుద్ధభూమినిప్రవహించె నుద్ధృతముగరామరావణయుద్ధపు సీమయందు
క్రన్నన బాణముల్ విడిచి కన్నఱ గల్గగ జేయ భీష్ముడేభిన్నముగాగ సైన్యములు భీతిని, నిల్ప శిఖండినప్డు తామిన్నక యుండ భీష్ముడని, మేదిని గూల్చెకిరీటి, తాతకున్కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
అన్నువమిన్నరోగనుమయచ్యుతుహారమువెల్గుచుండెనేకన్నులపండువై,తనువుగార్చెరణంబునరక్తధారలన్ మన్నునరామరావణునిమధ్యనజర్గినకారణంబుగాగ్రన్ననరాక్షసాంగనలగాంతులనందఱియేకధాటిగా
పండు మిర్చిని కళ్ళాలనెండ కొరకుపఱచియుంచగ రైతులు ప్రాకటముగకనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులుబోలిన మిరప రాశులు పొలములందు
ప్రత్యుత్తరంతొలగించు"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
పన్నుగ మిత్రులన్ గలిసి పండుగ పూటను సంకురాతిరిన్
చెన్నుగ బోవుచున్ మురిసి చెట్టుల క్రిందను ముత్తుకూరునన్
మిన్నగు కోడినిన్ గొనుచు మీరిన యాశను పందెమాడగా
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్...
తొలగించుఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
1960:
మిన్న విశాఖపట్నమున మేలుగ జేరుచు నద్దెకొంపనున్
చెన్నుగ నద్దెమంచమును చేర్చగ రాత్రిని గోడచెంతనున్
పన్నుగ నల్లులందరము పండుగ జేయుచు కుట్ట శాస్త్రినిన్
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు🙏
తొలగించుఎందుగలడు నీ హరి చూపుమిందుననగ
ప్రత్యుత్తరంతొలగించుసంధ్య వేళ నృసింహుడు స్థంబమునను
జీల్చెను , హిరణ్యు కడుపును జీల్చెను జను
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"స్తంభము నదె చీల్చి దానవుని కడుపు జీల్చెను..." అనండి.
ధన్యవాదములండీ
తొలగించుఎందుగలడు నీ హరి చూపుమిందుననగ
ప్రత్యుత్తరంతొలగించుసంధ్య వేళ నృసింహుడు స్థంబమునను
జీల్చెను , హిరణ్యు కడుపును జీల్చెను జను
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఎందుగలడు నీ హరి చూపుమిందుననగ
ప్రత్యుత్తరంతొలగించుసంధ్య వేళ నృసింహుడు స్థంబమునను
జీల్చెను , హిరణ్యు కడుపును జీల్చెను జను
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
భాగ్య నగరున బోనాల పండుగదియె
ప్రత్యుత్తరంతొలగించుకనుల పండుగఁ గూర్చె, రక్తంపు ఝరులు
పార కుండగ సర్కారు బలుల నచట
యాపి వేయుచు నిచ్చిరే యాజ్ఞలిపుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువీరుడనిలోనభీముండువేగదుమికి
ప్రత్యుత్తరంతొలగించుపత్నిద్రౌపదిపంతంబుభావమరసి
చీల్చెగుండెనుశాత్రవుఁజేరివడిగ
కనులపండుగఁగూర్చెరక్తంపుఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఉన్నత ధర్మ శాస్త్ర సమయోచిత ధీరపరాక్రముండు వి
ప్రత్యుత్తరంతొలగించుద్వన్నుత నీతిశాలి ప్రవిదారణభీకర జిత్వరుండు సం
పన్న శరాస్త్రశోభితుఁడు పార్థు శరాహతిఁ సైంధవుండు తాఁ
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
ప్రవిదారణము = యుద్ధము
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుమాత పితరుల కింటిలో మసలు నట్టి
ప్రత్యుత్తరంతొలగించుచిన్ని పాపల నవ్వులు చేష్ట లెల్ల
కనుల పండుగ గూర్చు, : రక్తంపు ఝరులు
