23, ఫిబ్రవరి 2021, మంగళవారం

సమస్య - 3644

24-2-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు”
(లేదా...)
“భూమి తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్”

64 కామెంట్‌లు:

  1. రాముఁడు పాలితప్రజలు రంజిలగా భువి నేలుచుండఁగన్
    తామరసాక్షి యోర్తు కడు దైన్యముతోఁ జనుదెంచి భర్త తా
    నై మరియొక్క తన్విని నయంబుగఁ దెచ్చె నటంచుఁ జెప్పె నా
    భూమి తనూజకున్, "సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్"

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    స్వామిని దల్చి లంకనట చక్కగ జూచుచు రావణాసురున్
    భామల బాధలాదటను పాటులు పెక్కులు రోజురోజునన్
    గోముగ నిద్రబోవగను కొండొక రాతిరి స్వప్నమందునన్
    భూమి తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్...:)

    రిప్లయితొలగించండి
  3. సీతరామునిమదిలోనసేమమనెడి
    మాటపాతదియనగనునవతతలపు
    రసనయన్నదిరమ్యమైరంగుపులిమె
    జానకికిఘటిల్లెనుగదాసవతిపోరు

    రిప్లయితొలగించండి


  4. ఏక పత్నీవ్రతుడు మగనిగ యిమిడెను
    జానకికి; ఘటిల్లెను గదా సవతి పోరు
    మరియొకజనన మందున మాధవుండు
    మగడుగాన! తనయుడు బ్రహ్మ కరణముగ


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'మగనిగ+ఇమిడెను=మగనిగ నిమిడెను' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  5. తేటగీతి
    దుష్ట రావణు రాముఁడు దునిమి వైచి
    యిష్ట సఖి సీత కానంద మింపు గూర్చి
    యయ్యయోధ్యకు భర్తగ నవతరించ
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    ఉత్పలమాల
    కాముకు రావణున్ దునిమి కాంతకు మోదము గూర్చి రాముడున్
    భామ సమేతుఁడై జనఁగఁ బట్టము గట్టఁగ భూమి భర్తఁగా
    నేమయె నంచు రాజ్యమున నింతులు మేళములాడ 'తల్లితో
    భూమి తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్' !

    రిప్లయితొలగించండి


  6. జగడమ్ములు తప్పవు నో
    పగ! భూమి తనూజకున్ సవతి పోరు ఘటి
    ల్లెఁ గదా యయోధ్యలోన్ కై
    క గుణము కారణముగ పతి కానన మేగన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. రావణునిజంపి విడుదల రాముడొసగె

    జానకికి :; ఘటిల్లెను గదా సవతి పోరు”

    రుక్మిణికి భీష్మకు సుతుడు రుక్మి చెల్లి

    కృష్ణునగ్ర సతికి కొత్త కృతము వచ్చి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. సమస్య :
    భూమితనూజకున్ సవతి
    పోరు ఘటిల్లె గదా యయోధ్యలోన్

    ( శ్రీరాముని పట్టాభిషేకవార్త తెలిసిన సీతాదేవి చెలికత్తెలు పరస్పరం వేళాకోళంగా మాట్లాడుకొంటూ ...)
    ఏమిది ? వింతవార్త యిది !
    యిప్పుడె వింటిమి ; కోసలేశుడే !
    రాములవారటే ! మనము
    రంజిలె నెంతయొ ; నాదు సందియం
    బేమన ముగ్ధయై వరలు
    ఇన్నళినాక్షికి ; పద్మగంధికిన్
    భూమితనూజకున్ సవతి
    పోరు ఘటిల్లె గదా ! యయోధ్యలోన్ .

    రిప్లయితొలగించండి
  9. చెలియ కత్తెలు గుసగుస చెప్పు కొనుచు
    మోద మందుచు తామప్డు మురిసి రచట
    రాజ్య రమ వరి యించగ రామచంద్రు
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    రిప్లయితొలగించండి
  10. కపటి కైకేయి కోరగా కానకేగు
    రాముని యనుసరించెడు రమణి గాంచి
    కలత చెందిన కౌసల్య తలచె నిటుల
    జానకికి ఘటిల్లెనుగదా సవతి పోరు .

    రిప్లయితొలగించండి
  11. ధామముపారలౌకికముతండ్రియురామునిసన్నిధానమున్
    కామమువీడుచున్జనుఁడుకన్నులణజూడనయోధ్యయందునన్
    రాముఁడుసీతతోనటనురాజిలెముక్తికినాధుడైతగన్

    భూమితనూజకున్సవతిపోరునఘటిల్లెఁగదాయయోధ్యలోన్

    రిప్లయితొలగించండి

  12. సీతా పరివేదన!

