4-2-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత”(లేదా…)“జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్”(యం.వి.వి.యస్. శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)
ద్రోహ చింతన గల్గిన దుష్ట బుద్ధి చేయ రానట్టి హానిని చేసి నంత రగిలి హృదయాన మంటలు రాజు కొనగ జలము బోసిన నడగదు జ్వాల సుంత
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:తలుపుల చాటు దాగుచును తైతక లాడుచు సైగచేయుచున్కులుకుచు రాగ నీవిచట గుట్టుగ చప్పుడు చేయకుండనేవలపులు మీర నాహృదియె భగ్గున మండగ నీదు ప్రేమనున్ జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
ఆటవిడుపు సరదా పూరణ:(జిలేబి గారికి అంకితం)చెలగుచు శాస్త్రమున్ మరచి చీకటి రాత్రిని మందుగొట్టుచున్ నిలుపుచు రోలునందు, కడు నీల్గుచు త్రేపుచు మెండు వెక్కుచున్ కలుపుచు తెడ్డుతోడ, నొక గండర గండుడు సోడియమ్మునన్ జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏
పెళ్లి జేసిరి కూడుచు బెద్ద లంతయెడము నాకరో న వలన నేమి ఫలము?విభుని గలవక వధువింక వేగుటెట్లుజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత.
ఆలి బిడ్డల కడుపులు మాడ్చునయ్యకూర్మి తాగిన కడుపుకు కుంపటగునుమధిర మనుజుల బతుకుల మంటరేపుజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఆలి బిడ్డలు ❌ఆలు బిడ్డలు✅
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. "కడుపుల కాలజేయు" అందామా?
ధన్యవాదములండీ
మొదటి పాదములో కడుపులు మాడ్చు నయ్యకు బదులుగాకడుపుల కాలజేయు అని చదువుకోవలసినది
పిన్నబుద్ధియైరారాజుభేదమెంచిధర్మరాజునునోడించెధరణిఁగోరిమగువద్రౌపదిమానంబుమంటఁగలసెజలముఁబోసిననడగదుజ్వాలసుంత
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కౌరవులతో సంధికి బయలుదేరెడు శ్రీకృష్ణ పరమాత్మ తో ద్రౌపది.... తేటగీతిఅలవి గాని స్వార్థమ్మున నాటనాడినాతి నీడ్చి యరణ్య మజ్ఞాతమంపసంధి జపమున నన్న! నా బొందిపైనజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత! చంపకమాలచులకన జేయు వ్యూహమున జూదము కొగ్గుచు నెగ్గి మాయతోవలువల నూడ్చి మమ్ము వనవాసము లాదిగ హింసఁ బెట్టి యింగలము రగిల్చి కౌరవులుఁ గాల్చఁగ నన్నయ! సంధిపేరుతోజలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
అలకల కొలికి ప్రియురాల! ఆగవే జిలేబి ! ననువీడకమ్మ చెలియ తపము ఫలించిన శుభవేళా కనులిటులటేల !జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "తపము ఫలించిన శుభవేళ బెదరగనేల జవరాల" పాటను గుర్తుకు తెచ్చారు.
చెలిమిగ చేప పిల్లలును చేరిన ముత్యపు చిప్ప రాశులున్బలులు తిమింగలంబులును బారులు తీరిన పెద్ద సంద్రమున్కిలకిల పొంగెడగ్గి పలు కీలలుజాపిన ఘోర వేళలన్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్టమున్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
చిన్న సవరణలతో ————చెలిమిగ పిల్ల చేపలును చేరిన ముత్యపు చిప్ప రాశులున్బలులు తిమింగలంబులును బారులు తీరిన పెద్ద సంద్రమున్తెలియక దాగినగ్గి పలు తెన్నుల మండిన ఘోర వేళలన్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్టమున్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...( తెలియక దాగినగ్గి= బడబాగ్ని)
క్రొవ్విడి వెంకట రాజారావు: ఈర్ష్య గుణమున దుష్టుడై నెగడు నట్టి బంధువెంచిన హీనమౌ పనుల తోడ డెంద మెంతయు క్షోబించి కొందళించె జలము బోసిన నడగదు జ్వాల సుంత.