కలుగ జేయున సహ్యంబు కల్ల గాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకాలు దువ్వగ నేలనొ కయ్యమునకు
ప్రత్యుత్తరంతొలగించునిలువ లేకున్న శరములనెక్కుబెట్ట
వైరి సేనల దునిమిన వీరులకును
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఎన్నడు గాంచలేదని సుహృత్తులు కోరగ వారితో సహా
ప్రత్యుత్తరంతొలగించుమిన్నగ నజ్జువాలముల మేడెము జర్గెడి యాంధ్రకేగితిన్
సన్నిహితుండ్రతో, కొమర సామిరథమ్ముల పోరుగాంచగా
కన్నుల పండువై, తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతేటగీతి
ప్రత్యుత్తరంతొలగించుతోయలి వలువలూడ్చిన దుస్ససేను
ఱొమ్ము రుధిరమ్ము రణమున గ్రోలెదనని
వాయుసుతుఁడు కురుక్షేత్ర భరణిఁ జెలఁగ
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
ఉత్పలమాల
అన్నుల మిన్న ద్రౌపదిని నందరిముందర వల్వలూడ్చఁగన్
గ్రన్నన దుస్ససేను రుధిరమ్మును త్రాగెడు బాస చేసి తా
నన్న విధంబుగా ననిని నందుచు భీముఁడు ఱొమ్ముఁ జీల్చఁగన్
గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించు🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుచెన్నగు కాలమిద్దియని చేరుచునందరు పల్లెపట్టులన్
ప్రత్యుత్తరంతొలగించుఎన్నికజేసి స్పర్ధకని నేపుగబెంచిన కోడిపుంజులన్
పన్నుగ పందెమొడ్డుచును పండుగపూటను కత్తిగట్టగా
కన్నులపండుగై తనువుగార్చె రణంబున రక్తధారలన్
సవరించిన పూరణ 🙏🙏🙏
తొలగించుచెన్నగు కాలమిద్దియని చేరుచునందరు పల్లెపట్టులం
దెన్నికజేసి స్పర్ధకని యేపుగబెంచిన కోడిపుంజులన్
పన్నుగ పందెమొడ్డుచును పండుగపూటను కత్తిగట్టగా
కన్నులపండుగై తనువుగార్చె రణంబున రక్తధారలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుకక్షగట్టిన భీముడు కదన మందు
ప్రత్యుత్తరంతొలగించుదుస్ససేనుని దునుమాడ తోషమంది
ద్రుపద కురులను ముడవగ రోషమరయ
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
ప్రత్యుత్తరంతొలగించుభూజ నరయగ జేసిన పోరు నందు
రామచంద్రుని శరములు రయము తోడ
రావణు నుదర మందున తావుగొనగ
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుఉ:
తొలగించుఎన్నిక లందు నిల్చి కటు వెంచిన జిత్తుల వమ్ము చేయుచున్
దన్ను గడింప వైరి జన తావుల దూరుచు బుజ్జగించుచున్
మిన్నగ ఖర్చు జేయ బహు మెప్పుగ నెంపిక వెల్లడించగన్
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములు
తొలగించుతిన్ననగు కామ దహనపు దినమునందు
ప్రత్యుత్తరంతొలగించుపూని రెల్లరును గులాలు బూసుకొనగ ,
రంగులపొడి నేత్రముల దొరగె బుడతడి
కనుల , పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
ప్రత్యుత్తరంతొలగించుచెన్నుగ సీత నాదుకొన శ్రీరఘురాముడు దీక్ష బూనుచు
న్నున్నత శౌర్య బింకముల నూగుచు రావణు కుక్షినందునన్
తిన్నగ నంబకమ్ములను తీవ్రముగా నెలకొల్పినంతటన్
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసమస్య :
ప్రత్యుత్తరంతొలగించుకన్నుల పండువై తనువు
గార్చె రణంబున రక్తధారలన్
( నరునికి నారాయణునికి నడుమ నిలబడి భీష్ముని పాటును పరికిస్తున్న శిఖండికి ఒకేసారి ఆ గాంగేయుని స్థైర్యానికి ఆశ్చర్యం - కోరిక తీరినందుకు ఆనందం . )
ఉత్పలమాల
....................
