21, ఫిబ్రవరి 2021, ఆదివారం

సమస్య - 3642

 22-2-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్”
(లేదా...)
“దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ”

55 కామెంట్‌లు:

 1. అరిగావిష్ణునిఁదలచుచు
  కరివరదునిమనసునందుకాంచగలేకన్
  కరమునురాక్షసమాయను
  దురితములోనరించిపోందుదురుమోక్షమ్మున్

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  పరువుల్ దీసి కరోన వైరసును భల్ భద్రమ్ముగన్ తోలుచున్
  దరువుల్ గొట్టుచు హైద్రబాదు నగరిన్ తాళమ్ములన్ తోడుతన్
  సరియౌ రీతిని శత్రు వర్గములనున్ చంపంగనున్ కోరుచున్
  దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ...

  రిప్లయితొలగించండి
 3. కందం
  గరళమ్ముఁ ద్రాపి పూతన
  పరునిగ హరినిందల శిశు పాలుండందెన్
  పరమాత్మ స్పర్శఁ బాపులు
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్

  మత్తేభవిక్రీడితము
  వర మౌనుల్ హరి ద్వార పాలకుల శాపగ్రస్తులన్ జేయఁగన్
  దరుణో పాయమటంచు రాక్షసులుగన్ దామోదరున్ వైరులై
  త్వరితంబౌగతిఁ జేరనొప్ప పరమాత్మాదేశమంచెంచుచున్
  దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ

  రిప్లయితొలగించండి


 4. పరిపరి విధముల నష్టము
  దురితము లొనరించి పొందుదురు! మోక్షమ్మున్
  కరివరదుని సేవింపగ
  నరులు భువిని పొందెదరు వినవె ప్రాణసఖీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆహా! విరుపుతో ఎంత చక్కని పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 5. హరునికి మణులను పెట్టెను

  శిరమున్కాళము , మురిసెను , ఛీ యని త్రోసె

  న్కరి చిమ్ముచు తొండమ్మున్

  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  ( శ్రీ కాళ హస్తి క్షేత్ర మహాత్యము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శిరమున్' అన్న పదానికి అన్వయం ?

   తొలగించండి
 6. కరి వరదుని యెదురించియు
  సురవరు శాపమ్ము బొంది చోద్యము గాగన్
  తిరముగ విమోచన ము కై
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్ము న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...వరదుని నెదురించియు.. విమోచనమునకు..." అనండి.

   తొలగించండి
 7. హరి సేవకులే, నిరతము
  హరిని తలచు, శాప గ్రస్త అసురులు వీరున్
  హరి దాస జయ విజయు వలె
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...హరిఁ దలతురు.. గ్రస్తు లసురులు.. హరిదాసులు జయవిజయులు..." అనండి.

   తొలగించండి
 8. హరి భక్తులె,శాపవశులు
  హరి దాస జయ విజయు వలె అసురులు వీరున్
  హరితో కయ్యమె తోవగ
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్


  రిప్లయితొలగించండి
 9. హరినామస్మరణమ్మే
  పరమపదమునిచ్చు నంచు వచియించిరి స
  ర్వరసులు గద మరి యెవ్విధి
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్.

  రిప్లయితొలగించండి
 10. హరినామంబును వీడకుండ ననునిత్యంబా చతుర్బాహువున్
  నిరతమ్మర్చన జేయువారకిలలో నిర్వృత్తియే లభ్యమౌ
  మరినీవా నుడులేలపల్కితివిరా మందుండ యేరీతిగా
  దురితంబుల్ బొనరించి మొక్షమును దోడ్తోబొందుటే యుక్తమౌ ?