క్షోభించి
మదిమది జిలేబి విడువకునను జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్! రావె దూర మువలదె శుభమగు వేళయిదె యిదే!జిలేబి
కలకల లాడు నింట శుభ కార్యము జేయగ బూననెంచుచున్సలలితరాగముల్ నచట సందడి జేయగ చూడచక్కగన్కలతలు బుట్టెనేల నట కల్గెను విఘ్నము లేలనో యికన్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్టమున్!!
కలకలలాడుచున్ మయుని కందువదెల్పెడి రాజసౌధమున్దలచుచు ధార్తరాష్ట్రుడట తల్లడమందగ మత్సరమ్మునన్ చెలిమిని కౌరవాగ్రజుడు చేసిన పెంపగు మేలుబోధలన్జలముల నెంతబోసినను జ్వాలయడంగదు తగ్గదుష్ణమున్ కందువ = సామర్ధ్యముకౌరవాగ్రజుడు = ధృతరాష్ట్రుడు
బలిమిని సముండు పురమున గలిగెనేనికలిమిని తనకంటె ఘనుడు గలిగెనేనికలుగు మత్సరమ్మనునగ్ని యలుకతోడజలము బోసిన నడగదు జ్వాలసుంత
మగువ పొంకాలు మదిలోన మంట రేప కామజ్వాలతో దేహంబు కాలుచుండె పడతి నీతీయనైనట్టి పలుకు లనెడు జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
తడిసి ముద్దైన చీరలో తరుణి బిగువు గుబ్బలను గాంచగను రేగె గుండెలోన కామ పుసెగలు చెలియ మేఘాలు రాల్చు జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
వలపుల రాజు బాణములు వాడిగ వేడిగ గుండెలోపలన్ చలుపుచు నుండగా తిథపు జ్వాలలు రేగగ దేహమంతయున్ సలసల కాగుచుండె ముముచానము రాల్చు పరామృతమ్మనే జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
*విదురుడు కృష్ణునితో పలికిన మాటలుగా* *** *** *** *** *** *** *** *** ** కలహము మానుమంచును సుగాత్రుడవై వచియింపనేమి యా ఖలురు సుయోధనాదులిక కయ్యపు బాటను వీడివత్తురే? విలువగు నీదు వాక్యముల విందురె చక్రి సుభాషితమ్ములౌ జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
క్రొవ్విడి వెంకట రాజారావు: చలమును గూడు తత్త్వమున సాగెడి దుష్టుడునైన బంధువే కలత లొనర్చు హీనమగు కర్మల సంకటబెట్టు చుండగా అలుకువదోడ వీగెను మనమ్ము విశేషముగా వెరించుచున్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్.
విలవిల లాడగా తులువ వేలము వెర్రిగ దుస్ససేనుడేవలువల నూడ్చ కృష్ణకు సభాసదు లెల్లరు మిన్న కుండిరేపెలుచన బాప వేడుచును పెన్నిధి వెన్నుని, భీముఁడిట్లనెన్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్కృష్ణ-ద్రౌపది: పెలుచన-కోపము
ఆకలి యొకబాధరగులు అగ్ని జఠరమున పొగయులేక, కడుపున ముల్లుగ దిగుఆకలియను జ్వాలకు మందు అన్నమెగదజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
కామితములకు లేదుగా కనికరమ్ముజలము బోసిన నడగదు జ్వాల సుంతతెల్పువాడను మెలగుమా తెలివితోడభక్తిభావము సతతము ముక్తి నిచ్చు !!