    స్వామి, యయోధ్యరాముడట జన్నముసేయగ
    నిశ్చయించగా
    నామది సంశయంబునను నల్గుచునున్నది! రాఙ్ఞిలేకయే
    హోమము నిర్వహంచుటకు యోగ్యత గల్గునె నుర్విలోపలన్?
    భూమితనూజకున్ సవతిపోరు ఘటిల్లెగదా యయోధ్యలో!

    రిప్లయితొలగించండి
  13. ప్రజల యపవాదములు లేని పాలన తన
    విధిగ నెంచి దేవేరిని విడిచిపెట్ట
    “జానకికి ఘటిల్లెను గదా సవతి పోర”
    నుచు తలంచి మీరారీతి నుడువదగునె ?

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    రాముడు రాజ్యమేలడను రచ్చను గూర్చి తలంచి క్రోధమున్,
    నేమగు నిప్పుడంచు కడు నిందలు వేయుచు చేరవేయగన్
    భూమి తనూజకున్; సవతి పోరు ఘటిల్లె గదా యయోధ్యలోన్
    సేమము గాదు లోకమున చింతయె, మాదిరి నెంచరే ప్రజల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. ఉ.
      ఓ మడివేలు మాటల కయోధ్యపురీషుడు రామచంద్రుడే
      నీమము దప్పరాదనుచు నిక్కపుటాలును బంప కానలన్
      రాముడు రాజసూయము సలక్షణమౌ విధి సేయ చోద్యమై
      తాఁ మదినం దలంచెనిటు, తాపసి యాశ్రమమందు సీతయే
      "భూమి తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్."

      మడివేలు-రజకుడు;

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తా మదినిం దలంచె..." అనండి.

      తొలగించండి
  16. అశ్వమేధ యాగము చేసె యవని మేలు
    కోరి రఘుపతి, పత్నిగ గూర్చునె గద
    సీత ప్రతిమయె రాముని చెంత, నాడు
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    రిప్లయితొలగించండి

  17. నీమము గల్గు రామునకు
    నెయ్యము గూర్చున దొక్క సీతయే
    ప్రేమ సుధా పయోధి సమ
    వీక్షణ లక్షణ‌ ధర్మ మార్గ సం
    ధాముని చిత్త నిర్మల సు
    తత్వ వివేచన జూడ నెట్టులా
    భూమి తనూజకున్ సవతి
    పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్?!

    రిప్లయితొలగించండి
  18. రామచంద్రమూర్తి జనక లలనసుతయు
    జానకికిఘటిల్లెనుగదా;సవతిపోరు
    లేకశూర్పణఖనుగాక నేకపత్ని
    వరుడుయై నయోధ్యకు చక్రవర్తినయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యంలో అన్వయం సరిగా లేనట్టున్నది. భావం స్పష్టంగా బోధపడడం లేదు.

      తొలగించండి
  19. రాములోరిది తప్పని రజకుడనిన
    జనులు తలచిరి లేదని సత్యమందు
    యాగ మందున బంగరు యామిని గన
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    రిప్లయితొలగించండి
  20. భార్యదూరమైన తనను వదలలేదు
    అండగుండెనుహనుమయు గుండెనిండ
    మురిపెముగ మటలాడగ, ముద్దుగుమ్మ
    జానకికి ఘటిల్లెనుగదా సవతిపోరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అండగ నుండెను' అనడం సరియైనది. "అండగా నుండె హనుమయు..." అనండి.

      తొలగించండి
  21. సమస్యా పూరణం

    భూమితనూజకున్ సవతి పోరు ఘటిల్లె గదా యయోధ్యలో

    నా పూరణ

    ఉత్పలమాల

    ఆమహరాణి కైకయ దురాశకు హద్దులు లేక కోరె నా
    రాముని కాననంపగను రాజుని జేయగ నాత్మనందనున్
    ఏమనిజెప్పనొప్పు సవతి యేడ్పులె యత్తకు శాపమై విధీ
    భూమితనూజకున్ సవతి పోరు ఘటిల్లె గదా యయోధ్యలో

