28, ఫిబ్రవరి 2021, ఆదివారం

సమస్య - 3649

1-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును”
(లేదా...)
“మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్”

111 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    సంచుల నిండ దుడ్డుగొని సాగుచు రాత్రుల క్లబ్బులాదటన్
    కొంచెము గూడ సిగ్గు విడి కొంగులు జార్చుచు నాట్యమాడుచున్
    వంచన జేయగా సతులు బంజరు హిల్సున ప్రాణనాథులన్
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్...

    రిప్లయితొలగించండి
  2. భక్తిరసధారమద్యమైమరులుగొలుప
    తనివిదీరంగద్రావిరిత్యాగధనులు
    ముక్తికాంతయుదరిజేరెముదితయగుచు
    మంచిదగుమద్యపానమ్ముమాన్యులకును

    రిప్లయితొలగించండి
  3. ఉచితములకోరుచునుచితమును కనకను

    ఓటు వేయు వానికినివ్వరో ధరలను

    పెంచి ప్రభువుకు రాబడి పెంచు మధువు

    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "ఉచితముల గోరుకొనుచు నుచితము గనక । నోటు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ

      సవరించిన పూరణ ⬇️

      ఉచితముల గోరుకొనుచు, యనుచిత రీతి

      నోటు వేయు వానికినివ్వరో ధరలను

      పెంచి ప్రభువుకు రాబడి పెంచు మధువు

      మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును”

      తొలగించండి
  4. భక్తిరసధారమద్యమైమరులుగొలుప
    తనివిదీరంగద్రావిరిత్యాగధనులు
    ముక్తికాంతయుదరిజేరెముదితయగుచు
    మంచిదగుమద్యపానమ్ముమాన్యులకును

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    కోరలన్ జాచి యొంటిని గుల్ల జేసి
    వీధి పాల్జేసి భార్యాది బిడ్డలొరగ
    హానికారకమ్మిదనుచున్ మానివేయ
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును

    ఉత్పలమాల
    పొంచి మనమ్మునన్ జెలఁగ భూతములట్లుగ భీతులెన్నియో
    దించక సీస గ్రోలుచును దిప్పలు వెట్టుచు నొంటి నింటినే
    పంచఁగ దుఃఖమున్ దగునె భార్యకు సంతుకు? మానివేసినన్
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "భార్యను బిడ్డ లొరుగ..." అనండి.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏మొదటి పూరణలో పొరపాటు సవరించుకుంటాను.

      తొలగించండి
  6. వంచన సేయగాను యనుపానులు దెల్సిన వారలెప్పుడున్
    అంచన జేయబూనుచును అంగన లల్లన జూపనెంతురే
    కొంచెము బుచ్చుకొండనుచు కూరిమి తోడుత బల్కుచుందురే
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేయగాను+అనుపానులు' అన్నపుడు యడాగమం రాదు. 'ఎప్పుడున్ అంచన, బూనుచును అంగన' అని విసంధిగా వ్రాయరాదు. "వంచన చేయుచుండి యనుపానులు... వారలెప్డు తా । మంచన చేయగా దలచి యంగన..." అనండి.

      తొలగించండి
    2. వంచన చేయుచుండి యనుపానులు దెల్సిన వారలెప్డు తా
      మంచన చేయగా దలచి యంగన లల్లన జూపనెంతురే
      కొంచెము బుచ్చుకొండనుచు కూరిమి తోడుత బల్కుచుందురే
      మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్!!

      ***సవరణతో...🙏🙏

      తొలగించండి
  7. మాట తడబడు మన్నన మాయ మగును
    తరతమ ములను బాటింప తరము గాదు
    కల్ల కపటు లౌదురు రిలను కాన నెట్లు
    మంచి దగు మద్య పానమ్ము మాన్యు లకును?

