5, ఆగస్టు 2021, గురువారం

సమస్య - 3804

6-8-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే”
(లేదా...)
“వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే”

50 కామెంట్‌లు:

  1. వినయ విధేయతలు గలిగి
    జనహిత కృత్యములు సల్పు సహృద యు లగుచున్
    మునుకొని సతతం బును బా
    వన ధర్మ ము బూను జనులు భాగ్యము గనరే !

    రిప్లయితొలగించండి
  2. వినుమనుమానమదేలా
    మన హైందవ సంస్కృతి భువి మాన్యంబు గదా
    గొనకొని నీమముగా పా
    వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే

    రిప్లయితొలగించండి
  3. తనమదినరిషడ్వర్గము
    ననయముపూనికవిడచుచుమర్మముదెలియన్
    కనగనుతపమునపరమము
    వనధర్మముఁబూనుజనులుభాగ్యముఁగనరే

    రిప్లయితొలగించండి

  4. స్నేహితురాలు జీవన కు చేసిన హితోపదేశము.


    మునులాచరించి చూపిన
    మనధర్మమ్మదియె గాదె మహిమాన్వితమౌ
    వినుమంటిని చెలియా జీ
    వన, ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే.

    రిప్లయితొలగించండి
  5. కందం
    మనమున చింతల వీడుచు
    ననునిత్యము భ్రుకుటి పైన నంచిత దృష్టిన్
    గొనసాగెడు ధ్యానఁపు జీ
    వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      అనునిత్యమ్ము సుఖాసనా యుతముగా నత్యంత సన్నిష్ఠతోన్
      మనమందున్ విడి చింతలన్ భ్రుకుటి నానాపానమందున్ విల
      క్షణమౌ సత్క్రియ విచ్చ నుంచుచు సహస్రారమ్మునన్ ధ్యాన జీ
      వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!

      తొలగించండి
  6. వినగాసాధనపారలౌకికపుతావిన్నాశికాగ్రంబునన్
    కనగానేకముగాగమానసముకావ్యంబైనవల్గున్గనన్
    చెనకన్బాహ్యపుశోధనల్విరియనాచెంగల్వలోనాత్మలో
    వనధర్మమ్మునుబూనలోకులకుసౌభాగ్యంబుప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  7. వనజాక్షుని సేవించుచు
    జనసంక్షేమమును గూర్చు చక్కని కృతులన్
    దనివార రచించెడు సుక
    వన ధర్మము బూనుజనులు భాగ్యముగనరే

    రిప్లయితొలగించండి
  8. కనగానేకముకాగమానసమునాకావ్యంబైనవెల్గున్గనన్

    రిప్లయితొలగించండి
  9. అనువు దొరక నీచమనక
    వనితలపయి బలిమిజేయు వారలనణచన్
    దన విధియని దుముకెడు యౌ
    వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే

    రిప్లయితొలగించండి


  10. కనుమా పూర్వము ప్రాజ్ఞులౌ కవులు సత్కావ్యమ్ము లెన్నింటినో
    మనదౌధర్మము గొప్పదంచు నది సమ్మానించి రక్షించినన్
    మనలన్ రక్షణజేయు సత్యమది నేమంబంచు భావించి జీ
    వన ధర్మమ్మును బూనలోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే.

    రిప్లయితొలగించండి
  11. ధనమే యగ్రీయంబని
    యనుకొననొప్పునె జనులకు నతి నిష్ఠురతన్
    మనమందున దీనజనా
    వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే

    రిప్లయితొలగించండి
  12. మ:

    పనులన్ శ్రద్ధగ జేయుచున్ విధులనున్ పాటించ నిక్కచ్చిగా
    జనులున్ మెచ్చెడు రీతిగా పటుగతిన్ సాగింపగన్ కార్యముల్
    ఘనమౌ కీర్తిని బొందు వారలగుచున్ కారుణ్యమున్ జూపు జీ
    వన ధర్మమ్మును బూను లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తిన్చులే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. పనిగట్టుకు పెంచినచో,
    పెనుపొందును వృక్షజాతి విరివిగ భువిలో,
    కనువిందగు ప్రకృతి, హరిత
    వన ధర్మముఁ బూను జనులు, భాగ్యముఁ గనరే!

    రిప్లయితొలగించండి
  14. మత్తేభము:
    మనిషే భూతలమంత నాదనఁగ దుర్మార్గంపు నాధిక్యతన్
    పెను జీవాలు నశించె, తుల్యతఁ జెడెన్, పెన్ముప్పు వాటిల్లె లే!
    వనముల్నిండుగ పక్షి జంతు తతులున్ వర్ధిల్లు కారుణ్య జీ
    “వన ధర్మమ్మును బూన, లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!!”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనిషి' అన్న రూపం సాధువు కాదు. "మనుజుండే భువియంత..." అనండి.

      తొలగించండి
    2. అలాగే సరిచేస్తాను. ధన్యవాదములార్యా 🙏

      తొలగించండి
    3. మత్తేభము:
      మనుజుండేభువియంత నాదనఁగ దుర్మార్గంపు నాధిక్యతన్
      పెను జీవాలు నశించె, తుల్యతఁ జెడెన్, పెన్ముప్పు వాటిల్లె లే!
      వనముల్నిండుగ పక్షి జంతు తతులున్ వర్ధిల్లు కారుణ్య జీ
      “వన ధర్మమ్మును బూన, లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!!”
      --కటకం వేంకటరామశర్మ.