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  22. సీత మున్యాశ్రమమ్మున జేరియుండ
    యాగమునుజేయ సమకట్టె రాఘవుండు
    సీత తలచెను మనమున చింత పడుచు
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    రిప్లయితొలగించండి
  23. రాముడయోధ్యలోననొక రమ్యతరంబగు నాధ్వరంబుతో
    భూమికి క్షేమమున్ దలిచి మోదముతో మిము బిల్వ బంచెనం
    చా మనుజేశు భృత్యులన జానతలంచె మనంబు నందిటుల్
    *భూమి తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్”*

    రిప్లయితొలగించండి
  24. ఆండ్రు పెరిగిన యింట లేదండ్రు సుఖము
    ముండ్లపై బ్రతు కయ్యెను పెండ్లి యాడ
    నందనులు లేరని తిరిగి చందునకును
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    [జానకి చందు లాలు మగలు]


    భూమిని నాకుఁ గన్పడఁగఁ బో రధికమ్ముగ స్వీయ భార్యచే
    నేమని పల్క నేర్తుఁ బరమేశ్వరు లీలల నెంచ శక్యమే,
    గీమునఁ గాన కున్న, మదిఁ గేకయ భూపతి చింత సేసె నో
    భూమి! తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్

    రిప్లయితొలగించండి
  25. సోమునిదనయ యగునా సుగుణశీలి
    జానకికి ఘటిల్లెనుగదా సవతిపోరు
    తనకు పిల్లలు గలుగని దపన వలన
    బెండ్లియాడెను లక్ష్శిని వెంకటేశు

    రిప్లయితొలగించండి
  26. రాముడు వంచి కార్ముకము
    రంజిల భర్తగ నాయెనేరికిన్?
    భీమ భవానితో మరియు
    వేమరు జాహ్నవి కేది జర్గెడిన్?
    రాముని మందిరంబిపుడు
    రాజిల గట్టచు నుండ్రి యెచ్చటన్?
    భూమి తనూజకున్, సవితిపోరు
    ఘటించె, నయోద్యలోపలన్.

    రిప్లయితొలగించండి
  27. రాముడు వంచి కార్ముకము
    రంజిల భర్తగ నాయెనేరికిన్?
    భీమ భవానితో మరియు
    వేమరు జాహ్నవి కేది జర్గెడిన్?
    రాముని మందిరంబిపుడు
    రాజిల గట్టచు నుండి రెచ్చటన్?
    భూమి తనూజకున్, సవితిపోరు
    ఘటించె, నయోద్యలోపలన్.

    రిప్లయితొలగించండి
  28. రాముని పాలనంబు జనరంజక మంచును ప్రస్తుతించుచున్
    రాముడు ధర్మమున్ వలచె ప్రాణము కన్నను మిన్న యంచు నా
    పామరు డాడు మాటలకు భార్యను వీడెను ధర్మబద్ధు డై
    భూమితనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్.

    రిప్లయితొలగించండి
  29. క్షేమము కాదరణ్యమని సితకు కోసల రాజపుత్రియే
    ప్రేమగ విన్నవించినను వీడను భర్తనటంచు సాగగా
    భామ దలంచె నిట్టుల సపత్ని కుతంత్రపు చేష్ట లెంచు నీ
    భూమితనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్.

    రిప్లయితొలగించండి
  30. ఆ మహనీయుడార్షవిధినాచరణంబొనరించు దీక్షగా
    రాముడు సత్యసంధుడభిరామగుణాకరుడాతడెన్నడున్
    నీమము దప్ప డేటికివి నిందలె గాననరాదికిట్టులన్
    "భూమి తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్"

    రిప్లయితొలగించండి


  31. వైరివర్గము నుజయించి వాసి గాను
    దాశరథియు ముదమ్మున ధరణి నేల
    రాజ్య రమయును భార్యయై రహిని గూర్చ
    జానకికి ఘటిల్లెను కదా సవతి పోరు

    రిప్లయితొలగించండి
  32. ఏమని జెప్పనొప్పుదును నీర్ష్యను నొందిన కైకయేకుపిన్
    రాముని పంపుమా వనికి రాజునుజేయుము నాదుసూనునిన్
    దామగనిన్ వరంబుగను దక్షణమిమ్మని పల్కనంతటన్
    భూమితనూజకున్ సవతిపోరు ఘటిల్లెగదా యయోధ్యలోన్

    రిప్లయితొలగించండి
  33. జానకీ రాములను బోలు జంట వారు
    వదలదు గదెపుడును పని బరువతనికి
    పనియె లోకమ్ము గమసలు, వర్కు పేర
    జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు

    రిప్లయితొలగించండి