వెన్నుని వెన్క నిల్వబడి
వీరుడు పార్థుని బాణవర్షమే
మిన్నగ గుర్యుచుండగను
మిన్నక నుండిన భీష్ముదేహమే
సన్నని చిల్లులై యెదయె
ఝల్లన గాంచెడి యా శిఖండికిన్
గన్నుల పండువై ; తనువు
గార్చె రణంబున రక్తధారలన్ !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుకుటిలముగ రణమున నలుగురు గలిసి హ
ప్రత్యుత్తరంతొలగించుతంబు జేయగ, దయ లేక, దారుణముగ,
ఉబికె కన్నీరు జనులకు, ఉత్తరకిల
కనుల పండుగఁ, గూర్చె రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'ఉత్తరకు కనుల పండుగ'?
గ్రామ వృద్ధియు నొకచోట గాంచి జూడ
ప్రత్యుత్తరంతొలగించుకనుల పండుగ గూర్చు, రక్తంపు ఝరులు
పార నొకచోట పంతాలు పట్టి యుండ
మనుజులందరు మంచిగ మసల రేమి ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
ప్రత్యుత్తరంతొలగించునిన్న బడ్జెట్టు వేళ సీతారామన్ గారి సేల పసను :)
ఎరుపు రంగు చిహ్నంబాయె నే ప్రగతికి
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
గల పసను పారు సేలయు, ఖచ్చితముగ
దేశ మింక సాగును ముందు తీయబోడి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపన్నిన పద్మ యుక్తినను పార్ధుని పుత్రుడు వైరి సేనలన్
ప్రత్యుత్తరంతొలగించుఛిన్నము సేయ మేఘములు చేసెను నాట్యము, దేవతాళికిన్
కన్నుల పండువై ; తనువు గార్చె రణంబున రక్తధారలన్
ఎన్నడు నీతినొల్లమను ఏలిక తొత్తులు చుట్టుముట్టగన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములండీ
తొలగించుపన్నులపైనపన్నులు సభాస్థలి మన్యపు వీరులందరున్
ప్రత్యుత్తరంతొలగించుదిన్నగ కాకతీయనృపతిన్ జని పన్నులు గట్టలేరు నా
పన్నుల రక్షసేయుమన భండన మేశరణంబునయ్యెగా
*“కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్”*
సమ్మక్క సారలమ్మల రక్తంతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమన్నన సేయడయ్యె హనుమంతు హితోక్తులు భార్య మాటలన్
ప్రత్యుత్తరంతొలగించుమిన్నగుతాతవాక్కులనుమేలునొసంగెవిభీషణోక్తులన్
గ్రన్ననవీడుసీతననకాతరుడయ్యుదశాననుండునా
పన్నులుయక్షరాక్షసదివౌకసచారణసిద్ధకోటికిన్
*“గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుస్వేఛ్చనిచ్చి నాంగ్లేయుల వెన్నుసఱచి
ప్రత్యుత్తరంతొలగించుకనుల పండుగఁ గూర్చె, రక్తంపు ఝరులు
పార నీయక దెచ్చిన వారి నెల్ల
భారతీయులు నర్పించె వందనాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'స్వేచ్ఛ నిచ్చి యాంగ్లేయులు... భారతీయు లర్పించిరి వందనాలు' అనండి.