      తొలగించండి
  15. జనులకు ధర్మము మూలము
    కనుగొని పాటించదగును కలకాలంబుల్
    వినయముతోగూడిన జీ
    వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే

    రిప్లయితొలగించండి
  16. వినుమా ! మానవ జన్మమే
    మిగుల నీవిశ్వంబులోసర్వదా
    ఘననీయంబని విశ్వసింతురిల
    సత్కార్యంబులంజేయగన్
    మనసానందముజెందు నిక్క
    ముగ సమ్మానంబు సిద్ధించు, జీ
    వన ధర్మంబును బూను లోకు
    లకు సంప్రాప్తించు లాభించులే

    రిప్లయితొలగించండి
  17. ఎనయంగా సమదృష్టినిన్ జెలగుచున్ హేయంపు టాలోచనల్
    కనరానీయక మానసమ్మడర సత్కర్మంబులన్ సల్పుచున్
    తనరారాన్ మనుజుండు సిద్ధి నిడు గీతా శాస్త్ర మందించు జీ
    వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  18. వనముల్ జీవనభాగ్యదాయకములై ప్రాణిప్రకాశమ్మునం
    దనయంబున్ దమజన్మధన్యత గనున్ హర్షంబు చేకూర్చు కా
    వున నవ్వానికి రక్షగూర్చుటయె యీ భూమిన్ యోగ్యకార్యంబుగా
    వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ఆర్యా
      ధన్యవాదాలు

      సవరణ:

      వనముల్ జీవనభాగ్యదాయకములై ప్రాణిప్రకాశమ్మునం
      దనయంబున్ దమజన్మధన్యత గనున్ హర్షంబు చేకూర్చు కా
      వున నవ్వానికి రక్షగూర్చుటయె యీ భూమిన్ స్వకార్యంబుగా
      వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

      తొలగించండి
  19. మత్తేభవిక్రీడితము
    అనునిత్యమ్ము సుఖాసనా యుతముగా నత్యంత సన్నిష్ఠతోన్
    మనమందున్ విడి చింతలన్ భ్రుకుటి నానాపానమందున్ విల
    క్షణమౌ సత్క్రియ విచ్చ నుంచుచు సహస్రారమ్మునన్ ధ్యాన జీ
    వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!

    రిప్లయితొలగించండి
  20. కనిపించేనిలనాకమే, నిరతమౌకల్యాణమేగల్గుగా
    శనివారమ్మిదియాదివారమనుచున్ సందేహమేలన్? జనుల్
    యనిశమ్ముల్ శ్రమ కోర్చి చేయగ పనిన్, యంతమ్మలక్ష్మీత్వభా
    వన, ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  21. మనమందున్ చెడు యోచనల్ విడిచి సంభావించుచున్ బెద్దలన్
    కనుచున్ పేదల ప్రేమతో సతతమున్ కావించి సత్కర్మలన్
    ఘనుడౌ చక్రధరున్ తలంచుచు ధృతిన్, కాంక్షించి మోక్షమ్ము జీ
    వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  22. వనముల్ మానవజాతికిన్నొసగు
    నవ్యాజంపు బ్రేమంబునన్
    ఘనమౌ వర్షము, బ్రాణవాయువును బాగైనట్టి సస్యంబులన్
    దనువున్ గాచెడి నౌషధంబులను వేతాపంబులన్ దీర్చు నా
    వనధర్మమ్మును బూను లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  23. వినుమాగిట్టక మానునాజనులు
    ఆవేషంబులెంతెంతనో
    దినవృద్దిన్ బరచన్ వివాదసహిత
    ద్వేషార్థులై జ్వాలలే
    వినువీథిన్ యెగజల్లిపోరుధరులై
    వేత్కంగలేరంత, పా
    వనధర్మమ్మును, బూనలోకులకు సౌభాగ్యమ్ముప్రాప్తించులే
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  24. అనయము శివునిం జూచుచు
    మనమున ధ్యానించుచుండు మనుగడ గలరై
    వినయము దానములను పా
    వనధర్మము బూనుజనులు భాగ్యము గనరే

    రిప్లయితొలగించండి
  25. ధన సంపాదనకై విదేశ భృతి ప్రాధాన్యంబుగానెంచినన్
    మన మూలంబులు విస్మరింపకెపుడున్ మాన్యంబుగా దాల్చుచున్
    ఘనమౌ భారత సంస్కృతిన్ జగతినగ్ర్యంబంచునుత్కృష్ట జీ
    వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  26. జన సంచయమ్మునకు మే
    లొనరు పనులఁ జేయు వారు నొప్పుగ నింకన్
    మన శాస్త్రచ యోక్తము పా
    వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే


    వనజాతాసన వాస వాది వర దేవవ్రాతముం బ్రీతిఁ గొ
    ల్చిన నేపారెడు పుణ్య మబ్బును ధరన్ శ్రేష్ఠమ్ముగా నమ్ము పూ
    సిన వృక్షమ్ముల నెల్లఁ గూడి పశు పక్షివ్రాత సంపోష ణా
    వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే

    రిప్లయితొలగించండి
  27. వినయంబొప్పుచు దానధర్మములు దావేవేగ గావించుపా
    వనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులే
    వినుచో సత్యము మీరలందరును భోవీరేశ్వరాయా!వెసన్
    గనగన్ సౌఖ్యములన్నియున్ ధరనువేకైవశ్యమౌధరన్

    రిప్లయితొలగించండి