  రిప్లయితొలగించండి
 11. హరికిని సమమే యందరు
  మరువక పూజించి సతము మాన్యులు గొనగా
  అరిగా నెంచి స్మరించుచు
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మదనపల్లె వారి అకృత్యములు

   అరరే!క్షుద్రపు పూజలంగొనుచు దామఙ్ఞాన మగ్నత్వమున్
   పరివారమ్మును జంపిరే! తలచగా పాషండులై వేడుకన్
   స్థిరమౌబుద్ధిని నమ్ముచున్ దమదు సంక్షేమంపు మార్గంబుగా
   దురితమ్ముల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే
   యుక్తమౌ

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. మరు జన్మనొందెదరు గద
  దురితము లొనరించి ; పొందుదురు మోక్షమ్మున్
  పరులకు జేసెడి సేవయె
  పరమాత్మకు జేరుననుచు బసరిలి సలుపన్

  పసరిలు = ఆలోచించు

  రిప్లయితొలగించండి
 13. కరములు జోడించి యడుగ
  వరముల, వరదుని హితమగు ప్రార్థనచేతన్
  నరకులు బెట్టుచు నిడుముల
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్!!

  ***నరకులు=రాక్షసులు.

  రిప్లయితొలగించండి
 14. మ:

  సరిరా రెవ్వరు లోకమున్ జతనుపూజల్ సేయ దుర్గాంబకున్
  త్వరగా కూర్చుము మంత్రవిద్యలనుచున్ తాదాత్మ్యమున్ బొందగన్
  మరలన్నించుచు దుష్టశక్తులట యేమార్చంగ సద్భక్తులన్
  దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. కరినా నక్రము, రావణుండు భువి కాంతన్, కాంచనాక్షుండు శ్రీ
  ధరణిన్, క్రూరుడు దంతవక్త్రుడును, దక్షుండున్, నిశుంభాదులున్
  సరళత్వంబున నీశు దివ్యపద సాన్నిధ్యంబు నొందంగ నా
  దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ

  రిప్లయితొలగించండి
 16. నరకంబున బడుదురు గద
  దురితము లొనరించి; పొందుదురు మోక్షమ్మున్
  నిరతము పరమాత్ముని శుభ
  చరణములను నమ్మి గొలుచు సన్మతులెపుడున్

  రిప్లయితొలగించండి
 17. పరమును పొందగ జాలరు
  దురితము లొనరించి; పొందుదురు మోక్షమ్మున్
  వరముగ సమ్మోదముతో
  కరముల సలుపదగు పుణ్య కర్మల చేతన్

  రిప్లయితొలగించండి
 18. సమస్య :
  దురితంబుల్ బొనరించి మోక్షమును దో
  డ్తో బొందుటే యుక్తమౌ

  మత్తేభవిక్రీడితము
  ...........................

  ( శిశుపాల వధ )

  హరిపై నిందలు వైచి నిండుసభ లో
  నార్భాటమున్ జేసెనే !
  యురమున్ బొంగగజేసి చైద్యు డటుపై
  నోండ్రింత గావించెనే !
  చరలాటల్ గొన గంఠమున్ జిదిమెగా
  జక్రాయుధుం డంతటన్ ;
  దురితంబుల్ బొనరించి మోక్షమును దో
  డ్తో బొందుటే యుక్తమౌ .

  ( చైద్యుడు - చేదిరాజ్యాధిపతి శిశుపాలుడు; ఓండ్రింత -గాడిద అరపు; చరలాటలు - క్రీడలు )

  రిప్లయితొలగించండి
 19. హరి భృత్యులు జయవిజయులు
  శరణని శ్రీహరిని వేడ శాపవిముక్తిన్
  హరిదెలిపెను రక్కసులై
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు
  1. మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. శంకరయ్యగారూ క్షమించండీ
   యతి గతి తప్పినది
   సవరతో   పరమార్థప్రదమాధవాంఘ్రియుగళీవ్యాసంగచిత్తమ్ము దు
   స్తరసంసారభయంకరాబ్ధితరణాసక్తాప్తినిర్మోహముల్
   కరుణార్ద్రత్వము ముక్తియోగ్యమగుచొ యే కాలమ్ము నెవ్వారికై
   దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే? యుక్తమౌ.

