5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

సమస్య - 3626

6-2-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును”
(లేదా...)
“పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్”

48 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    విద్యల నొల్లకే నగుచు వేషము లేయుచు విఱ్ఱవీగుచున్
    సద్యశమంద గోరుచును శంకర దేవుని చెంతజేరుచున్
    హృద్యము గాని భావముల హేళన రీతిని శాస్త్రివర్యుడా!
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్...

    ఓకే అలాగే సార్!

    రిప్లయితొలగించండి
  2. సహజమైనట్టిపదములసందడేది
    సోద్యమయ్యెనుయతిజంటసోకుఁజూడ
    గణములన్నియురణమునగంతులేయు
    పద్యమునువ్రాయఁబూనుటపాపమగును

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నెఱిని గూడని క్రమమున నింపు గాని
    నీతిమాలిన పదముల నెంచుకొనుచు
    సంఘ వృద్ధి నడచు భావజాలము గల
    పద్యమును వ్రాయబూనుట పాపమగును.

    రిప్లయితొలగించండి
  4. ఆంగ్లమాశించి పొగడుట ఆధునికము
    తీపి తెన్గున మాటలు తేలికాయె
    భాష మరచిన మనుజుల భారమెంచ
    పద్యమును వ్రాయఁబూనుటపాపమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏 సవరించి

      తే.గీ.
      ఆంగ్లమాశించు మనుగడ ఆధునికము
      తీపి తెన్గున పలుకుట తేలికాయె
      భాష మరచిన మనుజుల భారమెంచ
      పద్యమును వ్రాయఁబూనుటపాపమగును

      తొలగించండి
  5. పద్యము వ్రాయువారు యతి ప్రాస గణంబులు వాక్కు నర్థముల్
    సద్యశ మంద గూర్చుచును శారద సన్నుతి జేయు టొప్పగున్
    మద్యము గ్రోలి నాస్తికుల మార్గములోజని దేశనాశమై
    *“పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్”*

    రిప్లయితొలగించండి
  6. విద్యను నేర్వగా వలెను, విస్తృత
    భావ సుగంధ సంపదన్
    హృద్యత నింపుచున్ రచన
    లీనెడి శక్తిని పొందగా వలెన్,
    అద్యతనానుకూల పథ
    యానము నూనుచు, నట్లు గానిచో-
    పద్యము వ్రాయఁ బూనుటయె
    పాపము, ద్రోహము, మానుకొమ్మికన్!

    రిప్లయితొలగించండి
  7. గాడిదయని తిట్టిన చక్కగను తెలియును

    ఓరి గార్ధభా, రాసభా, ఖరమ యనుచు

    పాండితిన్ కనబరచి గర్వమున తిట్టు

    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. వ్యర్థ పదముల కూర్పు ల నర్థ మగుచు
    భావ మే మాత్రము o డక చేవ లేక
    చిత్త ముల తాక నట్టి వౌ చిత్ర మైన
    పద్యమును వ్రాయ బూనుట పాప మగును

    రిప్లయితొలగించండి
  9. పద్యము గద్యమున్ దెనుగు భాషకు ప్రాణ సమంబులండ్రు నై
    వేద్య మొనర్చి రార్యులు భవిష్య తరంబులు నాదరించగా
    గద్యము హృద్యమై ప్రజలు గావ్యుల మెచ్చిరి తద్విరుద్ధమై
    పద్యమువ్రాయబూనుటయెపాపముద్రోహముమానుకొమ్మికన్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    అమ్మదయవల్లఁ దరియించ నబ్బె విద్య
    సద్గురువు జిక్కి వాటాన సాగుచుండె
    నెదను నిన్నుంచి ప్రేమించ సుదతి! యెటుల
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును?

    ఉత్పలమాల
    విద్య గడించి సత్కవుల వేదిక పైనొక వెల్గు వెల్గ మీ
    సద్యశ దీప్తులన్ దనరు సాధ్విగ నన్యులు నన్నుమింతురే?
    వద్యగ నొప్పితే వినుడు బాధ్యతలన్నవి విస్మరించుచున్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్

    రిప్లయితొలగించండి
  11. సమస్య :
    పద్యము వ్రాయ బూనుటయె
    పాపము ద్రోహము మానుకొమ్మికన్

    ( నన్నపార్యుడు అందించిన రమ్యమైన పద్యాన్ని అయోగ్యులకోసం రచింపరాదు)

    ఉత్పలమాల
    .....................