సమస్య :జలముల నెంత బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్ ( దుష్యంత వియోగవిహ్వల శకుంతలకు శిశిరోపచారాలు చేస్తున్న అనసూయతో ప్రియంవద )చంపకమాల ...................అలికులవేణి యైన మన యన్నులమిన్న శకుంతలాసఖిన్ గలువల సెజ్జ వైచి, మృదు గంధమలందుచు, దామరాకులన్ మెలమెల వీచినన్, మదిని మీరు వియోగముచేత మేనిపై జలముల నెంత బోసినను జ్వాల యడంగదు ; తగ్గ దుష్ణమున్ .
గ్రీష్మమందు దినకరుని కృశమునొందికైపుగ వసతులనమర్చి కట్టినట్టివీడు కాలుచుండగ కుటుంబికుల నేత్రజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత- [ ] కృశము = వేడి
తే.గీ//మృగశిరా కార్తెనందున మృగ్యమౌనురోహిణీ కార్తెనందున రోళ్ళుబగులు !భగభగమని మండు బడబాగ్నికిని పిసరుజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత !!
చిలిపి పూవుల విలుకాని చేష్టితములువిరహ జ్వాలను రగిలించి వేఁగఁజేసెప్రియసమాగమమొక్కటే నయముజేయుజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
చం: పిలుపును గొన్న కర్షకులు బింకము మీరగ సమ్మె చేయుచున్గడగడ లాడుచున్ చలికి గండము గానగు సాగు చట్టముల్తొలగగ జేయుమన్న కడు దుష్టత కెంచి త్యజింప జేయనైజలముల నెంత బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణ మున్వై. చంద్రశేఖర్
జ్వలితహుతాగ్నిసంభవను సంగరభీకరవీరపత్నినైతులువ యొకండు నిండు సభ దువ్వలువల్ దొలగించఁ బూన నీపలుకుల నూరడిల్లుదునె పార్థివ!, వంచితహృద్దవాగ్నిలోజలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్.కంజర్ల రామాచార్య.
వెల వెలబోవజేసెగద,వేతనజీవులనందరిన్నిటన్కులుకులగ్రుమ్మరించకను,కూలగజేసిరియాశసౌధముల్సులువుగమానబోదుకద,సూక్ష్మముగానటువంటి బాధ,కేజలములనెంతబోసినను,జ్వాలయుడుంగదు తగ్గదుష్ణమున్++++++++++++++++++++++రావెల పురుషోత్తమరావు
ఎలుకలు లోన పీకి నటు లెప్పటి కప్పుడు నొప్పి హెచ్చెడిన్సలసల కాగి నట్లగుచు సన్నని యావిరు లౌను పొట్టలోమలమల మాడ్చి నట్లగుచు మండెడి క్షుత్తుకు తిండిదక్కయేజలముల నెంత బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్.
తల్లిదండ్రులెవరుజూడ తనయులందుపచ్చిగడ్డి వేసిన భగభగల మంటజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంతఏమిఖర్మము పట్టెనే నేటి జగతి
బలమిక దక్కె మాకనుచు పాతకులై పచరించు నాయకుల్విలువలు లేని పాలనను వేదన బెట్ట జనాగ్రహమ్మునన్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్మలమల మాడ్చు దుష్టులను మార్పును దెచ్చును మంచి పెంచగా
పలువురు రాజధాని కయి బంగరు భూముల నిచ్చి వేయగానిలుకడ లేని నేత లవినీతికి నూత మొసంగిరంచు చంచలమగు నిర్ణయంబెడద జ్వాలల లేపెను స్వాంతనంబనే*“జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్”*
బంధువర్గముపలికినబలుకులవియగ్రుచ్చుకొనియెనుడెందాన చిచ్చువోలెజలముబోసిన నడగదుజ్వాలసుంతప్రియముగల్గెడుమాటలునయముపలుక
