9, ఆగస్టు 2021, సోమవారం

సమస్య - 3808

10-8-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆంధ్రభోజుఁడు నన్నయ్య యనుట నిజము”
(లేదా...)
“నన్నయ యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్”

34 కామెంట్‌లు:

  1. తెలుగు వారిమనసున రాయలె నిజముగ

    నాంధ్రభోజుడు,నన్నయ‌యనుట నిజము

    నెపుడు నతని నాది కవి యని,వికటకవి

    యనుచు రామలింగని పిల్వ ఘనము గాదె

    రిప్లయితొలగించండి
  2. క్రమాలంకారంలో ---
    కృష్ణ రాయల దేమని కీర్తి నందె?
    ఆదికవిగ పేరొంది రాఢ్యు లెవరు?
    భారతం బితి హాస మై వరల దగునె?
    ఆంధ్ర భోజుడు : నన్నయ్య : యనుట నిజము

    రిప్లయితొలగించండి
  3. వెలుగుచూడనితెలుగునువింగడించి
    రాచబాటనుపట్టించెరమ్యముగను
    శోధనంబునసరిఁజూడశుద్ధమయ్యె
    ఆంధ్రభోజుఁడునన్నయయనుటనిజము

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తెలుగు భాషను నెరయించి వెలుగు లిడిన
    మొదటి వానిగ కీర్తిని పొంది యుండి
    ప్రథమ కావ్యము నందించి వఱలి నట్టి
    ఆంధ్రభోజుడు నన్నయ్య యనుట నిజము.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    భారతమ్మునుఁ దెనుగున వ్రాయనెంచె
    యాదికవిగ యశముఁగన్న నమరజీవి
    శబ్ద శాసనుడెవరంచు సంతునడుగ
    నాంధ్రభోజుఁడు, నన్నయ్య యనుట నిజము

    ఉత్పలమాల
    మిన్నగ భోజరాజువలె మేదిని రాజుగ ప్రోత్సహించె తా
    నెన్నుచు నష్టదిగ్గజములింపుగ వ్రాయఁగ కావ్యరాశులన్
    బిన్ని కుమారుడై సభను పేర్కొన రాయలవారి నెంచి కృ
    ష్ణన్నయ యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్డపలమాల మూడవ పాదంలో
      'బిన్ని కుమారుడై సభను పేర్కొనె రాయలవారి నెంచి కృష్ణన్నయ'
      అని చదువుకొన మనవి.

      శ్రీకృష్ణదేవరాయల గురించి వరుసకు తమ్ములైన వారి ప్రశంస:

      తేటగీతి
      అష్టదిగ్గజ కవులనే యాదరించి
      కత్తి, కలముల రెండింట ఘటికుఁడగుచు
      భోజరాజునుఁ దలపించు పూజ్యుఁడనఁగ
      నాంధ్రభోజుడు నన్నయ ననుట నిజము

      (ఆంధ్రభోజుడున్ + అన్నయ)

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తెలుగు భాషను నెరయించి వెలుగు లిడెను
    ఆంధ్రభోజుడు; నన్నయ్య యనుట నిజము
    తెలుగులో తొలి కావ్యము తీర్చి దిద్ది
    ప్రథమ కవిని నేననియెడి వాచకమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రథమ కవియె తాననియెడి (నాల్గవ పాదంలో కొద్ది మార్పు)

      తొలగించండి
    2. ప్రథమ కవియె తాననియెడి ( నాల్గవ పాదంలో కొద్ది మార్పు)

      తొలగించండి

  7. అష్టదిగ్గజ కవులనే యాదరించి
    తెలుగు భాషను సేవించె ధీటుగాను
    రమ్యకావ్యమున్ రచియించె రాయలతడె
    యాంధ్రభోజుడు, నన్నయ యనుట నిజము.

    రిప్లయితొలగించండి
  8. వన్నెలనాగరీకమదిపండగపండితభావజాలమున్
    చెన్నుగతెల్గుతేనెలనుచేకోనిగూర్చెనుభారతమ్మునే
    సన్ననితెల్గుకన్నెయునుసంగమమందెనుదేవభాషలో
    నన్నయయాంధ్రభోజుడనినన్సరియంచునుమెచ్చిరెల్లరున్

    రిప్లయితొలగించండి

  9. సన్నుతి జేతునాతనిని సాహితి శోభల తోడనాడటన్
    కన్నులపండువట్లతని కాలము సాగెను సత్కవీంద్రులే
    మిన్నగ గారవింపబడ మేదిని యందున కృష్ణరాయలే
    నన్నయ యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  10. చెన్నగు కావ్య రాజములు సిత్త
    ము రంజిల జేయ వ్రాసియున్
    మన్నన లందుకున్న ఘన మా
    న్య కవిశ్వరులంచు మర్వక
    నిన్ని శకంబులైనను గవీశ్వ
    రు లాది కవీంద్రుడైన శ్రీ
    నన్నయ, యాంధ్ర భోజుడనిన్
    సరి యంచు మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  11. ఉ:

    మున్నొక పండితుండు కడు ముచ్చట గొల్పెడు పద్యరాజమున్
    సన్నగ పాడుచుండ విని స్థానిక భాషయొ సంస్కృతమ్ము నో
    మన్నన జేయుమన్న దన మాటయె గొప్పని జెప్పె నివ్విధిన్
    నన్నయ యాంధ్ర భోజుడనినన్ సరి యంచును మెచ్చిరెల్లరున్

    స్థానిక భాష=తెలుగు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  12. సంస్కృతంబున భోజుఁడు సత్కవియని
    తెలుగులో నన్నయార్యుఁడు దిట్టకవిగ
    గణుతికెక్కుట విజ్ఞులు గణనజేసి
    ఆంధ్రభోజుఁడు నన్నయ్య యనుట నిజము

    రిప్లయితొలగించండి
  13. చెన్నగురీతి నాంధ్రమును చేయగ చక్కని కావ్యభాషగా
    మన్నన బొందెనెవ్వరిట?మంజులభాషగ మెచ్చియాంధ్రమున్
    పన్నుగ నాదరించె బలు పండితవర్గము నెవ్వరోయనన్
    నన్నయ,నాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్

    రిప్లయితొలగించండి
  14. భాషపయి మక్కువగ దాని పరవుకొరకు
    సత్కృతిగ నాంధ్రకవులను సాకువాడె
    యాంధ్రభోజుఁడు ; నన్నయ్య యనుట నిజము
    గాదు , తెనుగు భాషన నాది కవియనదగు

    రిప్లయితొలగించండి
  15. “నన్నయ యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్”
    జెన్నగు నట్టి వాక్కులివి, చిత్తము లోన గణించి చూడగా
    మిన్నగ నాంధ్ర భారతికి మేలొనరించగ మార్గదర్శియై
    నన్నయ సేవ చేయగనె నాటి తెనుంగున కందె స్పష్టతల్

    రిప్లయితొలగించండి
  16. ఆంధ్ర శబ్ద చింతామణి నందజేసి
    దీక్షబూని భారతమునాంధ్రీకరించి
    కావ్య భోజనప్రియులకు కడుపు నింపె
    నాంధ్రభోజుఁడు నన్నయ్య యనుట నిజము

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ఉత్పలమాల:
    ఎన్నగ భారతమ్ము తెనుగించగ నాదిగ నన్నయార్యుడే
    సన్నుతినొందె --,భోజు వలె సత్కవులన్ దరిజేర్చి రాయలే
    మున్నుగడించెకీర్తి,--యిట
    పోతన, మల్కిభ రాము లిద్దరున్
    “నన్నయ యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్”
    ---కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  19. సమస్య :

    నన్నయ యాంధ్రభోజు డని
    నన్ సరి యంచును మెచ్చిరెల్లరున్

    ( స్కూల్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన డిఈఓ గారి ప్రశ్నకు తెలుగు ఉపాధ్యాయుని సమాధానం )

    ఉత్పలమాల
    -------------

    " వన్నియ దెచ్చినట్టి ఘన
    వందితు లెవ్వరొ యాంధ్రభాషకున్ ?
    జెన్నుగ బల్కుడీ " యనుచు
    జెచ్చెర బోధకుడైన పండితున్
    దిన్నగ బ్రశ్న వేయ నతి
    ధీమతి నాతడు భక్తియుక్తుడై
    " నన్నయ , యాంధ్రభోజు " డని
    నన్ " సరి " యంచును మెచ్చిరెల్లరున్ .

    రిప్లయితొలగించండి
  20. మూడు రాజ్యములకు రాజు, ముచ్చటపడి
    తెలుగు కవులను పోషించె తీరుగాను.
    ఆంధ్ర భారతమును వ్రాసియాదికవిగ
    నలరి స్థాపించెను మరల నాంధ్రభాష.
    "తెలుగు కీర్తినిచాటిరి తేజరిల్లి
    ఆంధ్రభోజుఁడు, నన్నయ్య " యనుట నిజము

    రిప్లయితొలగించండి
  21. ఎన్నగ పేరు ఖ్యాతి గొనిరెవ్వరు తెన్గుల నాట చెప్పనన్
    యన్నయ నందమూరి, మన యల్లురి, యన్నమ, యాంధ్ర కేసరీ
    యన్నను, రుద్రమాంబ, మరి త్యాగయ, వేమన, యష్టదిగ్గజుల్
    నన్నయ, యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చిరెల్లరున్౹౹

    రిప్లయితొలగించండి
  22. రాయలవారంచు రారాజుగతెలుగు
    ప్రజలపాలించెను శ్రీకరముగ
    భారతాదికథల ప్రతినభూనితెలుగు
    జేసిన కవిరాజు స్రియములొసగె
    అష్టదిగ్గజములు అలరెనుతెల్గున భువనవిజయమది పొడుపుగాంచె
    ఆదికవియనుచు ఆరాద్యుడైయుండి
    నన్నయతెలుగున నాందిజూపె
    కవులలోకవియైమారి కలముబట్టె
    కవితరాసిచూపియెపుడు కవులజేసె
    ఇద్ద రిద్దరేని పిలువ ఇంపుమీర
    ఆంద్రభోజుడు నన్నయ్య యనుట నిజము
    ...తోకల....