    గద్యము కన్న మిన్న కద
    గణ్యుడ! కాంచనపద్మ మట్టులన్
    హృద్యము నైన యాదికవి
    కృత్యము ఛందము ; శారదాంబ నై
    వేద్యము ; బుద్ధిమాంద్యుడును
    భీరుడు లుబ్ధుడు డంబవాక్కుకై
    పద్యము వ్రాయ బూనుటయె
    పాపము ద్రోహము మానుకొమ్మికన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కనిహితవుపలికినారుమనోహరమైనపూరణ, ప్రణామములుగురువుగారు

      తొలగించండి
  12. దేవదేవుని వొగడని తెల్వి తోడ
    గ్రంథములు వేలు లక్షల వ్రాయనేల?
    నీతి నియమము లేనట్టి నేర్పుతోడ
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును.

    రిప్లయితొలగించండి
  13. వ్రాసి నయసత్య భరితమౌ వచనములను
    జనుల కుయహితము సలుపు జాగు లేక
    అట్టి దుష్ప్రచారముచేయు యల్ప బుద్ధి
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్రాసి నయసత్య భరితమౌ వాక్యములను
      జనుల కుయహితము కలుగు జగతి లోన
      అట్టి దుష్ప్రచారముచేయు యల్ప బుద్ధి
      పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును -- 2va paadamulo chinna savarana

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చోద్యమునైన పద్ధతిని సుంతయు నీతుల నెంచకుండగన్
    హృద్యముగాని వాక్యముల నెల్లను జేర్చి సమాజ వృద్ధినిన్
    ఛేద్యమొనర్చు బల్కులు విశేషముగా నెనయించి జూపుచున్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్!

    రిప్లయితొలగించండి
  15. గద్యపుగాలివాననిటగాడిదకూతలమేళవింపులో
    అద్యతనాంధ్రదేశముననాగెనుపద్యపుశోభయాత్రయే
    విద్యలవేషగాండ్రుతమవింతలపోకడచూపుచుండగా
    పద్యమువ్రాయబూనుటయెపాపముద్రోహముమానుకోమ్మికన్

    రిప్లయితొలగించండి
  16. కె.వి.యస్. లక్ష్మి:

    గురువుగారికి నమస్కారములు. దయతో మొన్నటి నిన్నటి పూరణలను గూడా పరిశీలించగలరు.

    మొన్నటి పూరణ:

    ఎన్నికలు బూటకమ్మయ్యె నేమి వింత?
    ఏకగ్రీవమ్మె మేలని యేలికనియె
    సగటు ఓటరు మనమున సెగలు రేగె
    జలము బోసిన నడగదు జ్వాల సుంత.

    నిన్నటి పూరణ:

    పదవు లెక్కగ ప్రతినలు పలికె నెన్నొ
    ఓటు లచ్చుగ పొందెను నోటు కపుడు
    గద్దెనెక్కి గతమువీడగా నిరసన
    మాలవేసిదూషించిరమాత్యుబ్రజలు.

    నేటి పూరణ:

    నీతి పెంచెడి పలుకుల నెంచు చుండి
    మంచి రచనల జేయగ మించు మెపుడు
    చేటు మాటల జనులను చెఱచు నట్టి
    పద్యమును వ్రాయ బూనుట పాపమగును.


    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన ఆనాటి దాశరథి వంటి మేధావుల నుద్దేశించి రాజభటుల మాటగా

      విద్యల నేర్చినీవు తగు ప్రేరణనీయగ ధిక్కరించుచు
      న్నుద్యమకారులైన ప్రజలుద్ధత బాల్పడ ధ్వంసకాండకున్
      వధ్యము నీదు వ్రాతలవి వంచనతోడివి రెచ్చగొట్టెడిన్
      పద్యము వ్రాయబూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్

      తొలగించండి
  18. ౧.
    విద్యల నెల్లనేర్చియును విత్తము నందుట పూరుషాళికిన్
    వద్య సుశోభితమ్ము కడు పాపము కాదన లేనిదంచుచున్
    గద్యము నైన వ్రాయగను గానము సేయగ నేరకుండెనే
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్!!

    ౨.
    విద్య నిగూఢ విత్తమని పెద్దగ మాటల పల్కువారలే
    చోద్యమదేమొ తెల్యకను చూడవిచిత్రమె నప్పుడప్పుడున్
    మద్యముత్రాగువారలగు మాన్యత నొందగనెంచుచున్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్!!