శాంతిఁ జేకూర్చు జనులకు క్షమయు కరుణయెల్ల వేళలఁ జక్కఁగఁ గల్ల కాదెయక్కట నరులకు నెడంద మిక్కుటముగఁజలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత [మిక్కుటముగన్ +చలము = మిక్కుటముగఁ జలము] లలిత మనస్కు లెల్లరకు లాలన కన్నను భాష్ప తోయముల్జలజల కాఱ మం దగును జయ్యన శోక మహాగ్ని తప్త దుర్విలపిత పూరుషాత్మలకు వింతగఁ బ్రశ్రయ గంధ యుక్త వాగ్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
వలపులఱేనిచర్యలకువాడిగజ్వాలలురేగమేనిపైజలములనెంతబోసిననుజ్వాలయడుంగదుతగ్గదుష్ణమున్ దెలియుమువీరరాఘవుడ!దిట్టగువారలుసైతమున్ గనన్ లలనలగాంచినంతనెయరాచకవృత్తినిసంచరింతురే
కళకళ లాడుచున్ తిరిగి కమ్మని యూహల తేల్చిప్రీతితోకిలకిలనవ్వులన్ గురిసి కిన్నెరకంటి బుజాంతరమ్మునన్చెలువము చూపకున్ననిశి చేడియకై తపియించు చుండగాజలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
కలవరమాయె మానసము కాంతుని ధ్యాస చెలంగి హెచ్చుగన్చిలుకపటానితేనిదొర చిత్తమునందున జ్వాల వేల్చగన్కలువలరేడు గూడ తన కౌముదితోవిరహంబు బెంచగాజలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
ద్రోహ బుద్ధిని చూపుచు దుష్టులెపుడుతీయనైన మాటలతో డ తీరుగానునట్టి వారల కుత్సిత మను యనలముజలము పోసిన నడగదు జ్వాల సుంత.
ద్రోహ చింతన గల్గిన దుష్ట బుద్ధి
రిప్లయితొలగించండిచేయ రానట్టి హానిని చేసి నంత
రగిలి హృదయాన మంటలు రాజు కొనగ
జలము బోసిన నడగదు జ్వాల సుంత
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తలుపుల చాటు దాగుచును తైతక లాడుచు సైగచేయుచున్
కులుకుచు రాగ నీవిచట గుట్టుగ చప్పుడు చేయకుండనే
వలపులు మీర నాహృదియె భగ్గున మండగ నీదు ప్రేమనున్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
చెలగుచు శాస్త్రమున్ మరచి చీకటి రాత్రిని మందుగొట్టుచున్
నిలుపుచు రోలునందు, కడు నీల్గుచు త్రేపుచు మెండు వెక్కుచున్
కలుపుచు తెడ్డుతోడ, నొక గండర గండుడు సోడియమ్మునన్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిపెళ్లి జేసిరి కూడుచు బెద్ద లంత
రిప్లయితొలగించండియెడము నాకరో న వలన నేమి ఫలము?
విభుని గలవక వధువింక వేగుటెట్లు
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆలి బిడ్డల కడుపులు మాడ్చునయ్య
రిప్లయితొలగించండికూర్మి తాగిన కడుపుకు కుంపటగును
మధిర మనుజుల బతుకుల మంటరేపు
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఆలి బిడ్డలు ❌
తొలగించండిఆలు బిడ్డలు✅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. "కడుపుల కాలజేయు" అందామా?
ధన్యవాదములండీ
తొలగించండిమొదటి పాదములో
తొలగించండికడుపులు మాడ్చు నయ్యకు
బదులుగా
కడుపుల కాలజేయు
అని చదువుకోవలసినది
పిన్నబుద్ధియైరారాజుభేదమెంచి
రిప్లయితొలగించండిధర్మరాజునునోడించెధరణిఁగోరి
మగువద్రౌపదిమానంబుమంటఁగలసె
జలముఁబోసిననడగదుజ్వాలసుంత
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికౌరవులతో సంధికి బయలుదేరెడు శ్రీకృష్ణ పరమాత్మ తో ద్రౌపది....
రిప్లయితొలగించండితేటగీతి
అలవి గాని స్వార్థమ్మున నాటనాడి
నాతి నీడ్చి యరణ్య మజ్ఞాతమంప
సంధి జపమున నన్న! నా బొందిపైన
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత!
