25, జులై 2021, ఆదివారం

సమస్య - 3793

26-7-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా”
(లేదా...)
“మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో”

38 కామెంట్‌లు:


  1. విరించి.

    సిరులార్జించెడు నెపమున
    వరుణాలయము కడతెంచి వచ్చితివనుచున్
    విరహము తో నామెయె కా
    మరణమ్మునుఁ గోరివచ్చె మానిని గనుమా.

    రిప్లయితొలగించండి
  2. కర మను రాగము బుట్టగ
    చెరగని వలపు మది లోన జిందులు వేయన్
    వెరువక ప్రియు జేరియు ప్రే
    మ రణమ్మును గోరి వచ్చె మానిని గనుమా !

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరసతినగు తనను వలచి
    విరలిని కీచకు డొనర్చు వికృత క్రియలన్
    అరికట్ట నెంచి నాతని
    మరణమ్మునుఁ గోరివచ్చె మానిని గనుమా!

    రిప్లయితొలగించండి
  4. విరిదమ్మిమేనువడలగ
    నరయన్ముక్తినిమనువుననభవునితోడన్
    పరిపంధియనంగుడునని
    మరణమ్మునుఁగోరివచ్చెమానినిగనుమా

    రిప్లయితొలగించండి
  5. కందం
    పరువఁపు హిడింబి చేరెను
    బిరుసెక్కిన కండవాడ భీమా! సరసన్
    మరుకేలిని దేలఁగ ప్రే
    మ రణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా!

    చంపకమాల
    పరువపు చిందులన్ వలపుఁ బంచ హిడింబినిఁ గూడవచ్చితిన్
    చురచుర చూపులో మదన చూడవొకో పిడి బాకు కాదనన్
    విరిసిన పూవురేకు నొగి వేడుక జేయును గుచ్చుకొంటె భీ
    మ! రణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో!

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తానతి లోక సుందరినని లంకేశు
      సోదరినని‌ దెల్పె,శోభ తోడ

      నడవుల‌ తిరుగుచు, నార్య సుతుడు మోహ
      నాంగుడవని పరిణయము నాడ

      తగినవాడ వనుచు వగలను‌ పోవుచు నీదరి చేరెను మోద‌‌ముగ, ని

      నకుల తిలకుని‌ ఘనతను తా తెలియక
      నగు మోముతో మరణమ్ము‌ గోరి‌

      వచ్చె మానిని‌ ,కనుమా, శుభాంగినెపుడు

      మట్డు బెట్ట రాదను,నీదు మాటలు విని,

      కోసెదను ముక్కు చెవులని దూసెను కర

      వాలము‌ను సుమిత్ర సుతుడా వనిత పైన


      సవరించినది

      తొలగించండి

  7. విరించి.

    పురణము దాటిపోగ పతి పోడిమి గోరుచు నప్పుడెప్పుడో
    తరుణియె తాళలేనని యధర్మమటంచు నెఱంగి తానిటన్
    సరసుడ వంచు గుర్తెరగి శ్యామిక యందున నిల్లు వీడి కా
    మ రణము గోరివచ్చినది మానిని నీవెటులాదరింతువో.

    రిప్లయితొలగించండి
  8. తరుణియురుక్మిణీసతియుతల్లడమందుచుమానసంబునన్
    వరకరుణాసముద్రజనవందితగౌరినిఁగోరెదీనయై
    పరిణయమాడనమ్మపరుపావనుక్రుష్ణునిగాకనెవ్వరిన్
    మరణముఁగోరివచ్చితినిమానినినీవెటులాదరింతువో

    రిప్లయితొలగించండి
  9. కె.వి.యస్. లక్ష్మి:

    సరసపు మాటలు రువ్వుచు
    మొరటుడు కీచకు నలరుచు ముద్దుగ భీమున్
    సరసన గూడుచు వానిది
    మరణమ్మునుఁ గోరివచ్చె మానిని గనుమా!

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరసతినంచు దల్చక నపారమునైన విమోహ మెంచుచున్
    విరివిగ కామకృత్యముల విక్కెడి కీచకు బుద్ధి దెల్పుచున్
    పరిపరియౌచు వేడికొనె వాయుసుతుండ! దురమ్ము వానిదౌ
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో!