   శ్రీ రామారావు కవులకు
   కృతజ్ఞతలు

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 21. హరితోస్నేహమునర్చనాదులునుదివ్యానందవైభోగముల్
  హరితోడ్నీడనియెంచుభృత్యులనుబాలాకారశాపాగ్నియే
  ధరకున్జేర్చగనేడ్చియేడ్చితుదభవ్యాజ్ఞన్ ద్రిజన్మంబులే
  *దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ”*

  రిప్లయితొలగించండి
 22. గురుభావంబునుగానలేకమదిలోఁగూర్మింతలేకన్కడున్
  విరసంబాయెగబ్రహ్మవంశమునుభావింపన్నిధిన్ఁగూడుచో
  తరుమన్మానససంచలన్మధురభక్తావేశముల్శైవమై
  దురితంబుల్బోనరించిమోక్షమున్దోడ్తోబోందుటేయుక్తమౌ

  రిప్లయితొలగించండి
 23. గురుతర దుఃఖస్వాంతు ల
  యి రమానాథుని నుతించి యిఁకఁ జేయంగా
  నరు లిలఁ బ్రాయశ్చిత్తము
  దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్


  హరినిం దల్చి విరోధ భావమున నత్యాశ్చర్య రీతిన్ దివిన్
  హరినే జేరఁగ వేగ వర్తిలిరి వారబ్భంగి ముప్పుట్టులన్
  హరి సౌధమ్మున ద్వార పాలకులె శాపార్తిన్ హృదిం దల్చిరే
  దురితంబుల్ వొనరించి మోక్షమును దోడ్తోఁ బొందుటే యుక్తమౌ

  రిప్లయితొలగించండి
 24. వరమో శాపమొ పొందినాము ధరపై భామా!శరీరమ్ములన్
  పరమానందము పొందు భంగిమల శ్రీ వాత్స్యాయునుద్భోదలన్
  శరవేగమ్మున నాచరించి జతగా స్వరగమ్ము పాలింపగా
  *దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 25. హరినీ నామము పాడుచున్ కనుల నీ యందంబులన్ గ్రోలుచున్
  సిరితో దర్శన భాగ్య మిమ్మనుచు నా చిత్తమ్ము నర్పించుచున్
  కరి యర్థించిన రీతి కావుమని వే ఖండింపగా వేడి నా
  *దురితంబుల్ ,బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 26. హరికిని శత్రువులగుదురు
  దురిత ము మొనరించి;పొందుదురు మోక్షమ్మున్
  ధరలో సుజనావళియును
  నిరతము మదిలో తలచుచు నియతిగ శ్రీశున్

  రిప్లయితొలగించండి
 27. పదవులు దప్పు స్థానములు పందిరిమంచము పాడె చందమౌ
  పెదవులు వెక్కిరించు నిను ప్రేమ హుళక్కి గణింప,మానుమా
  *ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొ!ప్పగున్*
  వదలక రామనామ సుధ పానము జేయుము సారెసారెకున్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష


  *వదలక రామపాదముల ప్రస్తుతి జేయుము సారెసారెకున్*

  పదముల పోహళింపు నుత పద్యవిలాస వినూత్న ఛందముల్
  ముదితల ముద్దుమోములన ముగ్ధమనోహర కావ్యకన్యకల్
  నిధులన తెల్గువాణి హృదినిండుచు పర్వెను మోహనాంగులై
  *ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొ!ప్పగున్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 28. హరికిన్ మ్రొక్కుచు భక్తితో సతత మాహ్లాదమ్ముతో, నిచ్చతో
  ధరణిన్ బాధల పొందు వారియెడన్ దాక్షిణ్యమున్ జూపుచున్
  స్థిర చిత్తమ్మున నున్నచో ముగితి సంసిద్ధించు, నేరీతిగా
  దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ

  రిప్లయితొలగించండి