15, ఫిబ్రవరి 2021, సోమవారం

సమస్య - 3636

16-2-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు”
(లేదా...)
“అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్”

74 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పన్నుగ హైద్రబాదునను బంజరు హిల్సున టెంటు వేయుచున్
    నున్నగ బోడి జేయుచును నోటిని మూయుచు నీరుత్రాగకే
    పన్నుగ స్ట్రైకు జేయుచును బంగరు కోరుచు కేసియారుతో
    నన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్...

    రిప్లయితొలగించండి
  2. మున్నొకబ్రాహ్మణుండునొడిమూటనురాళ్ళనుగట్టియేటిలో
    దిన్నగమున్గనుండగనిదెమ్మనిపంచెనృసింహవాణియా
    పన్నుడుగుక్షిశూలతనువంతమొనర్చగనెంచజియ్యరే
    యన్నముదిన్ననౌషధమునౌననివిప్రునికానతీయదా
    *“నన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్”*

    రిప్లయితొలగించండి
  3. అన్నమది లేదు కానగనత్తయింట

    మధుర జలము లేదక్కటా మామయింట

    యుపవసము చేయుటే మరియుత్తమమని

    అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  4. భిన్నత నేక రూపున విభేదము జూపని భారతావనిన్
    వన్నెలు మార్చు కుత్సితులు వాదును పెంచిరి ఢిల్లిలోన, రై
    తన్నల బాధలున్ గనగ తాపము నొందగ బాధతోడ ర
    క్తాన్నము వద్దు వద్దనె క్షుధార్తుడు రోయుచు నన్నదాతతోన్”

    రిప్లయితొలగించండి
  5. తపము జేయగ బూనిన ధర్మమూర్తి
    అన్నమును గోర డయ్యె :క్షుధా ర్తు డొకడు
    తనకు దొరికిన దానిని తనివి తీర
    చవిని జూచుచు మెసవియు సంత సించె

    రిప్లయితొలగించండి
  6. వింత యిందేమి గలదయ్య వేదవిదుడ
    తనకు మధుమేహ రోగమే తగిలె నంచు
    ప్రాణ భయముచే యటనున్న పాల పాయ
    సాన్నమును గోరడయ్యె క్షుధార్తుఁడొకఁడు

    రిప్లయితొలగించండి
  7. శక్తియున్నది తనకును శ్రమను జేయ
    పనిని కల్పించి నిచ్చెడి వరముచాలు
    ఉచితముగనిచ్చుపాకము ఓట్ల కొరకు
    అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కల్పించి యిచ్చెడి..." అనండి. 'పాకము+ఓట్ల' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
  8. ఉ:

    పున్నమి రేని మోము మది పొంగెడు రీతిని హావభావముల్
    వన్నెలు బోవుచున్ వరుస వావిని గల్పగ, పెండ్లి గోరుచున్
    చిన్నది చెంత జేర తెగచిందులు వేయుచు నమ్మ వద్దనా
    కన్నము వద్దు వద్దనె క్షుదార్తుడు రోయుచు నన్నదాతతొన్

    అన్నదాత = అమ్మ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  9. కన్నెకు బెండ్లిసేసితిని గౌరవ నీయులు పెద్దలెల్లరిన్
    మన్నన జేసిపిల్చితిని మా సదనమ్మున విందుకై యనన్
    పన్నయొకండు చెప్పెనట పథ్యము నాకు ప్రమీఢమంచు క్షీ
    రాన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్.