వెన్నును జూపరైరి అరి వీర భయంకర యుద్ధమందు నా
ప్రత్యుత్తరంతొలగించుపన్నుల గాచనెంచి తమ భద్రత నించుక లెక్కసేయకే
మన్నన బొందరేల, యిక మాన్యులె వైరుల ద్రుంచువారలై
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅన్న యనుజ్ఞ లేక నడగారితి నాగితి నిన్ని నాళ్ళుగా
ప్రత్యుత్తరంతొలగించుమన్నున గూల్చినాడ గను మత్సరినా కురు రేని ద్రౌపదీ
నిన్ను పరాభవించె గద నేడిటు జూడుము వాని దుర్గతిన్
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురామున కిరుగడల సీత, లక్ష్మణుండు
ప్రత్యుత్తరంతొలగించుమెలగు చుందురు కద కూర్మి మేలు నెంచి,
యసురు డెడబాప నెంచె, నయ్యాజి నందు
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆ బకాసురుడును జంపి యందరకును
ప్రత్యుత్తరంతొలగించుప్రాణభయమును పోగొట్ట వాతసుతుడు
నేకచక్రపురంబున లోకులకును
కనుల పండుగ గూర్చె రక్తంపు ఝరులు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు(బడ్జెటు - ఎన్నికల వస్తువు)
ప్రత్యుత్తరంతొలగించుతే.గీ.
నీటు బడ్టెటు నీయగ నిర్మలమ్మ
పెంచె ఖర్చుల ఘాటుగ పేర్మితోడ
ఎర్ర జెండాల రాజ్యాల నెన్నికలల
దీది పినరాయి బోతురా దిక్కులేక
కనుల పండుగఁ గూర్చ రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురత్న నిభ కణ విలసిత నూత్న నీర
ప్రత్యుత్తరంతొలగించుసంగ తుంగ విస్ఫారి తాభంగ భంగ
భార గోదావరికి రాఁగ వరద లంతఁ
గనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
[రత్నము = నవరత్నములలోని ప్రవాళము; రక్తంపు = ఎఱ్ఱని]
అన్న బలమ్ము నైపుణము నక్కజమై తనరారె నమ్మరో
క్రన్నన దండకా వనినిఁ గార్ముక హస్తుఁడు వీర రాఘవుం
డున్నెడఁ దొమ్మి దేను వెయి లుండిన రక్కస మూక కత్తరిం
గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించువైరి తతులను మార్కొను బలయు తుండు
ప్రత్యుత్తరంతొలగించువెన్ను జూపక రణమందు వీరు డగుచు
పోరు సల్పెడు తరుణాన పొల్పు గాను
కనుల పండుగ గూర్చు రక్తంపు ఝరులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుశ్రీనివాసునిమెడలోని యాణిపూస
తొలగించుకనులపండుగగూర్చె,రక్తంపుఝరులు
యుద్ధభూమినిప్రవహించె నుద్ధృతముగ
రామరావణయుద్ధపు సీమయందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రన్నన బాణముల్ విడిచి కన్నఱ గల్గగ జేయ భీష్ముడే
ప్రత్యుత్తరంతొలగించుభిన్నముగాగ సైన్యములు భీతిని, నిల్ప శిఖండినప్డు తా
మిన్నక యుండ భీష్ముడని, మేదిని గూల్చెకిరీటి, తాతకున్
కన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅన్నువమిన్నరోగనుమయచ్యుతుహారమువెల్గుచుండెనే
ప్రత్యుత్తరంతొలగించుకన్నులపండువై,తనువుగార్చెరణంబునరక్తధారలన్
మన్నునరామరావణునిమధ్యనజర్గినకారణంబుగా
గ్రన్ననరాక్షసాంగనలగాంతులనందఱియేకధాటిగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపండు మిర్చిని కళ్ళాలనెండ కొరకు
ప్రత్యుత్తరంతొలగించుపఱచియుంచగ రైతులు ప్రాకటముగ
కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
బోలిన మిరప రాశులు పొలములందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు