13, ఫిబ్రవరి 2021, శనివారం

సమస్య - 3634

14-2-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త”
(లేదా...)
“లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే”

33 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కేకల్ వేయుచు ధర్మ పత్ని మిగులన్ ఘీంకారముల్ చేయుచున్
  నూకల్ కాల్చుచు మూటగట్టి యిడగన్ నోర్మూసి వేగంబుగా
  శ్రీకృష్ణున్ గని ద్వారకా నగరినిన్ చేకూర్చగా నట్కులన్
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే...

  రిప్లయితొలగించండి
 2. భక్తి శ్రధ్ధలతో భవభంధములను
  వీడి,పరమశివునిపూజ నడపువారు
  దురితములు పోయు పరమాత్మ జేర,పుణ్య
  విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త

  రిప్లయితొలగించండి
 3. ధరల బెంచియు వర్తకుల్ ధాత్రి యందు
  మంచి లాభాల నార్జింప నెంచి pచూడ
  విభ వములు పెక్కు దక్కును : బిచ్చ మెత్త
  పూట పూటకు లభ్యమౌ పొట్ట కూడు

  రిప్లయితొలగించండి
 4. గడ్డమున్ బెంచి కాషాయ గుడ్డఁగట్టి
  మందిరమ్మును గట్టెద మాన్యులార
  పైక మొసగుమనుచు గోరు వారలకిల
  విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త

  రిప్లయితొలగించండి
 5. తేటగీతి
  విశ్వనాథుని వలె వీధి వీధి తిరుగు
  సాయి మనయింటి ముంగిట సాదరమున,
  పాపపరిహారమున్ జేయ బ్రతుకునందు
  విభవములు పెక్కు దక్కును, బిచ్చమెత్త

  శార్దూలవిక్రీడితము
  సాకారమ్మయి విశ్వనాథునివలెన్ సాయీశ్వరుండాదటన్
  బ్రాకామ్యమ్ముగ వీధులన్ దిరుగుచున్ రానొప్పమా ముంగిటన్,
  చీకాకుల్ దొలగించి పాపములఁ దాఁజేబట్టు సంవీక్షణన్
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్, బిచ్చమెత్తంగనే

  రిప్లయితొలగించండి
 6. కలనకలతనుబెట్టంగగాండివంబు
  వదలివీరుండువిష్ణునివద్దఁజేరి
  భీరుఁడగుచునుబీదయైబిచ్చమెత్తె
  విభవములుపెక్కుదక్కునుబిచ్చమెత్త

  రిప్లయితొలగించండి
 7. ఐకాగారికుడైన కుచ్ఛితుడు సన్యాసంబునే గ్రోలితిన్
  పైకంబిచ్చిన కట్టెదన్ గుడిని మీ పాపాలికన్ దొల్గి మీ
  రాకైలాసము చేరవచ్చునని యభ్యర్థించె డామోషికిన్
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే.

  రిప్లయితొలగించండి
 8. ధర్మకార్యము లేవైన దలచినపుడు
  అహము నశియించి ఙ్ఞానమే యంకురింప
  పంచ పుణ్యమ్ము జనులకు వంతుగాను
  విభవములు పెక్కుదక్కును బిచ్చమెత్త

  లోకంబందున నున్నజీవులకు మేలున్ గూర్చ దత్తుండు తా
  సాకారంబయె షిర్దిలోన యతిగా సాయాఖ్యుడై ద్వారకన్
  పాకంబించుక గోరుచున్, ప్రజలు సంభారమ్ము
  లర్పింపగన్
  లోకోత్కృష్ట సమస్తసంపదలు గల్గున్, బిచ్చమెత్తంగనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాకారీ ధనదాదిముఖ్యులు దివిన్ బాలించెడిన్
   నైపుణిన్
   సాకారంబగు నంబచే బడయు శ్రీచక్రార్చనల్ సల్పగా
   ఆకామేశ్వరి దీవెనల్ గలుగగా నాత్యంతికంబైనవౌ
   లోకోత్కృష్ట సమస్తసంపదలు గల్గున్, బిచ్చమెత్తంగనే

   తొలగించండి
 9. స్వయముగ దృఢ ప్రయత్నము సలిపి నపుడె
  విభవములు పెక్కు దక్కును ; బిచ్చమెత్త
  యెదుటివారి ఔదార్యమె యేరు పాటు
  జేయు నీదు సౌ భాగ్యపు సీమనెపుడు

  రిప్లయితొలగించండి
 10. సమస్య :
  లోకోత్కృష్టసమస్తసంపదలు గ
  ల్గున్ బిచ్చ మెత్తంగనే

  ( తంబురా మీటుతూ రామసంకీ
  ర్తనతో బిచ్చమెత్తిన త్యాగయ్య మోక్షసామ్రాజ్యాన్నే అందుకున్నాడు )

  శార్దూలవిక్రీడితము
  ............................

  ఊకోజెప్పగ నెంతసేపయిన నే
  నోహో సఖా ! పల్కెదన్ ;
  స్వీకారం బొనరించి చిత్తమున నా
  శ్రీరాము ద్యాగయ్యయే ;
  యేకాంతంబుగ గీర్తనన్ సలిపె నిం
  టింటన్ మహాగానంబుతో ;
  లోకోత్కృష్టసమస్తసంపదలు గ
  ల్గున్ బిచ్చ మెత్తంగనే .

  ( ఊకోజెప్పుట - ఒప్పుకొనునట్లు చెప్పుట )

  రిప్లయితొలగించండి
 11. శా:

  లోకంబెంచిన తెన్ను నేటికిదె యాలోకించ నీ ప్రక్రియన్
  సాకల్యంమగుటెంచి సాకతము పంచం జేరరే వాణినున్
  సాకారంబగు దీక్ష బాసరగ విశ్వాసంబు పెంపొందగన్
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చ మెత్తంగనే

  సాకతము =అనుగ్రహము

  ఆదిలాబాదు జిల్లాలోని బాసర సరస్వతి క్షేత్రములో మధుకర వృత్తి ఒక ముఖ్యమైన సంప్రదాయము.సరస్వతి అనుగ్రహము కోరేవారు బాసర గ్రామంలో భిక్ష స్వీకరించి , సరస్వతీ దేవికి నమస్కరించి ఆభిక్షను భుజిస్తారు.
  దివంగత ప్రధాని శ్రీ పి.వి. గారు ఈ పద్ధతిని పాటించారని ప్రతీతి.

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 12. విష్ణుడు మనకు నిచ్చిన విధి విధముగ
  విభవములు పెక్కు దక్కును, బిచ్చమెత్త
  నక్కరయులేక,విభవము నందకృష్ణు
  లీలె సంశయము వలదు లేశ మైన

  రిప్లయితొలగించండి
 13. వాకుల్ తల్లిఁ స్తుతించి వేడుకొనఁ సత్త్వజ్ఞాన మందున్ గదా
  కోకొల్లల్లిడు సంపదల్ సిరులనే కోరంగ శ్రీలక్ష్మినిన్
  హే కాత్యాయని కావుమా యనుడు దేహీ ధైర్య స్థైర్యంబుకై
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే౹౹

  రిప్లయితొలగించండి


 14. విను జిలేబి భిక్షమడుగ విభుని నీకు
  విభవములు పెక్కు దక్కును; బిచ్చమెత్త
  సాటి మనుజుల దక్కును చల్ల క్రింద
  ముంత యేను వినవె బాల మూఢురాల!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. అర్ధియందురు తిరుపడుయందురయ్య

  జోగియందురయ తిరిప జోగి యనును

  బిచ్చగాని నామపు చిట్ట పెద్దదయ్య

  విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి


 16. మాకందంబుగ నీరజాక్షి, "పరమాత్మా! నీవె మార్గంబనన్"
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్; బిచ్చమెత్తంగనే
  స్వీకారమ్ముగ నీ జనాళిని చెలీ క్షీణించు భాగ్యమ్ములే
  సాకారంబగు! నిత్యసత్యమిదియే సంత్రాణుడా క్షేత్రియే!  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతింప చిద్రూపియే
  చీకాకుల్ దొలగించ వేడుకొన దా శీఘ్రంబునన్బ్రోవు నా
  కాకుత్స్థున్ గుడిగట్టనెంచి యడుగన్ గాదేమి దోషంబిలన్
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కుచేలునితో వామాక్షి :
   శా.
   శ్రీకాంతుండని జెప్పుదీవు సతమున్ జిత్తంబునన్ గొల్తువే
   లోకంబందున గానమీక టకటల్ లోకేశు నే కల్వుమా
   శ్రీ కృష్ణుండిక బాపడేల ఘనుడీ చింతల్ దరిద్రంబులన్
   లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే.