    రిప్లయితొలగించండి
  10. అందరికీ నమస్సులు🙏

    కన్నము వేయు దొంగ కిక కష్టము పోలిసు చేత చిక్కగన్
    మిన్నక ముద్దముద్దకొక మిక్కుటమాయెను దేహబాధలుం
    దన్నగ, బోరుబోరుమని దారికి వచ్చెను కేక పెట్టుచున్
    “అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్”

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  11. తిన్నగ నర్కకూపమున తిష్ఠనువేసెదవీవు బ్రాహ్మడా!
    పన్నుగ ముష్టివేయగను పాచిన కూరలు పప్పుచారులన్
    అన్నయ! నిన్నవండినది హంగుగ దాచగ ఫ్రిడ్జిలోనిదౌ
    యన్నము వద్దువద్దనె క్షుధార్తుడు రోయుచు నన్నదాతతోన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నియొ యుద్యమాలనిట నేర్పడె గొప్పగ నుక్కుఫాక్టరీ
      భిన్నము సేయగా ప్రభుత పెక్కగు మార్గము లెంచుచుండ నే
      దన్నుగ నిల్చెదన్ మనకు దక్కగ నాంధ్రుల హక్కుభుక్తమం
      చన్నము నీరుముట్టకయె యామరణాంతము దీక్షసేయగా
      యన్నము వద్దువద్దనె క్షుధార్తుడు రోయుచు నన్నదాతతోన్ !

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  12. కుక్షి ఖాళీ యగుటచేత క్షుత్తు గలుగు
    నెగులు దీరగ దానిని నింపుటకయి
    యన్నముగోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు
    మద్యమె యనుకూలమయిన మందుయనుచు

    క్షుత్తు = ఆకలి
    క్షుధార్త = ఆకలి కలవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యన్నమును గోరఁడయ్యె... మందటంచు" అనండి. (మందు+అనుచు అన్నపుడు యడాగమం రాదు)

      తొలగించండి
  13. చద్ది కూడును తింటిని చాల దినము
    లుగద కావలె కొద్దిగ రొక్కము, ఫల
    హారశాలకుబోయద హాయిగనని
    అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
  14. సమస్య :
    అన్నము వద్దు వద్దనె క్షు
    ధార్తుడు రోయుచు నన్నదాతతో

    ( నిజాయితీ నిండిన రైతుల మహోద్యమం వలన ప్రభావితుడై ఒక యువకుడు పడుతున్న ఆవేదన )

    ఉత్పలమాల
    ....................

    " ఎన్నని విన్నవింతురయ ?
    యేమది నీమది మోడువారెనా ?
    క్రన్నన నీదు గుండె యిటు
    రాయిగ మారెన ? మోడివర్య ! రై
    తన్నకు నండగా నిలుతు ;
    తథ్యము ; దీక్షను బూనినాడ ; నా
    కన్నము వద్దు వ " ద్దనె క్షు
    ధార్తుడు రోయుచు నన్నదాతతో .

    ( క్రన్నన - వేగముగా )

    రిప్లయితొలగించండి
  15. తిన్నడు భక్తిపూర్వకము తీరుగ వేడుచు తిర్పమెత్తుచున్
    విన్నవి కన్నవన్నియును భీకరమౌ కడు మూఢభక్తితో
    పున్నమి రేయినందునను ముందరి రోజున సాధనమ్మునన్
    అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్!!

    రిప్లయితొలగించండి
  16. మొన్ననె కూలివాడొకడు మూటను మోయగ కష్టమొందగన్
    చిన్న యొకండు యాకలిని చెందియుగూడ సహాయమీయగన్
    మన్నన జేయ నాతనికి మాళిగ నందున విందునీయగన్
    నన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    రిప్లయితొలగించండి
  17. మద్యమును గ్రోలె నతిగాను, మందు లేని
    అల్సరు కడుపున పెరుగ అదుపులేక
    పిండివేయు నొప్పి పడుచు పేగులోన
    అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
  18. అన్నము బ్రహ్మరూపమగు నంచు శ్రుతుల్ వచియించె గాని యా
    యన్నము స్వార్థపూర్వకదురాశల తోడ నొసంగుచో
    మన్నన రాదు దాతలకు మాన్యుడు తిన్నును దోషమంచు నా
    యన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. 'తిన్నను' టైపాటు. "తోడ నొసంగుచున్నచో... తిన్నను దోషమంచు.." అనండి.