    రిప్లయితొలగించండి
  19. ఉ:

    మద్యము గ్రోలి మాటలను మత్తుగ బల్కుచు తథ్యమంచనన్
    సద్యము కూడదన్న మరి సత్తువ మీరగ వాదులాడుచున్
    విద్యను నేర్చినాడనని బీరము పల్కెడి మానవోత్తమా
    పద్యము వ్రాయ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  20. పద్యము వ్రాయ బూనుటన పావనమౌ విధిగా దలంచుచున్
    హృద్యములైన భావనల హృద్గతమౌ గతి గూర్చగావలెన్;
    మద్యపు మత్తులో మునిగి మానవిహీనములైన రీతులన్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్

    రిప్లయితొలగించండి
  21. సేద్యము జేసి ప్రాజ్ఞయను చేలనుఁ వ్రాసిన పద్యవృత్తముల్
    మద్యపు మత్తునిచ్చు, కడు మాన్యత పూర్వపు జన్మపుణ్యమే
    పద్యము వ్రాయఁ బూనుటయె, పాపము ద్రోహము మానుకొమ్మికన్
    మద్యము చేత బట్టి మతిమాంద్యపు పద్యము ప్రాసలల్లుటన్౹౹

    రిప్లయితొలగించండి


  22. బ్లాగు రాయుళ్ల తలపుల పడతి వినవె
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును
    విడువవే నీదు యత్నము విదుల బాట
    యిది జిలేబి నీకు సరిపోదిది విడువవె!


    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి


  23. ప్రముఖుల మాట! తగదిది! స్ఫు
    టము! పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రో
    హము మానుకొమ్మికన్ పడ
    తి! మా విదుల మార్గము తగదిది నీకు సుమా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. పద్యమును వ్రాయగలిగిన హృద్యముగను
    సద్యశంబుసంప్రాప్తించు పద్య కవికి
    మద్యమును గ్రోలి యశ్లీలమైన రీతి
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును

    రిప్లయితొలగించండి
  25. విద్య పసందు లేక సరవిన్ పలు వాక్యము లేవొ
    చెప్పుచున్
    హృద్యము లైన మాటల ననేకము నింపక డాంబికంబునన్
    నింద్యము లైన సంగతుల నేర్పుగ పల్కెడు దొద్ద వారలున్
    పద్యము వ్రాయబూనుటయె పాపము దోషము;మానుకొమ్మికన్.

    రిప్లయితొలగించండి
  26. ప్రాస నియమము లేకను పదముకూర్చి
    యతులు సరిగను పేర్చక గతులు తప్పి
    ఇష్టముగను పాదాలతో స్వేఛ్ఛగాను
    పద్యమునువ్రాయఁబూనుటపాపమగును

    రిప్లయితొలగించండి
  27. సత్యమును కొంత తెలిపి, యసత్యవార్త
    లను ప్రజలకు నేర్పుగ చేర్చు, రంగు కలిపి
    అట్టి దుష్ప్రచారముచేయు యల్ప బుద్ధి
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును

    రిప్లయితొలగించండి
  28. తే.గీ//
    నోటికొచ్చినటుల వాగి ధీటుగాను
    కవిని నేనే ననుకొనుచు గర్వముగను l
    యతిని గూర్చక ప్రాసయు నతకనట్టి
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును ll

    రిప్లయితొలగించండి
  29. వాద్యము లేని గీతములు , వాసనజూపని పుష్ప మాలికల్,

    ఆద్యుల పూజ సేయనను కౌరవ శ్రేష్ఠులు , మెప్పు పొందరే

    మిధ్యగు ఛంద రీతులను మేలని భాషను లెక్కసేయకన్

    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  30. ఆద్యులు, కాళిదాసు వలె నద్భుత రీతిగ రాకపోయినన్
    పద్యము లెప్పుడైన నిరవద్యము గాకయె, దీప్తిరుచ్యమై,
    చోద్యము లైవెలుంగక, కుచోద్యము గూడెడి భావయుక్తమౌ
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్.