చంపకమాల
చులకన జేయు వ్యూహమున జూదము కొగ్గుచు నెగ్గి మాయతో
వలువల నూడ్చి మమ్ము వనవాసము లాదిగ హింసఁ బెట్టి యిం
గలము రగిల్చి కౌరవులుఁ గాల్చఁగ నన్నయ! సంధిపేరుతో
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅలకల కొలికి ప్రియురాల! ఆగవే జి
లేబి ! ననువీడకమ్మ చెలియ తపము ఫ
లించిన శుభవేళా కనులిటులటేల !
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తపము ఫలించిన శుభవేళ బెదరగనేల జవరాల" పాటను గుర్తుకు తెచ్చారు.
చెలిమిగ చేప పిల్లలును చేరిన ముత్యపు చిప్ప రాశులున్
రిప్లయితొలగించండిబలులు తిమింగలంబులును బారులు తీరిన పెద్ద సంద్రమున్
కిలకిల పొంగెడగ్గి పలు కీలలుజాపిన ఘోర వేళలన్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్టమున్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
చిన్న సవరణలతో
తొలగించండి————
చెలిమిగ పిల్ల చేపలును చేరిన ముత్యపు చిప్ప రాశులున్
బలులు తిమింగలంబులును బారులు తీరిన పెద్ద సంద్రమున్
తెలియక దాగినగ్గి పలు తెన్నుల మండిన ఘోర వేళలన్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్టమున్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( తెలియక దాగినగ్గి= బడబాగ్ని)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఈర్ష్య గుణమున దుష్టుడై నెగడు నట్టి
బంధువెంచిన హీనమౌ పనుల తోడ
డెంద మెంతయు క్షోబించి కొందళించె
జలము బోసిన నడగదు జ్వాల సుంత.
క్షోభించి
తొలగించండి
రిప్లయితొలగించండిమదిమది జిలేబి విడువకు
నను జలముల నెంతఁ బోసినను జ్వాల యడం
గదు తగ్గ దుష్ణమున్! రా
వె దూర మువలదె శుభమగు వేళయిదె యిదే!
జిలేబి
కలకల లాడు నింట శుభ కార్యము జేయగ బూననెంచుచున్
రిప్లయితొలగించండిసలలితరాగముల్ నచట సందడి జేయగ చూడచక్కగన్
కలతలు బుట్టెనేల నట కల్గెను విఘ్నము లేలనో యికన్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్టమున్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలకలలాడుచున్ మయుని కందువదెల్పెడి రాజసౌధమున్
తొలగించండిదలచుచు ధార్తరాష్ట్రుడట తల్లడమందగ మత్సరమ్మునన్
చెలిమిని కౌరవాగ్రజుడు చేసిన పెంపగు మేలుబోధలన్
జలముల నెంతబోసినను జ్వాలయడంగదు తగ్గదుష్ణమున్
కందువ = సామర్ధ్యము
కౌరవాగ్రజుడు = ధృతరాష్ట్రుడు
తొలగించండిబలిమిని సముండు పురమున గలిగెనేని
కలిమిని తనకంటె ఘనుడు గలిగెనేని
కలుగు మత్సరమ్మనునగ్ని యలుకతోడ
జలము బోసిన నడగదు జ్వాలసుంత
మగువ పొంకాలు మదిలోన మంట రేప
రిప్లయితొలగించండికామజ్వాలతో దేహంబు కాలుచుండె
పడతి నీతీయనైనట్టి పలుకు లనెడు
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
తడిసి ముద్దైన చీరలో తరుణి బిగువు
రిప్లయితొలగించండిగుబ్బలను గాంచగను రేగె గుండెలోన
కామ పుసెగలు చెలియ మేఘాలు రాల్చు
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
వలపుల రాజు బాణములు వాడిగ వేడిగ గుండెలోపలన్
రిప్లయితొలగించండిచలుపుచు నుండగా తిథపు జ్వాలలు రేగగ దేహమంతయున్
సలసల కాగుచుండె ముముచానము రాల్చు పరామృతమ్మనే
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
*విదురుడు కృష్ణునితో పలికిన మాటలుగా*
రిప్లయితొలగించండి*** *** *** *** *** *** *** *** **
కలహము మానుమంచును సుగాత్రుడవై వచియింపనేమి యా
ఖలురు సుయోధనాదులిక కయ్యపు బాటను వీడివత్తురే?