    రిప్లయితొలగించండి
  8. పెంచెను తాత మధ్యమును పొందికనమ్ముచు మిద్దె మేడలన్

    వంచన చేసి తండ్రియును వందలు లక్షలు కూడవెట్టెరా

    ఇంచుక డబ్బు చిమ్మితిని నేతగనైతిని భారతమ్మునన్

    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మద్య మొసగెడి భీకర మత్తు నందు
    దుష్టవృత్తి వర్థనమొంది దోష మమరు
    ననుచు పీల్చుట చక్కగ నాపు జేయ
    మంచిదగును మద్యపానము మాన్యులకును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీకర మత్తు' దుష్టసమాసం. "మద్య మొసగు భీకరమగు మత్తు..." అనండి.

      తొలగించండి
  10. వ్యసనమునబల్కువారల ప్రాభవమ్ము
    త్రాగు డలవాటు విడువరు తరుణులైన
    చెప్పుచుందురు నెప్పుడు చింత లేక
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చెప్పుచుండెద రెప్పుడు.." అనండి.

      తొలగించండి
    2. వ్యసనమునబల్కువారల ప్రాభవమ్ము
      త్రాగు డలవాటు విడువరు తరుణులైన
      చెప్పుచుండెదరెప్పుడు చింత లేక
      మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును!!

      ***సవరణతో...🙏🙏

      తొలగించండి

  11. చంచల మైనమానసము సాకులజూపుచు
    చెంగలించగా
    కొంచెము పుచ్చుకొన్ననది గూర్చును మేలని నచ్చజెప్పుచున్
    పంచుకొనంగ మిత్రులతొ భావ్యముగాదు; సదాత్యజించగా
    మంచిది మద్యపాన మనుమానమదేలనొ సజ్జనుల్ గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మిత్రులతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరించిన పూరణ

      చంచల మైనమానసము సాకులజూపుచు
      చెంగలించగా
      కొంచెము పుచ్చుకొన్ననది గూర్చును మేలని నచ్చజెప్పుచున్
      పంచుకొనంగ స్నేహమున పాడియె బావ! వడిన్ త్యజించగా
      మంచిది మద్యపాన; మనుమానమదేలనొ సజ్జనుల్ గొనన్
      దించిన నారికేళముల తీయని పానియమే దగున్
      గదా!

      తొలగించండి
  12. వంచుటదుర్లభంబగుగయత్నములేకనుశోకకాండమున్
    పెంచినసాధనంబనెడిపెన్నిధిమత్తునమున్గగావలెన్
    చంచలమానసంబునికచంపగభక్తియమద్యమౌనుగా
    మంచిదిమద్యపానమనుమానమదేలనొసజ్జనుల్గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. వంచుటదుర్లభంబగుగవారధిలేకనుశోకకాండమున్
      యతినిసవరించితినిగురువుగారు

      తొలగించండి
  13. మరతురుగద వివేకము మత్తులోన
    వదలని వ్యసనము ,సిరులు వ్యర్ధమగును
    మిగులు రుగ్మత, వ్యధ మూలమింకనేల
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును?

    రిప్లయితొలగించండి

  14. మైలవరపు వారి పూరణ

    వంచన బుద్ధి గల్గును., వివాదములేర్పడు., సిగ్గు బోవు., నే
    కొంచెము సందు కన్పడిన గూడ పిపాస జనించు., గారవం
    బించుక యుండబోదు.,కొనరే! యొక నిర్ణయమున్, వధింపగా
    మంచిది మద్యపానమ., నుమానమదేలనొ సజ్జనుల్ గొనన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. మత్తు మనుజుని విజ్ఞతన్జిత్తు చేయు
    మత్తు పానీయము బరచు మరణ శయ్య
    కష్టముల పాలు జేయును గాన విడువ
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును

    రిప్లయితొలగించండి
  16. పూర్తిజేయగ నిచ్చిన పూరణయును
    తలపునందున తోచక తపనజెంది
    మంచిదగు మద్యపానమ్ము, మాన్యులకును
    ఔషధమువలె త్రాగిన దోషమవదు!

    రిప్లయితొలగించండి
  17. ఇది ఒక యాదార్థ సంఘటన. బొగ్గు గనుల కొత్తలో చాలా మందికి ఉద్యోగాలు , దానికి తోడు భారీ గా జీతాలు వచ్చేవి. సాయంత్రము చిత్తుగా తాగిన మత్తులో తన వద్దగల డబ్బును గాడిద కు బలవంతంగా తిన బెట్టడ మైనది.