    కుచోద్యము-అపహాస్యము, పక్షపాతము, అసూయ

    చోద్యము-ఆశ్చర్యము

    నిరవద్యము-ఆక్షేపణ లేనిది

    రిప్లయితొలగించండి
  31. పద్యములన్న భారతి కృపాఫలమంచు వచించి రందురే
    యాద్యులు పూర్వమెప్పుడొ, మహాద్భుతమౌ క్రియతోడ శ్రీకి నై
    వేద్యమొసంగుటే కదర, విశ్వ ప్రదీపిత కార్యమెవ్విధిన్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము? మానుకొమ్మికన్

    రిప్లయితొలగించండి
  32. దేశ ద్రోహులను పొగడు తేటగీతి
    వేటలాడుచు పశువుల యాటవెలది
    గురువునీసడించు లఘువు గురువుతోటి
    పద్యమును వ్రాయ బూనుట పాపమగును

    రిప్లయితొలగించండి
  33. చాలుచాలిక నీదువాచాలత, ఘన
    పండితులగు మీరీరీతి పలుక, నెట్లు
    తెలుగు భాషకు మకుటమై వెలుగు నట్టి
    పద్యమును వ్రాయఁ బూనుట పాప మగును

    రిప్లయితొలగించండి
  34. పద్యపు లక్షణంబెరిగి ప్రాస యతుల్ గమనించి హృద్యమౌ
    పద్యము వ్రాయువాడె కవి పండితులెల్లరు ప్రస్తుతించగన్
    మద్యము గ్రోలి యేహ్యమగు మాటలు పద్యమునందు గూర్చుచున్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్

    రిప్లయితొలగించండి
  35. పద్యకవిత్వమన్ననదిపండితపామరరంజకంబునై
    హృద్యమునై శ్రియంబిడి సహేతుక లక్షణ లక్ష్యగమ్యమై
    సద్యశజ్యోత్స్నలీయవలె సారవిహీననిషిద్ధ హేయపుం
    *“బద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్”*

    చోద్యమిదేమివింతమనసొప్పదుతప్పదునిప్పునుప్పుగా
    విద్యయవిద్యపద్యమదివేద్యముసద్యశకారకంబునౌ
    హృద్యముపద్యమంచుసెలవిచ్చినశంకరులెట్లుబల్కెనో
    *“పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్”*

    రిప్లయితొలగించండి
  36. సేద్యము చేయ నిత్యమును చెన్నుగ కైతల వ్రాయ సాధ్యమౌ
    మద్యము గ్రోలుచున్ సతము మానస మున్ నిలుపంగ లేనిచో
    హృద్యపు భావనల్ గలిగ వెప్డు ప్రశాంతత లేని చిత్తమున్
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్

    రిప్లయితొలగించండి
  37. సద్యము కవివరుల కనవద్య మైన
    గద్య ముండఁగ మన కిట హృద్యముగను
    జోద్యముగ దోష కోటికి నాద్య మైన
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును


    ఆద్య పద ప్రకాంక్షిత నిరర్థక కావ్య రసజ్ఞ మండ లా
    హృద్య యశో౽ర్థ విత్త నిచ యేప్సిత నీచ తరార్థ యుక్త హీ
    నోద్యత శబ్ద శాసన వియోగ ప దాన్విత భావ హీనమౌ
    పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  38. శుభము గలిగించు జగతికి సుకృతిగలుగు
    పద్యమునువ్రాయబూనుట,పాపమగును
    జీవహింసను జేసిన యెవరునైన
    ప్రాణరక్షణజేయగవలయుమనకు

    రిప్లయితొలగించండి
  39. హృద్యముగాకభావమునునేరికినర్ధముగానియట్టుగా
    పద్యమువ్రాయబూనుటయెపాపముద్రోహముమానుకొమ్మికన్
    పద్యమువ్రాయగావలయుప్రాసయుతంబుగ,లక్షణాలతోన్
    చోద్యముగాదెపండితులుసూచనలిచ్చుటనట్లుగానిటన్

    రిప్లయితొలగించండి
  40. విద్య నేర్చిన ఫలమున నుద్యమించె
    భృతియె చాలని ప్రభుతను వేడనెంచె
    బ్రతుక నేర్చిన వాడుగ రౌద్ర మంది
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును!!

    రిప్లయితొలగించండి
  41. సేద్యము సాహితీ వనముఁ జేయ ఫలించు ఫలంబిదే కదా
    విద్యలరాణి వేలుపుల పెద్ద మనోహరి దత్త లబ్ధమీ
    విద్యయటంచు దల్చెదరు, వేల్పుల విజ్ఞత వీడి దూఱుచున్
    బద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్.

    రిప్లయితొలగించండి