   తొలగించండి
 18. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే

  నాప్రయత్నం

  శార్దూలము

  లోకంబందున లేదుసాటియరయన్ లోకేశునర్థించగా
  సాకారంబగు సర్వసౌఖ్యములు నైశ్వర్యంబు లీలోకమున్
  శ్రీ కైవల్యము చేరగా చివరకున్ శ్రీకంఠుసేవింపగా
  లోకోత్కృష్ట సమస్తసంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 19. విద్యనిమ్మని గురువును బిచ్చమడిగి
  శిష్యరికమును సల్పుచు సేవచేయ
  బదులుగా శిష్యునకునిచ్చు చదువు గురువు
  విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త

  రిప్లయితొలగించండి
 20. ఆకాంతా మణి యామ్లకమ్ము నిడె తా యాచింపగా శంకరుల్
  స్వీకారంబని పేదరాలి యుసిరిన్ శ్రీలింట పండింపగా
  శ్లోకంబయ్యెను కన్కధార స్తవమే శోకంబులన్ బాపగా
  లోకోధ్ధారణ వారికార్యమన నాలోకింప స్పష్టమ్ముగా
  *లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 21. సాకల్యంబుగవాసనల్విడచియున్భాస్వంతుచూడన్సదా
  ఏకాంతంబుగవానినేదలచుచున్తానేర్చుసాధుండునై
  తాకన్మోక్షముమీదిజన్మకిలసంఘాతంబుకోరంగనౌ
  లోకోత్క్రుష్టసమస్తసంపదలుగల్గున్బిచ్చమెత్తంగనే

  రిప్లయితొలగించండి
 22. ఆకారంబున జూడ బాలకునిగా నాతండు గన్పట్టినన్
  లోకారాధ్యుడు పద్మనాభుడతడాలోకింప దెల్లంబయెన్
  నాకున్ దక్కెను భాగ్యమీ వటువహా నారాయణుండీతడే
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే

  రిప్లయితొలగించండి
 23. దుష్ట దుర్యోధను నెఱిఁగి తోరముగను
  దీను భంగి నక్కట ద్రౌపదీ వర సుతుఁ
  డేల యేనూళ్ల నడుగంగ నింత కన్న
  విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త


  ఏకాంతమ్మున మూసి కన్నులను సర్వేశున్ మహాదేవు లిం
  గాకారద్యుతి వెల్గు చంద్రధరుఁ గాలాత్మున్ జటాజూటు సా
  ధ్వీకాత్యాయని భర్త నాది సుమహాబిక్షున్ మహా భక్తినిన్
  లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చ మెత్తంగనే

  రిప్లయితొలగించండి
 24. మంచిపనులకు,గుడులకుమందులకును
  అవసరమనిపించ విధిగానువివరణొసగి
  జేయుపనులందు ధర్మంబు జెరుపనట్లు
  విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త!

  రిప్లయితొలగించండి
 25. వండుకొనునట్టి యామెకు నొక్కకూర
  పాతివ్రత్యంబు గలయట్టిభామకునొక
  మగడె,యోలక్ష్మి!యిటులనె ఱుగుము నిజము
  విభవములుపెక్కు దక్కును బిచ్చమెత్త

  రిప్లయితొలగించండి
 26. నాకేమీబిడియంబులేదుశివునిన్ ,నాకాధిపుండావృషిన్
  రాకాచంద్రుని,సత్యదేవునినికన్ రామాంజనేయున్ దగన్
  నేకాంతంబున శ్రద్ధతోడనుబ్రభున్ నింపొందసేవించుచో
  లోకోత్క్రుష్టసమస్తసంపదలుగల్గున్ బిచ్చమెత్తంగనే

  రిప్లయితొలగించండి
 27. సహజంబౌనాచమనము
  సహితంబుగనోరుఁగడుగు చందముయనగన్,
  నహమును వీడుటకొఱకై
  నహమదు ఖానుఁ డొనరించె నాచమనంబున్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 28. *లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చమెత్తంగనే”*
  శ్రీకాళేశ్వరు నన్నపూర్ణసతి నర్చింపంగ వైరాగ్యమో
  శ్రీకైవల్యపదంబుచిత్సుఖమునాశీర్వాదమోభూతియో
  లోకాలేలెడునమ్మనమ్మితినిపాలున్బువ్వయోనీరమో

  రిప్లయితొలగించండి
 29. ఓట్లు కోరెడువేళలో నోర్పు తోడ
  వేడుచుందురు కొందరు వివిధ గతుల
  పదవు లందిన తరువాత వసుధయందు
  విభవ ములు పెక్కు దక్కును బిచ్చ మెత్త

  రిప్లయితొలగించండి