      తొలగించండి
    2. మీ సూచనకు ధన్యవాదములు

      అన్నము బ్రహ్మరూపమగు నంచు శ్రుతుల్ వచియించె గాని యా
      యన్నము స్వార్థపూర్వకదురాశల తోడ నొసంగుచున్నచో
      మన్నన రాదు దాతలకు మాన్యుడు తిన్నను దోషమంచు నా
      యన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్.

      కంజర్ల రామాచార్య

      తొలగించండి


  19. అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు
    కోరు నతడు చేతికి పని కొంత చేవ
    గలిగి బతుకు బండి నడుప కంది శంక
    రార్య! జీవితమే మకరందమవగ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవగ' అనడం సాధు ప్రయోగం కాదంటారు.

      తొలగించండి
  20. తేటగీతి
    భిక్షమెత్తెడు వృత్తినిఁ బిల్లవాండ్ల
    దింపి, ధనము సంపాదించు తీరునేర్ప
    నాకలి నటించి దానమ్ము రూకలడగి
    యన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు!

    ఉత్పలమాల
    తిన్నఁగ భిక్షగా ధనము తెమ్మన భీతి ముఠాధినేతలున్
    దన్నుగ నుందుమంచనఁగఁ దప్పని దీనత వీధులెక్కుచున్
    ఖిన్నులఁ జేసి యాకలను కేకల రూకలఁ బొందు వంకతో
    నన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ముఠా' అన్నది అన్యదేశ్యం. దానితో సవర్ణదీర్ఘసంధి చేయరాదు. 'ఆకలి+అను' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

      ఉత్పలమాల
      తిన్నఁగ భిక్షగా ధనము తెమ్మన భీతి దళంపు నేతలున్
      దన్నుగ నుందుమంచనఁగఁ దప్పని దీనత వీధులెక్కుచున్
      ఖిన్నులఁ జేసి క్షుత్తు యను కేకల రూకలఁ బొందు వంకతో
      నన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

      తొలగించండి


  21. సుచరితుడు కాడు వాడు! చ
    ని, చ! అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు, రో
    యుచు నన్నదాతతోన్! వా
    డి చాకు వలె పల్కు గుచ్చె డిగనురికి మదిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. వన్నెగ వేట తెచ్చెనయ పార్వతి నాధుని కుక్షి నింపగన్

    అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    కన్నుల రక్త ధారలను కాంచిన గుండెలు బాధ నిండగా

    కన్నుకు మందు కన్నులని కన్నులనిచ్చెను కోరి కన్నడై

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  23. తే.గీ.
    ధ్యానమగ్నుడై వెల్గొందు ధన్యజీవి
    అన్నపూర్ణయె మురిపాన యడగువేళ
    మోక్షదానము సద్భక్తి బిక్షకోరి
    అన్నమును గోరడయ్యె క్షుధార్తుఁడొకఁడు

    రిప్లయితొలగించండి
  24. తిన్నయాహారమరగక తివిరి యొక్క
    డన్నమును గోరఁడయ్యె, క్షుధార్తుఁ డొకఁడు
    అన్నపానీయములు లేక నలమటించు
    ఈశ్వరేచ్ఛను దప్పింప నెవరి తరము

    రిప్లయితొలగించండి
  25. ఎన్నగ ధాత్రిపైని జను లెల్లరికిన్ కబళమ్ము బెట్టగా
    తిన్నగ సేద్యమొక్కటియె ధ్యేయముగా మది దాల్చి సాగు రై
    తన్నకు న్యాయ మందు వరకన్నము ముట్టనటంచు దీక్షతో
    అన్నము వద్దు వద్దనె క్షుధార్తుడు రోయుచు నాన్న దాత తోన్

    రిప్లయితొలగించండి
  26. అన్నము చాలు మాకు నిక నంతకు మించి మరేమి కోరమో
    యన్న క్షుధార్తి యాయువును యావిరి జేయుచు నుండెనన్న యా
    పన్నులమన్న నీ హలము పన్నుగ దీయగదన్న మాకు మృ
    ష్టాన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆయువును+ఆవిరి, ఉండెనన్న+ఆపన్నుల...' అన్నపుడు యడాగమం రాదు. "యాయువునె యావిరి.. నుండెనన్న నాపన్నుల..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ!