    ఉ:

    మంచిరియాల యందునొక మందుడు చిత్తుగ ద్రాగి మైకమున్
    మంచిని పెంపు జేతునని మాసపు వేతనమెల్ల పంచ నై
    కంచర గార్దభమ్ము చన గన్పడ మెక్కు మటంచు గ్రుక్కగన్
    మంచిది మద్య పాన మనుమానమదేలనొ సజ్జనుల్ గొనన్

    మంచిరియాల=మంచిర్యాల , తెలంగాణ జిల్లా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కంచర గార్దభమ్ము' సాధుప్రయోగం కాదనుకుంటాను.

      తొలగించండి
  18. అంచులు దాటి కీర్తి గని యాతత పేరు ప్రతిష్టలంది భా
    వాంచిత నవ్య రీతులను వాసిలి భేషన చిత్రసీమలో
    పంచెను నక్కినేని మధు పానపు రీతుల, నాటకంబునన్
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్

    రిప్లయితొలగించండి
  19. మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్
    కొంచెము ద్రావుమా యనుచు కోర్కెలు రేపు మిటారమంతయున్
    వంచన గానెరింగి యటు వంకకు బోవక జాగరూకులై
    మంచిగ నెగ్గు వారలకె మన్నన దక్కు నసంశయంబుగా

    రిప్లయితొలగించండి
  20. సమస్య :-
    “మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును”

    *తే.గీ**

    ఓట్లు పడవలెనన్నను నోట్ల నిచ్చి
    తాగినంత మందును పోసి త్రాపు చుంద్రు
    త్రాగమన్నను లొంగక త్రాగకున్న
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును
    ......................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  21. నలతలన్ని మాయమగు నేనాటివైన
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును ,
    పూటకొక తడవ రవంత పుచ్చుకొనిన
    మేలుగూర్చు పరిమితిని మీరకున్న

    రిప్లయితొలగించండి
  22. తే.గీ.
    భార్య బిడ్డల వీధుల పాలుజేయు
    పాడు తాగుడు మేలంచు ప్రభుతనడువ
    హానికరమగు నద్దాని జనులుమాన
    మంచిదగు, మద్యపానమ్ము మాన్యులకును

    రిప్లయితొలగించండి
  23. సంచిత పాప భారమున జానెడు పొట్టను నింప ద్రవ్య మా
    శించి నిరంతరంబు శ్రమ జేసియు సంసార బాధ్యతల్ విచా
    రించక త్రాగి త్రాగి తుదలేదను మత్తును వీడిపోవుటే
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సంచిత పాప భారమున జానెడు పొట్టను నింప ద్రవ్య మా
      శించి నిరంతరంబు శ్రమ జేసియు తానిక బాధ్యతల్ విచా
      రించక త్రాగి త్రాగి తుదలేదను మత్తును వీడిపోవుటే
      మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్

      తొలగించండి
  24. సమస్య :
    మంచిది మద్యపాన మను
    మాన మదేలనొ సజ్జనుల్ గొనన్

    ( “ కవికోకిల “ దువ్వూరి వారి కవితా
    మాధుర్యాన్ని వర్ణించలేము - ఆస్వాదింపవలసినదే )

    ఉత్పలమాల
    --------------

    ఎంచి నుతింపజాలము క
    వీశుడు దువ్వురి రామిరెడ్డి శో
    భాంచితశబ్దసారకవి
    భావుకకావ్యము " పానశాల " నే ;
    సంచితపద్యమద్యమది ;
    చక్కగ హాయిగ నాస్వదింపుడీ !
    మంచిది మద్యపాన ; మను
    మాన మదేలనొ ! సజ్జనుల్ గొనన్ .