    రిప్లయితొలగించండి
  11. దురహంకారుడు కీచకుఁ
    డరయక యెగ్గును పరసతినతి నీచముగా
    చెరబట్టగదలచె ఖలుని
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

    రిప్లయితొలగించండి
  12. చం:

    భరణము నెచ్చు దెమ్మనెడు బాధల నోర్వక పుట్టినింటికిన్
    పరుగున జేరి యేడ్చుచును పాటును దల్లికి దెల్వ జెప్పగా
    తరుణము నెంచరాదనెను తండ్రిగ బాధ్యత నిర్వహింప , తా
    మరణము గోరి వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరణించిన తనపతితో
      పరలోకముజేరమాద్రి పదపడి నడచెన్
      వెరవక నాథునిచితిపై
      మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

      తొలగించండి
  14. వ్యాక్సిన్ లేని మొదటి కరోనా ఉత్పాతం లో ......

    తరుణమిది డాక్టరమ్మకు
    కరోన రోగులను కావ కారుణ్యముతో,
    వెరవక చావుకు,విధిలో
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా!


    రిప్లయితొలగించండి
  15. తరుణ వయస్కయౌ సుదతి తా వరియించెను నిన్ను గాఢతన్
    విరహము సైపజాలదు వివేచన జూపుట పాడియౌనె యా
    మరుని శరంబులా లలన మానసమందున చిచ్చురేప కా
    మ రణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

    రిప్లయితొలగించండి
  16. దొరువు జల గలుపుచుండగ
    వరుసగ దినదినము పాలు పాడగు చుండన్
    మరల మరల గాదని చర
    మ , రణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

    దొరువు = నడబావి (
    చరమ = చివరి

    రిప్లయితొలగించండి

  17. విరించి.

    సరసము లాడ బిల్చితివి సద్గుణ శీలిని యోరి కీచకా
    తరుణుల నిట్లుసేయుట యధర్మమటంచు నెఱంగుమోయి యా
    పరమపునీతయౌ పడతి భండనభీముడు వెంటరాగ నీ
    మరణము గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో.

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. తరుణము సార్థకమ్మగు విధమ్ము, నపత్యము నందు మార్గమం
      దరయగ మాతయై తనరి, యక్షయ మోక్షవిధాయకమ్మునై
      యిరువురి యన్వయమ్ములఁ దరింపగఁ జేయు వివాహసౌఖ్య మా
      మరణముఁ గోరి, వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

      ఆమరణము మరణము వరకు అని అర్థము ఆసమంతాత్ మరణము అని విగ్రహవాక్యము
      ఆమరణదీక్ష వలె

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  19. తరిషము లంఘించి యిటకు

    తరుణిని వెదకంగదలచి దయచేసిన వా

    నరుడా! అంజని సుత హను

    మ, రణమ్మునుఁ గోరివచ్చె మానిని గనుమా!

    రిప్లయితొలగించండి
  20. వరగర్వితుడై యసురుడు
    తరుణుల నబలలుగనెంచి ధైర్యము తోడన్
    శరముల దాల్చుచు దురమున
    మరణమ్మును గోరివచ్చె! మానిని గనుమా!

    స్థిరమతి, సత్యవంతు దన చిత్తమునందున ప్రేమభావమున్
    కరుకగు కాననంబునను కాపురమేయన జంకులేకయే
    వరునిగ స్వీకరించె మునివాక్య మెరింగియు దాను భర్తదౌ
    మరణము, గోరివచ్చినది మానిని నీవెటు లాదరింతువో?