      అన్నము చాలు మాకు నిక నంతకు మించి మరేమి కోరమో
      యన్న క్షుధార్తి యాయువునె యావిరి జేయుచు నుండెనన్న నా
      పన్నులమన్న నీ హలము పన్నుగ దీయగదన్న మాకు మృ
      ష్టాన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

      తొలగించండి
  27. కడుపు నిండుగఁ దా నుదకమ్ము త్రాగి
    చొక్కు వచ్చిన నక్కట చోద్య మడర
    నాత్మ గౌరవ మత్తరి నడ్డు రాఁగ
    నన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు


    పన్నుగ లేస మైనను సుపక్వము నిండని వేఁడికొంచుఁ దా
    గ్రన్నన నంత దత్తమును గాంచుచు, సైపఁగ రాని యాకలిం
    గొన్నను గడ్డి నేనుఁగుల గొంగ భుజించునె!, యన్య భుక్త శే
    షాన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    రిప్లయితొలగించండి
  28. మిన్నగ గారవించు నిల మేటి యటంచును మాతృభూమినిన్
    పన్నిరి ద్రోహమున్ వెతల పాలొనరింతురటంచెరుంగగా
    కన్నుల నీరు నిండెనిక గద్గదమౌ స్వరమందు బల్కుచున్
    అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    ఎన్ని దినంబులాయె తిని యెట్టుల సైచితివింత ఆకలిన్
    నిన్నిక పస్తులుంచమని నిండు మదిన్నిడ నున్నదంతయున్
    కన్నుల నీరు నిండెనిక గద్గదమౌ స్వరమందు బల్కుచున్
    అన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్

    రిప్లయితొలగించండి
  29. పంచభక్ష్యములన్నియు బంచనుండ
    యన్నమునుగోరడయ్యె క్షుధార్తుడొకడు
    విసుగు వచ్చెనుగాబోలు వీసమంత
    చూచినంతనేయన్నమ్ముక్షుధలువోయి

    రిప్లయితొలగించండి
  30. బిడ్డ కష్టమున్ జూడగ పేద మనసు
    ఎటులమెప్పించెదోనని నింకమీద
    సాయమేదైన చేయగ శక్తిలేక
    అన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు!!

    రిప్లయితొలగించండి

  31. ఉన్నది లోక మంచు మది
    నున్నది దైవమటంచు నిత్య సం
    పన్నత నొంద మాధవుని
    ప్రార్థనలే యిల రక్షయంచు భా
    వోన్నతి నొంది చిత్తము మ
    హోద్ధతి నొందెడి తత్వ మాఁకొనన్
    అన్నము వద్దు వద్దనె క్షు
    ధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్!

    రిప్లయితొలగించండి
  32. తనువునందుకొవ్వు నధిక తరము కాగ
    తిండి తగ్గించ మది నెంచి తేనె తోడ
    వేడి పానీయమే చాలు విను మటంచు
    నన్నమును కోరడయ్యె క్షుధార్తు డొకడు.

    రిప్లయితొలగించండి
  33. మిన్నగు వంటకంబులవి మెండుగనుండగ సంతసంబునన్
    నన్నము వద్దువద్దనె క్షుధార్తుడు రోయుచునన్నదాతతోన్
    నన్నముజూడగా దనకుహర్షిత!గబ్బుగ గానిపించెనౌ
    చిన్నగనన్నదాతకును జెప్పెనురోయుచువద్దువద్దనిన్

    రిప్లయితొలగించండి