విలువగు నీదు వాక్యముల విందురె చక్రి సుభాషితమ్ములౌ
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచలమును గూడు తత్త్వమున సాగెడి దుష్టుడునైన బంధువే
కలత లొనర్చు హీనమగు కర్మల సంకటబెట్టు చుండగా
అలుకువదోడ వీగెను మనమ్ము విశేషముగా వెరించుచున్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్.
విలవిల లాడగా తులువ వేలము వెర్రిగ దుస్ససేనుడే
రిప్లయితొలగించండివలువల నూడ్చ కృష్ణకు సభాసదు లెల్లరు మిన్న కుండిరే
పెలుచన బాప వేడుచును పెన్నిధి వెన్నుని, భీముఁడిట్లనెన్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
కృష్ణ-ద్రౌపది: పెలుచన-కోపము
ఆకలి యొకబాధరగులు అగ్ని జఠర
రిప్లయితొలగించండిమున పొగయులేక, కడుపున ముల్లుగ దిగు
ఆకలియను జ్వాలకు మందు అన్నమెగద
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
కామితములకు లేదుగా కనికరమ్ము
రిప్లయితొలగించండిజలము బోసిన నడగదు జ్వాల సుంత
తెల్పువాడను మెలగుమా తెలివితోడ
భక్తిభావము సతతము ముక్తి నిచ్చు !!
సమస్య :
రిప్లయితొలగించండిజలముల నెంత బోసినను
జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
( దుష్యంత వియోగవిహ్వల శకుంతలకు శిశిరోపచారాలు చేస్తున్న అనసూయతో ప్రియంవద )
చంపకమాల
...................
అలికులవేణి యైన మన
యన్నులమిన్న శకుంతలాసఖిన్
గలువల సెజ్జ వైచి, మృదు
గంధమలందుచు, దామరాకులన్
మెలమెల వీచినన్, మదిని
మీరు వియోగముచేత మేనిపై
జలముల నెంత బోసినను
జ్వాల యడంగదు ; తగ్గ దుష్ణమున్ .
గ్రీష్మమందు దినకరుని కృశమునొంది
రిప్లయితొలగించండికైపుగ వసతులనమర్చి కట్టినట్టి
వీడు కాలుచుండగ కుటుంబికుల నేత్ర
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
- [ ] కృశము = వేడి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ//
రిప్లయితొలగించండిమృగశిరా కార్తెనందున మృగ్యమౌను
రోహిణీ కార్తెనందున రోళ్ళుబగులు !
భగభగమని మండు బడబాగ్నికిని పిసరు
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత !!
చిలిపి పూవుల విలుకాని చేష్టితములు
రిప్లయితొలగించండివిరహ జ్వాలను రగిలించి వేఁగఁజేసె
ప్రియసమాగమమొక్కటే నయముజేయు
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
చం:
రిప్లయితొలగించండిపిలుపును గొన్న కర్షకులు బింకము మీరగ సమ్మె చేయుచున్
గడగడ లాడుచున్ చలికి గండము గానగు సాగు చట్టముల్
తొలగగ జేయుమన్న కడు దుష్టత కెంచి త్యజింప జేయనై
జలముల నెంత బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణ మున్
వై. చంద్రశేఖర్
జ్వలితహుతాగ్నిసంభవను సంగరభీకరవీరపత్నినై
రిప్లయితొలగించండితులువ యొకండు నిండు సభ దువ్వలువల్ దొలగించఁ బూన నీ
పలుకుల నూరడిల్లుదునె పార్థివ!, వంచితహృద్దవాగ్నిలో
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్.
కంజర్ల రామాచార్య.