    రిప్లయితొలగించండి
  21. స్వరమునుఁబెంచిమాయగనుసన్నుతిసేయుచురామచంద్రునిన్,
    వెఱువకఁ బర్ణశాలకటువేగముఁజేఱగఁజుప్పనాతి "సో
    దరఁగనుమాసమాదరమునఁదద్దయుమాన్యతనందజేయుమా,
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో”

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  22. వరదుడ! పుట్టితీవిల దివాకరు వంశము నందు మర్త్యుడై
    కరుణను బంచి దీనులను కావగ రాక్షస బారినుండి నీ
    శరములఁ జచ్చినన్ గలుగు శాప విమోచన మంచు నెంచుచున్
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

    రిప్లయితొలగించండి
  23. తరుణము నెంచి, వ్యాజమున స్తన్యవిషమ్మునుఁ బేర్మి నిచ్చి, సం
    హరణముఁ జేయఁ బూని యసురాంగన పూతన కంసు నానతిం
    గరుణ యొకింత లేక, కటుకర్శశబుద్ధి స్వయమ్ము దానె త
    న్మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. శరణమ నక భీతిల్లక
    తరుణి తనువెడలె రణముకు ధైర్యము తోడన్
    పరుగిడిరి యరులు, శత్రుల
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా --


    రాణీ రుద్రమ గూర్చి

    రిప్లయితొలగించండి
  25. భరణమునకు పీడించగ
    మరుమాటల్ బలుకలేక మనసది మిగులన్
    బరువై మమతలు సంపుచు
    మరణమ్మును గోరివచ్చె మానిని గనుమా

    రిప్లయితొలగించండి
  26. విరటుని శ్యాలకుడతివల
    చెరబట్టగ జూచు ఖలుడు స్త్రీ లోలుండా
    దురహంకారుడు కీచకు
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. భరణము నీయలేదనుచు భర్తయె దానుగ గెంటివేయగా
    మరణము గోరివచ్చినది మానిని నీవెటు లాదరింతువో
    యరయగ దెల్సె నాకిపుడె హర్షకుమార! దయార్ద్రదృష్టితో
    నురమునబెట్టుకొందువనియూపిరియుందెడునంతకాలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆత్మీయతకై తల్లడిల్లే మానవత్వం గల మనిషి నుండి అవసరాలు తీర్చే మనిషి దాక మగవాడి పయనం.. అదే నేటి ఏటీయమ్ కు గల నిర్వచనమా..?

      తొలగించండి
  29. స్మర ఖర బాణ వితాన మ
    ధుర ఘాతమ్ములకు నోడి తోయజనేత్రా!
    దరికిం గీచకుఁ డదె దు
    ర్మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని! గనుమా


    నర వరు లేరి కెన్నఁడును నాకచ రాలినిఁ గాంచ శక్యమే
    తరుణిని నిన్ను గాంచితిని ధర్ముఁడ నీ దయ వ్యర్థ మెట్లగున్
    సురవర! సత్యవంతు సతి చూడు మరల్పఁగ స్వీయ భర్తృ దు
    ర్మరణముఁ గోరి వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో

    రిప్లయితొలగించండి
  30. హరి హరు సాక్షినొక్కరయి హాయిన చేరి వివాహ బంధమున్
    తరుణికి కాన్పు మృత్యువుకు తక్కువ కాదు సమాన మమ్మ య
    న్చు రుధిర సాక్షిగన్వినియు శోభన శయ్యను చేర వచ్చెరా
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  31. శిరమున పింఛము దాల్చిన

    మురళిని చంపగ యదుకుల మూర్తిని చేరెన్

    బెరుకున రక్కసి పూతన

    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి


  32. విరులను కొప్పున దురుముచు
    విరహమ్ము నటించి మించి బింకము తోడన్
    సరగున వలలుడు కీచక
    మరణమ్మునుఁ గోరివచ్చె - "మానిని" గనుమా!


    పరిణయమాడి నీదు దరి
    భాగ్యమటంచు ప్రకామ భావమున్
    విరులను బోలు కోమలత
    వెన్నెలచంద మనంత ప్రేమతో
    మరిమరి నిన్నుమెచ్చి యభి
    మానము తోడుత నీదుచెంతనే
    మరణముఁ గోరి వచ్చినది
    మానిని నీవెటు లాదరింతువో?!

    రిప్లయితొలగించండి
  33. చిరుతప్రాయము నపతియు
    మరణించగ పలువిధములమరుగుచుమదిలో
    పరితాపము నీనామ
    స్మరణమ్మునుగోరివచ్చె మానిని గనుమా

    రిప్లయితొలగించండి