    రిప్లయితొలగించండి
  23. సన్నుతరామగాధలను సంస్కృతమందు రచించి మాన్యుడై
    పన్నుగ వామలూరుభవపావను డాదికవీంద్రుడయ్యె, న
    ట్లన్నుల మిన్న నన్నయయు నాంధ్రముఁ జేయగ భారతమ్ము,, న
    వ్యోన్నతరీతి రాజకవిభోజవిభుండుగ కృష్ణరాయుడౌ
    నన్నయ! యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. మన్ననలొందె నాడు భువి మాన్యుడు రాయలు ఆంధ్రభోజుగన్
    వన్నెనుదెచ్చె నన్నకవి వాగనుశాసనుడంచు తెల్గులో
    నన్నయ గూర్చి మీరిటుల న్యాయమె పల్కగ నెవ్విధంబుగా
    నన్నయ యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్?

    రిప్లయితొలగించండి
  25. ఎన్నగ వ్రాసి తొల్లిఁ గృతి నింపు నొసంగగ నొక్కరిచ్చతో
    సన్నుతి జేసి యెక్కరిల చక్కని పోషణ నిచ్చి మించిరే
    మిన్నగ నిచ్చ పెంచుకొని మేలును చేసిరి తెల్గు భాషకున్
    నన్నయ, యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  26. తేట తెనుగున గలదనె తీయదనము;
    రాణ్మహేంద్రిని రాణించి రచన బూనె
    నాంధ్రభారత మిచ్చట నాదికవిగ;
    నాంధ్రభోజుఁడు; నన్నయ్య యనుట నిజము!

    పన్నుగ వ్యాస భారతము
    వ్రాయుచు తెన్గున రాణ్మహేంద్రిలో
    చెన్నుగ రాజరాజనృపు
    చిత్తము దోచి వరించె మాన్యతన్;
    ఎన్నగ తెన్గుభాష సవు
    రెన్నెను నాడట గృష్ణరాయలే;
    నన్నయ; యాంధ్రభోజుఁ డని
    నన్; - సరి యంచును మెచ్చి రెల్లరున్!

    రిప్లయితొలగించండి
  27. నన్నయ భారతంబునలనాడు రచింపగ ప్రోత్సహించెగా
    యెన్నగ నాంధ్రభోజుడతడేనన దమ్ముఁడు రాణ్నరేంద్రునిన్,
    చెన్నుగ కృష్ణరాయలల జేసెనటంచు సాహితీ సేవ, వా
    నన్నయ, యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  28. ఆదికవియని నన్నయ్య నండ్రు వోలె
    భాష లన్నిటి యందున ప్రధమ మైన
    తెలుగు నందున కావ్యమ్ము తేజరిల్ల
    ఆంధ్రభోజుడు నన్నయ్య యనుటనిజము

    రిప్లయితొలగించండి
  29. పుడమి నాంధ్ర భాషను నిజ భుజము పైనఁ
    దాల్చి వ్యాకరణమును సంధానము నొన
    రించి పెంచి పోషింపఁగ మించి పూర్వ
    మాంధ్రభోజుఁడు నన్నయ్య యనుట నిజము
    [భా + ఉ + జుఁడు =భోజుఁడు; భా = ప్రకాశము; ఉ =బ్రహ్మ; ఆంధ్ర భాషా కాంతి తోఁ బ్రకాశించు బ్రాహ్మణుఁడు ]


    చిన్నమ ముద్దు పెన్మిటి విశేష బలాఢ్యఁడు కృష్ణ దేవ రా
    డున్నత రాజ సత్తముఁడు నూర్జిత నిర్ణయుఁ డుత్సహించి పె
    ద్దన్నను బిల్చి విప్ర వర! తద్ద యెలుంగున నీవు పేర్మినిన్
    న న్నయ! యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్

    [నన్ను + అయ = నన్నయ]

    రిప్లయితొలగించండి
  30. మిన్నగ భారతంబునిల మెప్పగునట్లుగ వ్రాసెనేగదా
    నన్నయ,యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్
    పన్నుగ గృష్ణరాయలిల భాషను లెస్సగు దెన్గులోనదా
    చెన్నుగ ,నొప్పునట్లుగను జిందులుమీరగ వ్రాయకావ్యమున్

    రిప్లయితొలగించండి