వెల వెలబోవజేసెగద,వేతనజీవులనందరిన్నిటన్
రిప్లయితొలగించండికులుకులగ్రుమ్మరించకను,కూలగజేసిరియాశసౌధముల్
సులువుగమానబోదుకద,సూక్ష్మముగానటువంటి బాధ,కే
జలములనెంతబోసినను,జ్వాలయుడుంగదు తగ్గదుష్ణమున్
++++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
ఎలుకలు లోన పీకి నటు లెప్పటి కప్పుడు నొప్పి హెచ్చెడిన్
రిప్లయితొలగించండిసలసల కాగి నట్లగుచు సన్నని యావిరు లౌను పొట్టలో
మలమల మాడ్చి నట్లగుచు మండెడి క్షుత్తుకు తిండిదక్కయే
జలముల నెంత బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్.
తల్లిదండ్రులెవరుజూడ తనయులందు
రిప్లయితొలగించండిపచ్చిగడ్డి వేసిన భగభగల మంట
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
ఏమిఖర్మము పట్టెనే నేటి జగతి
బలమిక దక్కె మాకనుచు పాతకులై పచరించు నాయకుల్
రిప్లయితొలగించండివిలువలు లేని పాలనను వేదన బెట్ట జనాగ్రహమ్మునన్
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
మలమల మాడ్చు దుష్టులను మార్పును దెచ్చును మంచి పెంచగా
పలువురు రాజధాని కయి బంగరు భూముల నిచ్చి వేయగా
రిప్లయితొలగించండినిలుకడ లేని నేత లవినీతికి నూత మొసంగిరంచు చం
చలమగు నిర్ణయంబెడద జ్వాలల లేపెను స్వాంతనంబనే
*“జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్”*
బంధువర్గముపలికినబలుకులవియ
రిప్లయితొలగించండిగ్రుచ్చుకొనియెనుడెందాన చిచ్చువోలె
జలముబోసిన నడగదుజ్వాలసుంత
ప్రియముగల్గెడుమాటలునయముపలుక
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశాంతిఁ జేకూర్చు జనులకు క్షమయు కరుణ
తొలగించండియెల్ల వేళలఁ జక్కఁగఁ గల్ల కాదె
యక్కట నరులకు నెడంద మిక్కుటముగఁ
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత
[మిక్కుటముగన్ +చలము = మిక్కుటముగఁ జలము]
లలిత మనస్కు లెల్లరకు లాలన కన్నను భాష్ప తోయముల్
జలజల కాఱ మం దగును జయ్యన శోక మహాగ్ని తప్త దు
ర్విలపిత పూరుషాత్మలకు వింతగఁ బ్రశ్రయ గంధ యుక్త వా
గ్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
వలపులఱేనిచర్యలకువాడిగజ్వాలలురేగమేనిపై
రిప్లయితొలగించండిజలములనెంతబోసిననుజ్వాలయడుంగదుతగ్గదుష్ణమున్
దెలియుమువీరరాఘవుడ!దిట్టగువారలుసైతమున్ గనన్
లలనలగాంచినంతనెయరాచకవృత్తినిసంచరింతురే
కళకళ లాడుచున్ తిరిగి కమ్మని యూహల తేల్చిప్రీతితో
రిప్లయితొలగించండికిలకిలనవ్వులన్ గురిసి కిన్నెరకంటి బుజాంతరమ్మునన్
చెలువము చూపకున్ననిశి చేడియకై తపియించు చుండగా
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
కలవరమాయె మానసము కాంతుని ధ్యాస చెలంగి హెచ్చుగన్
రిప్లయితొలగించండిచిలుకపటానితేనిదొర చిత్తమునందున జ్వాల వేల్చగన్
కలువలరేడు గూడ తన కౌముదితోవిరహంబు బెంచగా
జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్
ద్రోహ బుద్ధిని చూపుచు దుష్టులెపుడు
రిప్లయితొలగించండితీయనైన మాటలతో డ తీరుగాను
నట్టి వారల కుత్సిత మను యనలము
జలము పోసిన నడగదు జ్వాల సుంత.