    రిప్లయితొలగించండి
  25. సమస్య :-
    “మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును”

    *తే.గీ**

    తాగి తాగి తెలియరాని రోగమొచ్చు
    నాస్తి పాస్తి కరిగిపోయి యప్పు పెరుగు
    నెక్కడైన పరువు తగ్గు నేవిధముగ
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును?
    ......................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "త్రాగి త్రాగి.. రోగమబ్బు" అనండి. ('వచ్చు'ను 'ఒచ్చు' అనరాదు)

      తొలగించండి
  26. కొంచెము మందువో లె ససికోసము నిత్యము పుచ్చుకున్నచో
    మంచిది , మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్
    పంచన చేరినట్టి సఖ బందుగులందరి ప్రోద్బలంబునన్
    మించిన వేళయందు మన మేనుకు కంపనజేయు మిత్రమా

    రిప్లయితొలగించండి
  27. కొంచెము పుచ్చుకున్న దనకున్ దనవారికి చేటువచ్చుని
    న్నంచితకృత్యరాజములనాచరణంబులమాన్పుదేహమం
    దుంచినరోగవారకమునొంచుధనంబుహరించునెంచగా
    నించుమనోవికారములనేరమటంచునుమానివేయగా
    **మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్”*

    రిప్లయితొలగించండి
  28. ముంచును సర్వసంపదలు, మోహనిమగ్నులఁజేసి మత్తునం
    దంచితరీతిఁ దేల్చును, గృహమ్మును తాళిని విక్రయించు, ని
    ర్వంచితమై గతించు ప్రతిభల్, నశియించు యశస్సు,మానుచో
    మంచిది మద్యపాన మనుమానమదేలనొ! సజ్జనుల్,. గొనన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  29. పెంచగ రాబడుల్ ప్రభుత విస్తృతి జేసి వినూత్నరీతిలో
    పంచె *ప్ర.సా.దు* లో ప్రజకు స్వస్థత గూర్చు నటంచు కోట్లలో
    సంచులలోన దించి సరసమ్మని జేసె ప్రచారమీగతిన్
    *మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    *(ప్ర.సా.దు.=ప్రభుత్వ సారాయి దుకాణము)*

    రిప్లయితొలగించండి
  30. ముంచుట లేదులే ప్రజను మోసముఁ జేయుట లేదు పూని యే
    వంచనఁ జేసి విత్తమును బావుకొనన్ గన లేదు కీర్తికై
    కొంచెపు బుద్ధితో తనరు కోరిక లుండవు వీటికన్ననున్
    మంచిది మద్యపాన మనుమానమదేలనొ! సజ్జనుల్ గొనన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  31. మంచిదగుమద్యపానమ్ము, మాన్యులకును
    దొరకుచుండును నెంతయో ధరణియందు
    తనువు చాలించినంతనే తాగినంత
    ఊర్ధ్వ లోకమందు దొరకు నుచితముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దొరకుచుండు నదెంతయో..." అనండి.

      తొలగించండి
  32. పొంచియుండు నపాయము బుద్ధి మాలి
    వంచకుల దోడ మితి మీర పానగోష్ఠి
    మించబోనీక మోతాదు మెలగినంత
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును

    రిప్లయితొలగించండి
  33. పానశౌరులనిన గౌరవమ్ము తొలగు
    సంపదనశించు దీనితో స్వస్థత చెడు
    నంచు దుర్వ్యసన మనిరి యార్యు లేల
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును?
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  34. కాంచితి రామపత్నిని సుగాత్రినయోనిజఁ శోకమూర్తిగా
    నంచనుమయ్య పల్క విని యబ్బుర మందిన వానరాళి వా
    చించిరి మోదమంది యట చిందులు వేయుచు గాలిచూలితో
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్.
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  35. శ్రీ గురుభ్యోనమః

    ప్రభుతలకు రాబడుల గూర్చు ప్రధమ వనరు
    సచివులకు యింధనమ్మిది సత్యమరయ
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును
    ప్రజల ధనమునకెరవేయ రామచంద్ర!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సచివులకు నింధనమ్మిది" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు సరి చేసుకుంటాను🙏

      తొలగించండి
  36. తే.గీ.
    కల్లు సారాయి లేనిదౌ కాలమేది
    పెద్ద మనుషుల తీరున బుద్ధిగాను
    మితము గమనించి సేవించి మెలగవలయు
    మనసు తేలిక జేసెడి మత్తుగూర్చు
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును

    రిప్లయితొలగించండి
  37. కాల్చ నెంచిన వంశపు గౌరవమ్ము
    ముంచఁ దల్చ మెయిని రోగ సంచయమునఁ
    గాంచ నెంచిన వేగంబ కాలు నిల్లు
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును


    అంచిత సోమపానము సురాళికి మే లగు వారి వోలె మీ
    రెంచి పరిగ్రహించిన నిజేంద్రియ రాశి నశించు వేగమే
    మించిన యట్టి పట్టుదల మేదిని వీడిన జీవకోటికిన్
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్

    [కొనన్ : ఈ విషయము గ్రహించుటకు]

    రిప్లయితొలగించండి
  38. త్రుంచును మానవత్వమును దూరముజేయు
    కుటుంబ సభ్యులన్
    ముంచును కొంపగోడులను పూజ్యమె యౌనుగ
    గౌరవంబదే
    మించిన నాయువేదరుగు, మేల్కొని సత్వరమే
    త్యజించగా
    మంచిది మద్యపానమను మానమదేలనొ సజ్జనుల్ గొనన్

    రిప్లయితొలగించండి
  39. మంచిగ జీవితాలనిల మార్చ
    గ నెంచి ప్రభుత్వ పెద్దలే
    మించిన ప్రేమచే జన నిమిత్త
    ము శాపులు తెర్చియుంచి రే
    వంఛన లేదు త్రాగవలె వాద
    వివాదము మాని, కొంచమే
    మంచిది , మద్యపానమను
    మానమదేలనొ సజ్జనాలికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రభుత్వ పెద్దలు' దుష్టసమాసం.

      తొలగించండి
  40. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  41. బీదసాదలతోబాటు పెద్దలకును
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును?
    మద్యపానమ్ము గల్గించు మత్తునికను
    స్తీర్వి సంబంధ రోగాల బారి జేయు
    ,..
    స్తీర్వి=శరీరము

    రిప్లయితొలగించండి
  42. అంచితమైన మార్గమున హర్నిశమున్ శ్రమియించు వారికిన్
    పంచుచు ప్రేమ నిత్యమును స్వర్గసుఖమ్ముల నిచ్చు భార్యతో
    కొంచెము మత్తునిచ్చికడు కూర్మిని గూర్చగ, శీతకమ్ములో
    మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్
    శీతకము: చలికాలము

    రిప్లయితొలగించండి
  43. మంచిదికాదు దుర్వ్యసనమందున చిక్కుకొనంగ నేరికిన్
    ముంచును గాదె యాయువును ముక్కలు చేయును జీవితమ్ములన్
    పెంచు మనోవికల్పమది వేడుకకైనను గ్రోలుటెవ్విధిన్
    మంచిది మద్యపాన ?మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్!

    రిప్లయితొలగించండి
  44. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  45. మంచిది మద్యపానమనుమాల మదేలనొ సజ్జనుల్ గొనన్
    సంచితమౌను బాపములు సజ్జనులైనను నెవ్వరేనియున్
    మంచిదిగాదు భూసురుడ! మద్యముద్రాగుట నెట్టివేళలన్
    మంచిగ దైవనామమును మానసమందున నిల్పి యుంచుమా

    రిప్లయితొలగించండి
  46. తప్పనిసరిగా చెరచును తనువు నదియు
    కలతలను రేపి కూల్చుచు కాపురము లు
    నాశమొనరించునట్టిదైననిది యెటుల
    మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును


    ఆధునికత పేరున త్రాగ నను దినమ్ము
    మంచి మర్యాద లెల్లయు మాయమగును
    చులకనముగనిన్నెల్లరు చూడ నెటుల మంచిదగు మద్యపానము మాన్యులకును


    కొంచము కూడమే లునిల కూర్చని మద్యము త్రాగుచున్నచో
    సంచిత మౌనురో గములు సత్వర మంచును చిత్తమం దునన్
    నెంచుచు మానసం బునను నిమ్ముగ నీ వ్యస నమ్మువీడి నన్
    మంచిది,మద్యపానమనుమానమదేలనొ సజ్జనుల్ గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "చిత్తమందు తా మెంచుచు..." అనండి.

      తొలగించండి